తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో B.+.+. గ్రేడుసాధించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి ప్రయత్నంలోనే గ్రేడ్ సాధించినందుకు గర్వంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ రెహనా ఇప్పత్ తెలియజేస్తూ 9 10వ తేదీల్లో న్యా క్ నిపుణుల బృందం సందర్శించి విద్య ప్రమాణాలను పరిశీలించిందని ఈ సందర్భంగా తెలియజేశారు డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం సంస్థ కార్యదర్శి కే సీత లక్ష్మి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారని గ్రేడ్ సాధించడానికి కీలకంగా వ్యవహరించిన వైస్ ప్రిన్సిపాల్ వి క్యు ఏసి కోఆర్డినేటర్ బోధన బోధనె తర సిబ్బంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వపు విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించిన కళాశాలలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడానికి మార్గం ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి గ్రేడ్ రావడానికి ప్రయత్నించిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు