
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు హాజరైయ్యారు.ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపారస్తులు బాల్నే సర్వేషంతో పాటు పలువురిని కలిసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి భాజపాకు అవకాశం ఇవ్వాలని కోరారు.అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి,రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక కొత్త చరిత్రను సృష్టించి సంకీర్ణ రాజకీయాలకు తావు లేకుండా చేశారన్నారు.అమెరికా వంటి దేశాలే నరేంద్ర మోడీ కోసం రెడ్ కార్పెట్ వేసి ఘన స్వాగతం పలుకుతుందన్నారు.
నేడు ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమనికి అధ్యక్షత వహించిన బాల్నే జగన్, నియోజకవర్గ కన్వీనర్ వడ్డెపెల్లి నరసింహరాములు,కాంటెస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కంభంపాటి ప్రతాప్, బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణాప్రతాప్ రెడ్డి,కౌన్సిలర్స్ శీలం రాంబాబు గౌడ్, కౌన్సిలర్ మినుముల రాజు,లూనవత్ కవిత వీరన్న నాయక్,బీజేవైఎం నియోజకవర్గ అధ్యక్షులు జూలూరి మనీష్,సీనియర్ నాయకులు కూనమళ్ళ పృథ్వి రాజ్,పట్టణ బీజేవైఎం అధ్యక్షులు గూడూరు సందీప్, మహిళ నాయకులు సూత్రపు సరిత,జల్లి మధు,గంగిడి మహేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.