భద్రాచలం 69 మంది మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ నియామకాలు

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం పట్టణంలోని మారుతీ నర్సింగ్ కళాశాలలో GNM నర్సింగ్ కోర్స్ పూర్తి చేసిన 69 మంది విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ‘ఒమెగా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ – హైదరాబాద్’ లో 32 మందికి, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నందు 17 మంది, ‘భాస్కర మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హైదరాబాద్’లో 20 మందిని ఎంపికై నేడు ఉద్యోగ నియామకాలు చేపట్టినారు.

ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ డా.ఎస్.ఎల్. కాంతారావు, చైర్మన్ డా.బి. సుబ్బరాజు మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులను, అధ్యాపకులను అభినందించినారు. నర్సింగ్ వృత్తి పవిత్రమైందని, విధి నిర్వహణ బాధ్యతతో చేపట్టాలని, స్పెషాలిటీ విభాగాల్లో నైపుణ్యత పెంచుకోవాలని విద్యార్థులకు సూచించినారు.

అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మేము మారుమూల గ్రామాలలో చదివి అతి పేద కుటుంబాల నుండి వచ్చామని, నేడు కార్పోరేట్ హాస్పిటల్స్లో ఉద్యోగ అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యం వారికి మరియు ఓమెగా హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, భాస్కర మెడికల్ కళాశాల & హాస్పిటల్ వారి మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలిపినారు.

డా.ఎస్.ఎల్.కాంతారావు

సెక్రటరీ & కరస్పాండెంట్ మారుతి నర్సింగ్ కళాశాల

ఐ ఎన్ టి యు సి (ఎఫ్) హనుమకొండ జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా సూరం నరసింహ స్వామి నియామకం

హనుమకొండ, నేటిధాత్రి(లీగల్):-

ఐ ఎన్ టి య సి (ఎఫ్) హనుమకొండ జిల్లా లీగల్ సెల్  ప్రెసిడెంట్ గా సూరం నరసింహ స్వామిని మరియు జనరల్ సెక్రటరీ గా కొంతం నాగేశ్వర్ ను నియమిస్తూ ఐ ఎన్ టి యు సి (ఎఫ్) రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ బుద్ధారం మురహరి తేది:-16-01-2025 నాడు ఉత్తర్వులు జారీచేశారు. గత కొంత కాలంగా వీరు కార్మికులకు న్యాయ సహాయం అందిస్తున్నారు. వీరియొక్క సేవలను గుర్తించి వీరిని ఈ పదవులలో  నియమించారు., తమ మీద  నమ్మకంతో తమకు ఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు స్వామీనాథ్ జస్వాల్ జి గారికి మరియు రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ బుధ్ధారం మురహరి గారికి మరియు కార్యవర్గ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వీరి నియామకం పై పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ జన్ను ప్రభాకర్ గుండెపోటుతో ఇటీవల మరణించగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రకాడ సానుభూతి తెలియజేశారు యూత్ అధ్యక్షుడు మర్రిరాజు, అఖిల్, సురేష్, సాల్మన్, ఏలియా, కిషోర్, సిద్దు, సుమన్, హరీష్, పవన్, పోశాలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో పెరిగిపోతున్న కుక్కల బెడద

ఒక్కో గ్రామంలో పదులసంఖ్యలో కుక్కల గుంపులు

పరకాల నేటిధాత్రి
పరకాల మండలంలోని పలు గ్రామాలలో ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేయడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.పలుచోట్ల పాఠశాలకు వెళ్ళే విద్యార్థులపై దాడులకు దిగుతున్నాయని సమాచారం వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఉండే కుక్కలు దారిన పోయే వారిపై దాడి చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి.వాహనాలపై ప్రయాణించే వారిని కుక్కలు గుంపులుగా వెంబడిస్తున్నాయని కుక్కల సమస్యపై గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శులకు,సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు.గతంలో మాదారం శివారులలో మూగజీవాల,పశువుల పై కుక్కలు దాడులు చేస్తుండడంతో పలువురు గాయాలపాలై ఆసుపత్రులకు పరుగులు తీసిన విషయం తెలిసిందే అదిఅలా ఉండగా ద్విచక్ర వాహనాల పై వెళ్లే వారిని వెంబడిస్తుండడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.మండలంలో దాదాపుగా ప్రతి గ్రామంలో సుమారు 20 నుంచి 50 వరకు కుక్కలు ఉన్నట్లు సమాచారం పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే పట్టణంలో పరిసర గ్రామాలలో ఈ పరిస్థితి తెలెత్తుతుంది చెప్పవచ్చు,దీంతో వీధుల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండడంతో చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు.వెంటనే అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నేటిధాత్రి ఎఫెక్ట్‌!

`వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌.

`రెండు సార్లు రాంచంద్రయ్యను సస్పెండ్‌ చేయించిన ఘనత నేటిధాత్రి దే.

`మొదటి సారి నిబంధనలకు విరుద్ధంగా పని చేసి కొలువు పోగొట్టుకున్నాడు.

`ఇప్పుడు అర్థరాత్రి దాక అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి సస్పెండ్‌ అయ్యాడు.

`మొదటి సారి నాలుగు నెలలకే మళ్ళీ కొలువు తెచ్చుకున్నాడు.

`ఇప్పుడూ ఆ ప్రయత్నంలోనే వుంటాడు.

`మళ్ళీ మళ్ళీ కొలువు ఇవ్వడం ఎందుకు?

`అక్రమాలు చేసి పట్టుబడినా ఉద్యోగం ఎందుకిస్తున్నట్లు?

`లంచాలకు మరిగిన వారి కొలువులు శాశ్వతంగా తొలగించరా?

`తాత్కాలిక విరామం ఇచ్చి ఇలాగే మళ్ళీ ఉద్యోగం ఇస్తారా?

`ఉద్యోగులలో భయం లేకపోవడానికి కారణం మళ్ళీ కొలువులు రావడమే!

`ఎంత అవినీతి చేసినా ఉద్యోగిని డిస్మిస్‌ చేయరన్న ధైర్యమే.

`అక్రమ సంపాదనా పరుల కొలువులు తొలగించాలి.

