హనుమకొండ, నేటిధాత్రి:
హనుమకొండలోని న్యూ లయోలా హైస్కూల్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ తాడిశెట్టి క్రాంతి కుమార్ మరియు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ అతిథులుగా పాల్గొని ముందుగా అమరవీరులకు నివాళులర్పిస్తూ, దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కొమరం భీమ్ భాగ్యరెడ్డి వర్మ కాలోజి నారాయణ రావు ప్రో జయశంకర్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జండా వందనం చేసి పిల్లలకు మిఠాయిలు పంచడం జరిగింది. పిల్లల్ని ఉద్దేశించి కరస్పాండెంట్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఆనాడు జరిగినటువంటి సాయుధ పోరాటం , హైదరాబాద్ స్టేట్ విలీనం నిజాం నిరంకుశ పాలన రజాకార్ల అరాచకాలు దేశ్ముకులు పటేల్ పట్వారిలు తెలంగాణ ప్రజల పైన చేసినటువంటి దాడులు అన్యాయాల పైన పిల్లలకు వివరించడం జరిగింది అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జరిగినటువంటి పరిణామాలు ఆంధ్ర పెత్తందారులు, ముఖ్యమంత్రులు చేసినటువంటి అన్యాయాలను పైన విద్యార్థులకు వివరించారు అనంతరం వ్యాసరచనలు చిత్రలేఖనం ఉపన్యాస పోటీలు విద్యార్థులకు నిర్వహించి బహుమతులు బహుకరించారు ఆనాటి వీరుల స్ఫూర్తితో మన ముందుకు సాగాలని వారికి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.