
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో పది బస్సుల్లో మండల పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభకుబయలుదేరారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే ములుగూరి బిక్షపతి,కాంగ్రెస్ పార్టీ పరకాల మండలాధ్యక్షుడు కట్కురి దేవేందర్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ లు కలిసి జెండా ఊపి ప్రారంభించారు.పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఇదే తొలి ఎన్నికల సంగ్రామసభ కావున ఐదు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల,పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.