ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
వీణవంక, ( కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ వైన్స్ అలాగే వెంకటరమణ ఎలక్ట్రిషన్ లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. సోమవారం తెల్లవారుజామున రోజులాగే షాప్ వద్దకు వచ్చిన షాపు యాజమాన్యం చూసేసరికి తాళాలు పగల గొట్టి ఉన్నాయని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి పరిశీలించగా పక్కన ఉన్న వైన్ షాపులో దొంగలు పడ్డారని తెలిసిపోయింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. దొంగలు షాపులోని సీసీ కెమెరాలను హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. మద్యం షాపులో వెనకాల ఉన్న గోడను పగలగొట్టి మద్యం బాటిల్స్ ను ఎత్తుకెళ్లారు. వెంకటరమణ ఐరన్ ఎలక్ట్రిషన్ షాపులో సుమారుగా 14 వేల రూపాయలను ఎత్తుకెళ్లారని యజమాని అన్నాడు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.