అక్టోబర్ 2న అన్ని గ్రామాలలో గ్రామసభలు ఏర్పాటు చేయాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగస్వామ్య ప్రణాళిక పద్ధతిలో ఉపాధి హామీ పనుల ఎంపిక మరియు లేబర్ బడ్జెట్ ఎలా తయారు చేయాలో వారికి అవగాహన కల్పించడం జరిగింది.ఈ సమావేశంలో ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు మాట్లాడుతూ పరకాల మండలంలోని 10 గ్రామపంచాయతీలలో రాబోవు ఆర్థిక సంవత్సరం లో 2 లక్షల 74 వేల 418 పని దినాలు,వాటికి సరిపోవు పనులను గుర్తించాలని మరియు కూలీల ఖర్చుకు గాను 8 కోట్ల 23 లక్షల 20వేల రూపాయలు సామాగ్రి ఖర్చుకు గాను 5 కోట్ల 48 లక్షల 80000 రూపాయలకు గాను లేబర్ బడ్జెట్ అంచనాలు తయారు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.అక్టోబర్ 2 న అన్ని గ్రామాలలో లేబర్ బడ్జెట్ కొరకు ప్లానింగ్ ప్రాసెస్ లో భాగంగా అన్ని గ్రామాలలో గ్రామసభలు ఏర్పాటు చేయాలని మరియు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారము పరకాల మండలంలోని 10 గ్రామపంచాయతీలలో లేబర్ బడ్జెట్లో పనులు ఎంపిక చేసి గ్రామపంచాయతీ తీర్మానాలు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్,ఏపిఓ ఇందిర,టెక్నికల్ అసిస్టెంట్ సుమలత,పంచాయతీ కార్యదర్శులు ల,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉండాలి

శాయంపేట నేటిధాత్రి:

భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డీ వరంగల్ రూరల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి ఆదేశానుసారం క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి వివిధ గ్రామాల్లో శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుప తిరెడ్డి ఆధ్వర్యంలో గోవింద పూర్ గ్రామకమిటీని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపే తానికి వివిధ గ్రామాల్లో పర్యటించి కొద్దినెలల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో అన్ని స్థానాలను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ఐక్యమత్యంతో కలిసికట్టుగా పనిచేసి మండలంలో బిఆర్ ఎస్ జెండా ఎగుర పిలుపుని చ్చారు.గోవిందపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా దాసి శ్రావణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకో వడం జరిగింది ప్రధాన కార్యదర్శి నర్రా రాజు ఉపాధ్యక్షులుగా బొత్స మహేందర్ బైరి రాజకుమార్ సంయుక్త కార్యదర్శిగా రాజేశ్వరరావు ప్రచార కార్యదర్శి కాల్వల సతీష్ మరియు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఈ కార్యక్రమంలో మండల కమిటీల కోఆర్డినేట్ సభ్యులు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం రవీందర్ మాజీ ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మేకల శ్రీను మాజీ ఎంపీటీసీ విష్ణువర్ధన్ రెడ్డి, గడిపే విజయ్ మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్ బైరి శ్రీను, బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మండల ముఖ్య నాయకులు మారేపల్లిమోహన్ కరుణ్ బాబు పాల్గొన్నారు.

బహుజన స్టూడెంట్స్ యూనియన్ నూతన జిల్లా కన్వీనర్ గా మచ్చ పవన్

హనుమకొండ, నేటిధాత్రి :

హనుమకొండ, జిల్లా కన్వీనర్ గా వేలం పెళ్లి గ్రామానికి చెందిన మచ్చ పవన్ నూ ఎన్నుకున్నట్టు
బహుజన స్టూడెంట్స్ యూనియన్ బి ఎస్ యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ ప్రకటించడం జరిగింది.
కమిటీని ఉద్దేశించి సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంలో విఫలమైందన్నారు
విద్యాశాఖకు మంత్రిని కేటాయించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కాలయాపన చేయడం సరికాదన్నారు రాష్ట్రంలో స్కూళ్లల్లో కాలేజీలలో ఫీజులు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఐదు లక్షల విద్య అర్హత కార్డు అమలు చేయాలన్నారు.
ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు
కమిటీని ఉద్దేశించి అనేక సమస్యలపై మంద సురేష్ మాట్లాడడం జరిగింది.

