ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

# నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 

నర్సంపేట ,నేటిధాత్రి :

వరంగల్,నల్గొండ,ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 

మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపుకు సహకరించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పట్టభద్రులను కోరారు. నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో జరిగిన అరాచకలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు నుంచి నిజమైన జర్నలిస్టుగా ప్రజలకు వివరించిన తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి,ఖమ్మం నల్గొండ,వరంగల్,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడం చాలా సంతోషకరం అని అన్నారు. దీనిలో భాగంగానే ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో నుండి ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులను గుర్తించి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు సైనికుల పనిచేస్తూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఓట్లు వేసే విధంగా సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, నర్సంపేట దుగ్గొండి,నల్లబెల్లి మండలాల అధ్యక్షులు బానోత్ లక్ష్మణ్ , ఏర్రెల బాబు,చిట్యాల తిరుపతి రెడ్డి,పలువురు నాయకులు,పట్టభద్రులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

చందుర్తి మల్యాల గ్రామాల మధ్యలో అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా ఇరువురికి గాయాలు

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామ శివారులోని మలుపు వద్ద ఏపీ 15 బి ఈ 8718 నెంబరు గల ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో దేవా మల్లేష్, దేవా స్వామి అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆ దారిలో వెళ్తున్న వాహనదారులు వీరిని గమనించి అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో సకాలంలో వారిని వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి వైద్యుల వివరాలు తెలుసుకొని బైకును అదుపులోకి తీసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది

వివాహిత ఆత్మహత్య కేసులో ముగ్గురి రిమాండ్

పరకాల నేటిధాత్రి

హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని పోచారం గ్రామానికి చెందిన జూపాక జ్యోతితో తేదీ 19మే రోజున అదనపు వరకట్నం కోసం జ్యోతి కుటుంబంలో గొడవ పడగా జ్యోతి తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.వెంటనే పరకాల ఏసిపి శ్రీ కిషోర్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తులో చేయడం జరిగింది. మంగళవారం రోజున ఆత్మహత్యకు కారకులైన ఆమె భర్త ప్రశాంత్,అత్త అహల్య,మామ రవి లను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పరకాల కోర్టులో జడ్జి ముందు హాజరు పరచడం జరిగింది.

దొరికేదాక సుద్దపూసలు! దొరికినంక ఎడ్డిపూసలు!!

https://epaper.netidhatri.com/view/271/netidhathri-e-paper-22nd-may-2024%09

 

`కుర్చీలో కూర్చున్నప్పుడు అహం.

`అధికారులమని అహంకారం.

`మాకంటే ఎవరు గొప్ప అని గర్వం.

`ప్రజలంటే లెక్క లేని తనం.

`ఆఫీసులకు వెళ్తే చిన్నచూపు చూడడం.

`ప్రతి పనికి లంచం…లంచం.

`సంతకానికి బేరం లేని ప్రతి ఫలం.

`పేదలైనా సరే లక్షలిస్తేనే కనికరం.

`పట్టు పడితే అమాయక ముఖం.

`వెక్కివెక్కి ఏడ్వడం…

`అయినా అవినీతి బుద్ది మానం.

`ఎంత మంది పట్టుబడుతున్న అధికారుల్లో కనిపించని భయం.

`మహా నటులను మించిన నాటకం.

`మాకేం తక్కువ అన్నట్లు పట్టుబడుతున్న మహిళాధికారులు.

`మేమేం తక్కువ అన్నట్లు లంచాలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

