Pedal to Progress Cycling Event
గరుడవేగ సంస్థ ఆధ్వర్యంలో ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ సైక్లింగ్ ఈవెంట్
గరుడవేగ సంస్థ ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ మేనేజ్మెంట్ ఉద్యోగుల కోసం సైక్లింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యమే తమకు ముఖ్యమని సంస్థ డైరెక్టర్ తెలిపారు.
గరుడవేగ (Garudavega.com) కంపెనీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యాల కోసం సంస్థ సైక్లింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించి, వారికి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేలా ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ (Pedal to Progress) పేరిట 12 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీని నిర్వహించింది.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీ రామ్ దుర్వాసుల మాట్లాడుతూ Pedal to Progress కార్యక్రమం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఉద్యోగుల ఆరోగ్యానికే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. వారి ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ చైతన్యం తమ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ఇంతకు ముందు కూడా ఓ వాకింగ్ ఈవెంట్‌ను నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కచ్చితంగా వ్యాయామం చేయాలని సూచించారు. ఉద్యోగులందరూ కుటుంబ సభ్యులతో కలిసి రావడంతో తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