ముందస్తు బతుకమ్మ వేడుకలు

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బతుకమ్మకు సంబరాలలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో అలరించారు. అనంతరం ‘పోయిరా గౌరమ్మ పోయిరావమ్మా అంటూ’ గౌరమ్మ పాటలతో బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో గొప్పదైన బతుకమ్మ వేడుకలు పాఠశాలలో నిర్వహించడం సంతోషకరమని అన్నారు. సాధారణంగా పూలతో దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు కానీ పూలనే దేవుళ్ళుగా పూజించే గొప్ప సాంస్కృతి తెలంగాణ ప్రజలదని, పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మలను తయారుచేసి వేడుకలు నిర్వహించడం వల్ల చిన్ననాటి నుండే పిల్లలకి మన పండగల పట్ల అవగాహన ఏర్పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

హన్మకొండ జిల్లా కోర్టులో స్వచ్ భారత్ దివాస్

పాల్గొన్న హన్మకొండ జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణా దేవి గారు:-

హన్మకొండ, నేటిధాత్రి (న్యాయ విభాగం):-

హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం రోజున స్వచ్ భారత్ దివాస్ కార్యక్రమం హన్మకొండ జిల్లా న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి అండ్ జిల్లా న్యాయ సేవాదికార సంస్థ చైర్మన్ బి.అపర్ణా దేవి గారు, మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు మరియు ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ప్రజలందరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.ఇట్టి కార్యక్రమం లో హన్మ కొండ జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, మరియు న్యాయవాదులు,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

బాలాజి పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలోని అక్షర ద స్కూల్ అలాగే బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.విద్యార్థులు నూతన వస్త్రాలు ధరించి తిరొక్క పులతో బతుకమ్మను అలకరించి కోలాటాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలాజీ
విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణా ఆడబిడ్డలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే వేడుక బతుకమ్మ అని అన్నారు.
ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల జీవన విధానానికి ప్రతీక
బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటుభక్తి శ్రద్ధలతో చేసుకుంటారన్నారు.ఈ నేపథ్యంలో రంగుల రంగుల పూలతో తెలంగాణా
పల్లెలు కళ కళలాడుతాయని తెలిపారు. ఆడపడచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ
ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా తెలంగాణ ప్రజలకు ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ అని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల
ప్రిన్సిపాల్ ఆర్. జ్యోతి గౌడ్,అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ భవాని, సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి,ఉపాధ్యాయ బృదం, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

ములుకనూర్ ఎస్.ఆర్.కే పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

పాఠశాలల్లో పండుగలు మత సామరస్యానికి, ఐక్యతకు నిదర్శనం – ప్రిన్సిపాల్ కాశిరెడ్డి ఆదిరెడ్డి

భీమదేవరపల్లి, నేటిధాత్రి అక్టోబర్ 01 :

దసరా సెలవులు బుధవారం నుంచి ప్రారంభం కానుండడంతో మంగళవారం మండలంలోని ముల్కనూర్ ఎస్.ఆర్.కే స్కూల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరింపజేశారు. విద్యార్థులు రంగురంగుల దుస్తులతో ఆకట్టుకున్నారు. మహిళ ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు. స్కూల్లో స్పీకర్ల సహాయంతో బతుకమ్మ పాటలు పెట్టుకొని ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ, పండుగలు మతసామరస్యానికి, ఐక్యతకు నిదర్శనం అని అన్నారు. పంచభూతాలలో ప్రకృతిని కాపాడి, దైవంగా భావించే పండుగలలో బతుకమ్మ పండుగ ప్రముఖమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం కవిత, ఉమామహేశ్వరి, శృతి, ఎం. అశ్విని, భీమేశ్వరి, జి. అశ్విని, అస్మా, అభిలాష్, రామకృష్ణ, శోభ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భద్రాచలం నేటి ధాత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం 119 నియోజవర్గలలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ పైలెట్ ప్రాజెక్టును రూపొందించిన
ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి
డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క
ఈ పైలెట్ ప్రాజెక్టు భాగంగా భద్రాచలం నియోజవర్గం నుండి మారుమూల ప్రాంతమైన పులి గుండాల గ్రామపంచాయతీ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ పైలెట్ ప్రాజెక్టుకు సెలెక్ట్ అవ్వడం
చాలా సంతోషంగాఉందిఅన్ని మీ దుమ్మగూడెం మండలకాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు(అబ్బులు )అన్నారు
ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ అందుబాటు ఉండి సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది
ఇది రాష్ట్ర ప్రజలందరికీ మంచి శుభ సూచకమైనది
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల నేస్తం
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా పాలన
మీ మండలకాంగ్రెస్ అధ్యక్షులు
లంక శ్రీనివాసరావు(అబ్బులు )

జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి దాత్రి

ఈరోజు భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి స్థాయికి రావాలని తెలిపారు. నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని డాక్టర్ అయి ప్రజలకు సేవ చేస్తున్న అని తెలియజేశారు

ప్రజలందరి ఆశీసులతో ఇప్పుడు ఎమ్మెల్యే అయి మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు

విద్యార్థులందరికీ విద్యతో పాటు టైం కి భోజనం సదుపాయాలన్ని అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భోగాల శ్రీనివాస్ రెడ్డి, భీమవరపు వెంకటరెడ్డి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

పాడే మోసిన చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్

మొగులపల్లి నేటి ధాత్రి
ఆత్మీయ మిత్రులు..కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మల్సాని బాపూరావు, మల్సాని రాజేశ్వర్ రావుల తల్లి మల్సాని ప్రమీలమ్మ సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించింది. కాగా తన అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ మల్సాని ప్రమీలమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి..పూలమాలలు వేసి ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి..ఓదార్చారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, స్వర్గలోక ప్రాప్తిరస్తు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్, మొగుళ్ళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్, ఆకినపల్లి మాజీ ఎంపీటీసీ రెంటాల రాజేశ్వరీ-సంపత్, కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఓనపాకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామ మంచినీటి సహాయ కులకు శిక్షణ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో గల మిషన్ భగీరథ అధికారు లచే గ్రామ మంచినీటి సహాయ కులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా మంగళవారం సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ మోటార్లు, ప్యానెల్ బోర్లు గురించి తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం మొత్తం నాలుగు రోజులు ఏర్పాటు చేయడం జరిగింది రెండవ రోజు(3/10/24) వాటర్ క్వాలిటీ గురించి,


మూడవ రోజు(04/10/24) చేతిపంప్స్ నిర్వహణ, నాలుగ వ రోజు (05/10/24)ప్లంబింగ్, పైప్లైన్ లీకేజీ నల్ల కనెక్షన్లు గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరగుతుంది. ఈ కార్యక్రమం లో మిషన్ భగీరథ అధికారి డి ఈ ఈ మధు కుమార్, ఏ ఈ ఈ ఇంట్ల వెంకటేష్ ఏ ఈ ఈ గ్రిడ్ వహీద్ ముఖ్య అతిథిగా ఎంపీడీవో ఫణి చంద్ర, ఎం పి ఓ రంజిత్ పాల్గొన్నారు.

గ్రామీణ విద్యార్థికి డీఎస్సీలో జిల్లా స్థాయి నాలుగో ర్యాంక్

జమ్మికుంట: నేటిధాత్రి
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి డీఎస్సీ 2024 ఫలితాలలో గణిత విభాగంలో జిల్లా స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించాడు. ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటి పల్లి గ్రామానికి చెందిన చుక్క రామకృష్ణ ఇటీవల జరిగిన డీఎస్సీ లో గణితం విభాగంలో జిల్లా స్థాయి నాలుగో ర్యాంకు సాధించాడు. ప్రాథమిక విద్యను విద్యారణ్య ఆవాస విద్యాలయంలో చదివి, ఇంటర్ డిగ్రీ ని విస్డం మరియు చాణిక్య డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేద విద్యార్థి డీఎస్సీలో నాలుగో ర్యాంక్ సాధించడం పట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ముందస్తు బతుకమ్మ వేడుకలు

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల
జమ్మికుంట నేటిధాత్రి
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ బి. రమేష్ అధ్యక్షతన ఎన్ ఎస్ ఎస్ మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించడం జరిగింది. కళాశాల విద్యార్థినిలు, అధ్యాపకురాలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. ఆటపాటలతో ఆడారు.సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్. డాక్టర్ ఓదేలు కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ రాజేంద్రo, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, ఎల్ రవీందర్, డాక్టర్ ఈ రవి, ఉమెన్ ఎంపవర్మెంట్ కన్వీనర్ డాక్టర్ శ్యామల, స్టాప్ సెక్రెటరీ డాక్టర్ గణేష్, డాక్టర్ మాధవి, ఉమా కిరణ్, రాజ్ కుమార్, కిరణ్ కుమార్,శ్రీనివాస్ రెడ్డి, సుష్మ, మమత, రవి ప్రకాష్, శ్రీనివాస్, అరుణ్ కుమార్, సాయి,విద్యార్థినీ విద్యార్థులు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

