
సీఎం రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండేలాగా కాబోతున్నారా
కరీంనగర్ మాజీ ఎంపీ *బోయినపల్లి వినోద్ కుమార్*
హుస్నాబాద్ నియోజకవర్గము చిగురుమామిడి మండల బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరు
తెలంగాణ ను గుజరాత్ మోడల్ చేస్తానని మాట్లాడటం హాస్యస్పదం
గుజరాత్ మోడల్ కు రాహుల్ గాంధీ ఒప్పుకుంటారా
ప్రభుత్వ కార్యక్రమాల ప్లెక్సీలలో ఉపముఖ్యమంత్రి ఫొటో ఎందుకు తొలగించారనేది ప్రశ్నార్థకంగా మారింది
తెలంగాణ లో గత పదేళ్ళలో ఏం అభివృద్ధి జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి చిత్రీకరణ చేస్తున్నరు
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు
కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది
యాసంగి పంటకు ఎఫ్రీల్, మే మాసాల్లో 500 ల బోనస్ ఇవ్వాలి,
వెంటనే ప్రభుత్వం జీవోలు జారీ చేయాలి
కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశాను
కరీంనగర్ కు రైల్వేలైన్ తీసుకొచ్చాను
ఐదేళ్లలో బండి సంజయ్ ఎం చేశాడు
బండి సంజయ్ ఎంపీ అయ్యాక ఒక్క నవోదయ పాఠశాల తేలేదు…ఒక్క గుడికి నిధులు తేలేదు
ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్ కి పంపిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతునవుతా
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తానని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని….సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్ మాటలను రాహుల్ గాంధీ ఒప్పుకుంటారా అని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు *బోయినపల్లి వినోద్ కుమార్* అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గములోని చిగురుమామిడి మండల బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం సుందరగిరి గ్రామంలో జరుగగా మాజీ ఎమ్మెల్యే *ఓడితేల సతీష్ కుమార్* తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ *బోయినపల్లి వినోద్ కుమార్* మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే మరో ఏక్ నాథ్ షిండే అవుతాడా అనే సందేహం ప్రజల్లో కలుగుతుందన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల ప్లెక్సీలలో మొన్నటి వరకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో ఉండేదని…ఇప్పుడు ఎందుకు ఫొటో లేదని ప్రశ్నించారు.
గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరగనట్టు సీఎం రేవంత్ రెడ్డి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిందని…ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సాకులు చెబుతోందని అన్నారు.
కాంగ్రెస్ మాయమాటలు….మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగితే వెంటనే కాఫర్ డ్యాం. నిర్మాణం చేయకుండా రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం చేయడంతో చెరువులు, కుంటలు ఎండిపోయి ప్రస్తుత యాసంగి పంటలన్ని ఎండిపోయే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
యాసంగి వరి పంటకు క్వింటాలు కు 500ల బోనస్ ఎఫ్రీల్, మే మాసాల్లో ఇవ్వాలని…పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాక ముందే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని పేర్కొన్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు చేయడం లేదన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని…రైతు భరోసా ద్వారా ఎకరాకు 15వేలు ఇస్తామని చెప్పారని…ఇప్పుడు ఇచ్చిన హామీ ఏమైందన్నారు.
బండి సంజయ్ ఎంపీ అయ్యాక ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదని అన్నారు.
ఐదేళ్లలో ఒక్క నవోదయ పాఠశాల తీసుకురాక పోవడంతో పాటు, ఒక్క గుడికి కూడా నయాపైసా నిధులు తేలేదన్నారు.
నేను 2014లో కరీంనగర్ ఎంపీ అయ్యాకనే మనోహరబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు.
కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్పించి వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతునవుతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినీత శ్రీనివాస్ రెడ్డి,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజయ్య, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు రవి, మండల కో ఆప్షన్ సభ్యుడు పాషా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణమాచారి, ప్రవీణ్, వెంకన్న, శ్రీనివాస్, గవ్వ వంశీధర్ రెడ్డి, రాజేశం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.