
# గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి/ కొత్తగూడ,నేటిధాత్రి :
గత కొన్ని నెలలుగా
గ్రామపంచాయతీ సిబ్బందికి సంబంధించిన పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కొత్తగూడ, గంగారం సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ల్యాదల్ల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కొత్తగూడ మండల జూనియర్ అసిస్టెంట్ వనమాలకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ల్యాదల్ల రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామ సిబ్బందికి వేతనాలు అందకనే అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వమైన వారి బాధలను గుర్తించి వేతనాలు విడుదల చేస్తుందని ఆశపడ్డ సిబ్బందికి నిరాశే ఎదురైందని ఆయన అన్నారు. గ్రామాన్ని అతి శుభ్రంగా ఉంచేది గ్రామ సిబ్బందని అలాంటి వారిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ వేతనాలు అందించడంలో జాప్యం చేయడం వల్ల వారి కుటుంబాలు అర్థాకళితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రోగాల బారిన పడకుండా ప్రతిరోజు గ్రామ రోడ్లను మురికి కాలువలు,వాడలను శుభ్రపరిచే సిబ్బంది బాధలను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మాస్టర్ పేమెంట్ సిబ్బందిని వెంటనే ఆన్లైన్ చేయాలని వారు కోరారు.లేనియెడల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు చింత యాకయ్య,కార్యదర్శి మిడతపల్లి రవి, నాయకులు, ఐఎప్టియు నాయకులు కంగాల పాపన్న,సుమంత్,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.