గత పాలకులవల్లే నిరుద్యోగ సమస్య పెరిగింది
* కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం : భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థిఎండీ. జహంగీర్
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతుప్రకటిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి.జహంగీర్ అన్నారు.శనివారంమునుగోడు మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ మండల బాధ్యుల సమావేశంజరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నల్గొండ,ఖమ్మం,వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిందన్నారు. పార్లమెంటు ఎన్నికలలో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం, ఇండియా బ్లాక్ భాగస్వామి అయినకాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నామన్నారు.దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మతోన్మాద బిజెపిని ఓడించడం కోసం, బి ఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకుమద్దతు ప్రకటిస్తున్నామనిఅన్నారు.గత ప్రభుత్వాలుమోడీ ప్రభుత్వం,కెసిఆర్ ప్రభుత్వంనిరుద్యోగ సమస్యను పెంచి పోషించిందన్నారు. పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలన్నారు. మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం పిలుపునిస్తుందన్నారు. పట్టభద్రులందరూ ఇండియా కూటమి అభ్యర్థి ఆయన తీన్మార్ మల్లన్న గెలిపించేందుకు పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోటిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని ఆయన అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేసిందనిఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్, చండూరు మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, మునుగోడు మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, , పార్టీ మండల నాయకులు వేముల లింగస్వామి, వెంకన్నతదితరులు పాల్గొన్నారు.
బి ఆర్ ఎస్ పార్టీ నాలుగో వార్డ్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు పై కాంగ్రెస్ నాయకుడు పోచమ్మల గణేష్ దాడి
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి
రామాయంపేట బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాలుగో వార్డ్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు పై కాంగ్రెస్ నాయకుడు పోచమ్మల గణేష్ పెట్రోల్ తో దాడి చేయడాని టిఆర్ఎస్ నాయకుడు కంట రెడ్డి తిరుపతిరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సారాపు యాదగిరి తీవ్రంగా ఖండించారు…… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట పట్టణంలో ఇంతవరకు ఎప్పుడు జరగని పరిణామాలు చోటు చేసుకోవడం విచారకరమన్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం చంపడానికి చూడడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలకు అధికార కాంగ్రెస్ పాల్పడుతుందని పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు పై కాంగ్రెస్ నాయకుడు పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు రామాయంపేట పట్టణంలో జరగలేదన్నారు. కానీ కొందరు అధికార పార్టీ అండ చూసుకొని ఇలాంటి సంఘటనకు పాల్పడుతుదన్నారని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుఅని అన్నారు. ఈ దాడికి కారణం పోచమ్మల గణేశా? అతని వెనుక ఎవరైనా ఉండి చేస్తున్నారా అనే విషయాన్ని పోలీసులు సమగ్రంగా పరిశీలించాలని వారిని కఠినంగా శిక్షించాలని ఇప్పుడే 307 సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేస్ నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా హైదరాబాదులో డిఐజికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మెదక్ వెళ్లి ఎస్పీకి దీనిపై ఫిర్యాదు చేయడమే కాకుండా సక్రమంగా కేసును పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
పట్టాభిరామస్వామి ఆలయంలో హనుమాన్ కు చందనాభిషేకం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో శ్రీ పట్టాభి రామస్వామి ఆలయంలో హనుమాన్ విగ్రహానికి గణపురం హనుమాన్ మాలాధారణ స్వాములు విధియా శనివారం రోజున స్వామివారికి చందనాభిషేకం జిల్లేడు మాళ్లతో స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు శ్రీ పట్టాభిరామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన దుర్వాస చార్యులు స్వాములకు పూజలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు అందించి కార్యక్రమంలో గణపురం లోని హనుమాన్ మాలాధారణ స్వాములు భక్తులు మహిళలు పాల్గొన్నారు
పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
మహిళా సంఘం కుట్టు మిషన్ సందర్శన
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు పాఠశాలల సంబంధిత మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఎంపియుపిఎస్ కొత్తకట్టు సింగారం, జెడ్ పి ఎస్ ఎస్ మాందారి పేట జెడ్ పి ఎస్ ఎస్ బాయ్స్ స్కూల్ శాయం పేట, టీఎస్ డబ్ల్యూ ఈ ఐ డియు ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన అదనపు గదులు నిర్మాణము కావాల్సిన వన్నీ తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల హెచ్ఎంలు ఎంపీడీవో మండల అధికారులు ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.
