నిబంధనలు పాటించని మాంటిస్సోరి హై స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి: ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ
కాటారం, నేటి ధాత్రి:
నిబంధనలు పాటించని మాంటిస్సోరి హై స్కూల్ పాఠశాలను గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ డిమాండ్ చేశారు. బుధవారం పాఠశాల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో ఎలాంటి కనీసం మౌలిక వసతులు లేకుండా స్కూల్ నడుపుతున్నారని, వేల వేలు ఫీజులు దోపిడిని అరికట్టాలను డిమాండ్ చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్ అంటూ విద్యార్థులతో కొనిస్తూ తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, నోటు పుస్తకాలు మొదలగునవి విక్రయించడం వల్ల బుక్ స్టాల్ లో కొనుగోలు తగ్గాయని, నిరుద్యోగంతో చదివిన చదువులకు ఉద్యోగాలు లేక ఉపాధి కోసం బుక్ స్టోర్స్ ను ఏర్పాటు చేసుకున్న వారు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న యజమాన్యాలు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. మాంటిసోరి యజమాన్యంపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ఆత్కూరి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు తరుణ్, సాగర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు…