భద్రాచలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం మండలం కి చెందిన జయమ్మ కి ఆరోగ్యం బాగొలేక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాటికి సంబంధించిన బిల్లులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేయగా అక్షరాల నాలబై ఎనిమిది వేల రూపాయలు (48,000రూ,,లు) చెక్కు రావడం జరిగింది. అట్టి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సంబంధితలకు అందజేసారు
వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొంబోతుల రాజీవ్, నర్రా రాము, భోగాల శ్రీనివాస్ రెడ్డి, పుల్లగిరి నాగేంద్ర, తాజ్ తదితరులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మోడెం వంశీ అనే పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు, ఇటీవల యూరప్ ఖండంలోని మాల్టా దేశంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఇండియాకు బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. కాగా అక్టోబర్ 4 నుంచి 13 వరకు సౌత్ ఆఫ్రికా లోని సన్ సిటీలో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక ఇవ్వడం జరిగింది. ఈ పోటీలకు రానుపోను ఖర్చులకు గాను 1,60,000 రూపాయలు పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా వారికి చెల్లించవలసి ఉండగా రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివ సేనా రెడ్డి చొరవతో, పట్నం అనుషా రెడ్డీ ఒక లక్ష ఆర్థిక సాయం అందించడం జరిగింది. మిగతా 60 వేల రూపాయలు అవసరం ఉండగా, ఎటపాకలో మేడ్వాయి కు చెందిన రామకృష్ణ రాజు ద్వారా వసుధ ఫౌండేషన్ వారికి, 19 -09 -24 న వ్రాత పూర్వకంగా అసోసియేషన్ సభ్యులు తెలియపరచడం జరిగింది.ఇంతకుముందు వసుధ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు సహాయం చేయటం అనేది లేకపోయినా కానీ, మోడెం వంశీ యొక్క ప్రతభ గురించి రామకృష్ణ రాజు మరియు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకుని వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరమరాజు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఈ రోజు వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు మోడెం వంశీకి 30 వేల రూపాయల ను హైదరాబాద్ వారి కార్యాలయం లో అందించడం జరిగింది. ఈ చెక్కును అందించినందుకు గాను, ఎటపాక రామకృష్ణ రాజు ని, వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరమరాజు ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి కళాశాల సంబంధించిన సమస్యలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి తెలియజేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ బిల్డింగ్ కోరకు, ల్యాబ్ & ఎక్యూమెంట్స్ , గ్రంధాలయం బుక్స్ గురించి తెలియజేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో మాట్లాడి మంజూరు చేయాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువాతో సన్మానించారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, నర్రా రాము, పుల్లగిరి నాగేంద్ర, కళాశాల సిబ్బంది జిల్లా నోడల్ ఆఫీసర్ ఇంటర్ విద్య H వెంకటేశ్వర రావు, ఇంచార్జి ప్రిన్సిపాల్ D. సుధాకర్ రెడ్డి , లైబ్రేరియన్ K. గరుడా చలం, సీనియర్ అసిస్టెంట్ B రత్న, ల్యాబ్ అసిస్టెంట్ చిన్న వెంకట నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
భీమదేవరపల్లి,నేటిధాత్రి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగాయపల్లి గ్రామానికి చెందిన ఎఱ్ఱబొజ్జు రాధిక ఇంటిపై నిన్నకురిసిన వర్షతోపాటు ఇంటిపై పడ్డపిడుగు, పిడుగు పడిన సమయం లో ఇంటిలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం పిడుగుపాటుతో ఇంటిలో నిలువఉన్న 45 సీసీ కెమెరాలు రెండు పెద్ద జిరాక్స్ మిసిన్లు ఇంటి ఫర్నిచర్ ,తో పాటు3లక్షల రూపాయల నగదు రెండు తులాల బంగారం మంటల్లో కాలిపోయాయి పిడుగుపాటుతో బీటలు బారిన భవనం ,ఇంటిలో ఉన్న గ్యాస్ సిలెండర్, పేలక పోవటంతో తప్పిన పెను ప్రమాదం ఇల్లు దగ్దం కావటంతో నిరాశ్రయురాలు కావటం తో ప్రభుత్వం సహాయం కోరుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఎఱ్ఱబొజ్జు రాధిక దాదాపుగా 50లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది
డాక్టర్ బి.ఎస్.రావు భవన్, హెచ్ బి కాలనీలో కంటి పరీక్షల క్యాంపు..