మహిళ స్వశక్తి కుట్టు కేంద్రం ను సందర్శించిన కలెక్టర్
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సురేఖ మండల సమైక్య సంఘం శాయంపేట ఆధ్వర్యంలో మహిళా యూనిఫామ్స్ స్వశక్తి కుట్టు కేంద్రం ను సందర్శించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. స్కూల్ యూనిఫార్మ్స్ స్టిచ్చింగ్ పనులను పరిశీలించగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమయ్యే లోపుగా యూనిఫార్మ్స్ కుట్టుటపూర్తి చేయాలని మహిళలకు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో మహిళా స్వశక్తి కుట్టుకేంద్ర సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలపై అవగాహన కార్యక్రమం
లక్షెటిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి:
మండలంలోని బలరావుపేట్, మిట్టపల్లి, ఉత్కూర్, మోదెల హన్మంతు పల్లి గ్రామాలలో రైతులకు నకిలి విత్తనాలు , విత్తనాల కొనుగోలు లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ సంచులలో విడిగా ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుండి రసీదు ను తప్పని సరిగా తీసుకోవాలి. విత్తన పాకెట్ బిల్లు ను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలి. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్స్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.
విత్తన పాకెట్ మీద తయారయిన తేది, కాలం ముగిసే తేది చూసుకోవాలి.
గ్రామాలలో తక్కువ ధర కు, ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మి వారి వివరాలు తెలుపాలి అని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయ విస్తరణ అధికారులు ష్మీన్, శ్రీనివాస్, అనుష రైతులు పాల్గొనడం జరిగింది.
వడ్ల కొనుగోలులో వేగం పెంచాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి….
బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, చివరి వడ్ల గింజ వరకూ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు కోరారు. శనివారం చెన్నూర్ నియోజకవర్గం లోని కోటపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల నుండి వడ్లను తరలించడంలో జాప్యం జరుగుతుందని రైతుల ద్వారా తెలుసుకోవడం జరిగిందని అన్నారు .నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ….వడ్ల కొనుగోలు కేంద్రానికి ధాన్యం రాగానే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయించాలన్నారు. కేవలం సన్నాలకే రూ.500 బోనస్ ఇవ్వడం మంచిది కాదన్నారు. తరచూ వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రంలో నిల్వచేసిన ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందికి గురికాకుండా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. రైతులకు మిల్లర్లు తక్షణమే డబ్బు చెల్లించాలని కోరారు. ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నియోజకవర్గానికి వచ్చి రైతులకు న్యాయం చేసేలా లేడని, కనీసం అధికారులు అయినా వడ్లను కొనుగోలు చేసేలా చొరవ తీసుకోవాలని, రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్యాక్స్ చైర్మన్ సాంబ గౌడ్ నాయకులు సత్యనారాయణ, విద్యాసాగర్, సంపత్ ,సందీప్ రెడ్డి ,బాపు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
రైతులు అధైర్య పడొద్దు
చివరి గింజ వరకు కొంటాం
హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
శాయంపేట నేటి ధాత్రి:
ధాన్యం కొనుగోలు ముమ్మరం చేయాలి కొనుగోలు పూర్తయ్య వరకు ప్రతి సెంటర్ పనిచేస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. మండలంలో ప్రగసింగారం వసంతపూర్ కొప్పుల సహకార సంఘాలు మహిళ సంఘాలు ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా అంతా 88% పూర్త యిందని, శాయంపేట మండల కేంద్రంలో మాత్రమే ఉంది దాదాపుగా 15% ఉంటుందని తెలపడం జరిగింది వర్ష ప్రభావం వల్ల రైతులు కాపాడేందుకు అందుబాటులో ప్రతి రైతుకు పరదాల సౌకర్యం చేస్తాము అని సెంటర్లో ఉన్న వారికి మొత్తం టార్పల్లిన్ ఇవ్వాలని ఆదేశించింది.జిల్లా మొత్తం 160 సెంటర్లో కొనుగోలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఐకెపి సెంటర్ల ద్వారా 88% పూర్తి చేశామని తెలపడం జరిగింది
మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరగా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ వెంట ఎమ్మార్వో ఎంపీడీవో వ్యవసాయ మండల అధికారి, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో బిఆర్ఎస్ పట్టభధ్రుల ఎన్నికల ప్రచారం
నడి కూడ,నేటి ధాత్రి:
పరకాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి సీరియల్ నెంబర్ 3లో మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నడికూడ మండల కేంద్రంలో నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) ఆధ్వర్యంలో పట్టభద్రులని కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు,నడికూడ పట్టభద్రుల గ్రామ ఇంచార్జిలు సంఘని వేణు,రావుల కిషన్, గొడిశాల రంజిత్ కుమార్, మొర్రి సారయ్య,రమేష్ వంశీ,ప్రశాంత్ మరియు బిఆర్ఎస్వి జిల్లా కో ఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి,నడికూడ మండలం క్లస్టర్ ఇంచార్జిలు దురిశెట్టి వెంకటేష్,సురాబు శ్రీకాంత్, గుడికందుల శివ,దోమ పవన్, బిఆర్ఎస్ నాయకులు రమేష్ శ్రీనివాస్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచలం నియోజకవర్గ టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ ప్రచారం
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం నియోజకవర్గం లోని పట్టభద్రుల ఓట్ల అభ్యర్థన ఖమ్మం,నల్లగొండ,వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచలం నియోజకవర్గ టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలిసి భద్రాచలం నియోజకవర్గంలోని పాలు ప్రాంతాల్లో పర్యటించారు..పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, బీజేపీ పాలకులు చేసిందేమీ లేదని విమర్శించారు. కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని తెలిపారు. పట్టభద్రులు, ప్రజల పక్షాన చట్ట సభలో గొంతుక వినిపించేందుకు తీన్మార్ మల్లన్న ను గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు
దుమ్ముగూడెం రేగుబల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ ప్రభుత్వ గుట్ట తవ్వకాలను రెవెన్యు వారు నిలిపివేయాలి
భద్రాచలం నేటి ధాత్రి
ప్రజల అవసరాలకు తట్టెడు గ్రావెలుకు సైతం అనుమతి ఇవ్వని రెవెన్యు వారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు
ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు తగ్గొడుతూ ఇసుక ర్యాంపులోకి రోడ్డు వెయ్యడం కోసం దొడ్డి దారిన గ్రావలను తరలిస్తున్న ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్లపై రెవెన్యూ వారికి ఎందుకు ఇంత ప్రేమ
అనుమతులు లెకుండా గుట్ట తవ్వకాలు జరుపుతున్న (భారీ యంత్రాలైన) JCB ను తోలకాలు జరుపుతున్న లారీలను వెంటనే సీజ్ చెయ్యాలి
సంబంధిత అక్రమార్కులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలి లేకుంటే ఉద్యమిస్తాం
CPIML మాస్ లైన్ ప్రజా పంధా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ దుమ్ముగూడెం మండలం లోని WL రేగుబల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ ప్రభుత్వ గుట్ట తవ్వకాలను రెవెన్యు వారు జోక్యం చేసుకొని నిలిపివేయాలని cpiml మాస్ లైన్ (ప్రజా పంధా) పార్టీ ఆద్వర్యంలో దుమ్ముగూడెం మండల రెవెన్యూ కార్యాలయం అధికారికి RI ఆదినారాయణ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంధా) పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్ మాట్లాడుతూ రేగుపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ గుట్టని కొంతమంది ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలైన జెసిబి లతో తవ్వకాలు జరుపుతూ లారీలతో ఇసుక ర్యాంపు లోకి రోడ్డు వేయడానికి వంద లాది ట్రిప్పులు తోలుతున్నారు ఇప్పటికే నాలుగు రోజులుగా ఇది కొనసాగుతుంది ఇది ఇట్లాగే కొనసాగితే ఆ గ్రామం ప్రజలకు భవిష్యత్ లో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే గ్రామంలో ఉన్న పశువులు మేత కోసం, స్మశాన వాటిక కోసం కాల కాల క్రమేణా పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల స్థలాల కోసం తదితర అవసరాలకు ఈ గుట్టనే ఇక్కడి ప్రజలు వుపయోగిస్తారు కాబట్టి ప్రజల అవసరాలను, బలహీనతలను అడ్డం పెట్టుకొని ప్రజా సంపద అయిన గ్రావెల్ ను కొందరు లూఠీ చేస్తున్నారని అన్నారు గ్రామస్తులు అవసరాల కోసం తట్టెడు గ్రావెల్ తీసుకుపోయిన అడ్డుపడే రెవిన్యూ అధికారులకి ఇక్కడ జరుగుతున్న లూఠీ కనబడడం లేదా అని ప్రశ్నించారు గ్రావెల్ మట్టి ఇసుక ఒక్క ట్రక్కు సైతం అక్రమంగా తరలిస్తే ఆ వాహనాల పైన ఆ వ్యక్తుల పైన కేసులు పెట్టే రెవిన్యూ వారు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నారు అక్రమార్కుల పట్ల ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్ల పట్ల రెవెన్యు వారు ఎందుకింత మెతక వైఖరి వహిస్తున్నారని విమర్శించారు తక్షణమే అనుమతులు లెకుండా జరుగుతున్న గుట్ట తవ్వకాలను,గ్రావెల్ అక్రమ రవాణా అని నిలిపివేయాలని, ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు చెల్లించకుండా ఎగ్గొడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ గుట్టని రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలను తొలకాలు జరుపుతున్నా భారీ యంత్రాలైన జెసిబి లను లారీలను తక్షణమే సీజ్ చేయాలని సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల ఉద్యమం తప్పదని హెచ్చరించారు
