ఘనంగా ప్రారంభమైన పరకాల క్రికెట్ లీగ్
పరకాల,నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో స్థానిక యువతను ప్రోత్సహించే లక్ష్యంతో శివ 11 టీం ఆధ్వర్యంలో పరకాల క్రికెట్ లీగ్‌ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చందుపట్ల రాజిరెడ్డి,పరకాల 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్,బీజేపీ నాయకులు కానుగుల గోపీనాథ్ హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు.క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.క్రమశిక్షణ,జట్టు భావన,ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు.ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో డీహైడ్రేషన్ కారణంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని,క్రీడాకారులు ఎక్కువగా నీరు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే క్రికెట్ ఆడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రంజిత్, అశోక్,దిలీప్,శివ,రోహిత్, అజ్మీర సాయి,ఆకుల వెంకటేష్,సిద్దు,రాజేష్,నవి, టీవీరాజు,గణేష్,ప్రశాంత్,యాకూబ్,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