లంచం ఇవ్వడం..పుచ్చుకోవడం రెండూ నేరమే! ఈ విషయం అధికారులకు తెలుసు. కాని లంచం తీసుకోకుండా పనిచేయలేనంత స్ధాయికి చేరుకున్నారు. అయితే అందరు అదికారులు అలా లేరు. కాని కొంత మంది మూలంగా మొత్తం వ్యవస్ధ భ్రష్టుపట్టిపోతోంది. పైగా దొరికినప్పుడు కదా? అని అలవాటు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దొంగలు దొరికిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి బాగా అలవాటు పడిన అధికారులు, ఇప్పుడు కూడా అదే కొనసాగించాలని చూస్తున్నారు. అదేంటో గాని గత ప్రభుత్వ హాయాం ప్రెండ్లీ రిలేషన్‌ పేరుత వారికి విపరీతమైన స్వేచ్ఛనిచ్చింది. దాన్ని అధికారులు దుర్వినియోగంచేశారు. ఇంతలో రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ధరణి లాంటివి రావడంతో అధికారుల పంట పండిరది. రాష్ట్రంలో పడావు పడి వున్న భూములు సాగులోకి రావడం పెద్ద ఎత్తున జరిగింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత సాగు నీటి వ్యవస్ధలో పెద్దఎత్తున మార్పులు వచ్చాయి. మిషన్‌ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం వంటివాటితో నీటి సౌలభ్యం పెరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం వచ్చింది. దాంతో భూములకు రెక్కలొచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే అత్యంత ఖరీదైన భూమి తెలంగాణగా మారింది. కేసిఆర్‌ తెచ్చిన భూ లెక్కలు, వాటి స్ధిరీకరణ వంటి వాటి కోసం తెచ్చిన ధరణ అధికారులకు కల్పవృక్షమైంది. దానికి తోడు పెద్దఎత్తున భూముల లావాదేవీలు పెరిగాయి. హైదరాబాద్‌ విస్తరించింది. రాష్ట్రంలోని ఇతర పట్టణాలు విస్తరించాయి. జిల్లాల సంఖ్య పెద్దఎత్తున పెంచడం, పరిపాలన మరింత చేరువ కావడంలో ఆయా నగరాల్లోనే కాకుండా, పల్లెల్లో కూడా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. రిజిస్ట్రేషన్‌ వల్ల పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటుందని గత ప్రభుత్వం అటు రెవిన్యూ, ఇటు రిజిస్ట్రేషన్‌ శాఖలకు పని విభజన వల్ల కూడా మరింత దోపిడీ పెరిగింది. భూమలు విషయంలో సంతకాలకు,పాస్‌ బుక్కుల పేరు మీద లక్షలు దోచుకునే అవకాశం ఏర్పడిరది. దాంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ అవినీతి పెరగానికి ఆస్కారమేర్పడిరది. రెవిన్యూ నుంచి మొదలు అన్ని శాఖల్లో కొంత మంది అధికారుల ఆదాయం చూసి, ఇతర శాఖలు కూడా మాకేం తక్కువ, మేమేం తక్కువ..మేమెందుకు దోపిడీ చేయొద్దన్నంతగా అవినీతికి పాల్పడం అలవాటు చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఎంత పెద్ద అవినీతి చేస్తున్నారని ఎన్ని పిర్యాధులు అందినా పట్టించుకున్నవారు లేరు. పైగా మీడియా వార్తా కథనాలు రాస్తే తిరిగి వారి మీదే కేసులు నమోదు చేసే స్ధాయికి చేరుకున్నారు. దాంతో మీడియా కూడా కొంత చూసీ చూడనట్లు వ్యవహరించింది. కాని రాష్ట్ర పాలనలో మార్పు వచ్చింది.
బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ వచ్చింది. అయితే మళ్లీ బిఆర్‌ఎస్‌ వస్తే తమ ఆటలు సాగవని కొత్త ఎత్తుగడ వేసిన ఉద్యోగులు ఈసారి మార్పులో వారు కూడా పాలు పంచుకున్నారు. దోపిడీకి మరింత తెగబడ్డారు. ఈ శాఖ, ఆశాఖ అన్న తేడా లేకుండాపోయింది. రెవిన్యూ, మున్సిపల్‌ , విద్యాశాఖ, రిజిస్ట్రేషన్‌, ఆఖరుకు వైద్య శాఖలో కూడా పెద్దఎత్తున అవినీత చోటు చేసుకుంటోంది. కారణం అధికారుల్లో విపరీతమైన అహంకారం పెరిగిపోయింది. కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే మాటల్లో చెప్పలేనంత ఘోరంగా వుంటోంది. ఒక తహసిల్ధార్‌ తన కార్యాలయంలో ఫోన్‌ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. బైట ఎంతో మంది ఆయన కోసం నిరీక్షిస్తుంటారు. అయినా ఆయన పిలుపు రాదు. అదేమంటే బిజీగా వున్నారు. పై అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక వారంలో కార్యాలయానికి వచ్చేది ఎన్ని రోజులన్నది ఎవరూ చెప్పలేరు. సమీక్షల పేరుతో కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారని, లేకుంటే ఆర్డీవోతో సమావేశంలో వున్నారనే సమాదానాలు