పుట్టినరోజు జరుపుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్

మంచిర్యాల, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి అందరికీ తినిపించారు. సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు డేగ ప్రవీణ్ కుమార్, జైపూర్ మండలంలోని శెట్పల్లి మాజీ సర్పంచ్ మేడి రవి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్ నీ శాలువాతో సత్కరించి,కేక్ కట్ చేపించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఉన్నత పదవులు అధిష్టించాలని, అద్భుతమైన పాలన కొనసాగించాలని, ప్రజాసేవలో తమ తండ్రిగారిలా ఎనలేని కీర్తి గణించాలని, ప్రవీణ్ కుమార్,మేడి రవి ఆకాంక్షిస్తున్నామని తెలియజేశారు.

నిమజ్జనానికి తరలి వెళ్తున్న సిద్ధి వినాయకుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం సింగరేణి ఎస్.ఎం.పిసి సెక్యూరిటీ కార్యాలయంలో. 11 రోజులు విజ్ఞేశ్వర పూజలు అందుకొని. భద్రాచలం నిమజ్జనంకై బయలుదేరుతున్న గణనాథుడికి. ఎంతో అంగరంగ.వైభవంగాసింగరేణి సెక్యూరిటీ సిబ్బంది. వినాయక నిమర్జనానికి తరలి వెళ్తున్నాను. ఏ.ఎస్.ఓ శ్రీనివాస్. జూనియర్ ఇన్స్పెక్టర్ రాజయ్య. జమీందార్. త్రిపాటి. కుమార్. జూనియర్ అసిస్టెంట్. మోహన్ రెడ్డి. సంపత్. కుమార్. జనార్దన్ రావు. వీరస్వామి. చంద్రమోహన్. ప్రవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్. సుంకరి శ్రీనివాస్. నూకరాజు. కిరణ్. తదితరులు పాల్గొన్నారు

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:

మండల వ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు మంగళవారం అధికారులు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ ఆఫీసులో చైర్ పర్సన్ తో కల చంద్రకళ వెంకన్న, తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ దశరథ , ఎంపీడీవో కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీడీవో మాధవరెడ్డి,పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మాసరాజు, కోపరేటివ్ బ్యాంకులో సింగిల్ విండో చైర్ పర్సన్ కోడి సుష్మ వెంకన్న, ల తోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు స్పెషల్ ఆఫీసర్లు జెండా ఆవిష్కరించి వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్లు కోడి వెంకన్న, అనపర్తి శేఖర్, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి

తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షుడు హనుమాండ్ల తిరుపతిరెడ్డి,మాజీ టీపీసీసీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో కలిసి హమ్యా నాయక్ మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మరో 13 నెలల పాటు నిజాం నిరంకుశత్వ పాలనలో ఉందని,చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని,దీంతో సెప్టెంబర్ 17న విమోచన దినంగా పేర్కొంటారని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ఉత్తర్వులు జారీ చేశాయని,అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలు నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంజి విజయపాల్ రెడ్డి,పెదగాని సోమయ్య,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కందాడి అశోక్ రెడ్డి,కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య వైస్ చైర్మన్ జీనుగా సురేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ భూసాని రాము,కోఆప్షన్ సభ్యుడు జలీల్, నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి,కందాడి అచ్చిరెడ్డి, గంజి ప్రసాద్ రెడ్డి,మెరుగు మల్లేశం గౌడ్, గంజి దేవేందర్ రెడ్డి,బిజ్జాల ప్రసాద్,కిషన్ యాదవ్,బిక్షం గౌడ్,ధర్మారపు మహేందర్, రామ్ రెడ్డి,అలువాల సోమయ్య,వెంకట్ రెడ్డి, వెంకన్న యాదవ్, బండారి వెంకన్న,వెన్నం సోమిరెడ్డి, దేవేందర్ రాజు,తండా రవి యాదవ్,మహేష్ యాదవ్,బుచ్చి రాములు,శీలం హరిత,వెలుగు మహేశ్వరి,రామచంద్రు,నరేందర్, సురేందర్ నాయక్,రమేష్ నాయక్, బుచ్చమ్మ,అండమ్మ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు నిజమైన వారసులు కమ్యూనిస్టులే.

