జైపూర్, నేటి ధాత్రి:
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది,ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వివిధ గ్రామాల పరిధిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఎగరవేసి చేసి స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జైపూర్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణములో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేసి గీతా లాపన చేశారు.తెలంగాణ అమరవీరుల చిత్రపాటాలకు నివాళులు అర్పించి వారు చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలనను నుంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17 వ రోజును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, పంచాయతీ కార్యదర్శి ఉదయ్,కార్యాలయ సిబ్బంది, ఏపీవో వెంకటేశ్వర్లు,మండల కాంగ్రెస్ నాయకులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి,మంతెన లక్ష్మణ్, కాటుకూరి సత్యం,కల్కి రమేష్, శివ, అనిల్ , తదితరులు పాల్గొన్నారు.