సర్వమత సమ్మేళనం

కొత్తగూడ, నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో భారతదేశం సర్వమతం సమ్మేళనం అని మరోసారి నిరుపుతమైనది
ఆ సన్నివేశ దృశ్యం అరుదైన ఘటన కొత్తగూడ మండల కేంద్రం లో చోటు చేసుకుంది కొత్తగూడ మండల కేంద్రంలోని జేఎల్ఎన్ వైసీ యూత్ క్లబ్ అధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్ రణధీర్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు నవరాత్రుల పూజలో భాగంగా చివరి రోజు వినాయకుడి విగ్రహానికి కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ముస్లిం యువకుడు ఎండి యూసఫ్ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్ గారు మాట్లాడుతూ కొత్తగూడెం మండలంలో కుల మత భేదాలకతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని.. మతసామరస్యనికి ప్రతిగా నిలిచిన ఎండీ యూసుఫ్ ను ప్రత్యేకంగా అభినందించారు

భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో

భద్రాచలం నేటి ధాత్రి

మీలాద్ ఉన్ నబి పండగ సందర్బంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఉన్న రోగులకు పండ్లు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరిమి. శ్రీనివాస రావు, పట్టణ అధ్యక్షులు అలీమ్,
సీనియర్ నాయకులు బంధం. శ్రీనివాస్ గౌడ్,తమ్మల. వెంకటేశ్వర్లు,మైనారిటీజిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ ఖాన్, ఎండీ హరీఫ్, ఎండి, బాబ్జి, sk. ఉస్మాన్, పాషా షారుద్దీన్, సేవాదళ్ మండలం అధ్యక్షులు శీలం. రామ్మోహన్ రెడ్డి,బసవరాజు, జిల్లా మహిళా కార్యదర్శి పందల. సరిత మరియు కార్యకర్తలు పాల్గొనరు

ఈత చెట్టు పై నుంచి పడిన గీతా కార్మికుడు

నెన్నెల, (మంచిర్యాల) నేటి ధాత్రి:

ఈత చెట్టు పై నుంచి పడిన గీతా కార్మికుడు
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు పోతులూరి రాజ్ గౌడ్ ఈతచెట్టు పైనుంచి కింద పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా వెంటనే కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. వెన్నుపూస విరిగిందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. క్షతగాత్రుని ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందజేయాలని గీత కార్మికుల మండల అధ్యక్షుడు మల్లా గౌడ్ కోరారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య మనందరికీ స్ఫూర్తిదాయకం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా ఎస్టిపిపి లోని పరిపాలనా భవనంలో భారతదేశం యొక్క మొదటి ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా జాతీయ ఇంజనీర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి ఈడి (హెడ్ అఫ్ ది ప్లాంట్) శ్రీ ఎన్ వి రాజశేఖర్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈడి శ్రీ ఎన్ వి రాజశేఖర్ రావు మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య మనదరికి స్పూర్తిదాయకం అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసి దేశాన్ని క్షామం నుండి విముక్తి చేయడమే కాకుండా ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్తాయికి అభివృద్ధి చేసారు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించారన్నారు. మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు. హైదరాబాదు నగరాన్ని మూసి నది వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించారన్నారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మంచి ఆలోచన విధానంతో భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చెందడంలో కృషి చేశారని తెలియజేసారు. ప్రతి ఒక్కరూ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ని స్ఫూర్తిగా తీసుకోని, దేశాభివృద్ధిలో పాటుపడాలని పిలుపునిచ్చారు.
అలాగే మన దేశ అభివృద్ధి లో ఇంజనీర్ ల యొక్క పాత్ర ఏంతో ఉందని , అంతరిక్ష పరిశోదనలో చంద్రయాన్, మంగళ్ యాన్, అటల్ టన్నెల్, చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలో అత్యంత ఎత్తైన మరియు పొడవైన రైల్వే బ్రిడ్జి ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక అభివృద్ధి లో 5 వ స్థానంలో ఉన్న మనం 2047 వరకు ప్రపంచంలోనే మొదటి స్థానంనకు రావాలని, తలసరి విద్యుత్ వినియోగం కూడా పెరగాలని దానికి తగినట్లుగా మనమంతా ప్రణాళికలతో సంస్థ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మరియు దేశ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్బంగా అందరికి తెలియజేసారు.ఈ కార్యక్రమములో జీ.ఎం.(పిసిఎస్) శ్రీనివాసులు, చీఫ్(ఓ&ఎం) జే.ఎన్.సింగ్, ఎ.జీ.ఎం(సివిల్)ప్రసాద్, ఎ.జీ.ఎం(ఈ అండ్ ఎం)మదన్ మోహన్,సముద్రాల శ్రీనివాస్,ఎస్వో టు ఈడి ప్రభాకర్,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్,ఇతర ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ హాస్పటల్ కు ప్రధమ చికిత్స అవసరం?

ఆపసోపాలు పడుతూ ప్రభుత్వ హాస్పిటల్ ను నెట్టుకొస్తున్న వైద్య సిబ్బంది..

అత్యుత్తమ సేవలు అందిస్తున్న పి.హెచ్.సి.లో కనీసం వసతులు కరువు

చాలి చాలని వసతులతో,సిబ్బంది కొరత ఉన్నా కూడా వైద్య సేవలలో ముందుకే…

హాస్పిటల్ కు వచ్చే రోగులకు మాత్రం మూగ జీవాల బెడద తప్పడం లేదు.

కాంపౌండ్ వాల్ లేక,మార్కెట్ మాంసాకృతులను నేరుగా హాస్పిటల్ లోకి తెస్తున్న మూగ జీవాలు

వైద్య సేవల్లో ఉన్న వసతులతో ముందున్న వైద్యం కోసం వచ్చే రోగులకు మాత్రం దుర్వాస తప్పడం లేదు..

నేటిధాత్రి ,భీమాదేవరపల్లి, సెప్టెంబర్16 :
2006 సంవత్సరం నుండి ముల్కనూర్ లో ప్రజలకు ప్రైమరీ చికిత్స అందిస్తూ చాలి చాలని వసతులతో ఉండి లేని సిబ్బంది తో కాలమెల్లతీస్తూ వైద్య సేవలో తమదైన ముద్ర వేస్తున్న భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తూ జిల్లాలోనే గుర్తింపు పొందిన వాటిలో ఒకటై ఉంది. కానీ జిల్లాలోనే ఇప్పటివరకు ప్రహరీ గోడ లేని పిహెచ్సిగా గుర్తింపు సంతరించుకుంది.వైద్యం కోసం హాస్పిటల్ కు వచ్చే రోగులకు లోపలికి రాగానే గుప్పు గుప్పు మంటూ దుర్వాసన, మూగజీవాలు దర్శనమిస్తాయి. హాస్పిటల్ చుట్టూ కాంపౌండ్ వాల్ లేక ముందున్న మార్కెట్ యొక్క వ్యర్ధాలను,మాంసాకృతులను లోపలికి తీసుకొస్తున్న మూగజీవాలు. ఏళ్లు గడుస్తున్నా ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ గోడ కట్టించే నాధుడే కరువాయే. ఇదిలా ఉంటే చాలీచాలని సిబ్బందితో జిల్లాలోని అత్యుత్తమ సేవలు అందిస్తున్న పీహెచ్ లలో ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి.ఇప్పటి కూడా మండలానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ముల్కనూర్ పి.హెచ్.సి.లో కేవలం ఒకే ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు.కనీసం మొన్న జరిగిన బదిలీల్లో నైనా ఒక ల్యాబ్ టెక్నిషన్ వస్తాడు కావచ్చు అనుకుంటే అది లేదు.ఉన్న వాళ్ళతోనే హాస్పిటల్ లో కాలం ఎల్లదిస్తున్న పరిస్థితి. అయిన వైద్యం కోసం వచ్చే వారికి మాత్రం తక్షణ చికిత్స లో ముందుండడం హర్షణీయం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలుమార్లు కాంపౌండ్ వాల్ కొరకై అధికారులకు విన్నవించిన మోక్షం కలగలేదు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే నే మంత్రి కావడం మంత్రి పొన్నం ప్రభాకర్ అయినా చోరవ తీసుకొని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పట్టించుకోని వెంటనే హాస్పిటల్ చుట్టూ ప్రహరీ గోడను కట్టించి బయట నుండి వచ్చే వ్యర్ధాలను, మూగజీవాలను అరికట్టేలా చూడాలని మండల ప్రజానీకం, హాస్పిటల్ కు వచ్చే రోగులు ఆకాంక్షిస్తున్నారు.

ఈ విషయంకై మెడికల్ ఆఫీసర్ ను వివరణ కోరగా
గతంలో కరోన సమయంలో నేను ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మెడికల్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో అప్పటి అధికారులకు కాంపౌండ్ వాల్ కొరకై అర్జీ పెట్టాను. అప్పుడు ఎస్టిమేషన్ దాదాపు 30 లక్షలు రూపాయలు దాకా వచ్చింది. తర్వాత బదిలీపై నేను ఎంజిఎం హాస్పిటల్ కు వెళ్లాను. మొన్న జరిగిన బదిలీలలో తిరిగి ముల్కనూర్ హాస్పిటల్ కు ట్రాన్స్ఫర్ పై వచ్చిన తరువాత ఈ సమస్యపై తీవ్రతను మా అధికారులకు వివరించాను. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు అంటూ తెలిపిన ముల్కనూర్ మెడికల్ ఆఫీసర్ ప్రదీప్ రెడ్డి వివరణ తెలిపారు.

వారోత్సవాల ముగింపు సభ

సిరిసిల్ల(నేటి ధాత్రి):

భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల సీపీఐ పార్టీ జిల్లా కార్యాలయంలో వారోత్సవాల ముగింపు సభను నిర్వహించడం జరిగింది. బద్దం ఎల్లారెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సభకు పంతం రవి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీపీఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గుంటి వేణు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 న దేశానికి స్వాతంత్రం వచ్చినా, తెలంగాణా మాత్రం నిజాం నియంతృత్వంలోనే ఉందని అణిచివేత లను,నిర్బందాలు,హింసలు ఎన్ని ఎదురైన భూమికోసం,భుక్తికోసం,విముక్తి కోసం కామ్రేడ్ రావి, నారాయణరెడ్డి,కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి,కామ్రేడ్ ముగ్ధుమ్ మొయినోద్దీన్ పిలుపుతో బందూకులు, బరిశెలు,కారం,గొడ్డన్లు అందుకొని తెలంగాణ ప్రజలు నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేశారన్నారు.1947 నుండి1948 సెప్టెంబర్ 17న తెలంగాణాకు విమోచనం లభించేంతవరకు ఎనలేని పోరాటాలు సీపీఐ చేసిందన్నారు. ఇందులో భాగంగా 3000 గ్రామాలు విముక్తం చేసే క్రమంలో,4500 మంది తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరులు అసువులు భాసారని వారిని స్మరించుకోవడం కోసమే సెప్టెంబర్ 11 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలని నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ ప్రాంతానికి చెందిన బద్దం ఎల్లారెడ్డి,సింగిరెడ్డి భూపతిరెడ్డి,అనభేరి ప్రభాకర్,గడ్డం తిరుపతి రెడ్డి వంటి వారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు తెలువడం కోసం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని అన్నారు.బద్దం ఎల్లారెడ్డి,సింగిరెడ్డి భూపతిరెడ్డిల విగ్రహాలను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్నారు.ఈ సమావేశంలో సీపీఐ నాయకులు కామ్రేడ్ కడారి రాములు నల్ల చంద్రమౌళి,అజ్జ వేణు, కే.వి అనసూర్య,సోమ నాగరాజు,తిరుపతిరెడ్డి,మంత్రి చంద్రయ్య, గాజుల పోశెట్టి,
ఎల్ల సత్తమ్మ, తదితర నాయకులు సీపీఐ పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ఎస్టిపిపి అభివృద్ధి పదంలో నడవాలని గణపతికి ప్రత్యేక పూజలు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోన ఎస్టిపిపి లోని మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రతిష్టించిన వినాయకుడికి ఎస్టిపిపి ఈడి (హెడ్ అఫ్ ది ప్లాంట్)ఎన్.వి.రాజశేఖర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈడి మాట్లాడుతూ జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అభివృద్ధి పదంలో నడవాలని, ప్లాంట్ లో పనిచేసే కార్మికులు,ఉద్యోగులు అందరూ క్షేమంగా ఉండాలని, ఎల్లవేళలా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆ గణపతిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం అర్చకులు స్వామి వారికి ఉద్వాసన పూజలు నిర్వహించారు.మధ్యాహ్నం రెండు గంటలకు వినాయక నిమర్జన కార్యక్రమంలో భాగంగా ఎస్టిపిపి టౌన్షిప్ లో శోభయాత్ర నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జీఎం (పీసిఎస్) కే. శ్రీనివాసులు, చీఫ్ ఆఫ్ (ఓ అండ్ ఎం) జె.ఎన్. సింగ్,ఏజీఎం (ఈ అండ్ ఎం)మదన్ మోహన్, ఏఐటియుసి పిట్ సెక్రెటరీ సత్యనారాయణ,సీఎంఓఏఐ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్,ఇతర అధికారులు ఉద్యోగులు మరియు మహిళలు పాల్గొన్నారు.

