*రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి కార్మిక శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రామారావు పేట లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి హరికృష్ణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, బెల్లంపల్లి మండలాధికారి రాజవ్వ తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల మేరకు రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు సమయంలో రైతుల సంబంధిత వివరాలు విక్రయించిన ధాన్యం వివరాలను ప్రభుత్వం అందించిన ట్యాబ్ల్ లలో నమోదు చేయాలని, అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, వేసవి తాపం నుండి విముక్తి కలిగించే విధంగా నీడను, ఇతరత్రా మౌలిక సదుపాయాలను కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన గన్ని సంచులు, వర్షా బావ పరిస్థితుల దృశ్యం ధాన్యం తడవకుండా టార్పల్లిలను అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యమును ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు కేటాయించిన మేరకు తరలించే విధంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ సభావత్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ ఇన్చార్జ్ అధికారి హరికృష్ణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.