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:

బీజేపీ ఆర్ఎస్ఎస్ లకు ఈ పోరాటంతో సంబంధంలేదు
సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వాముల భూమికోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిందని, తెలంగాణకు నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని సిపిఎం పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్ అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం తోరూర్ మండలంలో కంటయపాలెం గుర్తురు అమ్మపురం, గోపాలగిరి గ్రామాలలో అమరవీరుల స్తూపాల కు పుష్పాంజలి ఘటించి సిపిఎం పార్టీ తోరూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ వారోత్సవాలను ముగింపు సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్ సిపిఎం తోరూర్ మండల కార్యదర్శి ఎండి యాకుబ్ లు మాట్లాడుతూ, భూస్వాములు, రజాకార్ల వెట్టిచాకిరీ నీ ఎదిరించి సామాన్య ప్రజల్లో కమ్యూనిస్టు పార్టీ రగిలించిన చైతన్యం తో రైతులు నడిపిన నాటి పోరాటం చారిత్రాత్మకమైన దని అన్నారు. నాటి పోరాటం వల్ల 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదని వారికి సందర్భంగా గుర్తు చేశారు. ఈ పోరాటం ద్వారా 3 వేల గ్రామ ల లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటయ్యాయి అని వారు తెలిపారు.ఆ పోరాటంలో,దొడ్డి కొమరయ్య షోయబుల్లాఖాన్, పి.సుందరయ్య,ముగ్ధుమ్ మోహిణుద్దీన్, మల్లు స్వరాజ్యం లాంటి వారు వీరోచిత పాత్ర పోషించారని గుర్తు చేశారు.ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక,కులవివక్ష కు వ్యతిరేకంగా ఆ పోరాటం నేర్పిన అనుభవాలతో నేటి ప్రజలు దేశ సంపదలో సమాన వాటా కొరకు కుల,మతాలకు అతీతంగా,కేంద్ర రాష్ట్ర పాలకులు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం పోరాడాలని సూచించారు. ఆనాటి పోరాటం తో ఏమాత్రం సంబంధం లేని నేటీ బిజేపీ, ఆర్ ఎస్ ఎస్ సంస్థలు ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 వతేదీ వరకు వాడవాడలా ఈ వాస్తవాలు చెప్పాలని,ఆనాటి సామాన్య ప్రజలు, కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగాలను ఈ నాటి యువతకు తెలియజెప్పాలని కోరారు. నాటి పోరాట ఫలితంగానే తెలంగాణలో ఇప్పటికి అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయని అన్నారు కేంద్రంలో బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చరిత్రను వక్రీకరిస్తూ రెండు సినిమాలు విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఎలక్షన్లలో ఓటర్లను దండుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 చరిత్రలో ఏం జరిగింది దాని ప్రాధాన్యత ఏమిటి ఎందుకు ఇంత వివాదాస్పదమవుతుందో ఇవన్నీ లోతుగా పరిశీలించాలని బిజెపి ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూనే సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 కు వారసులు కమ్యూనిస్టులేనని సాయుధ పోరాటం లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని ఆ నెరవేర్చే బాధ్యత ఈ తరం పై ఉందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ తోరూర్ మండల నాయకులు , డోనక దర్గయ్య, మర్కా సాంబయ్య, గుద్దేటి సాయిమల్లు, ఉమగాని యాకయ్య, కొత్త వెంకట్రెడ్డి శంకరాచారి, ధరావత్ యాకన్న, సతీష్, ప్రమీల, శైలజ, తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనానికి సిద్ధమైన బొజ్జ గణపయ్య