ఎక్కువగా వినేలా చేస్తారు. దాంతో పనుల కోసం తిరిగి తిరిగి వేసారిన వాళ్లు అక్కడున్న అటెండర్లకు సమాచారమిస్తారు. అప్పుడు అయ్యవారు కనికరిస్తారు. లేకుంటే అధికార పార్టీ నాయకులు చెప్పింది చేస్తారు. ప్రజలకు దర్జాగా అన్యాయం చేస్తారు. పై స్దాయి నుంచి కింది స్ధాయి దాకా అవినీతి మరక లేని అధకారులు చాల తక్కువ. దొరికిన వాళ్లు మాత్రమే దొంగలు. కాని దొరక్కుడా అతి జాగ్రత్తపరులుగా చెలామాణి అవుతున్నవారు చాలా మంది వున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోతున్నారు. దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా సంపాదనకు ఎగబడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రస్తక్తి లేదని ఇప్పటికే ప్రకటించారు. ప్రజా పాలనతో అవినీతికి ఆస్కారం లేదని చెప్పినా అధికారులు వినడం లేదు. గతంలో ఏసిబి స్పందన అంతంత మాత్రంగా వుండేది. ఇప్పుడు ఏసిబి మరింత దూకుడు పెంచింది. అయినా ఇది సరిపోదు. ఇంకా దూకుడు పెంచాలి. అవినీతి పరులను పట్టుకోవాలి. ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి.
నిత్యం ముగ్గురు నలుగురు అధికారులు పట్టుబడుతున్నారు. అయినా ఎవరూ భయపడడం లేదు. కేసులౌతాయన్న భయమే కనిపించడం లేదు. జైలు జీవితం అనుభవించాల్సివస్తుందన్న ఆందోళనే లేదు. ఎలాగూ బెయిల్‌ వస్తుంది. మళ్లీ బైటకు వస్తాం. వ్యవస్ధలను మేనేజ్‌ చేసుకుంటాం. ఎంత ఖర్చైనా పెట్టుకుంటాం. మళ్లీ అవినీతితో పెట్టిదానికి పదింతలు సంపాదించుకుంటామన్న నమ్మకం అదికారుల్లో పెరిగిపోయింది. అసలు ఏసిబి అంటేనే ఒక రకంగా పోలీసు వ్యవస్ధతో సమానం. వాళ్లు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న తర్వాత మళ్లీ విచారణల పేరుతో కాల యాపనలు చేయడం ద్వారా అవినీతి అదికారులకే మేలు జరుగుతోంది. చివరికి కోర్టులో కేసులు నిలబడం లేకుండాపోతున్నాయి. పట్టుకోవడం వరకే మా పాత్ర..తర్వాత మాకు సంబంధం లేదకునే అలసత్వం ఏసిబిలో కూడా కనిపిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏసిబి పట్టుకున్న తర్వాత కూడా మళ్లీ అధికారులకు ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి? అన్నదానికి ఎవరి వద్దా? సమాధనం లేదు. అందుకే అధికారులు భయపడంలేదు. ఏసిబికి పట్టుబడడం కూడా వెకేషన్‌ టూర్‌లాగా మారిపోయింది. ఎందుకంటే కోర్టు ద్వారా తిరిగి ఉద్యోగం తెచ్చుకోవడమే కాకుండా, ఇంట్లో కూర్చున్నన్ని రోజులు జీతాలు కూడా అందుతాయి. దాంతో పని చేయాల్సిన అవసరం లేదు. జీతం నష్టం జరిగే అవకాశం అసలే లేదు. అందుకే అందిన కాడికి దండుకోవడం అలవాటు చేసుకున్నారు. రోజూ జేబు నిండకుండా ఇంటికి పోవడం లేదు. ముఖ్యంగా రైతులను అధికారులు వేధిస్తున్న తీరు అమానుషుం. ఆ మధ్య ఓ మహిళ రెవిన్యూ కార్యాలయ గుమ్మానికి తాలిబొట్టు వేలాడ దీసినా న్యాయం జరగలేదు. అలాంటి వ్యవస్ధలో వున్నందుకు ఈ సమాజమే సిగ్గు పడుతుంది.
ఉద్యోగ వ్యవస్థలో మహిళలు వుంటే అవినీతికి ఆస్కారం వుండదని అందరూ అనుకునేవారు. కాని అదేంటో ఇటీవల పట్టుబడుతున్న అధికారుల్లో ఎక్కువ శాతం మహిళలలే కావడం గమనార్హాం. ఇలా ఎందుకు జరుగుతోందన్నది ఆలోచించాల్సిన అవసరం వుంది. ఎందుకంటే మేమేం తక్కువ అవినీతి చేయడంలో అనుకుంటున్నారా? లేక మమ్మల్ని ప్రశ్నించేందుకు ఎవరికీ ధైర్యం వుండదన్న భరోసాతో చేస్తున్నారా? అర్ధం కావడంలేదు. ఓవైపు అవినీతికి పాల్పడుతూ, మీడియాలో వార్తలు వస్తే తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ లీగల్‌ నోటీసులు కూడా పంపించేస్ధాయికి చేరుకుంటున్నారు. ఒకప్పుడు మీడియాలో అదికారుల గురించి వార్తలు వస్తే అధికార వర్గాలన్నీ అలెర్టుయ్యేవి. కాని ఇప్పుడు మీడియాకే లీగల్‌ నోటీసులు పంపించు అని సలహాలిచ్చేదాకా చేరుకున్నారు. అవినీతిని ఒకరునొకరు ప్రోత్సహించుకుంటున్నారు. వాటాలు పంచుకుంటున్నారు. పట్టుబడినా నష్టమేమీలేదు. మళ్లీ మన కొలువు మనకు వస్తుంది. లేకుంటే సంపాదించుకున్నది వుండనే వున్నది అనేదాకా వెళ్తున్నారు. కోట్లు సంపాదించుకుంటున్నారు. పట్టుబడితే సుద్దపూసలుగా ముఖం పెడుతున్నారు.

రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32 వ వర్ధంతి వేడుకలు కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్స్ అద్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్ ఆధ్వర్యములో బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.ప్రధానిగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో నాయకులు పొడేటి బిక్షపతి,శ్రీనివాస రావు,శివ కృష్ణ,రామచందర్,శ్రీకాంత్,కొండ రమేష్,కనకరత్నం,పర్షరాములు,తదితరులు పాల్గొన్నారు.

మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు బాషిపాక యాదగిరి ఆధ్వ ర్యంలో ఘనంగానివాళులర్పించడం జరిగింది.

కూకట్పల్లి, మే 21 నేటి ధాత్రి ఇంచార్జ్

భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్య క్రమం వివేకానంద నగర్ డివి జన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాషి పాక యాదగిరి ఆధ్వర్యంలో ఘనం గా నివాళుల ర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశం లోనే నూతన సాంకేతిక విప్ల వం తీసుకొచ్చినటు వంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటు వంటి రాజీవ్ గాంధీ లాంటి నాయ కులు ఈ దేశానికి అవసరమని వారి సేవలను కొని యాడారు.ఈ కార్యక్ర మంలో వివేకా నందనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటె స్టెడ్ కార్పొరేటర్ భాషిపాక నాగమణి యాదగిరి సీని యర్ నాయకులు విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ అల్వాల భాస్కర్ వెంకటస్వా‌ మి సాగర్ దొరపల్లి పరశు రాములు దుర్గారావు నాగుల మల్లేష్ కచ్చిగల్ల రమేష్ డాన్ వెంకట్ యాకయ్య బోడ అశోక్ యూసుఫ్ శ్రీనివాస్ దయాకర్ రెడ్డి మునీశ్వర రావు పోతురాజు ఎన్
ఎస్ యు ఐ నాయకులు సాంసన్ దుర్గా ముదిరాజ్ దుర్గా ప్రసాద్ వీరేశ్ రాంబాబు లక్ష్మణ్అంజలి సురేఖ భాగ్యలక్ష్మి రేణుక ఉమాఉపేంద్ర హేమలత నాగమణి సంధ్యారాణి శాలిని భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