చేర్యాల అంగడి బజార్ ఇంటి యజమానుల సంఘము ఎన్నికలు

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల మున్సిపల్ పరిధిలో అంగడి బజార్ ఇంటి యజమానులు ఈరోజు
సర్వసభ్య సమావేశములో కార్యవర్గాన్ని ఏకగ్రీముగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులు: పుర్మ సంజీవరెడ్డి.అధ్యక్షులు: ఉప్పల నాగరాజు.కార్యదర్శి గా చారగొండ మల్లారెడ్డి. కోశాధికారిగా:బచ్చు   రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల అంగడి బజార్ ఇంటి యజమానులకు ఎటువంటి ఆపద వచ్చిన తాము ముందుండి పోరాడుతామని అన్నారు కాసుల శ్రీనివాస్ తేరాల శ్రీనివాస్ ఇప్ప కాయల శ్రీనివాస్ గాండ్ల రాజు ఔషర్ల బాలరాజు ఔషర్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

ఆల్ఫోన్సా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆల్ఫోన్సా పాఠశాలలో బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు.పాఠశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ,డీజే పాటలకు నృత్యాలు చేశారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ బెస్సి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర సంప్రదాయాన్ని గౌరవిస్తూ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా బతుకమ్మ వేడుకలను పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగిందని,విద్యార్థులకు అన్ని పండుగల పైన అవగాహన కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ జీనా రోస్,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కేకే మహేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ నేతలకు లేదు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో మునిగల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నాలుగుసార్లు గెలిచిన కేటీఆర్ తన బాధ్యతను మర్చిపోతే ఎన్నికల్లో ఓడిన ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ కు బాధ్యతలు గుర్తు చేశారని ప్రజల్లో కష్టసుఖాల్లో పాలుపంచుకొని సిరిసిల్ల అభివృద్ధికై కృషి చేస్తుంటే అధికారం కోల్పోయి దోచుకోవడానికి వీల్లేకుండా పోయిందని అందుకే నేతలకు నిద్ర పట్టడం లేదని ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని అలాగే గతంలో మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని కేటీఆర్ మోచేతు నీళ్లు తాగి మాట్లాడటం సరికాదని సరైన సమయంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మట్టి ఇసుక దందాలు చేస్తూ సహజ సంపాదన దోచుకుని ఎలా ఎదిగారు ప్రజలకు తెలుసునని అలాగే మీరు చేసిన అభివృద్ధితో మీరు రండి అభివృద్ధి పేరుతో అక్రమ చిట్టాలతో మేము వస్తాం మీరు ఎక్కడికి రమ్మన్నా మీ సిద్ధమని అలాగే ప్రశ్నించేటప్పుడు అబండాలు వేయరాదని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో లింగాల భూపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్ కర్ణాకర్ కొత్త రవి గుగ్గిళ్ళ శ్రీకాంత్ మోర లక్ష్మీరాజు ఎగుర్ల ప్రశాంత్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు హమీద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

స్వచ్ఛత హి సేవను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల చెల్పూర్ గ్రామంలో పరిశుభ్రత ఒక మహోన్నత కార్యక్రమమని ప్రతి ఒక్కరూ బాధ్యత పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు


మంగళవారం స్వచ్చతా హి సేవా కార్యక్రమాల్లో భాగంగా చెల్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయం నుండి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల వరకు స్వచ్ఛతపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ
స్వచ్ఛతా పరిశుభ్రత కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు స్వచ్చత హి సేవా కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం మరియు పరిశుభ్రమైన వాతావరణం సృష్టించడమేనని అన్నారు గ్రామీణ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించగలరని కలెక్టర్ పేర్కొన్నారు ర్యాలీ సమయంలో ‘స్వచ్ఛత కోసం స్మార్ట్ కార్యాచరణ వంటి నినాదాలతో ప్రజలలో పరిశుభ్రత పట్ల చైతన్యం పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ భాద్యతగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు ప్రజలు పరిశుభ్రతపై మరింత శ్రద్ధ పెట్టేలా మారుతుందని ఇట్టి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరి సహకారం అత్యంత అవసరమని ఆయన పిలుపునిచ్చారు ప్రతి కుటుంబం తప్పని సరిగా మరుగుదొడ్డి వినియోగించాలని తెలిపారు ఆరుబయట మల మూత్ర విసర్జన చేయడం సామూహిక నేరమని ఆయన పేర్కోన్నారు ఆరుబయట మల విసర్జన చేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతయాలని తద్వారా అంటు వ్యాధులు ప్రబలుతాయని అన్నారు విద్యార్థులు పరిశుభ్రత పాటించే విధంగా తమ కుటుంబ సభ్యులకు తెలియచేయాలని సూచించారు పచ్చదనం పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి భాద్యతగా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు
ఈ అవగాహన ర్యాలీలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు డిఆర్డిఓ అవినాష్ ఎంపీడీవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

కల్లెడ గ్రామం దళితవాడలో నీటి సమస్య

గత వారం రోజుల నుండి నీళ్ల సమస్యలు పట్టించుకోని అధికారులు

పర్వతగిరి నేటి ధాత్రి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని
కల్లెడ గ్రామంలో గత ఏడు రోజుల నుండి వాటర్ రాక పోవడంతో అంబేద్కర్ దళిత ఎస్సీ కాలనీలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామంలో ఉన్న బోరు ద్వారా నీటి సరఫరా చెయ్యక లేకపోవడంతో బిందెలతో పొలాల వద్దకు వెళ్లి తెచ్చుకున్న పరిస్థితి ఏర్పడింది అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది కిఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోకపోవడంతో వాటర్ ట్యాంక్ ల ద్వారా ఎస్సీ కాలనీ ప్రజలు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది సిబ్బంది వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా గ్రామంలో ఉన్న బోరు ద్వారా నేటి సరఫరా చేయాలని ఎస్సీ కాలనీ ప్రజలు కోరుతున్నారు పట్టించుకోని అధికారులపై ఉన్నంత అధికారులు చర్య తీసుకోవాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది మూగజీవులు కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి కల్లెడ గ్రామ ప్రజలను తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉచిత శిక్షణా కార్యక్ర మాలు

స్టెప్ సమన్వయకర్త కందగట్ల గోపాల్

శాయంపేట నేటిధాత్రి:

ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎడ్యుకేటర్స్ పేరెంట్స్ (స్టెప్) ఆద్వర్యంలో అక్టోబర్ 4,5,6 మూడు రోజులపాటు ఉపాధ్యాయు లకు, విద్యార్థులకు ఉచిత వ్యక్తిత్వశిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని వరంగల్ విభాగం స్టెప్ సమన్వయకర్త కందకట్లగోపాల్ తెలిపారు. విద్యార్థులలో ఉన్న మానసిక ప్రవర్తనా లోపాలను సరిచేసి, వారిలో ఆత్మ విశ్వాసం నింపి తద్వారా వారిని మంచి పౌరులుగాతీర్చి దిద్దడానికి ప్రతీ ఉపాధ్యాయుడు వ్యక్తిత్వ వికాస మార్గదర్శకులుగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నా మని వీటిని గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం లో గల నెక్కళ్లు గ్రామం లో ఉన్న ధ్యాన మందిరంలో 3రోజుల పాటు నిర్వహిస్తు న్నామని తెలిపారు .ఇందులో పాల్గొనే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేయడంతో పాటు మెటీరియల్ మరియు సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. 3 రోజులకు సరిపడే దుస్తులు, బెడ్ షీట్స్ తీసుకొని రావాలి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రావచ్చని కోరుతున్నారు .ఈ శిక్షణా కార్యక్రమములో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థులు కందకట్ల గోపాల్ ఫొన్ నంబర్ 9392213311 ఫొన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోగలరని కోరడం జరిగింది.

రాజ్యాంగ నిర్మాతను అవమానపరచడం సరికాదు

గంగాధర నేటిధాత్రి :

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వాట్సప్ గ్రూపుల్లో అవమానపరుస్తూ సంక్షిప్త వార్తలను ప్రచారం చేయడం సరికాదని అంబేద్కర్ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంగాధర మండలంలోని గంగాధర సైనికులు అనే వాట్సాప్ గ్రూపులో అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా సంక్షిప్త సమాచారం పంపించడం పై ఆ గ్రూపుకు చెందిన అడ్మిన్ దేశెట్టి శ్రీనివాస్ పై అంబేద్కర్ సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యుడైన దేశెట్టి శ్రీనివాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

error: Content is protected !!
Exit mobile version