నస్పూర్, (మంచిర్యాల) నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం షిర్కే కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి వినాయక మండపంలో నవరాత్రులు ముగించుకొని నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దగదగలాడే విద్యుత్ కాంతులతో వాహనాన్ని అందంగా అలంకరించి,అందరూ ఒకేలా ప్రత్యేక వస్త్రధారణ చేసుకొని, ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు స్వామివారికి సమర్పించి, తమ కుటుంబాలు, కాలనీ వాసులు, ప్రజలందరూ బాగుండాలని, జ్యోతి ప్రజ్వలనలు చేసి,కొబ్బరికాయలు కొట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. చిన్న పెద్ద అందరు కలిసి గణపతి ముందు కోలాటాలు వేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా నాట్యాలు చేసుకుంటూ ఆ గణనాథునికి ఘనంగా శోభాయాత్ర నిర్వహించి వీడ్కోలు తెలిపి నిమజ్జన ఘట్టం పూర్తి చేశారు.