ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు జి శివ సాయి కృష్ణ రెడ్డి
కాటారం నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు కాటారం మండలం దామరకుంట గ్రామంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు జి శివ సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దామరకుంట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో అభిమాన సంపాదించుకున్న నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అని కొనియాడారు. ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో జీవించాలని శివ సాయి కృష్ణారెడ్డి కోరారు. రానున్న రోజులలో పార్టీలో ఉన్నత పదవులు పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ముద్దం బాపు యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకుల చంద్రశేఖర్, రామగుండం శ్రీనివాసచారి, మాజీ వార్డ్ మెంబర్లు కోడి ప్రవీణ్, ఇండ్ల సందీప్, బాసాని రాజస్వామి, బండం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.