శాయంపేటలోఅంగరంగ వైభవంగా గణేశుని నిమజ్జనం

బై….బై….గణేశా… గణనా థునికి ఆటపాటలతో వీడ్కోలు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని గణనాథులను గణపతి బప్పా మోరియా జై బోలో గణేష్ మహరాజ్ కి జై, గణపయ్యా ఇక సెలవు అంటూ భక్తి శ్రద్ధలతో ఆ ఆదిదేవుడు గణనాథునికి మండల ప్రజలు వీడ్కోలు పలికారు. గణేష్ మండపాల వద్ద తొమ్మిది రోజుల పాటు మండపాల్లో ప్రతిష్టించిన వినాయకులను అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని వినాయ కులను ఆటపాటలతో తీర్థప్రసాదాలు స్వీకరించి, సాంప్రదాయ వస్త్రాధారణతో యువతి, యువకులు నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ, కేరింతల కొడుతూ, భక్తిశ్రద్ధలతో గణనాధునికి సెలవు పలికారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ట్రాక్టర్లను,లారీలను,ట్రాలీలను మామిడి తోరణాలతో ముస్తాబులు చేసి విఘ్నేశ్వరుని నిమజ్జనానికి తరలించారు. శాయంపేట ఎస్సై మాట్లాడు తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియమ నిబంధన పాటించా లని పేర్కొన్నారు మండల కేంద్రంలోని చెరువుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది చెరువుల వద్దకు గణనాథులను తీసుకువెళ్తున్న నేపథ్యంలో చిన్న పిల్లలను వెంట తీసుకెళ్లకూడదని, భక్తిశ్రద్ధలతో, నియమ నిబంధనలతో తరలివెళ్లాలని అన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆ ఆది దేవుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మిట్టపల్లి గ్రామంలో ముగిసిన గణేష్ ఉత్సవాలు

జైపూర్, నేటి ధాత్రి:

మిట్టపల్లి గ్రామంలో ముగిసిన గణేష్ ఉత్సవాలు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మిట్టపల్లి గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద నెలకొల్పిన విగ్నేశ్వరుడి యొక్క లడ్డు వేలంపాటలో 15,616 రూపాయలతో జుంబిడి మౌనిక సాయికుమార్ దంపతులు అలాగే 2 కేజీల లడ్డుని విగ్రహ దాత రామ టెంకి సమ్మయ్య రుతిక దంపతులు 5 కేజీల లడ్డుని వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో లడ్డుని వేలంలో పొందిన వారికి ఇచ్చారు. గణపతికి పూజలు చేసి గ్రామంలో గణపతిని ఊరేగింపు కార్యక్రమం చేసి గ్రామ పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి గ్రామస్తులు పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎస్టిపిపి లో నూతన టైలరింగ్ బ్యాచ్ ప్రారంభం

జైపూర్, నేటి ధాత్రి:

తేదీ 16.9.2024 సోమవారం రోజున ఎస్టిపిపి లోని సేవా భవన్ లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్టిపిపి హెడ్ అఫ్ ది ప్లాంట్ ఎన్.వి.రాజశేఖర్ రావు పాల్గొని నూతన టైలరింగ్ బ్యాచ్ ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఈడి ఎన్.వి.రాజశేఖర్ రావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ మహిళా సాధికారతకు ఏంతో ప్రాముఖ్యతనిస్తుందని స్త్రీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాదని, అందులో భాగంగానే సేవా సమితి ద్వారా ప్రభావిత గ్రామాల లోని మహిళలకు వివిధ రకాలైన స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నదని తెలిపారు. దీనిలో భాగంగానే ఈ రోజున నూతన టైలరింగ్ బ్యాచ్ ను 25 మంది మహిళలతో ప్రారంభించుకోవడం జరుగుతున్నదని తెలిపారు. ఈ సదావకాశాన్ని మహిళలు అధిక సంఖ్యలో వినియోగించుకోవాలని, తద్వారా వారు స్వయం సమృద్ధి సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సేవా సమితి కో ఆర్డినేటర్ చిలుక అరుణ, టైలరింగ్ శిక్షకురాలు రఫియ,సింగరేణి సేవా సమితి ఇంచార్జి ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్,మరియు మహిళలు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి:

బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కక్కెర్ల సహదేవ్ తల్లి కక్కర్ల కాంతమ్మ ఇటీవల మరణించడంతో సోమవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అందే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మామిడాల తిరుపతిరెడ్డి,గంజి విజయపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ జాటోత్ హమ్యా నాయక్,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, మాజీ సర్పంచ్ తమ్మడపల్లి సంపత్,నాయకులు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

గణనాథుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలి.

