5, 8 మస్ట్​గా పాస్​ కావాల్సిందే!

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసింది. అంటే 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్​ కావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థలకు రెండు నెలల వ్యవధిలోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్​లో పాస్​ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019 సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్‌ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది. ‘గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పరీక్షల్లో విద్యార్థులు పెయిల్ అయితే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటించిన రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ ఆ పరీక్షలోనూ ఫెయిల్ అయితే మళ్లీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుంది. అయితే ఎలిమెంటరీ విద్యా పూర్తయ్యే వరకు ఏ విద్యార్థని బహిష్కరించకూడదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.

న్యాక్.B.+.+. గ్రేడ్ సాధించినమహిళా డిగ్రీ కళాశాల

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో B.+.+. గ్రేడుసాధించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి ప్రయత్నంలోనే గ్రేడ్ సాధించినందుకు గర్వంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ రెహనా ఇప్పత్ తెలియజేస్తూ 9 10వ తేదీల్లో న్యా క్ నిపుణుల బృందం సందర్శించి విద్య ప్రమాణాలను పరిశీలించిందని ఈ సందర్భంగా తెలియజేశారు డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం సంస్థ కార్యదర్శి కే సీత లక్ష్మి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారని గ్రేడ్ సాధించడానికి కీలకంగా వ్యవహరించిన వైస్ ప్రిన్సిపాల్ వి క్యు ఏసి కోఆర్డినేటర్ బోధన బోధనె తర సిబ్బంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వపు విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించిన కళాశాలలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడానికి మార్గం ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి గ్రేడ్ రావడానికి ప్రయత్నించిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

బౌన్సర్లు కాదు గూండాలు.

`ఒళ్లు పెంచుకుంటే చాలు బౌన్సర్లైపోతారా?

`సెలబ్రిటీల పక్కన నిలబడితే బలుపు చూపాలా?

`బౌన్సర్లకు లైసెన్స్‌లు ఎలా ఇస్తారు?

`ఏజెన్సీల ఏర్పాటుకు అనుమతులెలా ఇస్తున్నారు!

`బౌన్సర్ల యూనియన్లు ఎలా ఏర్పడుతున్నాయి?.

`సెలబ్రిటీలకు బౌన్సర్లు ఎందుకు అవసరమౌతున్నారు?

`ప్రతి సందర్భంలోనూ బౌన్సర్లను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు.

`బౌన్సర్లను పెట్టుకొని సెలబ్రిటీలౌతున్నారా?

`సెలబ్రిటీలు అనిపించుకోవడానికి బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారా?

`బౌన్సర్ల మీద వున్న రౌడీ షీట్లు తెలుసుకుంటున్నారా?

`రౌడీ షీటర్లే బౌన్సర్ల అవతారమెత్తుతున్నారా?

`బౌన్సర్లకు డ్రెస్‌ కోడ్‌ ఎవరు డిజైన్‌ చేశారు.

`వారికి ఆ డ్రైస్‌ కోడ్‌ అనుమతులు ఎవరిచ్చారు?

`అత్యంత వివిఐపిలకు రక్షణగా వుండే ఎస్పీజీ కమాండర్ల కలర్‌ డ్రెస్‌ కోడ్‌ వాడుతుంటే ఏం చేస్తున్నారు.

`భౌన్సర్లు సెలబ్రిటీలకు రక్షణగా ఉంటున్నారా?

`ప్రజల మీద దౌర్జన్యం చేస్తుంటే కనిపించడం లేదా!

`అల్లు అర్జున్‌ వ్యవహారంలో పోలీసులనే నెట్టేసేంత శక్తి వారికి ఎవరిచ్చారు?

`పెళ్లిళ్లకు, పేరంటాలకు, ఆఖరుకు చావులకు బౌన్సర్లను వాడుకోవడమేమిటి?

`బౌన్సర్లు లేకుండా బైటకు రాని పరిస్థితులేమిటి?

`సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు బౌన్సర్లు లేకుండా అడుగు బైట పెట్టకపోవడమేమిటి?

`ప్రజా ప్రతినిధులకు కూడా బౌన్సర్ల అవసరమేమొస్తుంది.

`సెటిల్మెంట్లలలో బౌన్సర్లదే కీలక పాత్ర.