బి బి కే వాలీబాల్ కప్ విజేత భీంరాజ్ పల్లి ఫ్రెండ్లీ మ్యాచ్

విన్నర్ గా నిలిచిన బొమ్మన ఆకాష్ టీం

రన్నర్ గా నిలిచిన పొట్ట తిరుపతి టీం
ఫ్రెండ్లీ సిరీస్ విన్నర్ సామల సాగర్

గొల్లపల్లి నేటి ధాత్రి:గొల్లపల్లి
మండలంలోని భీమ్రాజు పల్లి గ్రామంలో భీమ్రాజు పల్లి బొమ్మన కుమార్ వాలీబాల్ టోర్నమెంటు( బి బి కే) సోమవారం రాత్రి నిర్వాకులు బొమ్మన కుమార్ ప్రారంభించారు.కీ:శే : ఎరసాని రాజయ్య జ్ఞాపకార్ధంగా క్రికెట్ టోర్నమెంటు బొమ్మన కుమార్ నిర్వహించారు. ఫ్రెండ్లీ మ్యాచ్లో పొట్ట తిరుపతి, దూసరహుల్, బొమ్మన ఆకాష్, కళ్ళెం చందు టీమ్లు వాలీబాల్ ఆడారు . విన్నర్ గా బొమ్మన ఆకాష్ టీం గెలుపొందారు. రన్నర్ గా పొట్ట తిరుపతి నిలిచారు. ఫ్రెండ్లీ మ్యాచ్ సిరీస్ విన్నర్ గా సామల సాగర్ టీం గెలుపొందారు. ఈ ఆటల్లో గెలుపొందిన బొమ్మన ఆకాష్ టీంకు ట్రోపీ తో పాటు, రూపాయలు రూ.2000 ప్రైజ్ మనీ,ఫ్రెండ్లీ మ్యాచ్ సిరీస్ విన్నర్ సామల సాగర్ టీంకు రూ. 1000 ప్రైజ్ మనీ బి బి కే కప్ స్పాన్సర్, బొమ్మన కుమార్ వాలీబాల్ టోర్నమెంట్( బి బి కే ) కప్పు ట్రోపీని స్పాన్సర్ బొమ్మన కుమార్, ముక్తామని, చేతుల మీదుగా విజేతలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బొమ్మన నరేందర్, బొమ్మన వెంకటేశం, కంది స్వామి, సింగారపు లచ్చయ్య,మహేష్, సాగర్, ఆర్ ఆర్ డి డిజిటల్ రేవెల్ల రమేష్, సామల రవి,కంది వెంకటేశం, కంది సత్యనారాయణ, దూస శ్రీనివాస్, చింతల రవీందర్ దితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ వర్ధంతికి ఘన నివాళులు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటి ధాత్రి:

భారతదేశంలో సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశాన్ని ఆర్థికపథంలో నడిపారని, సరికొత్త సంస్కరణలతో అభివృద్ధిలో వేగం పెంచారని కొనియాడారు. అతి చిన్న వయసులోనే ప్రధాని పీఠాన్ని అధిరోహించి, త్యాగానికి ప్రతీకగా చరిత్రలో నిలిచి పోయారని అన్నారు. ఆయన చేపట్టిన కార్యచరణలో భాగంగా దేశంలో సాంకేతిక రంగం లో ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చిందం రవి దుబాస్ రఫీ రవిపాల్ ప్రపంచ రెడ్డి ప్రేమ్ సాగర్ రాజేందర్ రాజు పత్తి శీను వల్ప దాసు రాము కోల శీను తదితరులు పాల్గొన్నారు.

గంగారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఏఎస్ఓల బృందం

కాటారం నేటి ధాత్రి

కాటారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గంగారం ఆయుష్మాన్ ఆరోగ్యం కేంద్రాన్ని ఏ ఎస్ ఓలా బృందం సందర్శించి పర్యవేక్షించారు ఈ ఆరోగ్య మందిరంలో ప్రతిరోజు నిర్వహించే వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు
ఆశాలు ద్వారా నిర్వహించే సేవల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు
మాతా శిశు సంరక్షణ సేవల గురించి మరియు చిన్నపిల్లల వ్యాధుల నివారణ టీకాల గురించి టీ బి వ్యాధి గురించి సీజనల్ వ్యాధుల గురించి షుగరు మరియు బిపి వ్యాధుల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రజలకు సరియైన మందులు అందుతున్నాయా బీపీ షుగర్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారా వారికి సకాలంలో మందులు అందుతున్నాయా. పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు ఏఎన్ఎం ద్వారా షుగరు మరియు బీపీ పరీక్షలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్శన కార్యక్రమంలో ఏ ఎస్ ఓ లు హిమాన్ష్ నిషాన్ సింగ్ నీరజ్ కుమార్ వివేక్ కుమార్ మరియు గంగారం డాక్టర్ సుమన్ ఏఎన్ఎం రజిని.కర్నాకర్, వెంకన్న,ఆశా కార్యకర్తలు రజిత,కవిత,కాంత, స్వరూప పాల్గోన్నారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములక పాడు గ్రామం లో మండల మహిళ సంఘం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఆధ్వర్యంలో