కాప్రా నేటిధాత్రి జవహర్ నగర్:
శ్రీ చైతన్య పాఠశాల డాక్టర్ బి ఎస్ రావు పేరు మీద స్థాపించిన మొట్టమొదటి బాలికల వసతి గృహం కో ఎడ్యుకేషన్ డేస్ కాలర్ బ్రాంచ్ నందు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం సెప్టెంబర్ నెలలో భాగంగా హెల్తీ ఇండియా ను నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ ఏజీఎం కృష్ణ మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణకు శారీరక మానసిక దృఢత్వానికి సరైన పౌష్టికాహారం, సరైన నిద్ర, యోగ, స్వచ్ఛమైన గాలి, తగు మోతాదులో నీరు తప్పక అవసరమని తెలియజేశారు. ప్రిన్సిపల్ మల్లిక బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతిరోజు పి ఈ టి ల సహకారంతో జరిగే యోగ, ఫిజికల్ యాక్టివిటీలు, విద్యార్థినులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. దీని ద్వారా విద్యార్థుల ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థులకు పండ్లు, గుడ్లు, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని ఏవోలు మూర్తి, శ్రీకాంతులు తెలపడంతో హర్షం వ్యక్తం చేశారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని గుర్తించి ప్లానెట్ ఆప్టిక్స్ వారి సౌజన్యంతో కంటి పరీక్షల క్యాంపు, దంత సంరక్షణ వాటి విలువలు తెలియజేసేందుకు ఉచిత దంత పరీక్ష క్యాంపు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శకుంతల, సౌజన్య ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని పాఠశాల విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు వినియోగించుకున్నారని తెలిపారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ప్రతి నెల ఒక అంశంతో విద్యార్థులతో అవగాహన పెంచడానికి స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఏజీఎం కృష్ణ, ఆర్ ఐ శ్రీరామ్ రెడ్డి, హరి, కోఆర్డినేటర్ రవి, ప్రిన్సిపల్ మల్లిక, బాలరాజు, డీన్స్ పవన్ సుభాష్, సతీష్, రేణుక, దివ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి . మొగుళ్ళపల్లి మండలం,పాత ఇస్సీపేట గ్రామ వాస్తవ్యు*లు జన్నే రాజు గారి కుమార్తె కీ||శే|| జన్నే సాయి శ్రీ ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి ఇంటికి వెళ్ళి వారి చిత్రపటం వద్ద నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసి, జన్నే రాజుకి ధైర్యం చెప్పిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు
వారి వెంట మండల పార్టీ అద్యక్షుడు బల్గురి తిరుపతి రావు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట్ రావు,గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్,గ్రామ శాఖ అద్యక్షుడు లక్ష్మయ్య,సీనియర్ నాయకులు శ్రీనివాస్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన గౌడ విద్యార్థులకు హన్మకొండలోని సర్దార్ సర్వాయి పాపన్న,కౌండిన్య పరపతి సంఘాల ఆధ్వర్యంలో ప్రోత్సాహ బహుమతులు అందిస్తున్నట్లు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెంది, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ గురుకులాల్లో చదివి పదవ తరగతిలో 10/10 మార్కులు సాదించిన నిరుపేద గౌడ విద్యార్థులు మాత్రమే ఈ ప్రోత్సాహ బహుమతులకు అర్హులని తెలిపారు. దీనికి గాను 10,వ తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డ్, కులం సర్టిఫికెట్స్ కాపీలు హన్మకొండ నయీమ్ నగర్ లోన్గల మోషన్ కళాశాలలో అందజేయాలని ఆయన వివరించారు.హన్మకొండ హంటర్ రోడ్ లో గల గౌడ హాస్టల్ నందు ఈ నెల 29 న విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు పరపతి సంఘాల అధ్యక్షులు అంబాల సూర్య నారాయణ గౌడ్, కార్యదర్శి గట్టు సత్యనారాయణ గౌడ్, కన్వీనర్ తండ నాగయ్య గౌడ్ ల ఆధ్వర్యంలో అందజేస్తారన్నారు. మరిన్ని వివరాలకు 9701275354 నెంబర్ కు సంప్రదించాలని రమేష్ గౌడ్ తెలిపారు.
# మొదలైన బొడ్డెమ్మ పండుగ వేడుకలు. # తొమ్మిది రోజుల పాటు జరుగనున్న
బొడ్డెమ్మ పండుగ.
నర్సంపేట,నేటిధాత్రి :
బొడ్డెమ్మ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంప్రదాయబద్ధంగా చేసుకునే రెండు పండుగలు గుర్తుకువస్తాయి.అవే బొడ్డెమ్మ, బతుకమ్మ,పండుగలు.ఈ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు.తెలంగాణ సంప్రదాయం పాటించే వారు తప్పకుండా బొడ్డెమ్మ పండుగ జరుపుకొంటారు.బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగకు ముందు వస్తుంది.ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకొంటారు. భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు, వినాయక చవితి మరుసటి రోజు బహుళపంచమి నుంచి 9 రోజులు ఈ పండుగను జరుపుకొనేవారు. మరికొందరు 5 రోజులు, మూడు రోజులు దశమి, ద్వాదశి నుంచి జరుపుకుంటారు.ఈ పండుగను బొడ్డెమ్మల పున్నమి అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ పండుగను చిన్నవారైన ఆడపిల్లలు, పెండ్లికాని అమ్మాయిలతో జరిపిస్తారు. ఇందులో పెండ్లి ఐనా స్త్రీల ప్రమేయం ఎక్కువగా ఉండదు.కన్నెపిల్లలు, బాలికలు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో మంచి భర్త రావాలని కోరుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకొంటారు.
బొడ్డెమ్మలను పెట్టి, రకరకాల పూలతో అలంకరించి, కన్నెపిల్లలు బాలికలు చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్- బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడారు. చివరీ రోజు నిద్రపో బొడ్డెమ్మ నిద్ర పోవమ్మా. నిద్రాకు నూరేండ్లు-నీకు వెయ్యేండ్లు. నిను గన్న తల్లీకీ నిండా నూరేండ్లు అంటూ పాడి తర్వాత బొడ్డెమ్మను జాగ్రత్తగా తీసి దేవుని ముందు పెడతారు.ఇలా 9 రోజుల పాటు ఆడి చెరువు దగ్గరికి తీసుకువెళ్తారు.అక్కడ చెక్కపీట మీద నుంచి బొడ్డెమ్మను తీసి నీటిలో నిమజ్జనం చేస్తూ పోయి రా బొడ్డెమ్మ పోయి రావమ్మా అంటూ బొడ్డెమ్మతో పాటు ముందురోజుల వాడిపోయిన పూలను కూడా చెరువులో నిమజ్జనం చేస్తారు.ఈ నేపథ్యంలో సోమవారం బొడ్డెమ్మల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నర్సంపేట డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలలో బొడ్డెమ్మలను ఏర్పాటు చేసి పండుగ వేడుకలను ప్రారంభించారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో మాజీ ఎంపిటిసి పెద్ది శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద బొడ్డెమ్మ పండుగ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభం చేశారు.దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో బొడ్డెమ్మ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలుపెట్టారు.ఈనేపథ్యంలో మహిళలు,చిన్నారుల మధ్యలో బొడ్డెమ్మలను పెట్టి, రకరకాల పూలతో అలంకరించి, కన్నెపిల్లలు బాలికలు చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్- బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడారు.
# బీసీ సంఘం జిల్లా నాయకులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్ తో ఈనెల 25న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లాతో పాటు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని మహా ర్యాలీనీ విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ హలో బీసీ… చలో హైదరాబాద్ కుల గణన మార్చ్ సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు జరిగే మహార్యాలీ ఉంటుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం గ్రామ, మండల,నియోజకవర్గ మరియు వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు అదే విధంగా అనుబంధ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, పార్టీలకతీతంగా బీసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డ్యాగల శ్రీనివాస్ కోరారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపట్టి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని కామారెడ్డి లో బీసీ గర్జన సభ పెట్టి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అంతేకాకుండా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిందని అనుకున్నట్టుగానే బీసీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు, చెన్నారావుపేట మండల ఇంచార్జ్ చెన్నూరి రవి కుమార్ ముదిరాజ్, దుగ్గొండి మండల నాయకులు సంకటి శ్రీనివాస్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, కార్యదర్శులు ఓడపెల్లి రమేష్ మేర, శీరంశెట్టి రాజేందర్, బేతి భాస్కర్, గాండ్ల శ్రీనివాస్, నెక్కొండ మండల నాయకులు మర్రి క్రాంతి కుమార్, కొలిపాక సుధాకర్ లతో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు.
`ఎంక్వైరీ అధికారులను తొలగించాల్సిన అవసరం ఏమివచ్చింది?
`‘‘సిబిఐ’’కి అప్పగిస్తేనే అన్ని విషయాలు బయటకొస్తాయి?
ఏ రోజునుంచైతే తగ్గానో…ఆ రోజు నుంచి నెగ్గడం మర్చిపోయాను అంటే ఇదేనేమో! ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దేమో!!
ఆ మంత్రికి తెలంగాణ ప్రజల్లో మంచి పేరే వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ కుటుంబానికి రాజకీయంగా గొప్ప కీర్తి వుంది. కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబం ప్రజాసేవలో ముందు వరుసలో వుంది. ఇప్పటి వరకు రాజకీయంగా వెలెత్తి చూపలేనంత పరువు ప్రతిష్ఠ వుంది. రాజకీయాలలో ప్రజాసేవలో తన తండ్రిని కోల్పోయిన త్యాగం ఆ కుటుంబానికి సొంతం. ప్రజల్లో ఆ కుటుంబం మీద ఎంతో నమ్మకం, విశ్వాసం వుంది.
రాజకీయంగా ఎలాంటి నాయకుడికైనా కొన్ని సార్లు విమర్శలు తప్పవు. ఈ నాయకుడుపై ఉమ్మడి రాష్ట్రంలో గాని, ఇప్పుడు గాని పెద్దగా విమర్శలు లేవు. సమర్థవంతమైన నాయకుడు అనే గుర్తింపే వుంది. ఉన్నత విద్యావంతుడు. సమస్యల మీద అవగాహన వున్న నాయకుడు. అదృష్టం కలిసివస్తే ముఖ్యమంత్రి కూడా అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయి. ఇప్పటికే రాజకీయంగా ఆయన ఎదగాల్సినంత ఎదగలేదు. రెండు సార్లు మంత్రి పదవి అనుభవిస్తున్నా తగిన స్థానం దక్కలేదు. కీర్తి ప్రతిష్ఠలకు కొదువలేదు. అయినా రాజకీయంగా వెనకబడుతున్నాడు. తగినంత గుర్తింపు రావడం లేదు అని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు మధనపడుతుంటారు.
ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా నెంబర్‌వన్ స్థానంలో వుండాల్సిన నాయకుడే…కానీ తనకు ప్రమేయం లేని అంశాలు తన మెడకు చుట్టుకునేలా వున్నాయి. ఆ సమస్యలు ఆయనను కలవరపెడుతున్నాయి. తన రాజకీయ జీవితానికి ముగింపు పలికేలా వున్నాయి. ఎందుకంటే ఎంతటి నేతలనైనా కడిగేయగల నాయకుడుగా పేరుంది. అవినీతికి ఆమడ దూరం వుంటాడనే అభిప్రాయం అందరిలోనూ వుంది. అలాంటి నాయకుడు వివాదాల మధ్య ఇరుక్కుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎవరికీ చెప్పుకోలేడు. నాకు సంబంధం లేదని తేల్చేయలేడు. అందుకే అటు చెప్పుకోలేక, ఇటు చక్కదిద్దుకోలేక సతమతమౌతున్నాడు. ఉజ్వలమైన తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమో? అని మధనపడుతున్నారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు అప్పటి పాలకులను అడుగడుగునా నిలదీసిన ఆ నాయకుడు ఇప్పుడు నోరు మెదపడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. తాను మంత్రిగా వున్నప్పటికీ సరిదిద్దుకునే అవకాశం లేని సమస్యలను ఎదుర్కొంటున్నాడు.