`బౌన్సర్ల వ్యవస్థ రద్దు చేయాలి!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఆరడుగులుంటే చాలు. కండలు తిరిగిన వస్తాదుల్లా వుంటే చాలు. కండలు తిరిగి దేహ దారుడ్యం వుంటే చాలు. ఇటీవల యువత ఎంచుకుంటున్న ఉపాది మార్గం బౌన్సర్‌. కొన్ని నెలల పాటు జిమ్‌లలో ట్రైనింగ్‌ తీసుకునేవాళ్లు కొందరైతే, సహజంగా దేహ దారుడ్యం వున్న వాళ్లు కొందరు. పైగా వారి డ్రెస్‌ కోడ్‌ చూస్తే ఏదో ఐపిఎస్‌ ఆఫీసర్ల లాగా, దేశానికి ప్రతి క్షణం సేవ చేస్తున్న సైనికుల్లా ట్రైనింగ్‌ అయిన వారిలాగా ఫోజులు కొడుతుంటారు. అసలు బౌన్సర్ల డ్రైస్‌ కోడ్‌ చేస్తూ సెక్యూరిటీలో ప్రైవేటు వ్యక్తులు అన్నట్లు కనించరు. సామాన్యులకు వారు పెద్ద పోలీస్‌ అధికారులేమో? అన్న అన్నంతగా వారి అత్యుత్సాహం చూపిస్తుంటారు. కళ్లకు నల్లటి షెమ్మాలు, ఆధునాథనమైన హియరింగ్‌ మైకులు పెట్టుకొని దర్జా, దర్పం ప్రదర్శిస్తుంటారు. అసలు వారి గురించి తెలియని వాళ్లు వారి వద్దకు చేరుకోవాలంటేనే భయపడుతుంటారు. అలా వారి వ్యవహారం సాగుతుంది. ఇక సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఏజెన్సీలు కార్యాలయాలు, బౌన్సర్లు చేసే రీల్స్‌ చూసి కొంత మంది అలా ట్రైనింగ్‌ అవుతున్నారు. వెరసి బౌన్సర్లలో అమాయకులే కాదు, కరడుగట్టిన నేరస్ధులు కూడా చేరిపోతున్నారు. బౌన్సర్లలో చాలా మందిపై నేరారోపణలున్నాయి. పోలీసు కేసులు నమోదై వున్నాయి. రౌడీషీట్లు ఓపెన్‌ చేసి వున్నాయి. చిన్న చిన్న నేరాలే కాదు, పెద్ద రియల్‌ వ్యాపారంలో నేరాలలో ఇంప్లీడ్‌ అయిన వారు కూడా వున్నారు. ఎక్కడికెళ్లినా సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా కనిపిస్తుండడంతో వారు కూడా హీరోల్లా ఫీలౌతున్నారు. ప్రజలపై ఇష్టం వచ్చినట్లు చేయిచేసుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు లొసుగు వుంది. ఆ బౌన్సర్లుగా అవతారం ఎత్తుతున్న వారిలో చాలా వరకు ఆవేశ పరులుంటారు. కొన్ని కేసుల్లో నిందుతులుగా వున్నవాళ్లు వున్నారు. వివిధ ప్రాంతాలలో రకరకాల గొడవలను ప్రేరేపించిన వాళ్లు వున్నారు. అనేక రకాలుగా నేర పూరిత చర్యల్లో బాగమైన వారు వున్నారు. నగరాలలో రౌడీలుగా చెలామణి అయిన వారు కూడా వున్నారు. వీరందిరకీ కనిపించిన ఉపాది మార్గం బౌన్సర్‌. ఈ మధ్య సెక్యూరిటీ ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల ముసుగులో బౌన్సర్లును తయారు చేస్తున్నారు. వారిని అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీదకు వదిలేస్తున్నారు. వివీఐపిలకు సెక్యూరిటీ ఇచ్చే సమయంలో తమలోని విశృంకలత్వాన్ని బైట పెట్టుకుంటున్నారు. ఒళ్లు చూసుకొని మురుస్తూ, సెలబ్రీల మెప్పు పొందేందుకు అత్యుత్సాహం చూపుతుంటారు. అలాంటి సంఘటనలో భాగమే అల్లు అర్జున్‌ వ్యవహరం ముడిపడి వుంది. బౌన్సర్లు అనే వాళ్లు ఆఖరుకు పోలీసులను కూడా కంట్రోల్‌ చేసే దాకా వెళ్లారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాని అప్పుడు అటు పోలీసు యంత్రాంగం కాని, ఇటు సమాజం గాని పెద్దగా పట్టించుకోలేదు. కాని పాపం పండేందుకు కొంత సమయం పడుతుందన్నట్లు బౌన్సర్ల అసలు రూపం ఇప్పుడు బైట పడిరది. సెక్యూరిటీ ఏజెన్సీల డొల్ల తనం ఇక్కడ తేట తెల్లమైంది. సహజంగా ప్రధాన నగరాల్లోనే కాకుండా, చిన్న చిన్న పట్టణాల వరకు సెక్యూరిటీ ఏజెన్సీలు చేరిపోయాయి. ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లు, బ్యాంకులు, ఏటిఎంలు, మాల్స్‌, హోటళ్లు, ఇలా చెప్పుకుంటూ రకరకాల వ్యాపారులు తమ కార్యాలయాల రక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి కూడా డ్రెస్‌ కోడ్‌ వుంటుంది. చేతిలో చిన్న కర్ర వుంటుంది. కాని బౌన్సర్ల ఎజెన్సీలు అందుకు భిన్నంగా తయారైపోయాయి. దేశంలో అత్యంత వీవీఐపిలుకు రక్షణ కల్పించే రక్షణ వ్యవస్దలోని ఎస్పీజీ కమాండర్‌ తరహాలో డ్రెస్‌ కోడ్‌ ఇచ్చారు. వీవీఐపిలకు రక్షణ కల్పించే ఎస్పీజీ కమాండర్‌లు సూట్‌తో వుంటారు. బౌన్సర్లు సఫారీ సూట్లలలో వుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులకు వుండే పోలీస్‌ సెక్యూరిటీని తలపించేలా వుంటారు. డ్రెస్‌ కోడ్‌ మురురు రంగులో వుండడంతో కొంత ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆ ఉపాది కూడా ఒక ప్యాషన్‌ అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్‌ కేసులో బలికీ బక్‌రాలు కూడా బౌన్సర్లే అవుతున్నారు. నగర కమీషనర్‌ సివి. ఆనంద్‌ రెండు రోజుల క్రితం కూడా బౌన్సర్ల మీద తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. బౌన్సర్లు అతి చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ప్రజల మీద చేయి