`తప్పు చేయాలంటే చేతులు వణికేలా భయం పుట్టాలి.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ రామచంద్రయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. అవినీతికి తాత రామచంద్రయ్య అనే కథనాన్ని ఇటీవలే నేటిధాత్రి దిన పత్రిక ప్రచురించడం జరిగింది. వైరా సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న రామచంద్రయ్య బారీ అక్రమాలకు పాల్పడుతూ, అక్రమ రిజిస్ట్రేషన్లు సాగిస్తున్న సంగతిని నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది. దాంతో కమీషనర్‌ జ్యోతి బుద్దా ప్రసాద్‌ వరకు సమాచారం చేరడంతో రామచంద్రయ్యను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రామచంద్రయ్య కాకలు తీరిన అవినీతి తిమింగలాల్లో ఒకరని గతంలోనే నేటిధాత్రి ఆయనపై కథనాలు ప్రచురించింది. నేటిధాత్రి దిన పత్రిక గత కొన్నేళ్లుగా రికాంలేని రిజిస్ట్రార్ల పేరుతో సబ్‌ రిజిస్ట్రార్ల అక్రమ రిజిస్ట్రేషన్లపై వరస కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఆ కథనాల మూలంగా చాలా మంది సబ్‌ రిజిస్ట్రార్లు రెడ్‌ హండెడ్‌గా పట్టుబడి కొలువులు కోల్పోయారు. తాజాగా వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ రామచంద్రయ్య మరోసారి సస్పెండ్‌కు గురయ్యారు. రామచంద్రయ్య గతంలోనే శాఖాపరమైన తనికీలలో అక్రమాలు సాగిస్తున్న సంగతి తెలిసి ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. అయితే ఉన్నతాదికారులను ప్రసన్నం చేసుకొని నాలుగు నెలలకే మళ్లీ కొలువుదీరాడు. అయినా ఆయనలో మార్పు రాలేదు. అప్పుడు కూడా నేటిదాత్రి రామచంద్రయ్య సాగిస్తున్న అక్రమ కార్యాకలాపాలపై నేటిదాత్రి కధనాలను అందించింది. స్పందించిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాదికారులు తనికీలు నిర్వహించారు. రామచంద్రయ్య అడ్డంగా దొరికిపోయాడు. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. మళ్లీ అదే పనిగా తన వృత్తి నిర్వహణలో అక్రమాలను సాగిస్తూనే వున్నాడు. గతం కన్నా మించి అక్రమ రిజిస్ట్రేషన్లను చేస్తూ వచ్చారు. ఆఖరుకు అర్ధరాత్రి వరకు కూడా కార్యాలయంలో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలింది. సాక్ష్యాత్తు సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇప్పటికే పలు మార్లు రిజిస్టేషన్‌, రెవిన్యూశాఖల అవినీతి అదికారులను హెచ్చరిస్తూనే వున్నారు. అయినా వారిలో మార్పు రాలేదు. కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా పలు మార్లు హెచ్చరించారు. ఏకంగా మంత్రి హెచ్చరికలనే రామచంద్రయ్య పెడ చెవిన పెట్టాడు. దొరికిపోయాడు. ఇలా రెండుసార్లు ఒక ఉద్యోగిని సస్పెన్షన్‌ చేయించిన ఘనత నేటిదాత్రి దినపత్రికకే దక్కింది. మొదటిసారి ఏకంగా శాఖఫరమైన నిబంధనలనే తుంగలో తొక్కి పిల్ల కళ్లు మూసుకొని పాలు తాగినట్లు అడ్డగోలు వ్యవహరాలు చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఈసారి అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేసి సప్పెండ్‌ అయ్యాడు. అయినా మారుతామన్న నమ్మకం నమ్మకం లేదు. ఒకసారి అవినీతికి అలవాటు పడిన ఏ అధికారి మారినట్లు చరిత్ర లేదు. అవినీతి సంపాదనకు ఎగబడి, అక్రమంగా సంపాదనకు మరిగిన ఉద్యోగులు కొలువులు పోయినా మళ్లీ వస్తాయనే దీమాతోనే పదే పదే లంచాలు తీసుకుంటున్నారు. దొరికినా ఫరవాలేదన్నట్లు బహిరంగంగానే ముడుపులు తీసుకుంటున్నారు. దొరికిపోతున్నారు. అయినా వారిలో తప్పు చేశామన్న భావన కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు కొలువుపోయినా మళ్లీ మళ్లీ వస్తుందన్న మన్మకమే ఉద్యోగులను మరింత విచ్చలవిడి అవినీతికి పాల్పడేందుకు కారణమౌతోంది. ఇప్పుడు కూడా కొలువు మళ్లీ ఎలా పొందాలన్నదానిపైనే రామచంద్రయ్య మళ్లీ లాబీయింగ్‌ మొదలు పెట్టాడు. సస్పెండ్‌ అయినట్లు ఉత్తర్వులు వచ్చిన మరుక్షణం నుంచే మళ్లీ తన కొలువు ఎలా తెచ్చుకోవాలన్నదానిపై ఉన్నతాదికారులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. అయినా ఇలా ఉద్యోగం పోగానే అలా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం అంటే ఎంత దైర్యం వుండాలి. రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాదికారుల వ్యవహారం ఎలా వుందనే అర్దం చేసుకోవాలి. లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరిన వాళ్లూ, అక్రమాలు చేసి ఉద్యోగం కోల్పోయిన వాళ్లకు మళ్లీ ఉద్యోగం ఇచ్చినప్పుడు ఒక కొలువు తొలగించడం ఎందుకు? అటు పట్టుబడి సస్పెన్షన్‌ అయిన వెంటనే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్లు ఆర్డర్‌ కూడా ఇస్తే సరిపోతుంది. అలా కొలువు పోయిన కొన్ని రోజులకే ఇలా మళ్లీ ఉద్యోగం వస్తుంటే అవినీతి ఎందుకు ఆగుతుంది? అదికారులు ఎందుకు మారుతారు? ఎందుకు భయపడతారు? ఉద్యోగం పోతే మళ్లీ రాదన్న భయం వారిలో ఏర్పడాలి. ఒక్కసారి పట్టుబడితే సంపాదించిన ఆస్ధులన్నీ ప్రభుత్వ పరమౌతాయన్న భయం వుండాలి. ఆస్దులు జప్తు చేస్తే తప్ప అదికారులు లంచాలు తీసుకోవాలంటే భయపడరు. ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఉపక్రమించకపోతే అవినీతి ఆగదు. అదికారులు లంచాలు మానరు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొన్ని వందల మంది అక్రమార్కులు దొరికారు. అయినా ఎక్కడా అవినీతి ఆగినట్లుగాని, అదికారులు భయపడుతున్నట్లుగాని లేదు. జరగాల్సిన అవినీతి జరుగుతూనే వుంది. దొరుతున్న వారు దొంగలు. దొరక్కుండా జాగ్రత్త పడుతున్న దొంగలు ఇంకా ఎంతో మంది వున్నారు. వాళ్లంతా లంచం ముట్టుకోవాలంటే భయపడే పరిస్ధితి రావాలి. ఒక్కసారి కొలువుపోతే మళ్లీ జీవితంలో ఉద్యోగం రాదన్న భయం ఏర్పడాలి.

కార్పోరేట్‌ ఆసుపత్రులలో కాళరాత్రులు! ఎపిసోడ్‌-1

‘‘అర్థరాత్రి’’ దాటితే ‘‘క్యూ కట్టే శవాలు’’!

