వనపర్తి నేటిదాత్రి :
భారతరత్న అవార్డు గ్రహీత కేంద్ర మాజీ మంత్రి
ఎల్కే అద్వానికి వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బచ్చురాం మాట్లాడుతూ దేశంలో రెండు ఎంపీ స్థానాలు ఉన్న కేంద్ర మాజీ మంత్రి అద్వానీ కృషి వల్ల 400 ఎంపి స్థానాలకు చేరుకున్నదని అన్నారు దేశంలో రామ జన్మభూమి రామ మందిరం అయోధ్యలో మసీదు ఉండడంవల్ల 1984లో అద్వానీ రథయాత్ర చేపట్టారని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు డి నారాయణ చిత్తారి ప్రభాకర్ బాబురావు వెంకటేశ్వర రెడ్డి మాజీ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అద్వానికి పాలాభిషేకం