ఈకార్య్రమంలో పార్టీ దుమ్ముగూడెం మండలం కార్యదర్శి దాసరి సాయన్న పార్టీ నాయకులు బాబురావు,భాస్కర్, ప్రవీణ్ తదితులు పాల్గొన్నాను
పేట వెంకటేశ్వర వైన్స్ తో పక్క కాలనీవాసులకు ఇక్కట్లు
వైన్స్ పక్కనే పాత భావి మందుబాబులకు ప్రాణాలకు ప్రమాదం
జనవాసాలలో మందుబాబులు తాగుడు కార్యక్రమాలు
తాగిన కాళీ సీసాలను పక్కనే ఉన్న దుకాణ సముదాయాలలో ముక్కలు చేయడం
ఏ మాత్రం చర్యలు తీసుకొని వైన్స్ యజమాన్యం
రామయంపేట (మెదక్)నేటిధాత్రి
రామయంపేటలోని వెంకటేశ్వర వైన్స్ ఉన్న స్థలం పక్క కాలనీ వాసులకు ఎన్నో కష్టాలపాలు చేస్తున్నాయని మనశ్శాంతి లేకుండా జరుగుతున్నదని కాలనీవాసులు ఆవేదన వెలబుస్తున్నారు . వెంకటేశ్వర వైన్స్ దాన్ని ఆనుకొని పర్మిట్ రూమ్ ఎలాంటి పహారి గోడ లేకుండా పరిధాల రేకులతో ఏర్పాటు చేయడం వల్ల మందుబాబుల మాటలు రనగొనదునులు తమకు నిద్ర లేకుండా చేస్తున్నాయని రాత్రి 11 గంటల వరకు కొనసాగడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉపాధ్యాయుడు పక్కనే ఉన్న ఇంటిలో నివసిస్తున్న భాస్కర్ తెలిపారు .అంతేకాకుండా పర్మిట్ రూములు ఆనుకొని పెద్ద పాత బావి తక్కువ ఎత్తులో ఉండడం మందుబాబులు ప్రమాదకరంగా మారిందని అన్నారు .ఇంతకుముందు కూడా ప్రాణాపాయాలు జరిగాయని ఆయన తెలిపారు. వెంకటేశ్వర వైస్ ఈ ప్రాంతంలో ఉండటానికి ఎలాంటి నియమ నిబంధనలు అనుకూలంగా లేవన్నారు ప్రజావాసాలకు దూరంగా పర్మిట్ రూములను బయటకు కనిపించకుండా ఏర్పాటు చేయవలసి ఉండగా ఇక్కడ మాత్రం పార్ధాలు రేకులు అడ్డంపెట్టి అనుమతులు ఇవ్వడం చేస్తున్నారు .జిల్లా ఎక్సైజ్ అధికారులకు దృష్టికి తీసుకుపోయిన ప్రజల కష్టాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉండడానికి ఎటువంటి ఆస్కారం లేదని నియమ నిబంధనలు లేవని ఎప్పటికైనా ప్రమాదకరమైన బావి పక్క కాలనివాసులకు ఇబ్బందులకు గురిచేస్తూ ఇక్కడ ఉండవలసిన అవసరం లేదని వెంటనే ఎక్సైజ్ కమిషనర్ ఇక్కడి నుంచి వైన్ తొలగించాలని వారి డిమాండ్ చేస్తున్నారు వైన్స్ యాజమాన్యం నిరంకుశ వైఖరి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ ఎమ్మెల్సి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని భారీమెజారిటీ తో గెలిపించండి
కౌన్సిలర్,బీజేపీజిల్లా ప్రధానకార్యదర్శి ఆర్పీ జయంత్ లాల్
పరకాల నేటిధాత్రి
వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల మున్సిపల్ 21 వార్డు కౌన్సిలర్,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంత్ లాల్ పిలుపునిచ్చారు.శనివారం పరకాల పట్టణంలోని పలు వార్డులలో ఉదయం ప్రచారం నిర్వహించారు.ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి చిన్నతనంలోనే జాతీయ వాదానికి ఆకర్షితుడై ఏబివిపిలో చేరి విద్యార్థి ఉద్యమాలు సామాజిక కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.బిజెపిలో చేరి తెలంగాణ ఉద్యమంలోనే ముందు వరుసలో నిలిచి తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను,విధానాల లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల గొంతుకగా నిలబడ్డారు
పట్టభద్రుల,నిరుద్యోగుల, ఉద్యోగుల,ఉపాధ్యాయుల, విద్యావంతులు సమస్యల పై ప్రశ్నించే వ్యక్తిని శాసనమండలికి పంపించాలని కోరుతున్నాను.బిజెపికి ఓటు వేసి నరేంద్ర మోడీకి మద్దతు తెలుపాలని కోరారు.ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పక్కన 1అంకె వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో మరాఠి నర్సింగరావు,వేణు శెట్టి రాజేష్,పున్నo అశోక్, తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుకు గురైన మహిళను కాపాడిన కానిస్టేబుల్
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
నిన్నటి రోజు సాయంత్రం జరిగిన ఘటనలో తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న గడ్డమీది తనతండ్రి శంకర్ మరణ వార్త విని గుండెపోటుకు గురైన మహిళను తొందరగా స్పందించిన కానిస్టేబుల్ ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి అక్కడ ఏం జరిగిందో ఇంట్లో వాళ్ళు గమనించే లోపు అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించి ఆమెకు గుండెపోటు వచ్చినట్టు సిపిఆర్ చేశారు అనంతరం సమీపంలో తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడినారు సిపిఆర్ చేసి మహిళా ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాసను పలువురు నే టిజన్లుఅభినందించారు
బీటీ రోడ్డు వేయాలి ప్రమాదకరంగా ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్
వనపర్తి నేటిదాత్రి
