
అడుగడుగున నీరాజనాలు
హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా కెసిఆర్
ప్రతిపక్షాలను బొందపెట్టాలి
-కాంగ్రెస్ కు ఓటడిగే హక్కు లేదు..
వాళ్లకు అధికారమిస్తే సంక్షేమ పథకాలన్నీ బంద్
-ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి సహకరించాలి
-గ్రామాగ్రామాన బిఆర్ఎస్ లోకి చేరికలు
ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి
కొమురవెల్లి నేటిధాత్రి
కొమురవెల్లి మండలంలో జనగామ బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికలప్రచారం లో భాగంగా కిష్టంపేట గ్రామంలో ప్రజలు బోనాలతో మంగళహారతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పది సంవత్సరాలు కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారని మరియు ఇకముందు 400 కి గ్యాస్ సిలిండర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం ఇస్తానని మరియు వారి కుటుంబాలలో ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తానని భరోసా ఇచ్చారు కావున మీరంతా కారు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి నన్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించాలని అన్నారు మరియు కాంగ్రెస్ కు ఓటడిగే హక్కు లేదు..వాళ్లకు అధికారమిస్తే సంక్షేమ పథకాలన్నీ బంద్..ప్రతిపక్షాలను బొందపెట్టాలి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అభ్యర్థి పల్లా సమక్షంలో గ్రామగ్రామాన పలువురు నాయకులు, యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు..వీరికి పల్లా గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలన లో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో అద్భుత మైన ప్రగతి సాధించిందన్నారు. బీఆర్ఎస్ ను నమ్మి పార్టీలో చేరిన వారికి అన్నివిధాలా అండగా ఉంటామని, ఏ కష్ట మొచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ పటిష్టత కోసం పనిచేస్తూ ప్రాంత అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలన్నారు అంతకుముందు చేర్యాలలో కెసిఆర్ సభ కొరకు సభాస్థలిని మరియు సభకు సంబంధించిన కార్యక్రమాల కొరకై తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకుడు ముస్టల బాల నరసయ్య మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోల్లు చంటి గద రాజు చందు కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ గీసా బిక్షపతి కొమురవెల్లి ఎంపీపీ తలారి కీర్తన కొమురవెల్లి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు