జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటలో డ్యూటీ డాక్టర్ అఖిల జాతీయ జెండాను ఎగురవేశారు ,ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని ఎక్సలెంట్ హై స్కూల్ లో ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ అపరాధ రుసుంతో అడ్మిషన్స్ జరుగుచున్నవి అని స్కూల్ కరెస్పాండంట్ కే.దేవానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి, ఇంటర్ చదవలేకపోయామని బాధపడుతున్న వారికీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ప్రవేశల కోసం అదనపు రుసుముతో అడ్మిషన్లు ఈనెల 30 వరకు జరుగుచున్నాయని తెలిపారు. ఈకార్యక్రమం చదువుకునే వారికీ మంచి సువర్ణ అవకాశం కల్పించబడిందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఎక్సలెంట్ హై స్కూల్ 9848947288, 9652608597 నంబర్ లను సంప్రదించాలని కోరారు. ఈకార్యక్రమంలో కోఆర్డినేటర్ భక్తు విజయ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హైదరాబాదులోని గాంధీభవన్లో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపుతూ, ప్రజా పాలన, పారదర్శక పాలనతో సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సోనియా గాంధీ కృషితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ స్ఫూర్తితో నిరంతరం ప్రజా శ్రేయసే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని వెలిచాల రాజేందర్ రావు కోరారు.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ ఓ సిటీ ఎదురుగా గల నూతన కలెక్టరేట్ నిర్మాణ మైదానంలో మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు
రాష్ట్ర రెవెన్యూ, హౌసీంగ్, సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, డిసిపి రవీందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఖిలా వరంగల్ లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పూలతో అంజలి ఘటించి నివాళులు అర్పించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసీంగ్, సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండలోని న్యూ లయోలా హైస్కూల్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ తాడిశెట్టి క్రాంతి కుమార్ మరియు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ అతిథులుగా పాల్గొని ముందుగా అమరవీరులకు నివాళులర్పిస్తూ, దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కొమరం భీమ్ భాగ్యరెడ్డి వర్మ కాలోజి నారాయణ రావు ప్రో జయశంకర్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జండా వందనం చేసి పిల్లలకు మిఠాయిలు పంచడం జరిగింది. పిల్లల్ని ఉద్దేశించి కరస్పాండెంట్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఆనాడు జరిగినటువంటి సాయుధ పోరాటం , హైదరాబాద్ స్టేట్ విలీనం నిజాం నిరంకుశ పాలన రజాకార్ల అరాచకాలు దేశ్ముకులు పటేల్ పట్వారిలు తెలంగాణ ప్రజల పైన చేసినటువంటి దాడులు అన్యాయాల పైన పిల్లలకు వివరించడం జరిగింది అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జరిగినటువంటి పరిణామాలు ఆంధ్ర పెత్తందారులు, ముఖ్యమంత్రులు చేసినటువంటి అన్యాయాలను పైన విద్యార్థులకు వివరించారు అనంతరం వ్యాసరచనలు చిత్రలేఖనం ఉపన్యాస పోటీలు విద్యార్థులకు నిర్వహించి బహుమతులు బహుకరించారు ఆనాటి వీరుల స్ఫూర్తితో మన ముందుకు సాగాలని వారికి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బందిచే స్వచ్ఛతాహి సేవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ, మేనేజర్ డి స్వామి, రెవెన్యూ అధికారి సతీష్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్లు, ఆర్పీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాల అందజేత
టి. ప్రైడ్ ద్వారా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17 వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలుచేయడం ప్రారంభించింది.
మహాలక్ష్మి పథకం అమలు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించింది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ… ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 87 కోట్ల 12 లక్షల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. తద్వారా మహిళలకు 2 వేల 958 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాం. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకూ 1 కోటి 30 లక్షల 67 వేల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనిద్వారా మహిళలకు రూ.51 కోట్ల 80 లక్షల లబ్ధి చేకూరింది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు రాష్ట్రంలో నిరుపేదలు సైతం కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1 వేయి 835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది. దీని ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 10 వేల 622 మంది లబ్ది పొందారు.
రూ. 500 కే వంటగ్యాస్ సిలిండర్ ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం, ప్రస్తుతం రాష్ట్రంలో 42 లక్షల 90 వేల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటిదాకా 95 వేల 146 మందికి లబ్ధి చేకూరుతోంది. దీనికి గాను ప్రభుత్వం రూ. 5 కోట్ల సబ్సిడీ అందజేసింది.
గృహ జ్యోతితో పేదల ఇంట వెలుగులు అల్పాదాయ వర్గాలవారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి, వారి గృహాలలో చీకట్లను పారదోలి, విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. ప్రస్తుతం రాష్ట్రంలో 48 లక్షల 62 వేల 682 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5 లక్షల 41 వేల 520 జీరో బిల్లులు జారీచేయడం జరిగింది. ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 20 కోట్ల 74 లక్షల 46 వేల 569 రూపాయలను గృహజ్యోతి క్రింద చెల్లించడం జరిగింది.
ఇందిరమ్మ ఇళ్ళు పేద, బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3 వేల 500 ఇళ్ళ చొప్పున రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల 50 వేల ఇళ్ళ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం.
