పాఖలకు సౌకర్యాలు కల్పించాలి
పాఖల పర్యటక కేంద్రానికి అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించాలని లయన్స్‌క్లబ్ జోనల్ చైర్‌పర్సన్ డాక్టర్ భరత్‌రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో పాఖలలో ర్యాలీని నిర్వహించగా లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ జిల్లా అటవీశాఖ అధికారి అక్బర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ భరత్‌రెడ్డి మాట్లాడుతూ పాఖల అభివృద్ధి కోసం, పాఖల సంపద, జీవవైవిధ్యం ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ పెట్టాలని, చెరువులోకి శిఖంలోకి పశువులు రాకుండా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే చెరువు కట్టపై సీసీ రోడ్డు, పర్యాటకుల కోసం అడ్వంచర్, స్పోర్ట్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. తూము ప్రాంతంలో సందర్శన సమయంలో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రమాదం వాటిల్లకుండా పెన్సింగ్‌ను ఏర్పాటు చేసి చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన సందర్భంగా ప్రమాదచికిత్స కిట్లను ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ పురుషోత్తం, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.