ఇందారం గ్రామపంచాయతీలో జెండా ఆవిష్కరణ

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామా పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలనా దినోత్సవం సందర్బంగా మండల పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీపతి బాపు రావు జాతీయ పతాకావిష్కరణ చేయడము జరిగినది.తదనంతరం స్వచ్ఛత సేవలో భాగంగా ప్రతిజ్ఞ చేయడము జరిగినది. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా కూడా కలిసికట్టుగా సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించాలని ప్రజలకు ప్రతి విషయంలో అవగాహన కల్పిస్తూ వైద్య ఆరోగ్య సూచనలని అందిస్తూ గ్రామాలను సస్యశ్యామలంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, గ్రామపంచాయతీ కార్యదర్శి, అంగన్వాడి టీచర్, ఆశ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version