వనపర్తి పట్టణంలో ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్ లో బీటీ రోడ్డు వెయనందుకు గుంతలో వర్షపు నీరు మల్లుకున్నాయని 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోడ్డు వెంట బారి వాహనాలు ద్విచక్ర వాహనాలు వెళుతుంటాయని రాత్రిపూట ప్రమాదం జరిగే అవకాశమున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వర్షపు నీరు ఇండ్లలోకి వెళ్లి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని వెంటనే జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే స్పందించి రోడ్డును తనిఖీ చేసి చర్యలు తీసుకొని బీటీ రోడ్డు వేయించాలని అదేవిధంగా రోడ్డును తనిఖీ చేసే అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు ఈ విషయమై మున్సిపల్ ఏఈ సాయి కిరణ్ వివరణ కోరగా త్వరలోనే బీటీ రోడ్డు వేయిస్తామని చెప్పారు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సిపిఎం పార్టీ నాయకులు
వర్షాలు రాకముందే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు శుక్రవారం, శనివారం రోజున జైపూర్ మండలంలోని డీసీఎంఎస్ తో పాటు వివిధ గ్రామాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది.ఈ సందర్బంగా దాసరి రాజేశ్వరి జిల్లా కార్యవర్గ సభ్యురాలు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తానని చెప్పింది.కానీ ఎక్కడ అమలు చేయడం లేదు.దింతో రైతులు కష్టపడి పండించిన పంటలకు రక్షణ లేకుండా పోయింది. కల్లాల వద్ద ఉన్న ధాన్యం అక్కడే ఉంటుంది. ఆ ధాన్యన్ని కాపాడుకోవడానికి రైతులు రాత్రి, పగలు నిద్ర లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దుంపల రంజిత్ కుమార్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ను వెంటనే చెల్లించాలి.కానీ ప్రభుత్వం మాత్రం కేవలం సన్నపు ధాన్యనికి మాత్రమే ఇస్తాను అనడం సరైంది కాదు.రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి రైతులు పండించిన అన్ని రకాల ధాన్యనికి బోనస్ చెల్లించాలి. అంతే కాకుండా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకంలో ధాన్యంను ఎక్కువగా వేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలపై ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. మరియు
జిల్లా అధికారులు స్పందించి ధాన్యాన్ని తరలించే లారీలు కోనుగోల కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచాలి. రైతుల ధాన్యన్ని పూర్తిగా కొనాలి.రైతులకు అన్యాయం చేస్తే మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని డిమాండ్ చేశారు.
డిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్ష పదవి పోటీ నుండి స్వచ్ఛందంగా తప్పకున్న పార్వతి రాజిరెడ్డి
మంచిర్యాల, నేటి ధాత్రి:
డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఎన్నికల నుండి స్వచ్ఛందంగా అధ్యక్షుని పోటీలో వైదొలుగుతున్నట్టు పార్వతి రాజిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పత్రికా విలేకరుల పట్ల మీడియా ప్రతినిధులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి జర్నలిస్టు ఉద్యమాలను బలోపేతం చేయాలని ఏర్పడిన డిజెఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి జరుగుతున్న ఎన్నికలలో తాను పోటీలో ఉండడం లేదని ఆయన మందమర్రిలో విడుదల చేసిన ఒక ప్రకటనలోతెలిపారు. డీజేఎఫ్ ఏర్పడింది ఒక మంచి లక్ష్యసాధన కోసమని అలాంటి నాయకత్వ విధానాలు చాలా కాలం కొనసాగాలని సదుద్దేశంతోటే తాను పోటి నుండి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు.డీజేఎఫ్ మిత్రులంతా రేపు జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి పూర్తి న్యాయం చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరంగా డిజెఎఫ్ పోరాడుతుందని కనుక ఓడిన గెలిచిన మన సంఘ అభివృద్ధి కోసం మిత్రులందరు సహృదయంతో సహకరించాల్సిందిగా ఆయన కోరారు.
ఫీజురీయంబర్స్ మెంట్స్ వెంటనే విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజకుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం 6 సంవత్సరాల నుండి 7,200 కోట్లు రూపాయలు వసూళ్లు చేయలేదు. నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ విడుదల చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కోర్సులు పూర్తిచేసి ,ప్రవేశ పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించే సమయం వస్తోంది విద్యార్థులు ఒక కళాశాల నుండి మరోక కోర్సులోకి వెళ్ళాలంటే సర్టిఫికేట్ వారి స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ రాలేదని తమ దగ్గర పెట్టుకుని వేధింపులు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఫీజులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. త్
గత అనేక సంవత్సరాలు నుంచి పేద విద్యార్థులు ప్రధానంగా అణాగారిన వర్గాలు విద్యార్థులు ప్రభుత్వం నుండి ఉపకార వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ఈ ప్రభుత్వం అయినా ఫీజులు అన్ని బకాయిలు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది.