వేసినట్లు తెలిస్తే జైలుకు కేసులు నమోదు చేస్తామన్నారు. తమ దాకా వస్తే తప్ప పోలీసులకు ఈ విషయం ఇంత కాలం అర్ధం కాలేదు. గతంలో ఎంతో మంది బౌన్సర్ల మూలంగా గాయాల పాలైన వారు అనేకం వున్నారు. బౌన్సర్లు నేట్టేసిన సందర్భాలలో కాళ్లు, చేతులు విరిగిన వారున్నారు. బౌన్సర్లు చేసే అతి ఇంత కాలం చూస్తూనే వున్నారు. కాకపోతే అల్లు అర్జున్‌ విషయంలో ఏకంగా పోలీస్‌ ఉన్నతాధికారులపై కూడా బౌన్సర్లు తిరగబడడంతో వారి వ్యవహారం పూర్తిగా అర్ధమైంది. అంతే కాదు బౌన్సర్లు లేని తోపులాటలను కూడా సృష్టిస్తారేది తేలిపోయింది. ఎందుకంటే బౌన్సర్లలో కొంత మంది దుందుడుకు స్వభావం కల్గిన వారుంటారు. వారు ఇలాంటివి అక్కడక్కడ ప్రేరేపిస్తుంటారు. నిజానికి అనేక సార్లు అనేక సందర్భాలలో తోపులాటలు జరుగుతుంటాయి. ప్రాణాలు పోయేంత తోపులాటలు జరగవు. ఎందుకంటే ఎవరికి రక్షణ కోసం వాళ్లు చూసుకుంటారు. కాని బౌన్సర్లు ప్రజలను ఇస్టానుసారం వారి పూర్తి బలం ప్రయోగించి జనాన్ని ఒక్కసారిగా తోయడం వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతాయని చెప్పడానికి సంధ్య ధియేటర్‌లో దుర్గటనే సాక్ష్యమని చెప్పాలి. బౌన్సర్లు విపరీత ప్రదర్శన మూలంగానే మహిళ చనిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. బౌన్సర్ల అత్యుత్సాహం వల్లనే పెద్ద తోపులాట జరిగింది. పోలీసులను సైతం బౌన్సర్లు తోసేశారు. అంటే వారికి పోలీసులంటే కూడా భయం లేకుండాపోయింది. తాము ఏదైనా కేసులో ఇరుక్కునే పరిస్ధితి వస్తే వీవిఐపిలే రక్షిస్తారన్న అతి నమ్మకం కూడా వారిని కొంత ప్రేరేపించేలా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక బౌన్సర్ల కల్చర్‌ దేశంలో అంతటా మొదలైంది. ముఖ్యంగా సినీ వర్గాలు వారిని విపరీతంగా వినియోగించుకుంటోంది. సహజంగా ప్రజల్లో సినీ వర్గాలకే క్రేజ్‌ వుంటుంది. దాంతో ప్రజలు సహజంగా హీరోలతో ఫోటోలు దిగాలని చూస్తారు. ముఖ్యంగా సెల్‌ ఫోన్లు వచ్చిన తర్వాత అభిమానుల్లో కూడా కొంత అత్యుత్సాహం కనిపిస్తోంది. దాన్ని తప్పించుకునేందుకు హీరోలకు బౌన్సర్ల సాయం అవసరపడుతోంది. అభిమానులు వేలకు వేలు పెట్టి టికెట్లు కొని సినిమాలు చూడాలి. కాని అదే అభిమానులు దగ్గరకొస్తే మాత్రం తోసేయ్యాలనే మనస్తత్వం సినీ నటుల్లో బాగా పెరిగిపోయింది. ఆ అహం వెర్రి జనానికి అర్ధం కాక సినిమాలో వున్నట్లే బైట కూడా హీరోలు వుంటారని భ్రమ పడుతుంటారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదిలా వుంటే ఇటీవల బౌన్సర్లను ప్రతి కార్యక్రమానికి వినియోగిస్తున్నారు. పెళ్లి, పేరంటం, చిన్న చిన్న ఫంక్షన్లు, చాలు, దినాలు ఇలా ఏ కార్యక్రమమైనా సరే సమాజంలో ఒకింత పేరున్న వాళ్లు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేస్తున్న వారు కూడా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫంక్షన్‌ హాల్‌ వద్దకు వచ్చిన విఐపి వచ్చినప్పుడు వారు రక్షణగా రావడం వారిని కుర్చీలలో కూర్చోబెట్టడం చేస్తున్నారు. తిరిగి పెళ్లికి, పేరంటానికి, ఆఖరుకు చావులకు కూడా హజరయ్యే విఐపిలకు కూడా రక్షణ కల్పించేలా ఆర్భాటం చేస్తున్నారు. దాంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విఐపిలు వచ్చినప్పుడు బౌన్సర్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. వెళ్లిపోయే మందు విఐపిలు ఇచ్చే దాని కోసం ఆశపడి, అత్యుత్సాహన్ని ప్రదర్శిస్తుంటారు. దాంతో పెళ్లి,పేరంటాలకు వచ్చిన బందువులు కూడా బౌన్సర్ల మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే బంధువులెవరో, స్నేహితులెవరో బౌన్సర్లకు తెలియదు. కాని విఐపిలు ఎవరో అందరికీ తెలుసు. వాళ్లు వచ్చినప్పుడు వారి అనుచర గణం చేసే హంగామాను గుర్తుపట్టి, బౌన్సర్లు కూడా మరింత అతి చేయడం మొదలు పెడతారు. అసలైన బంధువులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విఐపిలుగా చెలా మణి కావడం కోసం బౌన్సర్లను రక్షణగా పెట్టుకుంటున్నారా? లేక బౌన్సర్ల మూలంగా మూలంగా విఐపిలుగా చెలామణి అవుతున్నారా? అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా ఇలాంటి బౌన్సర్ల వ్యవస్ధను రద్దు చేయడమే అందరికీ మంచిది. ఎవరి అదుపాజ్ఞల్లో వారు వుంటేనే ఎంతో మంచిది. లేకుంటే బౌన్సర్లు చూసుకుంటారు లే అన్న తేలిక భావంతో వుంటే అల్లు అర్జున్‌ లాగా కేసుల్లో ఇరుక్కునేదాకా వస్తుంది. కటకటాలులెక్కించాల్సి వుంటుంది. తమ ప్రమేయం లేకపోయినా ముద్దాయిలై, నేరస్థుల జాబితాలో చేరాల్సి వుంటుంది. చేయని తప్పుకు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. భవిష్యత్తు ఇలా కూడా నాశనమౌతుంది. తస్మాత్‌ జాగ్రత్త.

ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు.

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణం లో గల ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ పెద్దపల్లి ఉప్పలయ్య కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం సర్వ మతాలకు నిలయమని, మతాల భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవడం మన ఆనవాయితని పేర్కొన్నారు. దసరా, దీపావళి, రంజాన్ క్రిస్మస్ ఇలా ప్రతి పండుగను పాఠశాలలో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రిస్మస్ వేడుక విశిష్టతను తెలుపుతూ చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కామన్ దగ్గర రోడ్ల పై ఉన్న కూరగాయల వ్యాపారులను తరలించాలి జె సీ ఆదేశాలు

వనపర్తి నెటిధాత్రి :
వనపర్తి పట్టణంలో 15 వ వార్డ్ కమాన్ సెంటర్ పాత గోపన్ గౌడ్ షాప్ ఏరియా లో రోడ్డ పై కూరగాయల వ్యాపారం చేయడంతో ప్రజలకు బాటసారు ల కు వాహనాలు నడి పే వారికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు కలెక్టర్ కు తెలిపారని మున్సిపల్ కౌన్సులర్ బండారు కృష్ణ తెలిపారు
నిరుపయోగంగా ఉన్న కూరగాయల మార్కెట్. చాపల మార్కెట్ ను మారేమ్మ కుంట చౌరస్తాను సందర్శించిన జాయింట్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ , 15వ వార్డ్ కౌన్సిలర్ బండారు కృష్ణ, కమిషనర్ పూర్ణచందర్, డీపీటీ,ఎం డి యున్యూస్ అనిల్ కుమార్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి. ఇంజనీర్ సెక్షన్ శేఖర్ మున్సిపల్ సిబ్బంది
రోడ్డపై ఉన్న కూరగాయల వ్యాపారులను చాపల వ్యాపారుల.ను వృదా గా ఉన్న భవనం లో కి తరలించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారని బండారు కృషి విలేకరుల కు తెలిపారు

కారుణ్య జ్యోతి పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు.

#కేక్ కట్ చేసిన ప్రిన్సిపాల్ మేరీ ఉషారాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని కారుణ్య జ్యోతి పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ ఉషారాణి కేక్ కట్ చేసి సందేశం, ప్రార్థన చేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మరియాదాసు, వైస్ ప్రిన్సిపాల్ కందుల కుమారస్వామి గౌడ్, ఉపాధ్యాయులు బొద్దుల సాంబమూర్తి, రాజేందర్, అజయ్, రాజా సాహెబ్, లక్ష్మణ్, సౌమ్య, విద్యార్థులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లిటిల్ ఫ్లవర్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో ఘనంగా సెమీ క్రిస్మస్ నిర్వహించడం జరిగింది ప్రిన్సిపల్ కరుణాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు కులమత బేధాలు లేకుండా ఇతరులకు సహాయం చేసే విధంగా మనమంతా కలిసికట్టుగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

రాంపురం లో దొంగల బీభత్సం

మరిపెడ నేటిధాత్రి .

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామపంచాయతీలో సోమవారం రాత్రి తాళాలు వేసి ఉన్న రెండు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు, ఇంట్లో వారు తీర్థయాత్రలకు వెళ్లిన సమయం చూసుకొని రాత్రి వేళలో రెండు ఇండ్లలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు, ఇరగని ఉపేందర్, ఇంటిలో ఈ చోరీలో తులంనర బంగారం, పదివేల రూపాయలు నగదు, సుదగాని బాలాజీ ఇంటిలో అర తులం బంగారం పట్టీలు పోయినట్టు బాధితులు తెలిపారు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా,స్థానిక మరిపెడ ఎస్సై గండ్ర సంతోష్ మరియు క్లూస్ టీం వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని విచారణ జరుపుతామని చెప్పారు,త్వరలోనే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని బాధితులకు భరోసానిచ్చారు.

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవాలి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి

జడ్చర్ల / నేటి ధాత్రి.

తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణా ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియకుండా తీసుకొనే అవకాశం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణా రెండూ కూడా తనకు రెండు కళ్లని చెప్పిన చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష ఎలా చూపుతారని ప్రశ్నించారు. గతంలో ఆంధ్ర ప్రజాప్రతినిధుల తరహాలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై కూడా భక్తులకు దర్శన, వసతి సదుపాయాలను టీటీడీ కేటాయించేది. అయితే ఈ మధ్యకాలంలో టీటీడీలో తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు చెల్లుబాటుకాకపోవడం, ఈ విషయంగా అనిరుధ్ రెడ్డి తిరుమలకు వెళ్లిన సమయంలో మీడియాలో మాట్లాడటం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన ఆంధ్ర మంత్రి ఒకరు టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత ఈ విషయంగా సానుకూల నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా ప్రకటించి వెళ్లారు. కానీ టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత కూడా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలని టీటీడీకి మరోసారి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలను, ప్రజాప్రతినిధులను అగౌరవపరిచే విధంగా తెలంగాణా ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ తీసుకున్నది విధానపరమైన నిర్ణయం కాగా.. ఈ నిర్ణయాన్ని టీటీడీ ఈఓ సొంతంగా తీసుకోలేరని దీనికి సీఎం అనుమతి అవసరమౌతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణా తనకు రెండు కళ్లని గతంలో చెప్పిన చంద్రబాబు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా ఆమోదిస్తారని నిలదీశారు. ఒకవేళ సీఎంకు తెలియకుండా టీటీడీ అధికారులే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేసారు. తిరుమల ఆలయానికి ఆంధ్ర భక్తుల కంటే తెలంగాణా భక్తులే అధికంగా వెళ్తారని, టీటీడీకి భక్తుల ద్వారా సమకూరే ఆదాయంలో ఎక్కువ భాగం తెలంగాణా భక్తుల నుంచే వస్తుందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీలో పరిగణలోకి తీసుకొనేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీటీడీ అధికారుల ధోరణి మారకపోతే తెలంగాణాలోని జోగుళాంబ నుంచి బాసర దాకా, భధ్రాచలం నుంచి చిలుకూరి బాలాజీ దాకా తెలంగాణలో ఉన్న అన్ని ఆలయాల్లో ఆంధ్ర వీఐపీల సిఫార్సు లేఖలను ఆమోదించకూడదని, వారికి ప్రత్యేక దర్శనాలు కల్పించకూడదని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతామని, అసెంబ్లీలోనూ.. ఈ విషయంగా నిర్ణయం తీసుకొనేలా చూస్తామని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా టీటీడీ, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా ప్రజాప్రతినిధులను కూడా గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి కోరారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.కేక్ కట్ చేసి ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం అని,మానవ సమాజానికి లోక రక్షకుడైన ఏసు జన్మదినం జరుపుకోవడం చాలా గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పండుగగా శుభపరిణామం తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎసిపి చిర్ర సతీష్ బాబు,సిఐ క్రాంతి కుమార్,పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,పరకాల మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ,మాజీ ఎంపీటీసీ పర్నెం మల్లారెడ్డి,ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,బొచ్చు జెమిని,పరకాల,ఆత్మకూరు, దామెర,నడికూడ మండలాల పాస్టర్లు,పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వివిధ శాఖల అధికారులు,క్రైస్తవులు పాల్గొన్నారు.

ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకం

మరిపెడ నేటిధాత్రి.

మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ లోని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో భార్గవ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రిస్మస్ వేడుకలకు డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరై
పాస్టర్లలతో కలిసి క్రిస్మస్ వేడుకల కేక్ కట్ చేసి,పాస్టర్ లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఏసు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని యావత్తు మానవాళికి మార్గదర్శకత్వం చేసేవి అని తెలిపారు. ఏసుక్రీస్తు మనుషులను
అందరిని ప్రేమించాలి, మార్గంలో నడవాలి, సేవా భావంతో మెలగాలని అన్న క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ప్రపంచానికి బోధించిన శాంతి దూత యేసు అని అన్నారు.క్రిస్టియన్ మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
దేశంలో సర్వ మతాలకు రక్షణ కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.గతంలో ఎన్నడు లేని విధంగా చర్చిల నిర్మాణానికి మరమ్మత్తులు ఆధురనీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు, క్రైస్తవుల సంక్షేమం కోసం తన వంతు పూర్తి సహకారం ఉంటుందని ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని చెప్పారు,ప్రజలకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలియజేశారు.
కరుణను ఆచరాత్మకంగా చూపించిన వ్యక్తి ఏసుక్రీస్తు అని కొనియాడారు.
సోదరాభావం వినయ కరుణతో సంతోషంగా మనమందరం జీవించవచ్చున్నారు, అనంతరం ఏర్పాటు చేసిన విందులో ప్రభుత్వ విప్ పాల్గొన్ని బోజనము చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ గణేష్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ మరిపెడ తహసిల్దార్ సైదులు, ఎంపీడీవో విజయ, పాస్టర్స్ భాస్కర్, రామ్మూర్తి, మహేందర్, ఉప్పల వెంకటేశ్వర్లు, దేవరాజు, ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,కాలం రవీందర్ రెడ్డి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు,రామ్ లాల్, అంబరీష, అప్సర్, తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్ టెన్త్,ఇంటర్ గడువు పొడిగింపు

జైపూర్,నేటి ధాత్రి:

