జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఎస్ టి పి పి ని సందర్శించిన సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. బలరాం వారు మాట్లాడుతూ ప్లాంట్ లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహించి ఇటీవల కాలంలో స్వర్గస్తులైన కిరీటి ఆత్మకు శాంతిని కోరుతూ సంతాపాన్ని తెలిపారు. ఎస్ టి పి పి అధికారులు అందరితో నిర్వహించిన సమావేశంలో అధికారుల యొక్క మానసిక ప్రశాంతత తోటి వారితో సత్సoబంధాలు మరియు పరస్పర సహకారం అత్యంత అవసరమని తద్వారా ఎస్ టిపిపి యొక్క పురోగతికి దోహదం చేసిన వారు అవుతారని తెలిపారు. ఎంత క్లిష్టమైన సమస్య అయినా చర్చించి పరిష్కారం కొరకు ప్రయత్నించాలని కోరుతున్నారు. దానికి వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు. విలువైన ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యుల వ్యథకి కారణమవ్వడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని అందరూ ఎటువంటి పరిస్థితులలో అయినా దృఢ చిత్తాన్ని అలవర్చుకోవాలని కోరారు.