
Papanna Jayanthi Celebrations in Dabba.
ఘనంగా డబ్బాలో పాపన్న జయంతి వేడుకలు
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో బడుగుల ఆరాధ్య దైవమైన సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి వేడుకలను ఘనంగా
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న సంక్షేమ సంఘం ఇబ్రహీంపట్నం మండల శాఖ అధ్యక్షుడు నేరెళ్ల సుభాష్ గౌడ్
మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న వీరోచిత పోరాటాలను ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పుప్పాల నర్సయ్య, లింగంపల్లి గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ కోటి దేవారెడ్డి, గౌడ సంఘ అధ్యక్షులు ఎలుక అశోక్ గౌడ్, నేరెళ్ల సత్యం గౌడ్, రాజం గౌడ్, సంఘ సభ్యులు అబ్బురి ప్రకాష్, నేరెళ్ల రాజ్ కుమార్, అబ్బూరి ఆనంద్ రాజ్, ఆనంద్, శ్రీనివాస్, దశ గౌడ్, ఈమెల్ గౌడ్, రంజిత్, నేరెళ్ల అంజా గౌడ్, అబ్బూరు వేణు, వెంకటేష్ ఆకు రమేష్, సత్య నంద, తదితరులు పాల్గొన్నారు