భయటపడలేని పరిస్థితులు ఎదురౌతాయని ఆందోళన చెందుతున్నారు. రాజకీయమా! కుటుంబమా అని తర్జనభర్జన పడుతున్నాడు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా వుంది. రాజకీయంగా ఆయనకు పదవులు రావాలి. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి. అనే దృక్పథంతో వున్న ఆ నాయకుడికి
‘‘టెస్కో’’లో జరిగిన కుంభకోణం మూలంగా తలపట్టుకుంటున్నారు. తలెత్తుకోలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్నాడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏ రోజు నుంచి తగ్గడం మొదలు పెట్టానో…అప్పటి నుంచి నెగ్గడం మర్చిపోయాను అని పెద్దలు చెప్పిన ఓ సామెత వుంది. అది ఇదేనేమో! అలాంటి కష్టం పగవారికి కూడా రాకూడదని కోరుకుంటారు. ఆ మంత్రికి తెలంగాణ రాజకీయాల్లో మంచి పేరుంది. ప్రజల్లో మంచి గుర్తింపు వుంది. ఆ నాయకుడు మా నాయకుడు అని గొప్పగా చెప్పుకునే అనుచర గణం వుంది. అంతే కాదు ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో గొప్ప పేరుంది. రాజకీయంగా గొప్ప కీర్తి కూడా వుంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆ కుటుంబం త్యాగాలు కూడా చేసింది. కుటుంబ పెద్దను కూడా కోల్పోవాల్సివచ్చింది. ఈ తర్వాత మలి తరం నాయకుడు ప్రజా సేవలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని రాజకీయంగా వెలెత్తిచూపిన వారు లేరు. ప్రజల్లో ఆ కుటుంబం మీద అచెంచలమైన విశ్వాసం, నమ్మకం కూడా వున్నాయి. ఆ ఉమ్మడి జిల్లాలో ప్రజా సేవలో ఆ కుటుంబం ముందున్నది. అంత గొప్ప నాయకత్వం ఆకుటుంబానిది. మలితరం నాయకుడుగా ప్రజల మన్ననలు పొందిన ఈ నాయకుడు ఉమ్మడి రాజకీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషించారు. కాంగ్రెస్‌లో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. తమది కాంగ్రెస్ కుటుంబం అనేందుకు ఆయన పదేళ్ల కాలంలో పార్టీలోనే వున్నారు. ఏనాడు ఆ నాయకుడి మీద ఎలాంటి రాజకీయ విమర్శలు కూడా లేవు. ప్రస్తుతం మంత్రిగా వున్న ఆ నాయకుడికి సమర్ధవంతమైన పాలకుడుగా, నాయకుడుగా కూడా మంచి పేరుంది. ఉన్నత విద్యావంతుడు, తెలంగాణ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ఇప్పుడున్న మంత్రి వర్గంలో ఎక్కువ అవగాహన వున్న నాయకుడు ఆ మంత్రి. గతంలో ఓసారి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. శాసనసభ వ్యవహరాలలో ఆయన పాత్ర కూడా గొప్పది. ఇప్పుడు కూడా మంత్రిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకస్ధానంలో వున్నారు. అయినా ఆయనకు తగినంత గుర్తింపు లేదని, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అంటుంటారు. మధనపడుతుంటారు. ఒక రకంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల్లో ఆయన కూడా నెంబర్ వన్ స్ధానం కోసం పోటీ పడుతున్న నాయకుడే.
కలిసొస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన నాయకుడే. కాని ఆయనకు సంబంధంలేని, తన ప్రమేయం లేని కొన్ని అంశాలు ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా వున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ జీవితానికి ముగింపు పలికేలా వున్నాయన్న ఆందోళన వ్యక్తమౌతోంది. గత ప్రభుత్వ హయాంలో అంతా జరిగినా, అప్పుడు ఆయనకు వీసమెత్తు పాత్ర లేకపోయినప్పటికీ కుటుంబ పరంగా ఆయన పరువు బజారున పడనుంది. అవినీతి ఆరోపణలు విరుచుకుపడే అవకాశాలున్నాయి. గతంలో అవినీతి విషయంలో ఈ నాయకుడు ఒంటి కాలు మీద లేచేవారు. గత ప్రభుత్వ అవినీతిని నిత్యం ఎండగడుతూ వుండేవారు. కాని తనకు తెలియకుండానే తన అంశంలో ఎప్పుడో అప్పుడు నేను అబాసుపాలయ్యే పరిస్దితి వస్తుందని ఆయన కూడా ఊహించి వుండరు. అలాంటి నాయకుడు ఇప్పుడు అవినీతి కుంభకోణ వివాదంలో ఇరుక్కుపోయే పరిస్దితులు కనిపిస్తున్నాయి. అయితే వాటిపై ఎవరితో చెప్పుకోలేరు..నాకు సంబంధం లేని తేల్చేయలేరు. అటు చెప్పుకోలేక, ఇటు చక్కదిద్దుకోలేక సతమతమౌతున్నాడు. ఉజ్వలంగా వుండాల్సిన తన రాజకీయ భవిష్యత్తుకు ఆశనిపాతంగా టెస్కో వ్యవహారం మారుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు టెస్కో విషయంలో ఈ నాయకుడు కూడా ఆరోపణలు గుప్పించిన సందర్భాలు కూడా వున్నాయి. ప్రతిపక్షంలో వున్నప్పుడు అప్పటి పాలకులను నిత్యం కడిగేసిన నాయకుడు ఇప్పుడు నోరు మెదపడానికి కూడా ఇష్టపడడం లేదు. తాను మంత్రిగా వున్నప్పటికీ సరిదిద్దుకోలేని స్దితిలో చిక్కుకొని లేని సమస్యలను ఎదుర్కొంటున్నారు. భయటపడలేని పరిస్దితులు ఎదురౌతాయా? అని ఆందోళన చెందుతున్నారు. దాంతో రాజకీయమా? కుటుంబమా?? అని తేల్చుకోలేక తర్జన భర్జనపడుతున్నారని సమాచారం. ఇప్పుడు ఆయన పరిస్దితి కరవమంటే కప్పకు కోసం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది. రాజకీయంగా మరింత ఉన్నత స్ధానానికి చేరాల్సిన సమయంలో ఆయనకు ఊహించని ఉపద్రవం ఎదురౌతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. రాష్ట్ర రాజకీయాలలో ఇంకా ఎంతో కాలం ప్రజా సేవ చేయాల్సిన నాయకుడు, తనకు సంబంధం లేని విషయం మూలంగా ఇబ్బందుల పాలౌతారా? ప్రజలనుంచి విమర్శలు ఎదుర్కొంటారా? వేచి చూడాలి. కాని ఆయన పాత్ర ఏమాత్రం లేని టెస్కోలో జరిగిన కుంభకోణం మూలంగా ఆయన తలపట్టుకుంటున్నారు. తలెత్తుకోలేని పరిస్ధితి ఎదురౌతుందా? అని కలవరపడుతున్నారు.