రైతన్నలకు రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ
మా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల రూపాయల వరకూ రైతుల రుణాలను మాఫీ చేశాం. రుణమాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. ఈ రెండు లక్షల రూపాయల లోపు రుణ మాఫీ కి గాను రాష్ట్రంలో 22 లక్షల 22 వేల 67 మంది రైతుల లోన్ అకౌంట్లలో 17 వేల 869 కోట్ల 21 లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది. జిల్లాలో 43 వేల 892 మంది రైతుల ఖాతాలలో రుణమాఫీ కింద రూ. 346 కోట్ల 85 లక్షలు జమ చేయడం జరిగింది.
రైతు భరోసా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. మా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతోంది.
సన్న వడ్లకి రూ.500 బోనస్ మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోంది. కానీ, పండిన పంటకు సరైన గిట్టు బాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పంటల బీమా పథకం రైతులకు పంటల బీమా పథకం వర్తింపచేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతే కాకుండా వ్యవసాయ మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం “తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్” ను ఏర్పాటు చేసింది.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి “తెలంగాణ విద్యా కమిషన్” ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాల అందజేత
మహమ్మద్ మైమిన్, నజీం సుల్తానా, గుమ్మడి అభయ్ పటేల్ కు కారుణ్య నియామక పత్రాలను ప్రభుత్వ విప్ అందజేశారు.
లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
పరిశ్రమల శాఖ నుంచి టీ ప్రైడ్ కింద ఎస్టీలు 17 మందికి, ఎస్సీ లు 36 మందికి, , ఇద్దరు దివ్యాంగులకు మంజూరు పత్రాలు ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రమేష్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల తహసిల్దార్ మొహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
*రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు గంగుల కమలాకర్,చామకూర మల్లారెడ్డి,వీ.శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి తదితర ప్రముఖులతో కలిసి తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు*
*హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17వతేదీన భారత యూనియన్ లో కలిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజున బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే*
*ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు,మాజీ మంత్రి, ఎమ్మెల్యే కే.టీ.రామారావు మంగళవారం తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు*
*ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర పాల్గొని మొదట తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు*
*ఆ తర్వాత ఎంపీ వద్దిరాజు కేటీఆర్,గంగుల, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి జాతీయ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి క్షీరాభిషేకం చేశారు, విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు*
*సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాల్సిన చోట మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఇందుకు స్పందన బీఆర్ఎస్ ప్రముఖులు, నాయకులు,కార్యకర్తలు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు*
*ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి”,”జోహార్లు జోహార్లు తెలంగాణ అమరవీరులకు జోహార్లు”,”సిగ్గు చేటు సిగ్గు చేటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం సిగ్గు చేటు”,”సిగ్గు సిగ్గు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు సిగ్గు సిగ్గు”అంటూ గులాబీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలివ్వడంతో తెలంగాణ భవన్, దాని పరిసరాలు దద్దరిల్లాయి*
`అలా అయితే షోయబుల్లా ఖాన్ నిజాంకు వ్యతిరేకంగ కలమెత్తాడు.
`సాక్షాత్తు నిజాం సోదరుడు కూడా తెలంగాణ విముక్తి పోరాటం చేశారు.
`ముగ్థూమ్ మొహినిద్దీన్ నిజాంకు వ్యతిరేకంగా కవిత్వం రాశాడు.
`తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ హడావుడి ఎందుకు చేసింది.
`తర్వాత ఎందుకు వదిలిపెట్టింది?
`ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సెప్టెంబరు17 ను ఎందుకు జరపలేదు!
`ఇప్పుడు బిజేపి చెప్పేదానిలో నిజమెంత వుంది?
`రాజకీయ అవసరాల కోసమే తప్ప, విమోచనంపై ఎవరికీ స్పష్టత లేదు.
`అంతా అవకాశవాదం!
`గొప్పల కోసం ఆరాటం.
`చరిత్ర వక్రీకరించి రాజకీయం.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 అనేది ఎడతెగని పంచాయితీగానే మిగిలిపోయింది. ఈ రోజు తెలంగాణ విమోచనా? విద్రోహమా? లేక విలీనమా? అన్న అంశాలపై అనేక రకాలైన అభిప్రాయాలున్నాయి. అందుకే ఎవరికి నచ్చిన రీతిలో వారు సెప్టెంబర్ 17 విశ్లేషిస్తూనే వుంటారు. అయితే నిజంగా ఈ రోజును విలీనమే అందామా? అదీ సరైందే..తెలంగాణ ఒకప్పటి హైదరాబాద్ సంస్ధానం ఇండియన్ యూనియన్‌లో విలీనం జరిగింది. చరిత్ర ప్రకారం ఇప్పటి తెలంగాణ అంటే ఒకప్పటి హైదరాబాద్ సంస్ధానం. అందులో మరట్వాడా ప్రస్తుతం మహారాష్ట్రంలో భాగం. బీదర్ అది ఇప్పుడు కర్నాటకలో వుంది. హైదరాబాద్ సంస్ధానంలో మూడు బాషలు కలిసిన ప్రాంతంగా వుండేది. మొత్తం హైదరాబాద్ సంస్ధానంలో 16 జిల్లాలుండేవి. తెలంగాణకు చెందిన 8 జిల్లాలు, మరాఠకు చెందిన 4 జిల్లాలు, కర్నాటకు చెందిన 4 జిల్లాలతో కలిసి వుండేది. 1947లో దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటుంటే తెలంగాణ మాత్రం ఇంకా నిజాం పాలనలో మగ్గిపోతూవుండేది. అయితే నిజాం ఇండియన్ యూనియన్ వీలీనయ్యేందుకు ససేమిరా? అన్నారు. తాను స్వతంత్ర దేశంగా వుంటానని తేల్చి చెప్పారు. అవసరమైతే పాకిస్తాన్‌లో కలిపేస్తానని కూడా చెప్పుకొచ్చాడు. కాని అప్పటికే హైదరాబాద్ సంస్ధానంలో దేశ స్వాతంత్య్ర ఉత్సవాలు జరుగుతుండేవి. దాన్ని జీర్ణించుకోలేని నిజాం ప్రజలను చిత్రహింసలకు గురి చేసే ప్రయత్నాలు అనేకం చేశారు. అందులో భాగంగా తెలంగాణలో రజాకార్లను పెంచిపోషించారు. ఖాసిం రజ్వీ లాంటి వారి చేతిలో నిజాం పోలీసులను పెట్టి తెలంగాణ పల్లెల్లో శాంతి లేకుండా చేశాడు. తెలంగాణ పల్లెల్లో ఖాసిం రజ్వీ చేసిన అరచకాలు అన్నీ ఇన్నీ కావు. వీర భైరాన్‌పల్లి, కూటిగల్ గ్రామాలలో రజాకార్లు అత్యాచారాలు, హత్యలు ఒక్కసారిగా తెలంగాణ సమాజాన్ని చైతన్యం వైపు తీసుకెళ్లింది. బైరాన్‌పల్లి ఘటనను మరో జలియన్ వాలా బాగ్ సంఘటనగా గుర్తు చేసుకుంటారు. ఒక్క బైరాన్‌పల్లిలోనే ఒకే రోజు 108 మంది రైతులను కాల్చి చంపారు. మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడిరచారు. నిజాం కాలంలో వెట్టి అనేది మరింత ముదిరిపోయింది. దాంతోపాటు హిందువులను ముస్లింలలోకి మార్చేందుకు పెద్దఎత్తున కుట్రలు జరిగాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. యార్ జంగ్ నేతృత్వంలో మజ్లీస్ ఇత్తెహదుల్ బైనుస్మలీన్ సంస్ధను ఏర్పాటు చేసి, హిందువులను ముస్లింలుగా మార్చుతూవచ్చారు. నానాటికీ నిజాం అరాచకాలు తీవ్రమౌతుండడం, రైతులను వేదిస్తుండడం, మహిళలను చిత్రహింసలకు గురి చేస్తుండడంతో హైదరాబాద్‌లో రామానంద తీర్ధలాంటి వారు పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టారు.
తెలంగాణ పల్లెల్లో కమ్యూనిస్టులు సాయధ పోరాటాలు చేస్తూ వచ్చారు. ఈ సాయుధ పోరాటాలు శరవేగంగా విస్తరించాయి. ఇదే సమయంలో హైదరాబాద్ సంస్ధానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ పోలో పేరుతో 1948 సెప్టెంబర్ 13 మొదలైన చర్య 17తో నిజాం లొంగిపోవడంతో పూర్తయింది. కాని నిజాం ప్రాభవం తగ్గలేదు. నైజాంను ఖైదు చేయలేదు. అసలైన తిరకాసు ఇక్కడే వుంది. రాజ్యాంగబద్దంగా దేశం పూర్తి స్యాతంత్య్రంలో గణతంత్ర దినోత్సవ ఆవిర్భావం వరకు ఎం.కే వెల్లోడిని ముఖ్యమంత్రిగా కొనసాగించారు. జేఎన్ చౌదరి గవర్నర్‌గా కొనసాగారు. ఎప్పుడైతే 1950 జనవరి 26లో దేశం పూర్తి గణతంత్ర దేశంగా మారిన తరుణం నుంచి రాజ్‌ప్రముఖ్‌గా నిజాంను కేంద్ర ప్రభుత్వం నియమించడంతో ఇది విద్రహమే అన్న అపవాదు వచ్చింది. అంతే కాకుండా హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసుకునేందుకు కదలిని కేంద్ర బలగాలు, నిజాం సైనికులు కలిసి, సాయుధ పోరాటం చేసేవారిపై పెద్దఎత్తున దమన కాండ జరిపారు. దాంతో హైదరాబాద్ ప్రజలు కేంద్రం నిజాంకు సహకరించిందన్న భావనతో విద్రోహ దినంగా చూస్తూ వచ్చారు. ఈ మూడు అభిప్రాయలపై వున్న చిక్కుముడులు ఎప్పుడూ తేగే పరిస్ధితి లేకుండాపోయింది. తెలంగాణ ప్రజలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం అవకాశం మృగ్యమైంది. ఇక్కడ కమ్యూనిస్టులు చెప్పే మాటలకు, ఇతర ఉద్యమకారులు చెప్పే మాటలకు కూడా కొంత పొంతనలేకుండాపోయింది. నిజాం హిందువులను మత మార్పిడిచేసేందుకు పెద్దఎత్తున కుట్ర చేశాడన్న వాదనలు అనేకం వున్నాయి. అయితే సాయుధ పోరాట సమయంలో, హైదరాబాద్ విమోచనంలో అనేక మంది ముస్లింలు కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భాలున్నాయి. సంఘటనలున్నాయి. తెలంగాణ సాయధ పోరాటానికి ముందే షేక్ బందగీ మరణం తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది. షేక్ బందగీ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమకారుడు. హైదరాబాద్‌లో షోయబుల్లాఖాన్ అనే జర్నలిస్టు నిజాంకు వ్యతిరేకంగా అక్షర పోరాటంచేశారు. తెలంగాణలో ఆయన అకృత్యాలను కళ్లకు కట్టినట్లు వార్తా కథనాలు రాశాడు. దాంతో ఆయన కాచిగూడ, చాధర్‌ఘాట్ మధ్యలో అర్ధరాత్రి చేతులు నరికేశారు. ముగ్థుం మొహినొద్దీన్ అనే రచయిత ఆయన కవితలతో నిజాంకు కంటి మీద కనుకు లేకుండా చేశారు. అందువల్ల నిజాం వ్యతిరేక పోరాటంలో అన్ని వర్గాలు పాలు పంచుకున్నాయి. అందువల్ల హిందువులకు ఆ రోజుల్లో ముస్లింలు వ్యతిరేకం కాదన్న సంకేతాలు కొన్ని వున్నాయి. అంతే కాకుండా స్వయంగా నిజాం సోదరుడే ఆయనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన సందర్భం వుంది. మొత్తానికి హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం జరిగింది. కాని ఆనాటి నెత్తుటి మరకలు మాత్రం ఇప్పటికీ పచ్చిగానే వున్నాయి.
మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 అనేది కీలకపాత్ర పోషించిందని చెప్పడంలో సందేహం లేదు. ఉద్యమ సమయంలో కేసిఆర్‌తో సహా, బిఆర్‌ఎస్, జేఏసి నాయకులంతా సెప్టెంబర్ 17 నాటు పెద్దఎత్తున హడావుడి చేసేవి. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని పోరాటం చేశాయి. తెలంగాణ వస్తే సెప్టెంబర్ 17 పెద్దఎత్తున ఉత్సవాలు జరిపిస్తాంటూ కేసిఆర్ ప్రకటనలు చేసేవారు. అయితే 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఉత్సవాలు జరిపించలేదు. తర్వాత అదికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నిర్వహించలేదు. సెప్టెంబర్ 17ను నిర్వహిస్తే ఎక్కడ తెలంగాణ ఉద్యమ బీజాలు మళ్లీ చిగురిస్తాయో అన్న అనుమానంతో సెప్టెంబర్ 17ను ఒక రకంగా నిర్భంధ దినంగానే చూశారు. అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ వాదులు,కమ్యూనిస్టులు ఎన్ని ఉద్యమాలు చేసినా ఉమ్మడి పాలకులు ఒప్పుకోలేదు. కాకపోతే అటు కర్నాటకలోనూ, ఇటు విధర్బలోనూ ఏటా విలీన దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ రోజు అక్కడి ప్రభుత్వాలు స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుతుంటారు. అంటే హైదబాదర్ రాష్ట్రానికి వచ్చిన అసలైన స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారిక కార్యక్రమాలు చేపడతారు. తెలంగాణలో కూడా విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని పాలకులను ఎన్ని సార్లు కోరినా పట్టించుకోలేదు. ఆగష్టు 15, జనవరి 26లు నిర్వహించిన ఉమ్మడి పాలకులు అక్టోబర్ 1ను తెలుగు రాష్ట్రం అవతరణ దినోత్సవంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించేవారు. సెప్టెంబర్ 17ను తొక్కిపెట్టారు. దాంతో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసిఆర్ దీనిని ఒక అస్త్రంగా మల్చుకున్నారు. కాని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకు తెలంగాణ చరిత్రో అంత ప్రాదాన్యత లేదని కొట్టిపారేశారు. ఒక్కసారి కూడా ఆయన అదికారిక కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణ విమోచనంలో రాజును నిందించే సమయంలో ముస్లింలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశముంటుందన్న ఒకే ఒక్క కారణంలో కేసిఆర్ నిర్వహించలేదు. దీనిని బిజేపి అనుకూలంగా మల్చుకున్నది. బిజేపి తాము అధికారంలోకి వస్తే అధికారింగా నిర్వహిస్తామని ప్రకటిస్తూ వచ్చింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో విలీన దినోత్సవాలు బిజేపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా జరుపుతామని ప్రకటించారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమే అవుతుంది. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన రోజే అనడంలో సందేహం లేదు.
·Within 12 hours government response after the news published
·Civil Supplies department get shaken with the news
·Commissioner issued orders to Collector
·Collector became serious on civil supplies officials
·Officials are in dilemma
·Previous report turned into bone of contention
·Officials are not in a position either to support their report or to give new one.
