
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 29, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షులు పల్లె రాజు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలలో మరో రెండు పథకాలు 500 కు గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ పథకాలను, సింగరేణి కార్మికుడు ఏదైనా ప్రమద వశాత్తూ మరణిస్తే కోటీ రూపాయల ఇన్సూరెన్స్ వర్తించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి అనాభిషేకం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుర చైర్ పర్సన్ జంగం కళ ,వైస్ చైర్మన్ ఏర్రం విద్యాసాగర్ , కౌన్సిలర్స్ పనాస రాజు , పొలం సత్యం , పూల్లురి సుధాకర్ , కొక్కుల స్రవంతి , పార్టీ అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ , ధికొండ శ్యామ్ గౌడ్ , యూత్ అధ్యక్షులు మొకనపల్లి రామకృష్ణా , మైనార్టీ అధ్యక్షులు అఫ్జల్ లాడెన్, తెజవత్ రాంబాబు , మెట్ట సుధాకర్ , బత్తుల వేణు , బిoగి శివ కిరణ్ ,ఎర్రబెల్లి రాజేష్ , కొక్కుల సతీష్ , పలిగిరి కనకరాజు , పూల్లురి కళ్యాణ్ , కనకం వెంకటేశ్వర్లు , కుర్మా సుగునకర్ , రాచర్ల సరేష్ , సురేందర్,వేల్పుల సత్యం , జంగoపల్లి మల్లయ్య,శ్రీకాంత్ రెడ్డి, రాం సాయి , భుమేష్ ,మలేష్ , సర్వర్, మహిళ నాయకురాళ్ళు పుష్ప ,సునీత, శారద ,రాజేశ్వరి ,దీప ,కమల,సృజన తదితరులు పాల్గొన్నారు.