రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బందిచే స్వచ్ఛతాహి సేవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మునిసిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ, మేనేజర్ డి స్వామి, రెవెన్యూ అధికారి సతీష్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్లు, ఆర్పీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.