·If submits new report it will endanger their jobs
·Officials made godown secret inspection
·When they will submit their report?
·There is possibility of making delay in preparing the report
·Till now all this ‘danda’ run in secret
·Most of the millers are not genuine
·“Netidhatri” exposed the secrets behind this ‘danda’
·This ‘danda’ is continuing in entire Telangana
·Ther government is getting heavy loss due to this mischief
·Officials extended their full support to this illegal practice
·Making enquiry with same department officials means giving keys to thieves
·It is right time for the government to take stern action
·What millers are saying is not correct
·They are not getting losses
·If really get loss, they won’t continue this business
·They took opportunity from the indifference nature of the government
·They are earning crores of rupees
HYDERABAD,NETIDHATHRI:
There is immediate response to the story published in ‘Neti Dhatri’ in the heading of ‘Godown…golmal’ (Fraud business in the name of godowns). Civil supplies department immediately entered into the field to find out the facts behind the mischief in the name of godowns. Now fraudulent millers fell in dilemma and not finding any way to come out of this situation. Civil supplies Commissioner wrote a letter to Warangal district Collector asking him go conduct inquiry on this mischief activity of millers. Collector also became serious on those responsible officials of civil supplies department and ordered to submit a report regarding to this matter. It is learnt that some officials already visited in secret the godown which became the centre point for all this fraudulent activity. It is also learnt that officials are deliberately keeping the facts revealed during their inquiry. Till now most of the millers are showing rice bags stored in a particular godown as belong to them. Like this the godown became like ‘lifeline’ for most of the millers. Entire episode is well known to civil supplies officials. It is also well known to them whom the godown originally belongs to.
The officials have also fully aware that which millers are showing the rice bags of the same godown as their stock pile. Here nothing is there to hide and field level responsible officers fully aware of this fraud. Now civil supplies officials are pretending to surprise on this episode. Most of the millers are showing the same godown and the inspecting officials writing down their reports as said by the millers. Like this millers are earning crores of rupees in illegal manner and the officials are receiving lakhs of rupees for their extended cooperation. At the same time they took all precautionary measures to prevent any leak regarding this matter. In general millers have very good close connections with political leaders. This is also one reason for the officials to write reports in favour of the millers. Unfortunately now these officials remain as scapegoats for their doings and amorousness. While doing so they never think about the consequences if this fraud gets exposed. Temporary desires made them to fell in the pit themselves dug. Now present government is very much serious about this fraud in which officials extended their helping hand. If once commit any mistake with fear, it is highly impossible to come out of that slough. This is the fact proved in the case of officials who indulged in illegal activity to meet their ardent desire.
Now officials those responsible can’t escape from this corruption. This type of illegal activity is not confined to Warangal. It is happening in entire Telangana state. When this fraud get exposed, the repercussions created, fell the officials of other districts in utmost despair caused by fear. Corruption became normal practice, but this episode is not only corruption but also severe crime. It is learnt that civil supplies officials once again visit the godown to conduct inquiry on the report. The repercussions created the by the published story ‘Gomal Godowns’ now fixed the officials in the clutch of corruption. How much time the officials will take to submit the report is to wait and see. At this juncture they can’t prepare report against the previous one that already submitted by them. At the same time they also could not support the report that submitted. This we can say really as very much difficult situation for the officials. If they will take some time to submit the report, in this mean time it may possible to manage officials from bottom to higher level. In this back ground Civil Supplies Commissioner and Collector should impose pressure on submitting the report as early as possible. Then only this ‘illegal danda’ gets fully exposed. If the inquiry is done by the officials of the same department may not give fruitful results. Special investigation is needed to expose the entire ‘danda’ that causing severe loss to the exchequer.
Those millers who have been indulging in such illegal activities always used to say about heavy losses incurred to them. Every time millers won’t speak other than the issue of losses. Then the government won’t have any chance to speak on other issue, remain in silent and show indifferent attitude towards the millers. They used to Ancash this government weakness and continue their illegal ‘danda’ behind the screen. Really speaking only in Telangana government gave enormous freedom to the millers. Here there is no need for them to pay deposit amount. In other states any miller has to deposit specific amount prescribed by the state government. In Telangana millers misusing the freedom given by the government and continue their illegal rice business every time saying about heavy losses. Like that they want to get sympathy from the people by putting blame on the government. But in the behind screen what is happening is totally different. This is not known to the people. It is not possible for common man to understand the mischief caused by some millers who are doing illegal business. The exemption given by the government on deposit is the main cause for all this illegal ‘danda’. Behind giving exemption on deposit the government intention is to encourage millers. Unfortunately this gentleness attitude of the government turns lenient for the millers. Now they are selling out their rice without knowledge of the government. In this course they always cheat the government with their sweet voices about losses. In this episode officials are also playing their role successfully taking every care not to expose their ‘danda’ and accumulating corruption money. In this course government should take severe action on such fraudulent millers which can create fear among others and prevent them from doing so in future.
