
Jeheerabad
నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న కారు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లోని అల్గోల్ చౌరస్తా వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన మారాటి బాలాజీ (40)ని కారు ఢీకొట్టింది. ఈ నెల 3వ తేదీ రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బాలాజీ, చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం పూట మృతి చెందారు. కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని, డ్రైవర్ గౌతమ్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడి తరఫున ఫిర్యాదు అందింది. జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.