ఓపెన్ టెన్త్,ఇంటర్ గడువు రాష్ట్ర విద్యాశాఖ పొడిగించినట్లు జైపూర్ అధ్యయన కేంద్ర సహాయ సమన్వయకర్త సత్తయ్య జంబోజు ఒక ప్రకటనలో తెలిపారు.ఓపెన్ టెన్త్ లో ప్రవేశానికి పుట్టిన తేదీ తెలియజేయడానికి టిసి, రికార్డు షీట్, మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ సరిపోతుందని ఎటువంటి విద్యార్హత లేకుండా టెన్త్ పూర్తి చేసుకోవడానికి మంచి అవకాశం అని తెలిపారు.అలాగే టెన్త్ ఉత్తీర్ణులై కాలేజీకి వెళ్లకుండా ఇంటర్ పూర్తి చేసుకోవచ్చని సెలవు రోజులలో తరగతులు నిర్వహించబడతాయని అన్నారు.ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్హతలు పొంది అన్ని రకాల పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు చేయవచ్చని, పై చదువులు రెగ్యులర్ గా చదవచ్చని తెలియజేశారు. ఏవైనా వివరాల కొరకు జిల్లా పరిషత్ జైపూర్ అధ్యయన కేంద్ర సమన్వయకర్త ప్రధానోపాధ్యాయులను సంప్రదించవచ్చని తెలిపారు.

జిల్లా డివిజినల్ ఇంజినీర్ పాపిరెడ్డినీ కలిసిన నాయకులు

భూపాలపల్లి నేటి ధాత్రి

టీఈఈ 1104 యూనియన్ భూపాలపల్లి డివిజన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా డివిజినల్ ఇంజినీర్ పాపిరెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కార్మికుల సమస్యలు చెప్పడం జరిగింది
వారు సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ప్రాంతీయ అధ్యక్షులు షేక్ జహురొద్దీన్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఒంటేరు మల్లయ్య కంపెనీ టీజీ ఎన్ పి డి సి ఎల్ ఉపాధ్యక్షులు ఎం. రమేష్, భూపాలపల్లి డివిజన్ అధ్యక్షులు ఎం. శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ కె. శ్రీకాంత్, కార్యనిర్వాహక అధ్యక్షులు గుర్రం సుమన్ అదనపు కార్యదర్శి కె. నరేష్, కోశాధికారి బి. రాజు, వి. సాయిరాం, డి. బాలాజీ పాల్గొన్నారు

పీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి బయల్దేరారు

Hyderabad News
Jagtial District
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నివాసం ఇందిరా భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి బయల్దేరారు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నివాసం ఇందిరా భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు PCC NRI Telangana State Conviner Shaik Chand Pasha కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ నర్సింగరావు గారు కృష్ణారావు గారు మరియు Jagtial District Minority President MD. Nehal మహిళ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ పిసిసి సభ్యులు INFORMATION And News Covering CEO Shaik Raheem PARVEZ Police Nazar News India

ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగం పరిధిలో రూపొందపడి భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వాలు వారి వారి కర్తవ్యాలు నిర్వహింప చేయడం జరుగుతుంది

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఆర్టికల్ 3 , 4 అనుగుణంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందుచూపుతో రాజ్యాంగం పొందుపరచడంతో తెలంగాణ రాష్ట్ర కళ సహకారం జరిగింది

అటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవించుకునే విధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే చట్ట సభకు ఎంపికైనటువంటి ప్రజా ప్రతినిధులు పార్లమెంటు సభ్యులు కానీ శాసనసభ సభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వారి యొక్క బాధ్యత వారి కర్తవ్యాలను నిర్వహించడం జరుగుతుంది

భారత రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిచే ఎవరైనా భారత శిక్షస్పృతికి అనుగుణంగా శిక్ష అర్హులు అని చెప్పక తప్పదు

యూనియన్ హోం మంత్రి అమిత్ షా ఒకప్పటి గుజరాత్ తడిపార్ తడిపార్ అని ఎందుకు అంటే ఆయన నేర పరువృతి ఆయన ఆలోచన విధానం తెలియజేయడం జరుగుతుంది

అటువంటివారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాపడడం మోడీ గారు అటువంటి నేర మోడీ గారు పరువృతి కలిగిన వారిని కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పడం పర్యవ స్థానం మనం గమనిస్తున్నాం

పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమితో పాటుగా ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగిన రాజకీయ పార్టీలను అన్నింటిని ఒక ఐక్యంగా నిలపడంతో రాజ్యాంగాన్ని గొప్పగా అమలు చేయబడే విధంగా పార్లమెంటుపై ఒత్తిడి చేయడం జరిగిందో ఆర్థిక నేరస్తులు అంబానీ ఆదాని లాంటి వారికి భారత ప్రభుత్వం కొమ్ముకాసే విధంగా ప్రయత్నం చేస్తుందో అటువంటి ఆర్థిక నేరస్తులను శిక్షించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే భాగంగా నిరసన వ్యక్తం చేస్తుంటే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకన చేసే విధంగా ఒక అవహేళనగా అంబేద్కర్ దేవుడా అనడం జరిగింది

ఇవ్వాళ్ల కనబడుతున్న దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగనే కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగారు

కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరవ రాష్ట్రాలు ఏర్పాటు కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి రాజ్యాంగం చరవే

మహనీయులు బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడడం సరైనది కాదు

ఈ అంశం కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదు యావత్ భారతదేశానికి సంబంధించిన అంశం కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ నర్సింగరావు గారు కృష్ణారావు గారు మరియు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ పిసిసి సభ్యులు

 

ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగం పరిధిలో రూపొందపడి భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వాలు వారి వారి కర్తవ్యాలు నిర్వహింప చేయడం జరుగుతుంది

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఆర్టికల్ 3 , 4 అనుగుణంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందుచూపుతో రాజ్యాంగం పొందుపరచడంతో తెలంగాణ రాష్ట్ర కళ సహకారం జరిగింది

అటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవించుకునే విధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే చట్ట సభకు ఎంపికైనటువంటి ప్రజా ప్రతినిధులు పార్లమెంటు సభ్యులు కానీ శాసనసభ సభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వారి యొక్క బాధ్యత వారి కర్తవ్యాలను నిర్వహించడం జరుగుతుంది

భారత రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిచే ఎవరైనా భారత శిక్షస్పృతికి అనుగుణంగా శిక్ష అర్హులు అని చెప్పక తప్పదు

యూనియన్ హోం మంత్రి అమిత్ షా ఒకప్పటి గుజరాత్ తడిపార్ తడిపార్ అని ఎందుకు అంటే ఆయన నేర పరువృతి ఆయన ఆలోచన విధానం తెలియజేయడం జరుగుతుంది

అటువంటివారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాపడడం మోడీ గారు అటువంటి నేర మోడీ గారు పరువృతి కలిగిన వారిని కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పడం పర్యవ స్థానం మనం గమనిస్తున్నాం

పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమితో పాటుగా ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగిన రాజకీయ పార్టీలను అన్నింటిని ఒక ఐక్యంగా నిలపడంతో రాజ్యాంగాన్ని గొప్పగా అమలు చేయబడే విధంగా పార్లమెంటుపై ఒత్తిడి చేయడం జరిగిందో ఆర్థిక నేరస్తులు అంబానీ ఆదాని లాంటి వారికి భారత ప్రభుత్వం కొమ్ముకాసే విధంగా ప్రయత్నం చేస్తుందో అటువంటి ఆర్థిక నేరస్తులను శిక్షించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే భాగంగా నిరసన వ్యక్తం చేస్తుంటే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకన చేసే విధంగా ఒక అవహేళనగా అంబేద్కర్ దేవుడా అనడం జరిగింది

ఇవ్వాళ్ల కనబడుతున్న దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగనే కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగారు

కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరవ రాష్ట్రాలు ఏర్పాటు కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి రాజ్యాంగం చరవే

మహనీయులు బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడడం సరైనది కాదు

ఈ అంశం కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదు యావత్ భారతదేశానికి సంబంధించిన అంశం

వనపర్తి ముఖచిత్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

వనపర్తి నెటిధాత్రి :
వనపర్తి జిల్లా ముఖచిత్రం క్యాలెండర్ ను వేరు వేరు గా హైదరాబాద్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఎంపీ మల్లు రవి వనపర్తి,ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆవిష్కరించారని వనపర్తి జిల్లాఐక్యవేదిక అధ్యక్షులుసతీష్ యాదవ్ తెలిపారు
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్,తీన్మార్ మల్లన్న టీం వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్. బి ఎస్ పి టౌన్ ప్రజెంట్ గంధం భరత్, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, నాయకులు బొడ్డుపల్లి సతీష్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారని సతీష్ తెలిపారు

మనువాదుల గుండెల్లో తుపాకీ తూటా పెరియార్.

డాక్టర్ భాను ప్రసాద్

భద్రాచలం నేటి ధాత్రి

స్థానిక బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ నందు మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో సాంఘిక విప్లవ నేత పెరియార్ రామస్వామి 51 వ వర్ధంతి సందర్భంగా పెరియార్ చిత్రపటానికి నివాళి అర్పించటం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారులు సామాజిక ఉద్యమకారులు ప్రముఖ హేతువాది డాక్టర్ భాను ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ ప్రజలకు స్త్రీ లకు గౌరవం లేకుండా కులం, మతం పేరుతో ఏళ్ల నుంచి అసమానతలకు కారణమైన మనువాద వ్యవస్థపై ఆత్మగౌరవ పోరాటం చేసిన వ్యక్తి పెరియార్ రామస్వామి అన్నారు. సమాజాన్ని కులాల పేరుతో విడదీసి, ఆత్మగౌరవం లేకుండా అవమాన పరిచిన మనువాదుల గుండెల్లో తుపాకీ తూటగా మారిన గొప్ప సంఘసంస్కర్త పెరియార్ రామస్వామి అని కొనియాడారు. పేదలకు ఆత్మగౌరవం దక్కినప్పుడే సమాజంలో అసమానతలు తొలగి అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పిన పెరియార్ రామస్వామి నేటి సమాజానికి ఆదర్శం అన్నారు. ప్రతీ ఒక్కరు పెరియార్ మార్గంలో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు మేకల లత, ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి, కార్యదర్శి కొప్పుల నాగమణి,కోట ప్రశాంతి, రమణమ్మ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా పెరియార్, కొప్పుల తిరుపతి, భద్రాచలం పట్టణ ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు,కొవ్వాల రవి, మేడ్చెర్ల లక్ష్మణ్, అంబోజి రత్నం, తదితరులు పాల్గొన్నారు

కరాటే స్టేట్ ఫిఫ్త్ లెవెల్ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే వినోద్

మంచిర్యాల,నేటి ధాత్రి:

కరాటే స్టేట్ ఫిఫ్త్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్ పోస్టర్ ను మంగళవారం మంచిర్యాలలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ విడుదల చేశారు.2025 జనవరి 5వ తేదీ ఆదివారం రోజున సోమ గూడెం త్రినేత్ర ఫంక్షన్ హాల్ లో కరాటే,కుంగుఫు ఛాంపియన్షిప్ 2025 స్టేట్ ఫిఫ్త్ లెవెల్ నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్ కుందేళ్ళ రవి తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్స్ భూమయ్య,రంగ రమేష్,మోకేనపేల్లి సురేష్,దాసరి రాజేష్,ఆల్ స్టైల్ ప్రెసెంట్ నాగలక్ష్మి,ట్రెజరర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలి :

– తెలంగాణ ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వాక్యాలు ఖండిస్తూ అమిత్ షాను మంత్రి వర్గం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, టి.పి.సి.సి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు.


వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతు గత వారం రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో రెండవ స్థానంలో,దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.అమిత్ షా అంబేద్కర్ పై మాట్లాడిన మాటలకు దేశం యావత్తున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
అమిత్ షాను వెంటనే మంత్రివర్గంలో నుండీ వెంటనే భర్తరఫ్ చేయాలని కొరుతున్నప్పటికీ కనీస స్పందన లేదన్నారు..
ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్టీ వర్గాలు ఏకదాటిపైకి వచ్చి అహంకారంతో మాట్లాడిన అమిత్ షాను మాట్లాడే మాటలు ఖండిస్తున్నారన్నారు..
నేడు జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి లేఖ రాయడం జరుగుతుంది..
దేశవ్యాప్తంగా అనేక ఆందోళన జరుగుతున్న మోడీ అమిత్ షాను వెనకేసుకు రావడం విడ్డూరం..
అమిత్ షా పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వేలాది మంది సమక్షంలో ధర్నా నిర్వహించడం జరిగింది..
దేవుడి తర్వాత దేవుడిగా పేదవారు అంబేద్కర్ను కొలుస్తారన్నారు..
డా. బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అవపోషణ చేసుకొని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారు..
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశంలోని ప్రజలకు అనేక హక్కులు కల్పించబడ్డాయి..
అట్లాంటి మహనీయుడిపై అమిత్ షా అహంకార పూరితమైన మాటలు మాట్లాడడం దారుణం..
ఇప్పటికే అసెంబ్లీ ఆవరణలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం..
బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగివచ్చి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలి..
బిజెపి ప్రభుత్వం దేశంలోని పేదల సంపద ఆదాని అంబానీల దోచుపెడుతుంది..
ఆదానీ 2014 సంవత్సరంలో సంపన్నుల జాబితాలో 600 పై చీలుకు ఉండి నేడు రెండవ స్థానానికి ఏ విధంగా ఏగబకారో సమాధానం లేదు..
పార్లమెంట్లో ప్రశ్నించిన 150 మంది ఎంపీలను బహిష్కరించారు..
దేశంలో నియంతృత్వ పరిపాలన చేస్తున్న బీజేపి ని రాబోవు రోజుల్లో గద్దె దించాలి..
మణిపూర్లో ప్రజలు వారి హక్కులను కోల్పోతున్న ప్రధాని మోడీ, అమిత్ షా వారి గురించి పట్టించుకోరు..
మణిపూర్ లో జరుగుతున్న వాటిపై నోరు మెదపని భారతీయ జనతా పార్టీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పు పడుతున్నాం..
ఇప్పటికైనా నరేంద్ర మోడీ దిగివచ్చి అమిత్ షాను వెంటనే భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేసారు.
స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ కు వినతి పత్రం అందించారు.

నూతన ఎస్సై కి ఘన సన్మానం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట ఎస్సైగా జక్కుల పరమేష్ ఇటీవల ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్, మాజీ సర్పంచ్ కందగట్ల రవి మర్యా దపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పరకాల ఏఏంసి వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదు నాగరాజు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు చింతల రవిపాల్ పాల్గొన్నారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ ను పరకాల ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మారపల్లి నందం, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గాజె రాజేందర్, సోషల్ మీడియా కన్వీనర్ ధైనంపల్లి సుమన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సామల బిక్షపతి ఎస్సై ని కలిసి శాలువాతో సత్కరించారు.

హామీల అమలులో పాలకుల వైఫల్యం

ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కరువు

ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట,నేటిధాత్రి:

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు.మంగళవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ జిల్లా కమిటీ సమావేశం మహమ్మద్ ఇస్మాయిల్ అధ్యక్షతన నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న గాదగోని రవి మాట్లాడుతూ ఓట్లు సీట్లు అధికారం కోసం అనేక ఆశాజనకమైన హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని అరకొర అమలు చేసి గొప్పగా ప్రచార ఆర్భాటం చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆదానిలాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాల రూపొందిస్తూ హక్కుల కోసం పోరాడే శ్రామికులపై నియంతృత్వంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తుండగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వ వైఫల్యాలను బూచిగా చూపించి ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా ప్రజా పోరాటాలను చేపట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజా ఉద్యమం : పెద్దారపు రమేష్

చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లా పాలకుల వైఫల్యంతో ఎంతో వెనుకబడి ఉన్నదని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలను చేపట్టి అవినీతి అక్రమాలు భూ కబ్జాలపై ఎక్కడికక్కడ స్పందించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా పోరాటాలు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి,మందరవి జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా నాయకులు కుసుంబ బాబూరావు, వంగల రాగసుధ,నాగెల్లి కొంరయ్య, కనకం సంధ్య,మహమ్మద్ రాజాసాహెబ్,కొత్తకొండ రాజమౌళి, సింగతి మల్లికార్జున్,కేశెట్టి సదానందం, గటికె జమున,ఐతమ్ నగేష్,ఎగ్గెని మల్లికార్జున్,ఎల్లబోయిన రాజు,మాలి ప్రభాకర్,అప్పనపురి నరసయ్య,బత్తిని కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version