పిఎసిఎస్ డైరెక్టర్ గంగాధర్ స్వప్న రాజు.

చిట్యాల,నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రంలోని చింతలపల్లి లో హనుమాన్ టెంపుల్ లోని గణనాధుని. విగ్రహ దాత సొసైటీ డైరెక్టర్ గంగాధర్ స్వప్న రాజు
సోమవారం రోజున కుటుంబ సభ్యులతో విగ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో. పిల్లా .పాపలతో. పాడిపంటలతో. కలకాలం వర్ధిల్లాలని అగ్రనాదున్ని వేడుకున్నట్లు వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో గణేష ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

యువ నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

ముందుకొచ్చిన యువతకు కృతజ్ఞతలు తెలిపిన బ్లడ్ మోటివేటర్ ముస్తఫా

పరకాల నేటిధాత్రి


యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణం హనుమకొండ జిల్లా లో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా పరకాల గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సూర రాజేందర్,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్, సూపరిండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందచేయడం జరిగింది.ఈ రక్తదాన శిబిరం లో 30 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన రక్తదాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.ఈ కార్యక్రమంలో సూర రాజేందర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్,సూపరిండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహన్,యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్,వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు )కానిస్టేబుల్ బొట్టు కమలాకర్,కోలా రాజేష్,ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్,అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, మునిగాల రాంప్రసాద్, సృజన,జ్యోతి,భావన , బిటుకూరి యాకయ్య, పాలకుర్తి విష్ణు,ఎస్.కె ముస్తఫా,అనిల్,ఆరిఫ్ , నాగరాజు,నదీమ్,ఆజాం, ఇమ్రాన్,సిద్దు,కలీం ,ఇర్ఫాన్ షరీఫ్,సంతోష్ , రేణికుంట్ల అనిల్,మహమ్మద్ అఫ్రోజ్,మహమ్మద్ ఫెరోజ్ , సద్దాం,విశాల్,జూపాక సిద్దు,మహమ్మద్ లూకమన్ , శివ సాయి,రబ్బాని ఖాన్, రియాజ్,నవనీత్,సుల్తాన్ పాషా,అఖిల్,ఫయాజ్ గౌస్ ఆనంద్ ఖాజా మొయినుద్దీన్ , ఊరటి రవికుమార్,యాద రవికుమార్,చెలిమల్ల అశోక్ కుమార్,తూనం రాము, సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్,మోడెం రాజశేఖర్ గౌడ్,నాగవెళ్ళి కార్తిక్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

ప్రజా సేవలో అంజనిపుత్ర

మంచిర్యాల ఎస్సై సురేష్

మంచిర్యాల, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలో సామాజిక సేవలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ మరింత ముందడుగు వేయాలని
వారి సేవలు ఆదర్శమని మంచిర్యాల ఎస్సై సురేష్ హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు దీపేశ్ రేన్వ అన్నారు. సోమవారం అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటుచేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిదులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఎస్సై సురేష్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు దీపేష్ రేన్వ అంజనీపుత్ర యువత ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతోపాటు సేవా దృక్పథం అలవడుతుందన్నారు, ఎండీ పిల్లి రవి మాట్లాడుతూ ప్రజల లో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ లోక క్షేమం కోసం పూజలు, అన్నదానాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు ఎస్ .కిషన్, సదానందం, డైరెక్టర్ లు తదితరులు పాల్గోన్నారు.

పల్లకిలో నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుడు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :

గుండాల మండలం పెద్ద తోగు గ్రామం లో గణేష్ చవితి ఉత్సవాల్లో 9 నవరాత్రులు ఘనంగా పూర్తిచేసుకుని గ్రామంలో పల్లకిలో ఊరేగింపుతో నిమజ్జనానికి బయలుదేరిన గణేశుడు ఊరేగింపులో దొర కుంజా కాంతారావు, పటేల్ తాటి భాస్కర్ గణేష్ కమిటీ సభ్యులు చెన్నూరి సురేష్, భాడిశా గంగరాజు, సల్లూరి సురేష్, జాడి రాంబాబు,గ్రామస్తులు సల్లూరి పెంటయ్య, సునారి వెంకన్న, కుంజ లక్ష్మి, సువాసిని, సుమలత, సుశీల బాయమ్మ, చంద్రమ్మ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నస్పూర్ హౌసింగ్ బోర్డ్ వినాయకుని లడ్డూ వేలం పాట 6516

