
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి ప్రశాంత్
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు రామయంపేట్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లోని విడుదల చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ బండరు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7000 వేల కోట్లు స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచితలకు కాకుండా విద్యార్థులకు పక్షాన ఉండి ఈ ప్రభుత్వం వెంటనే ఫీజు రివర్స్మెంట్ విడుదల చేయాలని కోరడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది రానున్న రోజుల్లో నీకు నీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించడం జరిగింది
డిమాండ్స్
1.రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. ఇకనుండి స్కాలర్షిప్లను 3వేలకు పెంచి నెలవారీగా ఇవ్వాలి.
2. ఎంఈఓ, డిఈఓ లతో పాటు మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ నిర్వహించి ఉపాధ్యాయుల కొరత తీర్చాలి మరియు అటెండర్, స్కావెంజర్లను నియమించాలి.
3.వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి ఫీజుల దోపిడీని అరికట్టాలి.
4.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి.
5.గురుకుల ,రెసిడెన్షియల్ పాఠశాలలు,కళాశాలలకు పక్క భవనాలు నిర్మించి,నాణ్యమైన, భోజనం మౌలిక వసతులు కల్పించాలి.
6.SMH హాస్టల్స్ సంఖ్య పెంచి అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ సౌకర్యాన్ని కల్పించాలి.
7.ప్రైవేట్,కార్పొరేట్ జూనియర్ కళాశాలల అడ్మిషన్ల ను ఆన్లైన్లో నిర్వహించాలి
8.ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీని ఆన్లైన్లో నిర్వహించాలి,అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తున్న వారిని శిక్షించాలి.
9.రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలలో రెగ్యులర్ వీసీలను నియమించాలి, 82 శాతం ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి.
10.సెల్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలి మరియు యూనివర్సిటీలలో మౌలిక వసతులు కల్పించారు.
11.యూనివర్సిటీలలో ఆశాస్త్రీయంగా పెంచిన పీజీ, ఇంజనీరింగ్ కోర్సుల ట్యూషన్ ఫీజు మరియు ఎగ్జామ్ ఫీజులను తగ్గించాలి.
ఈ కార్యక్రమంలో నాయకులు సంపత్ ప్రణయ్ మన దీక్షిత్ సతీష్ అశ్విత్ అభిషేక్ భరత్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు