ప్రజా పాలనతో చెరువు పూడికతీతకు పునర్జన్మ
భూసారం జలసిరి రెండు రైతుకే
నేటిధాత్రి చర్ల
చర్ల మండలంలోని పెద్ద చెరువు వద్ద ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రైతు వారంలో భాగంగా చెరువులో పూడిక తొలగింపు మరియు సమర్థ నీటి వినియోగంపై అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ తిరుపతి మాట్లాడుతూ చెరువు మట్టిలో ఉన్న పోషకాలు పంట పొలాల్లో వినియోగిస్తే భూమి సారవంతం పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు అలాగే చెరువుల ద్వారా భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయో వివరించారు వ్యవసాయానికి వినియోగించే నీటిని అవసరానికి అనుగుణంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని రైతులకు పలు సూచనలు చేశారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు చెరువులోని మట్టిని ఆ గ్రామానికి చెందిన పంట పొలాల్లో వినియోగించుకునేందుకు చెరువు పరిసర ప్రాంత రైతులు తమ సొంత ఖర్చులతో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులు కల్పించిన విషయాన్ని కూడా తెలిపారు అదేవిధంగా రైతులు ముందుకు వచ్చి తమ పంట పొలాలకు చెరువు మట్టిని తరలించుకునే అవకాశమున్నందున కార్యనిర్వాహక ఇంజినీర్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియచేశారు
ఎంపీడీవో ఈదయ్య మాట్లాడుతూ నీరు మానవ జీవితానికి ప్రాథమిక అవసరమని పూర్వ కాలంలో గ్రామాలు మరియు పట్టణాలు ఎక్కువగా నదులు చెరువుల పరిసర ప్రాంతాల్లోనే ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం బోర్‌వెల్‌ల వినియోగం అధికమవడంతో భూగర్భ జలాల మట్టాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు భూగర్భ జలాల పునరుద్ధరణకు చెరువులు ఎంతో ముఖ్యమని అందువల్ల పూడిక తీత కార్యక్రమం అత్యంత అవసరమని పేర్కొన్నారు నీటి వనరులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు
ఎంఆర్వో శ్రీనివాస్ మాట్లాడుతూ చెరువులు కాలువలను కాపాడుకోవడం రైతుల బాధ్యత అని తెలిపారు చెరువులో నుంచి తీసిన మట్టిని పంట పొలాల్లో మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆత్మ కమిటీ చైర్మన్ బుచ్చిబాబు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల ప్రాముఖ్యతను వివరించారు చెరువుల వ్యవస్థ వల్ల నీటి నిల్వలు పెరిగి వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడేదని తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం చెరువుల అభివృద్ధి మరియు పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ చేపడుతున్న కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ సాంబశివరావు ఇరిగేషన్ సహాయక కార్యనిర్వాహక ఇంజినీర్ సంపత్ సహాయక ఇంజినీర్ సుమన చర్ల పంచాయతీ కార్యదర్శి సురేష్ రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
