మరిపెడ నేటిధాత్రి .
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామపంచాయతీలో సోమవారం రాత్రి తాళాలు వేసి ఉన్న రెండు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు, ఇంట్లో వారు తీర్థయాత్రలకు వెళ్లిన సమయం చూసుకొని రాత్రి వేళలో రెండు ఇండ్లలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు, ఇరగని ఉపేందర్, ఇంటిలో ఈ చోరీలో తులంనర బంగారం, పదివేల రూపాయలు నగదు, సుదగాని బాలాజీ ఇంటిలో అర తులం బంగారం పట్టీలు పోయినట్టు బాధితులు తెలిపారు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా,స్థానిక మరిపెడ ఎస్సై గండ్ర సంతోష్ మరియు క్లూస్ టీం వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని విచారణ జరుపుతామని చెప్పారు,త్వరలోనే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని బాధితులకు భరోసానిచ్చారు.