ప్రైవేటు, కార్పోరేట్ కళాశాలలు, ఫీజు రీయింబర్స్మెంట్ పై మాత్రమే ఆధారపడి నడుస్తున్న కళాశాలలో కోట్లు రూపాయలు బకాయిలు వల్లన విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు, ప్రభుత్వం కూడా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని రాష్ట్రంలో బకాయిలు ఉన్న ఫీజులను తక్షణమే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ భవిష్యత్ లో ఫీజుల కోసం పోరాడుతుందని తెలిపారు.
తీన్మార్ మల్లన్న గెలుపుకోసం ముమ్మర ప్రచారం
పరకాల నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ బలపరచిన వరంగల్,ఖమ్మం,నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ,పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం శనివారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని 13వ వార్డు 57వ భూత్ లో వాకర్స్ మరియు పట్టణంలోని పట్టభద్రులను కలిసి,బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండవ వరుసలోని తీన్మార్ మల్లన్న ఎదురుగా ఉన్న బాక్స్ లో మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బొచ్చు శ్రీధర్,బొచ్చు మహేష్,బొచ్చు సారయ్య,
బొచ్చు జేపి,బొచ్చు మహేందర్
బొచ్చు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్షంకు నిలువుటద్ధం “సంరక్ష” హాస్పిటల్
“రక్షణ” లేని “సంరక్ష” ?
హాస్పిటల్ నిర్లక్ష్యం? హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగిన పేషెంట్ బంధువులు
ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో వసూలు, రోజూ మినిమం ఒక లక్ష, లేదంటే 50వేలు కట్టాల్సిందే అని బాధితుల ఆవేదన
పేరుకే “ఉత్త”మ సేవ హాస్పిటల్ అవార్డ్, అయితే పైసలుండాలి లేదా ఇన్సూరెన్స్ ఉండాలి అంటున్న జనాలు
పది రోజులు ట్రీట్మెంట్ తరువాత సీరియస్ అంటూ హైదరాబాద్ వెళ్ళాలని అన్న యాజమాన్యం
హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేసిన బంధువులు
పోలీసుల జోక్యంతో బాధిత మహిళకు న్యాయం
ట్రీట్మెంట్ కొరకు హైదరాబాద్ తరలించిన బంధువులు
“నటరాజ శ్రీ స్వామి” నీకిది న్యాయమా అంటున్న వరంగల్ తూర్పు బాధితులు
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ తూర్పు పరిధిలో, వెంకట్రామా జంక్షన్ వద్ద గల సంరక్ష హాస్పిటల్ నందు, ఈనెల 11న వరంగల్ చార్బౌలి ప్రాంతానికి చెందిన వాణి అనే మహిళ మూత్రపిండాల సమస్యతో ఆసుపత్రిలో చేరగా తనకున్న హెల్త్ కార్డు ద్వారా ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పి, దాదాపు 13 రోజులుగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తూ, హెల్త్ కార్డు ఉన్నందువలన డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కేవలం మెడికల్ షాప్ వరకు బిల్లులు చెల్లిస్తే చాలు అని హాస్పిటల్ వర్గాలు చెప్పినట్లు రోగి బంధువులు తెలుపుతున్నారు. మూత్రపిండాల సమస్యతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా, నేడు పేషెంట్ పరిస్థితి విషమంగా ఉంది అని, హైదరాబాదుకు వెళ్ళండి అంటూ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా తెలుపగా హాస్పిటల్లోనే ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు. తన భార్య పరిస్థితి ఆవేదన చూసి భర్తకు హాస్పిటల్లోనే స్ట్రోక్ వచ్చినట్లు బంధువులు తెలిపారు. వెంటనే అదే హాస్పిటల్లో అతనికి స్టంట్ వేశారు సదరు డాక్టర్లు మూడు లక్షల రూపాయలు స్టంట్ వేసినందుకు బిల్ అయినట్లు తెలుస్తోంది. ఒకే హాస్పిటల్లో అటు తల్లి, ఇటు తండ్రి ఇద్దరు అడ్మిట్ అయి ఉండటం వల్ల దుంఖం, ఆందోళనతో ఉన్న కుటుంబ సభ్యులకు తమ తల్లి ఆరోగ్యం బాలేదు హైదరాబాద్ తీసుకెళ్లండి అని డాక్టర్లు చెప్పడంతో వారికి అనుమానం వచ్చి ఏమి ట్రీట్మెంట్ చేశారు ఇన్ని రోజులు? ఇప్పుడెందుకు హైదరాబాద్ అంటున్నారు అని గట్టిగా నిలదీశారు. మెడికల్ షాపు బిల్లు మూడు లక్షల రూపాయలు వరకు కడితే చాలు మిగతాది మేము ఇన్సూరెన్స్ కార్డు ద్వారా క్లెయిమ్ చేసుకుంటాం