ఇదొక విచిత్రమైన సందర్భం. కాని చిన్న చితకా వ్యహారం కాదు. చేసింది మంచి పని కాదు. టెస్కొలోవెలుగు చూసిన అవినీతి కుంభకోణం. ఒక వ్యవస్ధను నిర్వీర్యం చేసిన దౌర్భాగ్యం. నమ్మి శాఖను అప్పగిస్తే నిండా ముంచిన వైనం. కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న ఉదంతం. ఒకప్పుడు టెస్కొలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని, జరిగిందని పదే పదే కొన్ని వందల సార్లు కాంగ్రెస్ నాయకులందరూ చెప్పిన మాటే. లెక్కలతో సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో వున్నప్పుడు అనేక సభల్లో , వేధికల మీద మాట్లాడిరదే. అంతే కాదు ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశమే. గత ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతి చేసిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మారు. ఆదరించారు. గెలిపించారు. పాలన అప్పగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత చేనేత, జౌళి శాఖలో జరిగిన దానిపై దృష్టి పెట్టారు. ఆ శాఖ ప్రక్షాళనకు పూనుకున్నారు. జరిగిన అవినీతిని వెలికితీయాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖలో సమూల మార్పులు చేశారు. ఉన్నతాదికారులను తప్పించారు. విజిలెన్స్ ఎంక్వౌరీకి ఆదేశాలు జారీ చేశారు. నూతన యంత్రాంగం అంతా తన పనులు తాను చేస్తున్న తరుణంలో మళ్లీ ఆ శాఖలోని ఉద్యోగులు పిడుగులాంటి వార్తను విన్నారు. ఆ శాఖ అధిపతిగా వున్న కమీషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీగా వెళ్లి తిరిగి మళ్లీ అదే సీట్లోకి వచ్చారు. తన ప్రతాపం చూపడం మొదలు పెట్టారు. తన అవినీతి చిట్టా బైటకు తీస్తున్న అదికారుల్లో కొంత మందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. కొంతమందిని సస్పెండ్ చేశారని సమాచారం. అంటే ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా విజిలెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను సదరు కమీషనర్ సస్పెండ్ చేయడం పెద్దఎత్తున వివాదానికి దారి తీసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కమీషనరే, ప్రభుత్వం అప్పగించిన పనిని నిర్వర్తిస్తుంటే ఉద్యోగ పరంగా వేధింపులకు గురి చేయడాన్ని ఆ శాఖ ఉద్యోగులు మండి పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కమీషనర్‌తోపాటు, సహకరించిన ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. కమీషనర్‌కు స్ధాన చలనం కల్పించినా, మంత్రి ఒత్తిడితో మళ్లీ అదే సీట్లోకి వచ్చింది. వేటు పడిన ఉద్యోగులకు మళ్లీ పోస్టింగులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వానికంటే కమీషనరే పవర్ ఫుల్ అని నిరూపిస్తోంది. పైగా కమీషనర్ మీద ఎంక్వౌరీలో పాలు పంచుకున్న ఓ మహిళా అదికారికి ఇప్పటి వరకు మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నట్లు కూడా శాఖలో గుసగులాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత, జౌళిశాఖలో కీలకభూమికతోపాటు, పెద్దఎత్తున అవినీతికి కమీషనర్ పాల్పడనట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఏది నిజం..ఏది అబద్దం: చేనేత సహాకార సంఘాల్లో ముప్పైశాతానికి పైగా బోగస్ సంఘాలను గుర్తించినట్లు సాక్ష్యాత్తు వ్యవసాయ, చేనేత, ఔళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదికారికంగా ప్రకటించారు. విజిలెన్స్ ఎంక్వౌరీకి కూడా గతంలోనే ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో టెస్కొ నుంచి వివిధ శాఖలకు వస్త్రాల రవాణాలో చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు మంత్రి వెల్లడిరచారు. వందల కోట్ల అవకతలను ప్రాధమికంగా గుర్తించినట్లు కూడా చెప్పారు. పైగా గతంలో చేనేత పేరు చెప్పి మరమగ్గాల మీద తయారైన వస్త్రాలను కొనుగోలు చేశారని కూడా తెలిసినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో 393 చేనేత సంఘాలు, 140 మాక్స్ సొసైటీలు, 135 చిన్న తరహా యూనిట్లున్నాయి. వీటిలో 30శాతం బోగస్ సంఘాలున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. ఆ బోగస్ సంఘాల సృష్టివెనుక ఎవరున్నారన్నదానిపై కూడా విచారణ జరుగుతోంది. ప్రధానంగా వాటి రూపకల్పనలో కూడా ఉన్నతాధికారి పాత్ర నేరుగా వున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో వున్న 393 చేనేత సంఘాలలో కేవలం 105 సంఘాలకు మాత్రమే పని కల్పించారని కూడా నివేదికలున్నాయి. వీటిని త్వరగా నిగ్గు తేల్చాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. కాని కమీషనర్ చేసిన పనికి సంబంధించి, ఆమె మీద వస్తున్న ఆరోపణల మూలంగా మంత్రి పరువు ప్రతిష్ట గోదావరిలో మునిగిపోతుందని ఆయన శ్రేయోభిలాషులు బాధపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఓ అడుగు ముందుకు వేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజిలెన్స్ ఎంక్వౌరీకి ఆదేశించారు. ఇదిలా వుంటే టిస్కొలో కోట్లు చేతులు మారినట్లు, అవినీతి జరిగినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తేల్చి చెప్పారు. చేనేతల పొట్ట కొట్టారని కూడా నిజాన్ని నిగ్గు తేల్చారు. 2016 నుంచి చేనేత శాఖలో ఆడిట్ జరగకుండా ఎందుకు తొక్కిపెట్టారు. ఆడిట్ జరగకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఎవరు అడ్డుకున్నారు? అన్నది కూడా వెలుగు చూడాల్సిన అవసరం వుంది. విజిలెన్స్ అదికారులు ఇచ్చిన సూచనతో జయేష్ రంజన్ ఇచ్చిన ఆదేశాలు కూడా ఎందుకు బుట్టదాఖలయ్యాయి అన్నది తేలాల్సివుంది. ఈ మొత్తం అవినీతి, గందరగోళం మీద సిబిఐ ఎంక్వౌరీ జరిగితే అన్ని నిజాలు నిగ్గు తేలుతాయని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం..ఏం జరుగుతుందో!!
