గంగాధర నేటిధాత్రి :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వాట్సప్ గ్రూపుల్లో అవమానపరుస్తూ సంక్షిప్త వార్తలను ప్రచారం చేయడం సరికాదని అంబేద్కర్ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంగాధర మండలంలోని గంగాధర సైనికులు అనే వాట్సాప్ గ్రూపులో అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా సంక్షిప్త సమాచారం పంపించడం పై ఆ గ్రూపుకు చెందిన అడ్మిన్ దేశెట్టి శ్రీనివాస్ పై అంబేద్కర్ సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యుడైన దేశెట్టి శ్రీనివాస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.