నస్పూర్ మంచిర్యాల నేటి దాటి

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ గణేష్ మండలి వద్ద ఈరోజు నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డు మహా ప్రసాదాన్ని వేలంపాట నిర్వహించగా వేలంలో పాల్గొన్నవారు రవి గౌడ్ 5500 రామారావు 6000 గడ్డం సత్యా గౌడ్, 6,516లకు వేలం పాట పడుకొని ఆ మహాగణపతి లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు గణపతి మహా ప్రసాదాన్ని వేలంపాటలో పాడుకున్న గడ్డం సత్యా గౌడ్ దంపతుల చేతిలో అయ్యగారు వేదమంత్రాలతో లడ్డు ప్రసాద్ గారిని సత్య గౌడ్ దంపతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొని వేలంపాటలు గెలుపొందిన వారిని శా ల్వాతో సన్మానించి ఆ గణనాధుని కరుణాకటాక్షాలు మీకు ఎల్లవేళలా లభిస్తాయని అభినందించారు

బాయమ్మ పల్లె గణపతి లడ్డు వేలం 4,555

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :

పెద్దపల్లి జిల్లా ఓదెల మంలం లోని బాయమ్మపల్లె గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి లడ్డు వేలంపాట లో నల్లగొండ అరుణ – సదయ్య గౌడ్ లు 4,555.రూపాయల కు దక్కించుకున్నారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

చేర్యాలలో ఘనంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు

చేర్యాల నేటిదాత్రి

చేర్యాల పట్టణంలో జరిగిన గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను చేర్యాల పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు తగిన ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్ చేర్యాల సిఐ ఎల్ శ్రీను ఎస్సై వీరేష్ చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు పర్యవేక్షించారు పెద్ద ఎత్తున గణపతులు చేర్యాల కుడి చెరువు లో నిమజ్జనం చేశారు

దళితుడిని కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

సోమవారం జయశంకర్ జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు అరకొండ రాజయ్య అద్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య, ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య లు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపై మహిళలపై రోజు రోజుకు పెరిగి పోతున్న సంఘటనలు అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయని అన్నారు. అందుకే దళిత బహుజనులు అందరూ ఏకమై బహుజనులపై దాడిని ఖండించాలి దళితులపై దాడులు చేస్తున్న నిందితులను కఠినంగా శిక్షించక పోవడం వలన ఇటీవల వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఎనికేపల్లి గ్రామ దళితుడు నట్టల మనోహర్ ని ఇదే గ్రామానికి చెందిన ఇతర కులస్తులు బిటి రాజేందర్ మహేందర్ భాస్కర్ బాలరాజు రాము, శ్రీనివాస్ లు కిడ్నాప్ చేసి కట్టేసి ఇనుప రాడ్ తో కట్టెలతో మనోహర్ ని కొట్టి చంపడానికి ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. దళితుడిని కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తో పాటు హత్య యత్నం కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. అందుకే గ్రామ స్థాయి నుంచి కుల మతాలకు అతీతంగా అందరినీ చైతన్య వంతులను చేయాలని మహానీయుల ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగింప చేయాలని కోరారు.
ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మారపెల్లి కొంరయ్య జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల ఉపాధ్యక్షులు మాడుగుల వీరయ్య , పారనంది రాములు మండల నాయకులు కోండ్ర సారయ్య అరకొండ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

దళితులకు 50 సంవత్సరాలకే ఫించన్ ఇవ్వాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* డిమాండ్.

చిట్యాల, నేటిధాత్రి :

భారత దేశం లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారని వారికి 50 సంవత్సరాలు నిండిన వారికి వ్రృద్దాప్య ఫించన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
సోమవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన జరిగిన సమావేశంలో మల్లయ్య మాట్లాడుతూ…. దళితులు అభివృద్ధి చెందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఇతర కులాలకు 50 సంవత్సరాలు నిండిన వారికి పించన్లు ఇచ్చిందని తెలిపారు .ఈ ప్రభుత్వం కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి దళితుడికి పించన్లు మంజూరు చేయాలని దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుటకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ టేకుమట్ల మండల అధ్యక్షుడు అరకొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version