# అమరవీరుల స్తూపం వద్ద నివాళులు ఈ నెల 27న సికింద్రాబాద్ లో జరిగే ఉద్యమకారుల సన్మాన పోస్టర్ ఆవిష్కరణ
నర్సంపేట,నేటిధాత్రి :
దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్ర నర్సంపేట పట్టణానికి చేరుకోగా నియోజకవర్గ వివిధ మండలల ఉఫ్యామకారులు ఘనస్వాగతం పలికారు.నర్సంపేట పట్టణ కేంద్రంలోని నందగిరి రజినీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బస్సు యాత్రలో భాగంగా ముఖ్య అతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రాష్ట్ర మహిళ ఫోరమ్ అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం తెలంగాణ తొలి,మలిదశ , ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమమ కారులందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేఫెస్టోలో ఇచ్చిన హామీలు 250 గజాల ఇండ్లు డబుల్ బెడ్ రూమ్, ఇండ్ల స్థలాలు, హెల్త్ కాడ్స్ , ఉద్యమ కారుల గుర్తింపు కాడ్స్ ,25000 వెల పెన్షన్ పథకాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.అనంతరం ఈ నెల 27 సికింద్రాబాద్ లో జరిగే హరి హరి కలభవన్ లో తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం పోస్టర్ ను అవిష్కరించారు. ఈకార్య క్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లి యాదగిరి,మల్లాడి వీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌడగని రాజీరు, జిల్లా అధికార ప్రతినిధి ఆకుల సాంబరావు,వరంగల్ జిల్లా మీడియా ఇంచార్జి నర్మెట యాదగిరి,దార్ల రమాదేవి, పుట్టపాక కుమరస్వామి , సుదర్శన్ , వెంకట్ రెడ్డి,దోమల రవి, నెక్కొండ అధ్యక్షులు కొత్త సంపత్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కార్యదర్శి కత్తుల సదానందం, చెన్నారావుమండల గౌరవ అధ్యక్షులు అంగోతు వీరసింగ్, అధ్యక్షులు లింగమూర్తి, ఉపాధ్యక్షులు ఉడుగుల సాంబయ్య తో పాటు నెక్కొండ, చెన్నారావుపేట,దుగ్గొండి,నల్లబెల్లి ఖానాపూర్, నర్సంపేట మండలాల ఉద్యమకారులు పాల్గొన్నారు.
– ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ హైద్రాబాద్ సౌజన్యంతో – కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝ, ఎస్.పి అఖిల్ మహాజన్ – నామోగ్రామ్ విభాగాన్ని కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు సిరిసిల్ల(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ లో గల షాదీఖానా ఫంక్షన్ హాల్ లో, తెలంగాణ రాష్ట్రంలోనీ అత్యున్నతమైన ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ హైద్రాబాద్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు మహిళలకు నిర్వహించడం జరిగినది. నామోగ్రామ్ విభాగాన్ని కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించగా నోటి క్యాన్సర్ విభాగాన్ని నాగుల సత్యనారాయణ, చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, ప్రారంభించారు. ఈ పరీక్షలో భాగంగా 25 సంవత్సరాలు పైబడిన మహిళలకు, బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ , మామోగ్రామ్, ఫైన్ నీడల్ ఆస్పిరేషన్ సైటోలజీ, మరియు సర్వైకల్ బయాప్సీ పరీక్షలు చేయడం జరిగినది. 25 సంవత్సరాల పైబడిన మహిళలలో తెల్లబట్ట, అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, ఛాతీలో నొప్పి,చేతిలో గడ్డలు ఉన్నవారికి మందులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలోని టోటల్ ఓపి 164 కాగా, నోటి క్యాన్సర్ పరీక్షలు 31 పురుషులకు మరియు 43 మహిళలకు ,రొమ్ము క్యాన్సర్ 39 మందికి ,గర్భాశయ క్యాన్సర్ 51 మందికి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కేకే మహేందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వసంతరావు, వేములవాడ ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ తిలక్ రాజ్ , డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రజిత ప్రోగ్రాం అధికారి డాక్టర్ నయీమ్ జహ, డాక్టర్ లక్ష్మీప్రసన్న, ప్రోగ్రాం కోఆర్డినేటర్ సర్వేశ్వర్ ప్రసాద్, కాముని వనిత పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, శ్రీదేవి,వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసులు కి షాదీ ఖానా ఇంచార్జ్ మహమ్మద్ సలీం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విధమైన సేవలను ముందు ముందు కూడా కొన్ని సాగించవలసిందిగా కోరారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు మంచి రోజులు రాబోతున్నాయని, యేళ్ళ నాటి శని వదిలిందని ,ప్రతీ జర్నలిస్ట్ తన హక్కులను సాకారం చేసుకోబోయే తరుణం మీడియా అకాడమి చైర్మెన్ కె శ్రీనివాసరెడ్డి ద్వారా ఆసన్నమయ్యే సమయం వచ్చేసిందన్నారు. హైదరాబాద్ లోని దేశోద్ధారక భవన్ లో జరిగిన టియు డబ్ల్యూ జే ఐజేయు స్టేట్ ఎమర్జెన్సీ ఎక్స్టేండేడ్ ఎక్జిక్యూటివ్ కమిటిలో మీడియా అకాడమీ చైర్మేన్ శ్రీనివాసరెడ్డి కి జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కోనే సమస్యలైన…. ఇళ్ళ స్థలాలు,అక్రిడేషన్,హెల్త్ కార్డు ల గూర్చి వివరించగా వారు సానుకూలంగా స్పందించి,అతీ త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో “జర్నలిస్ట్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం” ఏర్పాటు చేసి, తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కోంటున్న అన్ని సమస్యలకి ఆ సభా వేదిక ద్వారానే శుభవార్త తెలియజేస్తానని తెలపడం చాలా సంతోషకరమని టియుడబ్ల్యూజే( ఐ.జే.యు) జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్,ప్రదాన కార్యదర్శి సామంతుల శ్యాము లు తెలిపారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్
ముంపు మండలాల ఇన్చార్జ్ డేగల వంశీ
భద్రాచలం స్థానిక ఆదర్శ్ నగర్ కాలనిలో పట్టణ అధ్యక్షుడు డేగల శివ అధ్యక్షతన మాల మహానాడు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ హాజరై కార్యమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు ఆదర్శ్ నగర్ కాలనిలో మాల మహానాడు సమావేశం నిర్వహించడం ఆనందంగా ఉందని మన మాలలు ఐకమత్యం కొరకు భద్రాచలం లోని అన్ని కాలనిలో నియోజకవర్గ స్థాయిగా విసృతంగా సమావేశాలు జరుపుతామని జిల్లా హెడ్ క్వార్టర్ లో త్వరలోనే బారి జన సమూహం తో మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం చేపడతామని కొన్ని రాజకీయ అగ్ర కులాలు మాలల ను చిన్న చూపు చూస్తున్నాయి అని రాబోవు రోజుల్లో వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి ముంపు మండలాల మాల మహానాడు ఇంచార్జ్ డేగల వంశీ హాజరై కొన్ని రాజకీయ అగ్ర కులాలు మాలలను అణచవేయబడే కుట్ర జరుగుతావుంది కాబట్టి మనమందరం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది రాబోవు రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి మన మాలల సమస్యల ను తీర్చడానికి మాల మహానాడు అండగా ఉంటుందని వారికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆదర్శ్ నగర్ కాలని మాల మహానాడు మహిళా నాయకులు తుమ్మల రాణీ, డేగల వెంకటమ్మ,దాసరి సామ్రాజ్యం, పల్లంటి లక్ష్మి, రాయిపూడి లక్ష్మి, మద్దెల నాగమణి, అల్లాడి సుధ,జయ,సునీత, కమిటీ మెంబర్లు, బట్టూ కుమార్, అల్లాడి వెంకటేశ్వర్లు,సంతోష్, తుమ్మల కృష్ణ, బొరుగడ్డ గోపి, సారంగి అర్జున్, దాసరి భాస్కరరావు, బట్టూ ఎడ్విన్,అల్లాడి బాలరాజు, డేగల వెంకటేశ్వర్లు,సతీష్,నందిబాబు, తదితరులు పాల్గొన్నారు..
జిల్లా ప్రజలపై గణపతి ఆశీస్సులు ఉండాలని, ఆయన ఆశీస్సు లతోనే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీలో శివ సాయి గణేష్ మండలి, ఫ్రెండ్స్ యూత్ విగ్రహ దాత ఎర్రం అనూష సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి చివరి రోజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గణనాథుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించా రు.గణనాథుని అనుగ్రహం ఉండాలని తాను ఆ దేవుడినిప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధి లో తలపెట్టిన అభివృద్ధి.సంక్షేమ పథకాలు సఫలీకృతం అవుతున్నాయన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ పండుగ ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అంద రూ భక్తి భావం పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత సాధ్యమన్నారు. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నియోజకవర్గంలోని అందరూ సుఖసంతోషాలతో అభివృద్ధి చెంది ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ సజ్జనపు స్వామి,కాంగ్రెస్ నాయకులు బుర్ర కొమురయ్య, శివసాయి గణేష్ మండలి ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు పొనగంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ప్రణీత్, కమిటీ సభ్యులు కొమురవెల్లి శ్రీనివాస్, లోత్ రాకేష్, సాంబరాజు శ్రీకాంత్, ఎండి రజాక్, లతో పాటు యూత్ నాయకులు పాల్గొన్నారు.
