పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండావిష్కరణ వేడుకల్లో పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి అనంతరం ప్రజా పాలన ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ విజయ్ పాల్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ నరసింహ కౌన్సిలర్స్,మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు,పిఏసిఎస్ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు,మున్సిపల్ ఆఫీసర్స్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్, మెప్మా సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