తెలుగు నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం. రుద్రంపూర్.
గౌతమ్ పూర్. గ్రామపంచాయతీలలో. వరసిద్ధి వినాయక 11 రోజులు పూజా కార్యక్రమాలు ముగించుకొని. భక్తుల ఆనంద కోలాహాలను. చూస్తూ. భద్రాచలం.గోదారమ్మ తల్లి. ఒడిలో నిమజ్జనానికి. వెళ్తున్నాడు రుద్రంపూర్ గ్రామపంచాయతీలో నాలేరియా.యూత్. పొట్టి శ్రీనివాస్. పరమేష్. ఓదయ్య. ఉప్పు శ్రీనివాస్. మరి యూత్ పిల్లలు ఉన్నారు.మార్కెట్ ఏరియా.నుండి సకినాల.సమ్మయ్య.ప్రవీణ్. హరీష్. నాగరాజు. భూలక్ష్మి. గోపెరియా. నుండి గుమ్మడి శ్రీనివాస్. ఎండి రజాక్. వినయ్. క్లబ్ ఏరియా.నుండి. శ్రీనివాస్. మరియు తదితరులు పాల్గొన్నారు గౌతమ్ గౌతమ్ పూర్ నుండి బిక్షపతి. మరి వాళ్ళ యూత్ పాల్గొని విజయకుడ్ని. నిమజ్జనానికి తీసుకెళుచు నారు

గణపతి నిమజ్జనం వేడుకల్లో భారీగా పాల్గొన్న మహిళా భక్తులు

నస్పూర్, (మంచిర్యాల) నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం షిర్కే కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి వినాయక మండపంలో నవరాత్రులు ముగించుకొని నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దగదగలాడే విద్యుత్ కాంతులతో వాహనాన్ని అందంగా అలంకరించి,అందరూ ఒకేలా ప్రత్యేక వస్త్రధారణ చేసుకొని, ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు స్వామివారికి సమర్పించి, తమ కుటుంబాలు, కాలనీ వాసులు, ప్రజలందరూ బాగుండాలని, జ్యోతి ప్రజ్వలనలు చేసి,కొబ్బరికాయలు కొట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. చిన్న పెద్ద అందరు కలిసి గణపతి ముందు కోలాటాలు వేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా నాట్యాలు చేసుకుంటూ ఆ గణనాథునికి ఘనంగా శోభాయాత్ర నిర్వహించి వీడ్కోలు తెలిపి నిమజ్జన ఘట్టం పూర్తి చేశారు.

రాజీవ్ గాంధీ విగ్రహా ఆవిష్కరణ పట్ల భగ్గుమన్న బిఆర్ఎస్.

# డివిజన్ వ్యాప్తంగా నిరసన సెగలు.

నర్సంపేట,నేటిధాత్రి :

సచివాలయం ముందు తెలంగాణతల్లి విగ్రహం ఉండాల్సిన స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ పట్ల భారత్ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు.నర్సంపేట డివిజన్ పరిధిలోని దుగ్గొండి,నర్సంపేట,చెన్నారావుపేట, నెక్కొండ,ఖానాపురం,నల్లబెల్లి మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.నర్సంపేట పట్టణంలో,పలు మండల కేంద్రాలలో తెలంగాణతల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.అమరవీరుల స్థూపాల వద్ద నివాళులు అర్పించారు.


రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో నిరసన కార్యక్రమాలు పాల్గొన్న నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,నల్లబెల్లి మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి మాట్లాడుతూ తెలంగాణ తల్లి ఆత్మగౌరవని కించపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు.నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన,తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ తల్లిని అవమానించారని అవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమాలలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు ,పీఎస్ఎస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్ ,నియోజకవర్గ నాయకులు ,క్లస్టర్ బాధ్యలు మరియు ఇతర నాయకులు,కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

మతోన్మాదం, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే సాయుధ పోరాట అమరవీరులకు నిజమైన నివాళి ‌

ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :


తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభ మంగళవారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూభూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని, మతోన్మాదం, కార్పొరేట్ సంస్థల కలిసి ప్రజలపై చేసిస్తున్న దాడులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నాడు దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని బిజెపి ముస్లింలకు, హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్ర భాష్యాలు చెప్తున్నదని అన్నారు. దీనిని తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన మహోన్నతమైన పోరాటంలో దొడ్డి కొమురయ్య, షేక్ బందగి, ఠాన్ నాయక్, షోయబుల్లాఖాన్ లాంటి ఎందరో వీరులు అశువులుబాసారని అన్నారు. వీళ్లంతా కుల, మతాలతో సంబంధం లేకుండా భూస్వాముల అణిచివేతకు, దోపిడీకి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డితో పాటు మగ్దూం మొహియుద్దీన్, బిమిరెడ్డి నర్సింహ రెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, మల్లు స్వరాజ్యం ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. ఆ పోరాటంలో సుమారు 4000 మంది అమరులయ్యారని, 3000 గ్రామాలలో ప్రజారాజ్యాలు ఏర్పడ్డాయని, పదిలక్షల ఎకరాల భూ పంపిణీ ఆ పోరాటం చేసిందని చెప్పారు. అలాంటప్పుడు హిందూ, ముస్లింల మధ్య పోరాటం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ‌ తెలంగాణ రైతాంగ పోరాటంలో సోయబుల్లాఖాన్, షేక్ బందగి, మగ్దూం మోహినుద్దీన్, జవ్వాద్ రజ్వీ, ఆలం ఖుందుమీరి, షౌకత్ ఉస్మాని తదితర ముస్లిం నాయకులు నిజాం పైన పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజలను పట్టిపీడించింది, వెట్టిచాకిరి చేయించుకున్న వారిలో విసునూరు రాంచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాప రెడ్డి లాంటి హిందువులైన జమీందారులు, జాగిర్దారులు, దొరలు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, పటేల్, పట్వారిలే మెజారిటీగా ఉన్నారని, వీరి ఆగడాలకు వ్యతిరేకంగానే ప్రజలంతా కుల, మతాలకతీతంగా ఐక్యంగా సాగించిన పోరాటాన్ని మతం పేరుతో ఎలా వక్రీకరిస్తారని ఆయన విమర్శించారు. బిజెపి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహాత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులుమితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు వాస్తవ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. మన ప్రాంతంలో ఎర్రబోతు రామిరెడ్డి ఉరి శిక్ష పడితే అమెరికా జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసి వార్త ప్రచురిస్తే దానిని చూసి ప్రపంచవ్యాప్తంగా పదహారేళ్ల అతనికి ఎలా ఉరిశిక్ష విధిస్తారని ఉద్యమం పెద్ద ఎత్తున జరిగిందని, ఆ ఉద్యమాన్ని చూసి బ్రిటన్ కు చెందిన జాన్ ఫ్రిటర్ కోర్టులో వాదించి ఉరిశిక్షను రద్దు చేయించారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల్లో భాగంగానే అల్వాల నర్సింహారెడ్డి కూడా యూనియన్ సైన్యాలకు దొరకకుండా పోరాడుతూ తమ తుపాకీతో తామే కాల్చుకున్నారని పేర్కొన్నారు. వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం, దున్నేవాడికే భూమి కావాలని పోరు చేసిన అమరుల త్యాగాలకు మతం రంగు పులిమే మతోన్మాద చర్యలను ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇది ప్రజల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిదానం చేసిన రైతాంగ సాయుధ పోరాట అమరుల త్యాగాలను కించపరచడమేనని అన్నారు. అమరులను ‌గుర్తు చేసుకోవడం అంటే, మతోన్మాదుల ఆగడాలకు, కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ అమరులు చూపిన బాటలో పయనించడమేనని, నేడు మన ముందున్న కర్తవ్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో CPM జిల్లా జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, మహ్మద్ సలీం, పి నర్సిరెడ్డి, గంజి మురళీదర్, మల్లం మహేశ్, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కొండ అనురాధ, వెంకన్న, మన్నెం బిక్షం, సరోజ, నర్సింహ, సైదాచారి, అరుణ, పోలె సత్యనారాయణ, బొల్లు రవీంద్ర కుమార్, మహబూబ్ అలీ, రాములు, నగేష్ , నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