భద్రాచలం నేటి ధాత్రి

మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 33వ వర్ధంతి సందర్భంగా రాజీవ గాంధీ ఫొటో కు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఆలాగే రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు సైన్స్ అండ్ టెక్నాలజీ కు కంప్యూటర్ మన దేశంలో ప్రో త్స హించి అభివృద్ది చేయడం జరిగింది అనిభద్రాచలం నియోజక వర్గం సేవాదళ్ అధ్యక్షులు పిలక వెంకట రమణ రెడ్డి మాజీ మండల అద్యక్షులు లంకా శ్రీనివాసరావు మహిళా సంఘం నాయకురాలు మద్ది కుమారి సత్యవతి మోహనరావు సోమినీ బుజ్జి అలివేలు శిరీష్ సబిత ఆదిలక్ష్మి పుష్ప మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు

అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి బియ్యం అందజేత

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఫాతిమా అనారోగ్యంతో మృతి చెందడతో వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందజేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎండి అతిమ్ వాళ్ళ అమ్మ ఫాతిమా కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 50 వేలు బియ్యం అందజేయడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో శ్యామ్ కిరణ్ ప్రశాంత్ వేణు సాయి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత పాల్గొన్నారు అని ఈ సందర్భంగా తెలియజేశారు

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామంలో భరత్ నగర్ లో అకాల వర్షానికి పిడుగుపాటు గురై మృతి చెందిన రుద్రారపు చంద్రయ్య కుటుంబాన్ని సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి మహేందర్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శిస్తూ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం పరుస్తూ తనవంతు సహాయంగా 10000 రూపాయల నగదు ఇవ్వడం జరిగింది ఇట్టి విషయమై ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబానికి సహాయం అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు వైద్య శివప్రసాద్ రాజు ఎంపిటిసి రాము శ్రీనివాస్ రెడ్డి భాను నాగరాజు మునిగేల రాజు బాల్రెడ్డి శ్రీనివాస్ మనోహర్ సర్దార్ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.

అచ్చునూరి కిషన్
ములుగు జిల్లా ఇంఛార్జీ.

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కిషన్ అధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులను, సిబ్బంది’ని ఓటు అభ్యర్థిస్తూ మాట్లాడుతూ….. ఈ నెల 27 నా జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వామపక్ష పార్టీలు, తెలంగాణ జన సమితి, న్యూడెమోక్రసీ, PRTU తెలంగాణ, STUTS, మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో మీ ముందుకు వస్తున్నా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న’కు మొదటి (1)ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించగలరని ప్రతి ఒక్కరిని పేరుపేరున వేడుకుంటున్నాను.

తీన్మార్ మల్లన్న వ్యక్తి కాదు ఒక మహా శక్తి, పోరాట యోధుడు, సామాన్య ప్రజలకు ఏలాంటి ఆపద వచ్చినా అనునిత్యం అండగా నిలిచే మానవతా వాది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాల’పై అలుపేరుగని పోరాటం చేసి వంద రోజులు జైలు జీవితం గడిపిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అవిశ్రాంతంగా పోరాటం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న’నే అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.!
అనేక మంది పేద ప్రజలకు ఆసరా గా ఉంటు వరదల సమయంలో ముంపు ప్రాంతాల ప్రజలకు, కరోనా కష్ట కాలంలో తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్న వారి బాధను చూసి చలించి వారి కి నేనున్నాను అనే మనోధైర్యాన్ని ఇచ్చి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహించినా వ్యక్తి తీన్మార్ మల్లన్న.

ఉద్యోగుల పై ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ను రద్దు చేయాలని ఆమరణ దీక్ష చేసి వారి పక్షాణ నిలబడి పోరాటం చేసిన వ్యక్తి మల్లన్న, అలాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 46 నిరుద్యోగుల మధ్య వేర్పాటువాదన్ని సృష్టించి నిరుద్యోగ యువతను అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం.

కావున ఇప్పుడు ఉన్న ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల సాధనకై సానుకూలమైన వైఖరి’తో ఉంది కాబట్టి విద్యావంతులైన మీరందరూ ఒకసారి ఆలోచించి మీ తరుపున నిలబడి, కలబడే ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న’కే మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పెద్దల సభకు పంపాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్, యూత్ కాంగ్రెస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు, మధు, కోటి, అశోక్, శ్రావణ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

తంగళ్ళపల్లి నేటి దాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో దివoగతి భారత దేశ మాజీ ప్రధాని ప్రధాని గౌరవ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తించుకుంటూ దేశంలో గాంధీ కుటుంబం ప్రజలకు ఎంతో మేలు చేసిందని వారి కుటుంబంలో ఎంతో మంది ప్రధానిగా పని చేస్తూ దేశానికి సేవ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు

శాస్త్ర సాంకేతిక రంగంలో రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి

బొమ్మకంటి చంద్రమౌళి

పరకాల నేటిధాత్రి మంగళవారంరోజున పరకాల పట్టణం ఆర్ ఆర్ గార్డెన్స్ జరిగిన దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భముగా నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి మాట్లాడుతూ దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాన్ని తీసుకువచ్చిన నేత రాజీవ్ గాంధీ అని,వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భముగా వెంకటకృష్ణ మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, ఆధునిక భావాలు, నిర్ణ‌యాత్మ‌క శ‌క్తి క‌లిగిన రాజీవ్‌గాంధీ అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞాని అని అన్నారు.భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో రాజీవ్ గాంధీ అగ్రగామిగా నిల్పారని అన్నారు.కంప్యూటర్ విద్యను అమలు చేసే దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు.గాంధీ కుటుంబం మొత్తం దేశానికి,దేశ ప్రజల సేవకై అంకితమైందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,చెరుపెల్లి మొగిలి, బొచ్చు జితేందర్,బొచ్చు కట్టయ్య,ఒంటీరు సుధాకర్, ఒంటేరు రవికుమార్,బొచ్చు బాబు,లక్కం శంకర్ వసంత అభిమానులు,కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన కౌన్సిలర్ సంపత్

హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో స్థానిక ఒకటవ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలతో ఘన నివాళి అర్పించారు.

మీడియా కన్వీనర్ గా కోమల్ల జలంధర్

గొల్లపల్లి నేటి ధాత్రి:

గొల్లపల్లి పట్టణానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోమల్ల జలంధర్ ను బి ఆర్ ఎస్ పార్టీ గొల్లపల్లి మండలం మీడియా కన్వీనర్ గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించగా మంగళవారం గొల్లపల్లి మండల కేంద్రంలో జలంధర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పిటిసి గోస్కుల జలంధర్, బి ఆర్ ఎస్ మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్ మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు జలంధర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి.

# గీసుగొండ మండల బీఅర్ఎస్ యూత్ అధ్యక్షులు శిరిసే శ్రీకాంత్.

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గీసుగొండ మండల బీఅర్ఎస్ యూత్ అధ్యక్షులు శిరిసే శ్రీకాంత్ కోరారు.ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు గీసుగొండ మండల క్లస్టర్ ఇంచార్జ్ ల ఆధ్వర్యంలో గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లి,మచ్చాపురం,కొమ్మాల, బొడ్డుచింతలపల్లి గ్రామలలో పట్టభద్రుల ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు.ఎన్నికల హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని బొడపెట్టాలని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లు,కోట ప్రమోద్, మంద రాజేందర్, మచ్చాపురం ఎంపిటిసి కంబాల రజిత కోటి, యాత్ అధ్యక్షులు రాకేష్, బొడ్డుచింతల పల్లి పార్టీ అధ్యక్షులు పోగుల యుగేందర్, బండి రాజు,ఇందూరి ప్రవీణ్,కేదాసి సురేష్,కొమ్మలా యూత్ నాయకులు తాళ్లపెళ్లి ప్రసాద్, తాళ్లపెళ్లి తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ కి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు

రఘునాథపల్లి ( జనగామ) నేటి ధాత్రి:-

మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో దివంగత ప్రధానమంత్రి భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ 33 వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా ఉంచారని అన్నారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కింది గ్రామాల్లో అభివృద్ధి చెందాలని రాజీవ్ యువజన కింద ప్రతి గ్రామానికి నిధులు మంజూరు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ముదిరాజు కుల సంఘం పెద్దమనుషుల ఎన్నిక

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బుద్దారం గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం పెద్దమనుషుల ఎన్నిక జరిగింది కుల పెద్దమనుషులుగా నిరటి గున్ని ముదిరాజ్ అచ్చునూరి రమేష్ ముదిరాజ్ గార్లను ముదిరాజ్ కుల సంఘం సమక్షంలో ఏకగ్రీవంగా పెద్దమనుషులుగా ఎన్నుకోవడమైనది ఈరోజు ఎన్నికైన పెద్దమనుషులను మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ నీరటి గున్నిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలొ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం స్వామి ముదిరాజ్ అచ్చునురి సరంగపాణి డైరెక్టర్ అచ్చునురి సంపత్ కట్ల రాజు కట్ల పవన్ మల్లవేణి రాంబాబు సదయ్య రమేష్ ప్రశాంత్ పోషలు పెద్ద రమేష్, మాల నర్సయ్య ముదిరాజ్ కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు

దొడ్డువడ్లకు సైతం బోనస్ ప్రకటించాలని బి ఆర్ ఎస్ నాయకుల నిరసన .

గొల్లపల్లి నేటి ధాత్రి:
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ 500 ఇస్తానన్న వాక్యాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం అన్ని రకాల వడ్ల కు బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూబి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ అధ్వర్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలోని మండల కార్యాలయం ముందు మంగళవారం ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా
గొల్లపల్లి జడ్పీటీసీ గోస్కుల జలందర్ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.. దగా.. నయవంచన..
గ్యారెంటీ కార్డులో..
“వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి..
ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని
సన్నాయి నొక్కులు నొక్కుతారా ??
ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి..
ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??
ఇది ప్రజా పాలన కాదు..
రైతు వ్యతిరేక పాలన
నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు..
కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు..
కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా
అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు..
ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు
రూ.15 వేలు రైతుభరోసా అన్నారు .. ఇవ్వలేదు
వ్యవసాయ కూలీలకు
రూ.12000 వేలు అన్నారు.. వేయలేదు
ప్రతి రైతుకు డిసెంబర్ 9నే..
రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు
నేడు బోనస్ విషయంలో కూడా
ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు.
ఓట్ల నాడు ఒకమాట…
నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం
అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో
గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ
పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే..
నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని
బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు
ఎద్దేడ్సిన యవుసం..
రైతేడ్చిన రాజ్యం నిలబడదు..
నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన
కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు..
పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు..
తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు..
కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు..
నేటి నుంచి రైతన్నల చేతిలోనే..
కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ.. అయింది అన్నారు..

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గోస్కుల జలందర్,బి ఆర్ ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్,ప్యాక్స్ వైస్ చైర్మన్ నవ్వా తిరుపతి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మరాంపెళ్లి బాబు, ప్యాక్స్ డైరెక్టర్ కచ్చు కొమురయ్య, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు బలభక్తుల కిషన్, సామల విరస్వామి, అవరి చందు, మ్యాదరి రమేష్,డి బి అర్ ఎస్ పార్టీ మండల మీడియా కన్వీనర్ కోమల్ల జలందర్, ఎంపీటీసీలు చింతం అశోక్, గోవిందుల లావణ్య జలుపతి, గోలి లక్ష్మిగంగారెడ్డి, తూర్పాటి రవి నాయకులు మారం రాజశేఖర్, కనుకుట్ల లింగారెడ్డి, ఒరగంటి అశోక్ రావ్, సిద్దంకి మల్లారెడ్డి, రత్నం, కనుకుట్ల లింగారెడ్డి, కూన రాజేందర్,బత్తిని సత్తన్న, బొల్లం గంగరాజం, కడమండ వెంకన్న, దావుల రాకేష్, తాండ్ర కిరణ్, కలికోట సత్యం, రవి, భూమన్న, గోపాల్ రావ్, సత్యం రావ్, రాజ్ కుమార్, మహేష్ మరియు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version