ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మెడికల్ ఆఫీసర్

*నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు*

*-మెడికల్ ఆఫీసర్ సారియా అంజు*

ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

జ్వరం వచ్చిందని వీధి చివర ఉండే క్లినిక్ వెళ్తున్నారా?
తస్మాత్ జాగ్రత్త..
మీకు ఇంజక్షన్ చేసే డాక్టర్ అసలు డాక్టరేనా? అతను రాసే మందులు నిజంగా మన బాడీకి అవసరమైన అన్నది ఆలోచించండి. ఉన్న రోగం పోతుందో లేదో తెలియదు కానీ కొత్త రోగం రావడం మాత్రం గ్యారెంటీ అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.
రోగులకు చికిత్స చేయాలంటే ఉండాల్సింది ముందు సరైన అవగాహన.తగినంత నాలెడ్జ్.. అన్నింటికంటే కావాల్సింది అనుభవం.కానీ చాలామంది నకిలీ డాక్టర్లుగా చెలామణి అవుతున్న వారికి ఇవేవీ ఉండవు. కానీ ట్రీట్మెంట్ చేసేస్తారు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా తీస్తారు. నిజానికి రూల్స్‌‌‌‌ ప్రకారం ఆర్‌‌‌‌ఎంపీ, పీఎంపీలు ఫస్ట్‌‌‌‌ ఎయిడ్‌‌‌‌ చేసేందుకు మాత్రమే పరిమితం కావాలి. తమ సెంటర్‌‌‌‌కు ప్రథమ చికిత్స కేంద్రం అని బోర్డు మాత్రమే పెట్టుకోవాలి. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు హేవీ డోస్‌‌‌‌ ఇంజక్షన్లు, పెయిన్‌‌‌‌ కిల్లర్స్‌‌‌‌, యాంటీ బయాటిక్స్‌‌‌‌, స్టెరాయిడ్స్‌‌‌‌ ఇచ్చేస్తున్నారు. వీటి వల్ల ఉన్న రోగం తగ్గకపోగా కొత్తగా ఫిట్స్‌‌‌‌ రావడం, బీపీ పెరగడం, తగ్గడం, తల తిరగడం, వాంతులు, ఒంటి నొప్పులు కొత్తగా తయారవుతున్నాయి. ఈ టైమ్‌లో సరైన ట్రీట్‌మెంట్ అందకపోతేమరణమే శరణమవుతుంది.
చాలా రోజులుగా ఆర్ఎంపి, పి.ఎం.పి లపై అధికారుల చూపు తగ్గడంతో ఇష్టాను రీతిలో వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.

*మెడికల్ ఆఫీసర్ తనిఖీ లు…*

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ప్రథమ చికిత్స కేంద్రం మరియు గొల్లపెల్లి లోని అశ్విని ప్రథమ చికిత్స కేంద్రం మరియు మెడికల్ షాపు లో మెడికల్ ఆఫీసర్ తనఖీ నిర్వహించారు. తనిఖీలు ఆర్ఎంపీలు ఉపయోగించకూడనివి లిక్విడ్, సిరంజి లు లభ్యం కావడంతో మెడికల్ ఆఫీసర్ వాటిని సీజ్ చేశారు. అలాగే మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ లేని క్లినిక్ లు మరియు నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ లను నడిపిస్తే చూస్తూ ఊరుకునేది లేదని క్లినిక్ పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న వారిపై ఉక్కు పాదం మోపుతామని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సమాచారం అందిస్తే వాటిని సీజ్ చేస్తామని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!