పరకాల, నేటిధాత్రి (లీగల్):-
పరకాల బార్ అసోసియేషన్ లో ఆధ్వర్యంలో మహిళా న్యాయవాదులకు సంక్రాంతి ముగ్గుల పోటి నిర్వహించారు. ఇట్టి ముగ్గుల పోటీలో అధిక సంఖ్యలో మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.అనంతరం ఈ పోటీలో పాల్గొని గెలుపొందిన విజేతలకు పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాలిని లింగం గారు బహుమతులు ప్రదానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండల భద్రయ్య మాట్లాడుతూ ఈ పోటీలో బహుమతులు గెలుచుకున్న మహిళా న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు. తరువాత ఈ పోటీలో పాల్గొన్న వారికి జ్ఞాపికలు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మరియు ఇతర సీనియర్, జూనియర్, న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు, మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.