గంగాధర నేటిదాత్రి :*
గంగాధర మండల కేంద్రానికి చెందిన మల్యాల రాజేందర్ అనే యువకుడు ఈనెల 18వ తేదీన తన వివో v23 ఫోను పోగొట్టుకుని గంగాధర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు www.ceir.gov.in ఆన్లైన్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి విచారణ చేశారు. ఫోన్ దొరికిన వ్యక్తి తన సిమ్ కార్డును ఫోన్ లో వేయగా సమాచారం గంగాధర పోలీస్ స్టేషన్ కు చేరింది. దీంతో ఫోన్ దొరికిన వ్యక్తి నుండి స్వాధీనం చేసుకొని సోమవారం గంగాధర పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ నరేందర్ రెడ్డి రాజేందర్ కు అందజేశారు. అందజేసిన ఎస్ఐకి రాజేందర్ కృతజ్ఞతలు తెలిపాడు.