
#ఇంటింటా ప్రచారం నిర్వహించిన జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న.
నల్లబెల్లి, నేటి ధాత్రి: గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలనుపట్టించుకున్న పాపాన పోలేదు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి వారికి నిత్యం అందుబాటులో ఉంటూ కరోనా కష్టకాలంలో కూడా నియోజకవర్గ ప్రజలకు మనోధైర్యం కల్పించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే నర్సంపేట నియోజకవర్గాన్ని మోడల్ సిటీగా మార్చిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కుతుందని జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు సోమవారం గుండ్లపాడు గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి వాల్ స్టిక్కర్లు అంటించి ఇంటింటా ప్రచారం నిర్వహించి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగులసునీత ప్రవీణ్ గౌడ్, ఎన్నికల ఇన్చార్జి ఫ్యాక్స్ చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, మహిళా మండల అధ్యక్షురాలు గోనె శ్రీదేవి, క్లస్టర్ బాధ్యులు మామిండ్ల మోహన్ రెడ్డి, నరహరి, ఎంపిటిసి లక్ష్మీ సౌమ్య, నాయకులు కల్వల భగీరథ, వెంకన్న, సుధాకర్, ఆదిరెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.