అని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో వెంటనే బంధువులు మిత్రులు హాస్పిటల్ కి చేరుకొని ఆందోళన చేశారు. గడచిన 13 రోజుల నుంచి ఏ ట్రీట్మెంట్ చేశారు ఏమో తెలియదు కానీ, రోగి పరిస్థితి అత్యంత ప్రమాదంలోకి వెళ్లడం గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆసుపత్రి డాక్టర్లను యజమాన్యంను నిలదీయగా వారు ఉస్మానియా ఆసుపత్రి నుండి స్పెషలిస్ట్ డాక్టర్లను సైతం పిలిపించి వైద్యం చేయించాం అని తెలిపిన డాక్టర్లు. అయినా కానీ పేషెంట్ కండీషన్ ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో, ఆసుపత్రి వర్గాలు అప్పటికే హెల్త్ కార్డు ద్వారా బిల్లులు దాదాపు 20 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మెడికల్ షాప్ లో మాత్రం మూడు లక్షల బిల్ అయింది అదొక్కటి కడితే సరిపోతుంది. ఆ బిల్లు కట్టి పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది కాబట్టి హైదరాబాద్ తీసుకెళ్లండి అని వైద్యులు చెప్పగానే, పేషెంట్ తరపున బంధువులు అసలు ఏంటి? ఏం జరుగుతుంది ఆసుపత్రిలో అని ఆందోళనకు దిగారు. ఆసుపత్రి యజమాన్యంను నిలదీయగా మా చేతిలో ఏమీ లేదు, మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కేవలం మెడికల్ షాప్ బిల్లులు మూడు లక్షల రూపాయలు చెల్లించి హైదరాబాద్ తీసుకెళ్లండి అని మరో మారు చెప్పడంతో పేషంట్ బంధువులు ఆందోళన ఉదృతం చేయగా, వెంటనే స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ రంగప్రవేశం చేసి దాదాపు గంటన్నర అటు బంధువులతో, ఇటు డాక్టర్లతో చర్చించి, జరిగిన సంఘటనపై వివరాలు ఆరా తీసి, జరిగిన తప్పిదాన్ని వైద్యుల నిర్లక్ష్య నిర్లక్ష్యమే కారణమని తెలుసుకొని, వెంటనే వైద్యులను మందలించి పేషంటుకు తగిన న్యాయం చేశారు. పేషెంట్ కి కావాలసిన ట్రీట్మెంట్ మొత్తం ఖర్చులు ఇన్సూరెన్స్ బాధ్యత హాస్పిటల్ యాజమాన్యమే బరించాలి అని పేపర్ రాపించి, పేషెంట్ ను హైదరాబాద్ కు తరలించారు. వెంటనే స్పందించి న్యాయం చేసిన మిల్స్ కాలనీ పోలీస్ సీఐ కి పేషెంట్ బంధువులు, మిత్రులు అభినందనలు తెలిపారు.
మిల్స్ కాలనీ పోలీసుల చొరవ అభినందనీయం
సంరక్ష ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై వెంటనే స్పందించిన మిల్స్ కాలనీ పోలీసు అధికారి, సదరు ఆసుపత్రికి చేరుకుని దాదాపు రెండు గంటలు కూర్చొని విచారణ జరిపి, హాస్పిటల్ నిర్లక్ష్యం పైన సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడి, మందలించి, బాధిత మహిళకు న్య్యాయం చేసిన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ కి పేషెంట్ బంధువులు మిత్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
పేరుకు “ఉత్త”మ సేవ హాస్పిటల్ అవార్డు
సోషల్ మీడియాలో ఒక ఎస్ఎంఎస్ వైరల్ అవుతుంది.
సదరు హాస్పిటల్ కు ఉత్తమ సేవ అవార్డు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ 2024,15వ ఆగస్టుకి కూడా మళ్ళీ ఇవ్వండి “ఉత్త”మ సేవ అని, నిర్లక్ష్యపు డాక్టర్లు, 40మంది బడా డాక్టర్లు కలిసి, తలో 10లక్షలు వేసి 4కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టడం. ఈఎచ్ఎస్, ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ పేరుతో అక్రమ బిల్లులు. అన్ని ట్రీట్మెంట్ లు చేయడం, ఆగం చేయడం, బిల్లుల ఆమోదం కోసం రాజకీయ నాయకుల మద్దతు ఉండటం. ఒక్కో డాక్టర్ కి నాలుగేసి హాస్పిటల్ లో పార్టనర్షిప్ ఉండటం. వీళ్లకు ఉత్తమ సేవ అని అవార్డ్ ఇచ్చే బదులు, పేదలకు 20 రూపాయలకే వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అవార్డ్స్ అంటున్నారు కొందరు నెటిజన్లు.
Asking for cross-voting is nothing but suicidal
https://epaper.netidhatri.com/view/275/netidhathri-e-paper-25th-may-2024%09
· Cross-voting is only tick and propaganda of inefficient people
·No voter can heed whatever a political party say
·All of a sudden people never change their mind
·Is it possible for such cross-voting?
