
Pension Hike Demand for Disabled and Cheyutha Beneficiaries
వికలాంగుల కు,చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి.
◆:- పెన్షన్ దారులను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
◆:- పెన్షన్ దారులతో ఝరాసంగం తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించిన ఎం ఆర్ పి ఎస్ , వీ హెచ్ పి ఎస్ నాయకులు.
వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ రాయికోటి నర్సిములు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం సెప్టెంబర్ 15 కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6000/- మరియు చేయుత పెన్షన్ దారులకు 4000/- వెంటనే పెన్షన్ పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ రాయికోటి నర్సిములు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా నర్సిములు మాట్లాడడం జరిగింది.వికలాంగులకు మరియు వృద్ధులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు,చేనేత కార్మికులకు,బీడీ,గీత కార్మికులకు మరియు కండరాల క్షీణత 15000/- పెన్షన్ పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు 4000 /-నుండి 6000,/-మరియు చేయూత పెన్షన్ దారులకు 2000/- నుండి 4000 /-ఇస్తానని ఎన్నికలో హామీ ఇచ్చి ఇప్పటికి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం లోకి వచ్చి 21 నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు వారికి పెన్షన్ పెంచలేదని విమర్శించారు.పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగ తహసీల్దార్ కార్యాలయం వికలాంగుల హక్కుల పోరాట సమితి ( వి హెచ్ పి ఎస్ ) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎం ఆర్ పి ఎస్ ) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు పెన్షన్ దారులతో మహాధర్న నిర్వహించడం జరిగింది. తదనంతరం డిప్యుటీ తహసీల్దార్ కర్ణాకర్ రావు కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెన్షన్ పెంచాలని అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలని తమరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కుప్పా నగర్ నర్సిములు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు శోభరాణి సావిత్రి, బిస్మిల్లా, ఖాదర్ అల్లి గినియర్ పల్లి నబీ,నాగమ్మ, గుండమ్మ నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.