Flood Alert for River Area Residents — Mahesh Varma
నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
టి ఆర్ పి జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ
మంచిర్యాల,నేటి ధాత్రి:
నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మొంథా తుఫాన్ ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సూచించారు.ముఖ్యంగా దండేపల్లి,లక్షేట్టిపేట్,చెన్నూర్, కోటపల్లి,వేమనపల్లి,భీమిని, జైపూర్ మండలాల నదీ పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చెట్లు,కరెంటు పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.వీలైనంతవరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని కోరారు.