జైపూర్ మండలంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ సంబరాలు

జైపూర్, నేటి ధాత్రి:

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది,ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వివిధ గ్రామాల పరిధిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఎగరవేసి చేసి స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జైపూర్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణములో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేసి గీతా లాపన చేశారు.తెలంగాణ అమరవీరుల చిత్రపాటాలకు నివాళులు అర్పించి వారు చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలనను నుంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17 వ రోజును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, పంచాయతీ కార్యదర్శి ఉదయ్,కార్యాలయ సిబ్బంది, ఏపీవో వెంకటేశ్వర్లు,మండల కాంగ్రెస్ నాయకులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి,మంతెన లక్ష్మణ్, కాటుకూరి సత్యం,కల్కి రమేష్, శివ, అనిల్ , తదితరులు పాల్గొన్నారు.

నాంసాని పల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు

పెద్దపల్లి జిల్లాలో 100 అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు, సన్న హాలు,

విగ్రహ ప్రదాత,కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ ( వాసు,)

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, అంబేద్కర్ యూత్ అండ్ అసోసియేషన్, ఆధ్వర్యంలో మంగళవారం ఓదెల మండలం నాంసాని పల్లి గ్రామంలో సమావేశం జరిగింది, నాంసానిపల్లి గ్రామ అంబేద్కర్ యూత్ అండ్ అసోసియేషన్ నల్లాల రామ్ నరసయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కురుమ పల్లి మాజీ,సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూరు విగ్రహాల ప్రధాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆసం పల్లి లక్ష్మీ పౌండేషన్ చైర్మన్ ఆసం పల్లి శ్రీనివాస్,ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇరుగురాల క్రిష్టయ్య, జిల్లా కోకన్వీనర్ సంకెనపల్లి లక్ష్మయ్య, పాల్గొన్నారు, ఆసంపల్లి వాసు ను, శాలువతో ఘనంగా సన్మానించారు పూల బొకే అందించి అభినందించారు, ఈ సందర్భంగా నూరు అంబేద్కర్ విగ్రహాల,పదాత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్, చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశానికి దిక్సూచి ప్రపంచ మేధావి, భారతరత్న, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు అణ గారిన,వర్గాలకు స్ఫూర్తిని స్తుందన్నారు
దళిత అనగారిన,వర్గాల తో పాటు అన్ని వర్గాలకు అన్ని హక్కులు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, ఆయన విగ్రహాలను పెద్దపల్లి జిల్లాలోని గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తామన్నారు,నూరు అంబేద్కర్ విగ్రహాలు ప్రతిష్టాపనే ధ్యేయంగా పనిచేస్తానన్నారు, అంకితభావంతో పనిచేస్తున్న ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం సేవలను అభినందించారు, క్రమశిక్షణ కలిగిన,అంబేద్కర్ సంఘం నాయకుల తో కలిసి పని చేయడం సంతోషకరమన్నారు,, అంబేద్కర్ విగ్రహాలు అవసరం ఉన్నవారు, తనను గాని, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్యను కానీ సంప్రదించాలని కోరారు.

