ఖమ్మం, నేటి ధాత్రి:
ఆరు దశాబ్దాల పోరాటంతో సాదించుకున్న తెలంగాణలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నందు జాతీయ జెండాను వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి కొండమీద వెంకట్ ఆవిష్కరణ చేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు అద్యక్షతన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ అమరవీరులకు స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం తాళ్లూరి వేణు, మచ్చా లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం సుమారు 12 వందల మంది విద్యార్థి యువకుల బలిదానాల తోటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మన రాష్ట్రం మనకు కావాలని మన ఉద్యోగాలు మనకు కావాలని మన నీళ్లు మనకు కావాలని నిధులు, నీళ్లు, నియామకాలు జరగాలని ప్రత్యేక రాష్ట్రం కొరకు సబ్బండ వర్గాలు సకల జనుల సమ్మె చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోవడం జరిగిందని రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్ష కోసమే రాష్ట్రాన్ని సాదించారో అది పరిపూర్ణం కాలేదని సంపూర్ణం చేయడం కోసం ప్రజలు ప్రజాస్వామిక వాదులు పోరాడాల్సిన కర్తవ్యం మిగిలే ఉందన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినా మౌలికమైన మార్పులు చేయకపోవడం భాదాకరమని అన్నారు. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అందరికీ చేరువయ్యే విధంగా ప్రజాపాలన కొనసాగాలని విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాలని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అప్పులు లేని రాష్ట్రంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కార్మిక నేత మంద వెంకటేశ్వర్లు, శంకర్ కోటయ్య, నర్సింహారావు, వెంకట్ బాబు, పాషా, బాబు, అంబాలా వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి,విజయకుమార్, శైలంద్ర, సత్యవతి, రమ, సబిత, సురేఖ రాజ్యలక్ష్మీ, పెవిలియన్ గ్రౌండ్ నందు ఉచిత కరాటే శిక్షణ పోందుతున్న పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.