వైద్య శిభిరాన్ని ప్రారంభించిన డాక్టర్ విజయచెందర్ రెడ్డి,డాక్టర్ కాళీ ప్రసాద్ రావు
పరకాల నేటిధాత్రి సోమవారం రోజున హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదేళ్ళ గ్రామంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా 17సెప్టెంబర్ నుండి ఓటిసీ నిర్వహించు సేవ పక్వాడ (సేవ పక్షం)కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పరకాల నియోజకవర్గం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి,పరకాల నియోజకవర్గ బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కాళీ ప్రసాద్ రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా రోగులను పరీక్షించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్లో వచ్చు విశేష జరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిశుభ్రత మీద మరియు తగు ఆహారా నియమాలను పాటిస్తూ జ్వర తీవ్రతను బట్టి నిపుణుల సలహా మేరకు రక్త పరీక్షలు నిర్వహించుకొని విను వెంటనే వైద్యం చేయించుకోవాలని సూచించారు.ఈ ఆరోగ్య శిబిరంలో ఆర్థోపెడిక్ డాక్టర్లు డాక్టర్ విజయ చందర్ రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్,హనుమకొండ రెడ్ క్రాస్ డాక్టర్లు డా.జి.కిషన్ రావు,డా. మొహమ్మద్ తహర్ మసూద్,భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు గురజాల శ్రీరామ్ రెడ్డి,ముత్యాల శ్రీనివాస్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజ్ కుమార్,ఓబీసీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల రమేష్,యాదగిరిరావు,యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల సుమంత్, బూత్ అధ్యక్షులు డెంగు నవీన్,ననబోయిన శ్రీనివాస్ రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్,అరువ గంగాధర్, మాందాటి శ్రీకాంత్,పోచాలు తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట: నేటి రాత్రి వీణవంక కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి వరుస దొంగతనాలతో వీణవంక గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. మండల కేంద్రంలోని వెంకటరమణ ఎలక్ట్రికల్స్, నల్ల పోచమ్మ వైన్స్ లో వరుస చోరీలు జరగగా, వెంకటరమణ ఎలక్ట్రికల్స్ లోని షేటర్ ను గడ్డపార సహాయంతో పైకి లేపి, షాపులోని బయట సీసీ కెమెరాలను, కట్ చేసి, సీసీ కెమెరా ల హార్డ్ డెస్క్ ను 15వేల రూపాయలను చోరీ చేశారని, షాప్ యజమాని కాసనగట్టు వెంకటరమణ ఆవేదన వ్యక్తపరిచారు. నల్ల పోచమ్మ వైన్స్ లో కిటికీ కింది నుండి సిమెంట్ గోడలను తొలగించి, అందులో నుండి షాపులకు ప్రవేశించి సీసీ కెమెరాలను కట్ చేసి, హార్డ్ డిస్క్ , 31 వేలరూపాయలను, 85 వేల విలువగల మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లారని, షాప్ యజమానులు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ చోరీ విషయంపై వీణవంక ఎస్సై తోట తిరుపతికి ఫిర్యాదు చేయగా , వెంటనే స్పందించి క్లూస్ టీం ను రప్పించి, ఆధారాలు సేకరించి విచారణ చేపడుతున్నారు.
వరంగల్ తూర్పులోని, 20వ డివిజన్, కాశిబుగ్గ శాంతినగర్ కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్యాల కొమురయ్య, సోమవారం నాడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్థానిక 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాదు లోని, గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ని కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకై తన వంతు కృషి చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్యాల కొంరయ్యను జిల్లా కాంగ్రెస్ నేతలు అభినందించారు.
ఈనెల 30 తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభని జయప్రదం చేయండి.
పి.డి.ఎస్.యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ,భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్
*పి.డి.ఎస్.యు.50 వసంతాల స్వర్ణోత్సవాల ను పురస్కరించుకొని చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది.
భారత విద్యార్థి ఉద్యమాలకు పి.డి.ఎస్.యు. దిక్సూచిలా నిలిచిందని, 50 ఏళ్ల లో విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ, విద్యార్థుల హక్కుల కోసం, శాస్త్రీయ విద్య సాధన ,సమసమాజ స్థాపనే ద్యేయంగా పి డి ఎస్ యు పోరాడిందని పి.డి.ఎస్.యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ,భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ తెలిపారు. సోమవారం చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పి.డి.ఎస్.యు. 50 వసంతాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని పోస్టర్ ఆవిష్కరణ సదస్సు నిర్వహించటం జరిగింది. సందర్భంగా కాంపాటి పృథ్వీ,మునిగేలా శివ ప్రశాంత్ మాట్లాడుతూ నక్సల్భరి, శ్రీకాకుళం,గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల ప్రేరణతో, కత్తుల వంతెన పై నెత్తుటి కవాతు చేసిన పి.డి. ఎస్.యు. 50 యేండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎందరో విద్యార్థి రత్నాలైన జార్జిరెడ్డి,జంపాల చంద్రశేఖర్ ప్రసాద్,శ్రీపాద శ్రీహరి,కోలాశంకర్,రంగవల్లి, చేరాలు,రమణయ్య, సాంబయ్యలు తమ వేడి నెత్తురు ను ధార పోశారని గుర్తు చేశారు. పి డి యస్ యూ ఆవిర్భావం నాటినుండి అధిక ధరలు, అధిక ఫీజులకు వ్యతిరేకంగా, ఆశ్రిత పక్షపాతం అవినీతికి వ్యతిరేకంగా, కుల వివక్షత, మతోన్మాదానికి వ్యతిరేకంగా, మహిళలపై దాడులు, సంక్షేమ హాస్టల్స్ సమస్యలపై, పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కై, యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేపట్టిందని వారు తెలిపారు. ఈ క్రమంలో 50 ఏళ్ల తర్వాత కూడా భవిష్యత్ తరాలకు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తూ పి.డి. ఎస్.యు. పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సంఘటితంగా ఉద్యమించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో PDSU రమేష్, సురేష్, నరేందర్, రాంబాబు, రాంప్రసాద్ ప్రవళిక, శ్రీలత,సంమ్రీన్ తదితరులు పాల్గొన్నారు.
PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ 9849599748
మలహర్ రావు. నేటిధాత్రి : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తాటిచెర్ల బ్రాంచ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఎంవి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత వారు బ్యాంకు పథకాలపై బ్యాంక్ మ్యాజిక్ షో ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా సురక్ష బీమా యోజన పథకం. జీవనజ్యోతి భీమా యోజన. అటల్ పెన్షన్ యోజన, .N.P.S వాత్సల్య చిన్నపిల్లల కొరకు కొత్త స్కీమ్ 18 నుంచి 8 సంవత్సరాల లోపు వారు కూడా ఈ పథకంలో చెరచు రిటైర్మెంట్ స్కీమ్ గురించి స్కూల్ విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ భాస్కర్ రావు, బ్యాంకు మేనేజర్ సాయి, బ్యాంకు అటెండర్ అమీర్, కళాజాత బృందం సభ్యులు విజయ్, మేజీషిన్ రియాజ్, డప్పు ప్లేయరులు పాల్గొన్నారు. స్కూల్ యాజాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు,
డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్.
హసన్ పర్తి / నేటి ధాత్రి
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో నివాస స్థలాలు లేని కడు నిరు పేద దళిత కుటుంబాలు గత మూడు సంవత్సరాల నుండి గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 516 లో సూమారుగా 70 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం నివాస స్థలాలు ఇప్పించి ఇందిరమ్మ గృహాలు మంజూరి చేయాలని, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత బహుజన ప్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టరు ప్రావీణ్య మరియు ఆర్డివో కు బాధిత దళిత కుటుంబాలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చుంచు రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత అర్వూలైన నిరుపేద దళిత కుటుంబాలకు ప్రభుత్వ, పంచరాయి, ఇనాం అసైన్డ్ తదితర భూములను పంపిణి చేసి ఇందిరమ్మ నివాస గృహాలు మంజూరి చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. నిరుపేదలకు మద్దతుగా మాట తప్పకుండా ఇచ్చిన హమీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి, భూములకు హద్దులు నిర్ణయించాలని, భూ కబ్జాదారులనుండి భూములను కాపాడి భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సింగారపు రవి ప్రసాద్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్ రావ్, నాయకులు దాసు, రాకేష్, మొగిలి, మధున, జ్యోతి, సంద్య, లక్ష్మి, మమత, శ్యామల, శిరోమణి, సరోజన, ప్రభ, భారతమ్మ, రాజయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలో గల కోనాపురం, పాపయ్యపేట గ్రామాల్లో నిర్మించిన (పల్లె దవాఖానలు) వైద్య ఆరోగ్య ఉప కేంద్రాలను సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించారు.నూతన పల్లె దవాఖానలో,ఒపి రిజిస్ట్రార్,రికార్డు బుక్ లను పరిశీలిం చారు.అనంతరం పాపయ్యపేట పల్లె దవాఖానకు భూమిని తల్లిదండ్రులు ఉప్పరి సాయిలు,ఎల్లమ్మల జ్ఞాపకార్థంగా విరాళంగా ఇచ్చిన కుమారులు ఉప్పరి గంగులు, రామచందర్,నరసింహస్వామిలు అభినందించిన దొంతి ఘనంగా సన్మానించారు.
మోడల్ స్కూల్ డైనింగ్ హాల్ లో భూమిపూజ చేసిన ఎమ్మెల్యే దొంతి..
అమీనాబాద్ మోడల్ స్కూల్ లో నూతన డైనింగ్ హల్ కు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భూమి పూజ చేశారు.మోడల్ స్కూల్ లో రూ. 30 లక్షలతో నిర్మించనున్న డైనింగ్ హాల్ కోసం శిలాఫలకం వేసి ప్రత్యేక భూమి పూజ చేశారు.అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో 79 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈకార్యక్రమాలలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, తహశీల్దార్ పాణికుమార్ , డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ ప్రకాష్ ,డాక్టర్ సరోజ, డాక్టర్ భవాని ,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి,ప్రసన్న లక్ష్మీ , టిపీసీసి మెంబర్స్ పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్,జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి,జిల్లా రైతు కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు సాదు మధుసూదన్ రెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్స్ సిద్దన రమేష్,తప్పేట రమేష్ ,మండల ఉపాధ్యక్షులు నన్నెబొ యిన రమేష్ యాదవ్,కేతిటి వీరారెడ్డి,బొంత శ్రీనివాస్,లక్క కుమార్,మజ్జిగ రాంబాబు, మంచాల సదానందం,యూత్ డివిజన్ ఉపాధ్యక్షులు రూపిక శ్రవణ్ కుమార్,జిల్లా నాయకులు పార్వతమ్మ,తుటి పావని,బండి పద్మ, ఆవుల రాములు, మండల రాములు, ఉప్పునుతుల లింగమూర్తి, కల్లెపు శేఖర్ తదిత రులు పాల్గొన్నారు.
టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రాంకిషన్ కుమారుడు కీర్తిశేషులు గజ్జెల వివేక్ యొక్క 34వ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని వివేక్ జన్మదిన వేడుకలను వరంగల్ శివనగర్ నందు గల డాన్ బాస్కో అనాధపిల్లల ఆశ్రమములో నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతలో భాగంగా తన కుమారుడు భౌతికంగా తమ మధ్య లేకపోయినప్పటికీ అతని జన్మదిన వేడుకలను అనాధ పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని రాంకిషన్ తెలిపారు. ఆశ్రమంలోని పిల్లలకు అవసరమైన వస్తువులను తన కుమారుని జ్ఞాపకార్థం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలందరికి భోజనాలు ఏర్పాటు చేశారు రాంకిషన్ దంపతులు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహాధ్యక్షులు హేమానాయక్ జిల్లా బాధ్యులు ఇంద్రసేనారెడ్డి, మధు, శంకేశి రాజేష్, ఆనంద్, శ్రీనివాస్, నాగేశ్వరరావు, భరత్, మాడిశెట్టి శ్రీనివాస్, ఆనందరావు, కుమారస్వామి, భాను తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి
నేటిధాత్రి, హైదరాబాద్
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో, కేటీఆర్ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండిస్తూ టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలను వదిలేసి, బంధువులకు దోచిపెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని, కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. కట్టు కథను సృష్టించి బద్మాష్ నాటకాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని, బామ్మర్దులను, బంధువులను బాగు చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే, కేసీఆర్, కేటీఆర్ దే అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. గెలిపించిన ప్రజలను వదిలేసి, బంధువులకు దోచిపెట్టిన బీఆర్ఎస్ ను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనైతే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అడ్రస్ గల్లంతు చేశారు. ఇక ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భవిష్యత్తులేదని తేలిపోవడంతో, కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రజలకు దూరమైన ప్రభుత్వమైతే.., కాంగ్రెస్ ప్రజలకు దగ్గరైన ప్రభుత్వం అని గుర్తుంచుకో కేటీఆర్ అని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పరిష్కరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నది. దీంతో ప్రజల్లో రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటీఆర్ చవకబారు ప్రకటనలు చేస్తున్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినందుకు నజరానాగా పాలమూరు రంగారెడ్డి వర్కులు ఇస్తే అవి ఆయన అల్లుడు సృజన్ రెడ్డి చేసింది వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే సృజన్ రెడ్డికి – కేటీఆర్ కు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయం వాస్తవం కాదా? కేటీఆర్ కు ఉన్న బినామీల్లో సృజన్ రెడ్డి ఒకరన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని, అమృత్ టెండర్లలో సృజన్ రెడ్డి కంపెనీకి టెండర్ వచ్చిందని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే టెండర్లు పిలిచినప్పుడు ఆర్థికంగా సాంకేతికంగా అనుభవం ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొంటాయి కదా. స్టార్ టాప్ కంపెనీలు ఆర్థికంగా ఉండి సాంకేతిక అనుభవము లేని కారణంగా సాంకేతికంగా అనుభవం కలిగిన కంపెనీలతో జాయింట్ వెంచర్ పెట్టుకొని టెండర్ల లో పాల్గొంటారు అనే సంగతి కేటీఆర్ కు తెలియదా? కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ ను హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ గుర్తుంచుకో.., అవినీతి నిరోధక చట్టం, సెక్షన్లు అని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నావు… ఆ సెక్షన్లన్నీ మీకు మీ కుటుంబానికి వర్తిస్తాయి. మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేసే రోజు దగ్గర్లోనే ఉంది. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని భూములను కన్వర్షన్ చేశారు? ఎన్ని బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చారో అందరికీ తెలుసు. ఈ అనుమతుల్లో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అక్రమాలు జరిగాయో, మీ కుటుంబం ఎంత అవినీతికి పాల్పడిందో చెప్పాలంటే.. రాస్తే రామాయణం వింటే మహాభారతం అంత కథ ఉంది. బీఆర్ఎస్ పాలనలో మీరు దేవుళ్లను కూడా వదిలిపెట్టలేదు కదా.., వెయ్యి కోట్ల రూపాయల యాదాద్రి పునర్నిర్మాణ పనులను ఏఅనుభవం లేని సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో జరిపించింది మీరే కదా? మల్టీ నేషనల్ కంపెనీ ఆర్కిటెక్ట్ నిపుణులతో యాదాద్రి పనులు చేయాల్సి ఉండగా… చిన జీయర్ స్వామి కళ్లల్లో ఆనందం కోసమే ఆనందసాయికి అప్పజెప్పారు కదా..? అందులో మీరెంత తిన్నారు? పైగా, అతనికి మీరు 30 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారని మేం ప్రశ్నిస్తున్నాం. యాదాద్రి దేవాలయ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మేం కోరుతున్నాం. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి చేత ఆర్కిటెక్ట్ పనులు చేయించడం ఎంతవరకు సమంజసం అని కేటీఆర్ ని అడుగుచున్నాము. కేవలం జీయర్ స్వామి మెప్పుకోసం ఆనంద సాయి అనే సినిమా సెట్టింగులు వేసే వ్యక్తికి పనులు అప్పజెప్పి దాదాపు 30 కోట్ల రూపాయలు చెల్లించడం అవినీతి కాదా అని అడుగుతున్నాం యాదాద్రి దేవాలయ పనుల్లో జరిగిన అవకతవలపై దేవాదాయ శాఖ ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరుచున్నాము. మీ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే అవినీతి నిరోధక చట్టం కింద మీ చెల్లెలు ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లింది నిజం కాదా? బీజేపీ బిఆర్ఎస్ రహస్య మిత్రులు అనడానికి కవితకు బెయిల్ రావడమే నిదర్శనం. గతంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రాజ్యసభలో అవసరమున్న బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా? అని అడుగుతున్నాం. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోం. మీకు చేతనైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలే తప్ప.. సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు విమర్శలతో రాజకీయ పబ్బం గడుపుతామంటే ఇకపై నడవదని హెచ్చరిస్తున్నాం అని అన్నారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పనులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సమగ్ర విచారణ జరిపి ప్రజల ముందు వాస్తవాలను ఉంచాలని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి కోరారు.
మలహర్ రావు. నేటిధాత్రి: అఖిల భారత యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో కొయ్యూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ మండలంలో అఖిల భారత యాదవ సంఘం మండల అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని ఇట్టి ఎన్నిక జిల్లా అధ్యక్షులు మేకల సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో 25-09-2024 రోజున ఉదయం 11 గం లకు ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల యాదవ కుల సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనవాల్సిందిగా యాదవ సంఘ నాయకులు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సీనియర్ నాయకులు యాదన్న రామన్న యాదవ్, బోయిని రాజయ్య యాదవ్, కొడారి బాబు యాదవ్, యాదన్న గట్టయ్య యాదవ్, సిద్ది శంకర్ యాదవ్, పొన్నాల రాజయ్య యాదవ్, కడారి మల్లేష్ యాదవ్, ఇట్టవెన శరత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.