ఘనంగా గొల్లపెల్లి పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవం

గొల్లపల్లి నేటి ధాత్రి :

నవరాత్రుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడు మంగళవారం నిమజ్జనోత్సవానికి బయలుదేరాడు.ఆయా మంటపాలవారు గణేష విగ్రహాలను ప్రత్యేక వాహనంపై ఆసీనులను చేసి శోభాయాత్రగా గొల్లపెల్లి పట్టణ ప్రధాన వీధుల గుండా చెరువుకు నిమజోత్సవానికై ఇజం యూత్ సభ్యులు డప్పు చప్పుళ్ళు,మంగళవాద్యాల నడుమ యువత మరియు మహిళలు ఆటపాటలతో కోలాటలాటలతో తరలించారు.కాగా స్థానిక బాబు జగ్జీవన్ రామ్ సంఘం సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయా విగ్రహ మంటపాల నిర్వహకుల వారికి స్వాగతం పలికరు కాగా బాబు జగ్జీవరామ్ సంఘం లంబోదరణకి ఈ గ్రామంలోని కొన్ని కుల సంఘాల పెద్దలు ప్రతి ఏటా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక్కడ లంబోదరునికి మొక్కిన మొక్కులలో అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తున్నామని వారు నమ్మకంగా భావిస్తున్నారు. ఈ లంబోదరని ప్రత్యేకత కాగా స్థానిక పోలీస్ అధికారులు ప్రత్యక్ష భద్రత ద్వారా శోభాయాత్ర వేడుకలను సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్సై చిర్ర సతీష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిఘా నీడలో నిమజ్జనోత్సవం వేడుకలు కొనసాగించారు. బాబు జగ్జీవన్ రామ్ సంఘం సభ్యులు వారు ఇక్కడ లడ్డు ప్రసాదం ప్రతి సభ్యునికి చేరవేస్తారు. తదుపరి వినాయక విగ్రహమును నిమజ్ఞోత్సవాన్ని కొనసాగించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్దతి మార్చుకోవాలి

మండల పార్టీ అద్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసిన బి ఆర్ఎస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పద్దతి మార్చుకోవాలని గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి అన్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ గారి పిలుపు మేరకు స్థానిక జిల్లా పార్టీ అద్యక్షురాలు గండ్ర జ్యోతి వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు గణపురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్దతి మార్చుకోవాలని అన్ని వర్గాల ప్రజల కోసం పని చేయాలని అన్నారు
సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహా ఏర్పాటు రాజకీయం కోసం అని దని వాళ్ళ ప్రజల దృష్టిని పక్కదారి పట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేరని రేవంత్ ప్రభుత్వం రైతులను ఇబ్బద్దులు పెడుతుందని ఋణమాఫీ పేరుతో అనేక ఆంక్షలు పెట్టి రైతులను నట్టేట ముంచుతున్నారని 6 గ్యారంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా తెలంగాణ తల్లి ఉద్యమ చరిత్రను కెసిఆర్ పేరును లేకుండా చేయాలని చేస్తున్నారని ప్రజల పక్షాన ఎన్నికల హామీల అమలు కోసం నేతృత్వంలో ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తామని ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు
కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొలుసాని లక్ష్మీనరసింహారావు మాజీ సొసైటీ ఛైర్మన్ పొరెడ్డి పూర్ణచంద్రారెడ్డి నాయకులు బైరగాని కుమారస్వామి గంజి జనయ్య మాజీ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి గండు శ్రీధర్ కడారి ఓదెలు పల్లెబొయిన సదయ్య ఎలబోయిన భద్రయ్య గాదె శేఖర్ చడా సర్వేషాం అల్లూరి శ్రీనివాస్ బొట్ల స్వామి మార్త సుధాకర్ విష్ణు వాజీద్ బుక్యా రమేష్, తదితరులు పాల్గొన్నారు

మంత్రి పొంగులేటిని కలిసిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటిధాత్రి :

వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమాలలో జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న పర్యటన సందర్బంగా మంగళవారం నిట్ లో ఆయనను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఎమ్మెల్యే దొంతి వెంట కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ ఇతర నాయకులు ఉన్నారు.