·If it is true what is the use of campaigning for months together?
·What is the need for sped crores of rupees?
·If cross-voting is true, it just requires two days enough
·People are brilliant
· For seven decades they elected whom they want
·They kept a party aside which they feel not proper
·People have their own opinions on voting
·They give power to a party that they feel efficient
·In a democracy victory always sides with people
·Leaders are always servants to the society
·Before enlightened people no leaders could exhibit their greatness
·Any leader who feels that he is guiding the people is nothing but foolishness
HYDERBAD,NETIDHATHRI:
Without any alliance how can a party ask the people to vote in favour of its opponent party? Is it possible? After hectic discussions for months together even if some parties form alliance, they have to enlighten the people on their seat sharing every time during their campaign. Even then also some people may not get any idea about such alliances. In such situations, if any party ask the people to vote in favour of a particular party may not convince the people to vote as per the wish of that party. People never turn against or in favour of a particular party at that very movement as per the direction of a party. When we think logically, such thing never happened because doing like that it will turn into suicidal for that particular party. It is nothing but burying its political future. Every party struggles to get every vote to cost in favour of it but never says for cross voting which has suicidal effect on its existence. If any two parties come for an understanding during elections then there will be chance of mutually asking the people to vote in favour of them. Now parliament elections completed. Votes are now safe in EVM machines. At this time for all astonishment there prevails wide spread propaganda about BRS asked the people to cost their vote in favour of BJP. There is also saying that after coming to on conclusion that party lost confidence among the people, the BRS leaders indirectly indicated the people to vote in favour of BJP. It is nothing but bad propaganda. If there are any proofs for such indications, such videos and audios might have already appeared in social media. Without any proofs making such propaganda is not considered as ethical practice. The opposition parties may spread such news in media for their own political benefit. When proofs are not present it can’t be treated as genuine but people think them as nothing but ‘true lies’.
Those who treated themselves as skilful analysts generally bring forth such issues.Some political leaders fell in this trap and began to believe such analysis. Karimnagar BRS candidate Vinodkumar also fell in such trap of propaganda and announced that he is going to lose his Karimnagar seat. He also mentioned about cross voting. All of a sudden such cross voting is not at all possible. He knows well this fact. As per the opinion expressed by him if cross voting occurs, it never happened then and there but it will takes place like water under mat for long time for months together. Is Vinodkumar has no idea about who are his real followers and who are digging pits on backside? Vinodkumar always speaks about what is happening around the world. It is unfortunate that why he didn’t know about what is happening in his parliamentary constituency? If the people feel Bandi Sanjay has done something for the constituency, then automatically they will incline towards him. If they have feeling against him then they will vote in favour of Vinodkumar. This is the straight away logic. Then there is no question of logic of crossing voting. Are people in a position to heed the words of Vinod kumar opponents? Why these surmises arise? How it happened and how this propaganda takes place? Cross voting took place in Telangana in large scale is the prevailing propaganda in the state. Lot of discussions are going on in the state regarding this. What is he meaning of cross voting? For this question there is no answer from anybody. This word has been used in widespread manner during elections. There is no specific definition for this word. What saying here is the votes of one party has been voted in favour of another party. How it is possible? When Parliament and Assembly elections held at a time, then there is a possibility of cross voting. It can be said as reasonable logic. This also won’t have either any specific calculations or proofs.
Every time political parties used to raise logic. This may be different before elections, at the time of elections and at the time of counting of votes. Media also behave like this. Nobody is ready to expose what is real. Here is one simple question. Why people indulge in cross voting. What is the necessity for them for doing so? Whoever person say in his own way but people vote in determined manner. They simply give their vote in favour of whom they to decide to vote. Even parties distribute money, people accept it, but cost their vote as per their will. Political leaders habituated the people for money. Now they reached to a stage to feel, ‘this money distributing also ours’. Political parties are habituating the people to accept money and saying them to cost the vote only in favour their political party. People are determined to whom they have to vote. Then how this cross voting question arises? They never change their mind immediately after the indication given by any party. During these Parliamentary elections, it is said that Cross voting occurred and BRS votes were transferred to BJP. This logic is new and not acceptable. How Vinod Kumar also came to one conclusion on cross voting. If he knows it in before why he did not took proper steps to prevent this? There is no answer for this question. Three months before the elections he had been participated in campaign. He visited every village and made house to house campaign. Crores of rupees spent. Now before results to declare, he is telling the future about his defeat. The words of whom, the people have to relay? Any party will ask the people to vote in favour of it. Then how it is possible for asking to give vote in favour of another party? In local elections it may become possible because the number of voters less and campaigning period is also very less. This word ‘cross voting’ only spread during the time of elections. Later this word never been heard. This never happens in between political parties but if a candidate feels that he will be defeated, then there may be a chance of such agreement between two candidates in fray. This also happen only sufficient days before the elections. So ‘cross voting’ is nothing but trash.