గణపురం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులు నాయకులు నాయకురాళ్లకు తెలియజేయునది ఏమనగా తేదీ 17 09 2024 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భముగా జాతీయ పతాకావిష్కరణ ఉదయం 8:30 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరుగును కావున ఇట్టి కార్యక్రమమును విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము
రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య- భద్రాచలంలో ప్రారంభమైన జీపుజాత
ఈ నెల 22,23 తేదీల్లో జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో జరిగే ఏఐటియూసి అనుబంధ రాష్ట్ర ఆటో క్యాబ్, ప్రైవేటు మోటార్స్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 3వ మహాసభను జయప్రథం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య అన్నారు. మహాసభల విజయవంతాన్ని కోరుతూ సోమవారం బస్టాండ్ అవుట్ గేట్ ఆటో వద్ద పోస్టర్ ఆవిష్కరించి జీపు జాతా ప్రారంభించారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితబస్సు రవాణా సదుపాయం కల్పించడం ద్వారా ఆటోకార్మికులు బ్రతుకులు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లాయని తెలిపారు. ఎన్నిక మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా క్యాబ్, ఆటో కార్మికులను ఆదుకోవాలన్నారు. ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి నేటీకి అమలు చేయకపోవడం అన్యాయమని, వెంటనే ఆ నిధులను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలన్నారు. రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, గ్రేటర్ హైదరాబాద్లో 20 వేల కొత్త ఆటోలకు పర్మీషన్లు ఇవ్వాలని, ఓలా, ఊపర్, ర్యాపిడో ద్వారా అక్రమంగా నడుస్తున్న టూ వీరల్ వెహికిల్ నిషేదించాలని, ఆటోక్యాబ్మటర్ చార్జీలు పెంచాలని, ప్రమాదబీమా రూ.10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు కూడా వర్తింపచేయాలని, మహాలక్ష్మీ పథకం ద్వారా నష్టపోయిన ఆటోలకు థర్ట్ పార్టీ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని, మహాలక్ష్మీ పథకం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికులకు నెలకురూ.12 వేలు చెల్లించాలని అన్నారు. అన్ని రంగాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వం ఆటో కార్మికులను విస్మరించడం సరైంది కాదన్నారు. ఆటో కార్మికులు కుటుంబాలు నష్టాల్లో కూరుకుపోయాయని, పిల్లలకు బడి ఫీజులు కూడా కట్టించుకుని కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జరగబోయే మహాసభకు ముఖ్యాతిధిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ కూనంనేని సాంబశివరావుతో పాటు ఏఐటియూసి జాతీయ నాయకులు విఎస్ బోస్, రాష్ట్ర ప్రథాన కార్యదర్శి బాలరాజు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు, జిల్లా గౌరవాధ్యక్షులు సాబీర్ పాషా, యూనియన్ ప్రథాన కార్యదర్శి బి వెంకట్, ఏఐటియూసి జిల్లా ప్రథాన కార్యదర్శి నరాటిప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాలవిశ్వనాధం, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కల్లూరి వెంరటేశ్వరరావు తదితరులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ మహాసభ వేదికగా ప్రభుత్వానికి కార్మికుల సమస్యలను వివరించేందుకు పెద్ద ఎత్తున కార్మికులు కదిలి రావాలని కోరారు. అనంతరం ఇన్టేట్ అడ్డా, మార్కెడ్ అడ్డా, ట్యాక్సీ అడ్డాలో కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియూసి జిల్లా కార్యదర్శి నరాటి ప్రసాద్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, ఆఫీస్ బేరర్స్ కె వెంకటేశ్వర్లు, వేల్పుల మల్లిఖార్జున రావు, సిపిఐ పట్టణ నాయకులు సాధనపల్లి సతీష్, కంబంమెట్టు శ్రీనివాస్, చిట్టిపోతుల కృష్ణయ్య, అశోక్ కుమార్, పితాని మనస్సే, కవిటపు మోహన్, నాగు, శేఖర్, క్రాంతి, సురేష్, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్ల గూడ గ్రామంలో కోదండ రామయ్య దేవాలయంలో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద లడ్డు లక్కీ డ్రా.లక్కీ డ్రా లో పాల్గొన్న 300 మంది భక్తులు. లక్కీ డ్రా ద్వారా వచ్చిన వచ్చిన మొత్తం 30300 వేల రూపాయలు. ఆ మొత్తాన్ని భారీ వర్షాలకు ఇండ్లు దెబ్బ తిన్న వారికి సాయం సారయ్య 10 వేలు బిక్షం 5వేలు బాల్క 5వేలు మల్లెల విజయకుమార్ గాంధీనగర్ 10వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు కొత్తగూడ మండలంలో ఇటీవల డెంగ్యూ జ్వరం తో మృతి చెందిన మల్లెల విజయ్ కుమార్ కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన దేవాలయ కమిటీ. సైప సురేష్. ప్రతాపని శ్రీకాంత్. సైప రామచందర్. గోగ్గుల లక్ష్మయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు…
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని జేఎల్ఎన్ వైసీ యూత్ క్లబ్ మరియు అధ్యక్షులు మల్లెల రణధీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి పూజ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడ ఎస్సై కుశకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు సందర్భంగా ఎస్ఐ కుషకుమార్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమంలో యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలను చెరువు వద్దకు తీసుకువెళ్లరాదని ఊరేగింపు సమయంలో డిజె సౌండ్ లు పెట్టరాదని యూత్ క్లబ్ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు… ఈ కార్యక్రమంలో విగ్రహ దాత కుందారపు సత్యనారాయణ. మాజీ ఎంపీటీసీ హలవత్ సాలుకి సురేష్. మాజీ వైస్ ఎంపీపీ పూల యాదగిరి. గ్రామ పెద్దమనిషి కంగల సూరయ్య. వజ రాహుల్. వేంపల్లి కృష్ణ.కంగాల నాగేశ్వరావు. అమర్.సిరిగిరి సురేష్. ఎండీ ఇమ్రాన్.కంగాల శేఖర్. యూత్ సభ్యులు.తదితరులు పాల్గొన్నారు…
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.