ఎస్టిపిపి లో స్పెషల్ క్యాంపెయిన్ 4.0 కార్యక్రమం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని (ఎస్టిపిపి) సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పరిపాలనా భవనంలో స్పెషల్ క్యాంపెయిన్ 4.0 కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి ఈడి (హెడ్ అఫ్ ది ప్లాంట్) ఎన్.వి.రాజశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులందరి చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేపించడం జరిగింది.ఈ సందర్బంగా ఈడి రాజశేఖర్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం –స్వచ్చత ను సంస్తాగతీ కరించడం మరియు మన దేశంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైల్స్ ని తగ్గించడం అలాగే ఆఫీసులను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ స్వచ్చత కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా
పరిపాలనా సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల శాఖ (డి.ఎ.ఆర్.పి.జి) మరియు బొగ్గు మంత్రిత్వ శాఖల వారి ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.ప్రపంచలోని ఏ దేశంలోనైన పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచడమేనని అన్నారు. మనం పరిశుభ్రంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాక ఇతరులను అపరిశుభ్రత చేయనియకుండా చూడాలన్నారు. అలాగే వారానికి 2 గంటలు మరియు సంవత్సరంలో 100 గంటలు పరిశుభ్రతకు కేటాయిస్తే పరిశుభ్ర తెలంగాణ తద్వారా స్వచ్చ భారత్ సాధ్యమవుతుందన్నారు.
ఈ కార్యక్రమములో జీ.ఎం.(పిసిఎస్) శ్రీనివాసులు, ఏఐటియుసి పిట్ సెక్రెటరి సత్యనారాయణ,సీఎంఓఏఐ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, ఎ.జీ.ఎం (సివిల్) ప్రసాద్, ఏజీఎం (ఫైనాన్స్) టి.సుధాకర్,ఎ.జీ.ఎం(ఈ అండ్ ఎం)మదన్ మోహన్, డిజిఎం (పర్యావరణం)వాసుదేవ మూర్తి, ఎస్వోటు ఈడి ప్రభాకర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్,ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో జెండావిష్కరించిన చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండావిష్కరణ వేడుకల్లో పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి అనంతరం ప్రజా పాలన ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ విజయ్ పాల్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ నరసింహ కౌన్సిలర్స్,మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు,పిఏసిఎస్ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు,మున్సిపల్ ఆఫీసర్స్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్, మెప్మా సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రభుత్వ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా),

నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలదండలు వేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంపీడీవో ఆఫీసులో శ్రీధర్ జెండా ఆవిష్కరించారు, ఎమ్మార్వో ఆఫీస్ లో నవాబ్ తాసిల్దార్ నిజాముద్దీన్ జెండా ఆవిష్కరించారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ యందు ఎస్సై తోట తిరుపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తదుపరి అనంతరం జాతీయ గీతాన్ని అందరూ కలిసి ఆలపించారు ఇతర కార్యాలయంలో ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇందారం గ్రామపంచాయతీలో జెండా ఆవిష్కరణ

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామా పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలనా దినోత్సవం సందర్బంగా మండల పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీపతి బాపు రావు జాతీయ పతాకావిష్కరణ చేయడము జరిగినది.తదనంతరం స్వచ్ఛత సేవలో భాగంగా ప్రతిజ్ఞ చేయడము జరిగినది. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా కూడా కలిసికట్టుగా సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించాలని ప్రజలకు ప్రతి విషయంలో అవగాహన కల్పిస్తూ వైద్య ఆరోగ్య సూచనలని అందిస్తూ గ్రామాలను సస్యశ్యామలంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, గ్రామపంచాయతీ కార్యదర్శి, అంగన్వాడి టీచర్, ఆశ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

చెన్నూరు, (మంచిర్యాల) నేటి ధాత్రి:

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూర్ పట్టణ బీజేపీ కార్యాలయం (15వ వార్డు) వద్ద పట్టణ బీజేపీ అధ్యక్షుడు జాడి తిరుపతి అధ్యక్షతన జాతీయ జెండ ఎగరవేయడం జరిగినది.అదే విధంగా ఈ రోజు మన దేశ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టిన రోజు సందర్భంగా చెన్నూర్ పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగులకు చెన్నూర్ పట్టణ బీజేపీ నాయకులు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని చెప్పడం జరిగింది. ఇటువంటి రోజును భారత ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం గా జరుపుకోవాలని అదేశించగా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు పట్టించే విధంగా ఈ రోజును తెలంగాణ విమోచన దినోత్సవం బదులుగా ప్రజాపాలన దినోత్సవంగా పేరు మార్చి వేడుకలు నిర్వహించడం సరికాదు అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాపర్తి వెంకన్న,జిల్లా చేరికల కమిటీ సభ్యులు చెన్నూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, చెన్నూర్ పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు గర్రేపల్లి వెంకట నర్సయ్య,తుమ్మ శ్రీపాల్, రెండవ వార్డు కౌన్సిలర్ కమ్మల శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ కె వి ఎం శ్రీనివాస్,పట్టణ ఇన్చార్జి రత్న లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యవర్గ సభ్యులు కొండపాక చారి,జిల్లా ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షులు తలారి రాజులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివ క్రిష్ణ, పట్టణ బీజేపీ నాయకులు కాయిత రాజేష్, వంశి, మద్ధ మధు,అడప శ్రీనివాస్,జనార్ధన్, రాజబాపు,గణేష్ సింగ్, ,కాయిత్ వెంకటేష్,సుంకరి శ్రావణ్, శ్రీకాంత్ ,సాయి తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అమరుల త్యాగ ఫలితం తెలంగాణ విమోచన దినోత్సవం

జమ్మికుంట: నేటి దాత్రి

ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి విమోచన లభించిందని జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు జీడి మల్లేష్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జమ్మికుంట పట్టణంలోని బిజెపి కార్యాలయం ఆవరణలో కార్యకర్తలతో కలిసి మల్లేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు .అనంతరం నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజెపి శ్రేణులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ భారత్ దేశానికి 1947 ఆగస్టు 15 వ తేదిన స్వాతంత్రం వచ్చి దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటే తెలంగాణ ప్రాంతం (హైదరాబాద్ సంస్థానం) ఆనాడు నిజాం నవాబు పరిపాలనలో ఉన్నదని గుర్తు చేశారు. నిజాం రాజు తన ప్రత్యేక సైన్యాన్ని (రజాకార్) ఏర్పాటు చేసుకొని దానికి కాసిం రజ్వి అనే ఒక నరరూప రాక్షసుడిని నాయకుడిని చేసి అతని ఆధ్వర్యంలో తెలంగాణలో మహిళ పైన అత్యాచారాలు చేయడం, మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించడం, దోపిడీలు చేయడం, చిన్న పెద్ద తేడా లేకుండా క్రూరంగా హింసించడం జరిగిందని గుర్తు చేశారు. నిజాం దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది ఉద్యమించి అమరులు అయ్యారని అన్నాడు. ఆనాడు భారత దేశ హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాం రాజు ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఈరోజు స్వేచ్ఛ వాయులు పిలుస్తున్నారంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషి అని, అతనిని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ స్మరించుకోవాలని మల్లేష్ సూచించారు. జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వాని సెప్టెంబర్ 17 న అధికారికంగా ఉత్సవాలు జరిపించాలని డిమాండ్ చేశాడని, కానీ అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించడం దురదృష్టకరమని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఎంఐఎం పార్టీకి భయపడి, కొన్ని వర్గాల సంతృస్టికరణ కోసం తెలంగాణ ప్రజలను అవమానించారని నాయకులు తీవ్రంగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పల్లపు రవి, ఠాగూర్ రాజేష్, అప్పం మధు యాదవ్, మోతే స్వామి, ఇటికాల స్వరూప, మేక సుధాకర్ రెడ్డి, ఠాగూర్ రాకేష్, మోడెం రాజు, పత్తి జనార్దన్ రెడ్డి, ఉడుగుల రవికుమార్, గర్రెపల్లి నిరుప రాణి, ఎండి రజియా తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version