గ్రామ గ్రామాన ఎమ్మెల్యేకు సత్యంకు పాలాభిషేకాలు

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ బిడ్డ బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజ్ కు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలను అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రామడుగు మండల కేంద్రంతో పాటు గోపాలరావుపేట, గుండి, దేశరాజుపల్లి, తిర్మలాపూర్, వన్నారం, కొరటపల్లి, దత్తోజిపేట గ్రామాలలోని ముదిరాజ్ కులస్తులంతా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రామడుగు మండలంలో ముదిరాజ్ బిడ్డకు మార్కెట్ కమిటీ పోస్టును నామినేట్ చేయడం శుభపరిణామం అన్నారు. ఎమ్మెల్యే సత్యం తాము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నారని, అలాగే మండలంలో ముదిరాజ్ కులస్తుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి అన్ని విధాల సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమాలలో రామడుగు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు జిట్టవేని రాజు ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు మామిడి కుమార్ ముదిరాజ్, వన్నారం అధ్యక్షులు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ బాసవేణి శ్రీనివాస్ ముదిరాజ్, గోపాల్ రావు పేట అధ్యక్షులు రేండ్ల రాములు ముదిరాజ్, దేశరాజు పల్లి అధ్యక్షులు పిట్టల నరసయ్య ముదిరాజ్, గుండి అధ్యక్షులు బొమ్మరవేని లచ్చయ్య ముదిరాజ్, తిరుమలాపూర్ అధ్యక్షులు గుండా కుమార్ ముదిరాజ్, కొరటపల్లి అధ్యక్షులు నెల్లి గంగరాజు ముదిరాజ్, దత్తోజిపేట ముదిరాజ్ సంఘ సభ్యులు భీనవేణి రవి ముదిరాజ్, మండల ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కొలిపాక మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్ల మల్లేశం, ఆయా గ్రామాల ముదిరాజ్ సంఘ పెద్దమనుషులు, సొసైటీ డైరెక్టర్లు, ముదిరాజ్ యువత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!