`ఏ ఆసుపత్రి ముందు చూసినా బంధువుల ఆర్థనాదాలు…

`పట్టించుకునే వారు లేక బాధితుల అరణ్య రోదనలుl

`అవి ఆసుపత్రులు కాదు…ప్రాణాలను తోడేస్తున్న రాబందుల నిలయాలు

 

`బతికుండగానే పీక్కు తిని ప్రాణాలు తీస్తున్న నరరూప రాక్షసులు

`వైద్యులు కాదు తెల్ల కోటు ముసుగులో దెయ్యాలు

`వైద్యం పేరుతో పేదల రక్తం మరిగిన పిశాచులు

`వచ్చీ రాని వైద్యులతో వైద్యం చేయిస్తున్నారు

`శంకర్‌ దాదాలతో వైద్యం కానిచ్చేస్తున్నారు

`ప్రైవేటు ఆసుపత్రులకు పట్టిన కాసుల రోగం

`డబ్బు సంపాదనకు మరిగిన ప్రైవేటు ఆసుపత్రుల పైత్యం

`ప్రాణాలు నిలపాల్సిన చోట మృత్యు ఘోషలు

`దేవాలయంలా కొలవాల్సిన చోట బంధువుల శాపనార్థాలు

`నిత్యం వందల ప్రాణాలు తోడేస్తున్నారు

`వైద్యం కోసం వెళ్తే శవాలై వస్తున్నారు

`చిన్న చిన్న ఆపరేషన్లలో ప్రాణాలు పోతున్నాయి

`ఆసుపత్రుల పేరు చెబితే జంకుతున్నారు

`నూకలు బాకి వుంటే బతికొస్తామనుకుంటున్నారు

`వైద్యం పేరుతో ఆస్థులు కొల్లగొడుతున్నారు

`అర్థరాత్రి సమాచారమిచ్చి చనిపోయాడంటున్నారు

`అనుభవం లేని డాక్టర్లతో వైద్యం చేస్తున్నారు

`అందుబాటులో లేని వైద్యుల పేర్లతో బోర్డులు నింపేస్తున్నారు

`నమ్మి వైద్యం కోసం చేరితే ప్రాణాల మీదకు తెస్తున్నారు

`శాయశక్తులా కృషి చేశామని చేతులు దులుపులుకుంటున్నారు

`వైద్య ప్రమాణాలు గాలికి వదిలేశారు

`అధికారులు లంచాలకు అలవాటు పడ్డారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఆసుపత్రులు కాదు…నరకానికి నకళ్లు…వైద్యాలయాలు కాదు..భూతాలకు నిలయాలు..పిశాచాలకు కేంద్రాలు..అవును కడుపు మండిన వాడు ఇలాగే అంటాడు..కష్టాల బారిన పడ్డవాడు ఇలాగే నిందిస్తాడు..క్షణ క్షణం ఆ ఆసుపత్రులను శపిస్తాడు.. నిర్వాహకులపైన దుమ్మెత్తిపోస్తాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా విరామం లేకుండా తిట్ల దండకం అందుకుంటారు…పాపం పండిన నాడు మీ బతుకులు కూడా విగత జీవులైన రోగుల కుటుంబాల కన్నా అద్వాహ్నమైన పరిస్తితులు ఎదుర్కొంటారని , మట్టి కొట్టుకుపోతారని రోధిస్తూ బాదితులు శపిస్తారు. కొన్ని నిజాలు భయంకరంగా వుంటాయి. వరంగల్‌ జిల్లాలో ఆసుపత్రులు సంగతి తెలిస్తే పై ప్రాణాలు పైకే వెళ్తాయి. ఆసుపత్రిలో అడుగు పెట్టగానే ప్రాణాలు పోతాయి. అంతలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పేరుకు మాత్రమే కార్పోరేట్‌ ఆసుపత్రులు. అక్కడ పని చేసేది పదుల సంఖ్యలో మాత్రమే వైద్యులు. బైట ఏర్పాటు చేసే బోర్డులలో వందల సంఖ్యలో వైద్యుల పేర్లుంటాయి. ఆ పేర్లున్న వైద్యులు ఒక్కరు కూడా ఎప్పుడూ వుండవు. వచ్చి వైద్యం చేయరు. చదివేస్తే వున్న మతి పోయినట్లు సగం సగం చదివిన వైద్యులు మాత్రమే వైద్యం చేస్తుంటారు. వైద్యంలో సరిగ్గా మెలుకువలు తెలియని పట్టుభద్రులు చేత మాత్రమే వైద్యం అందిస్తుంటారు. దాంతో నిత్యం వరంగల్‌లోని పేరు మోసిన ఆసుపత్రుల నుంచి నిత్యం అర్ధ రాత్రి దాటిందంటే ఎన్ని శవాలు బైటకు వస్తాయో తెలియదు. ఆసుపత్రుల్లో చేరిన వారు ఎంత మంది బతికి బట్టకడతారో చెప్పలేం. అంత దారుణంగా వైద్య సేవలు అందుతున్నాయంటే పరిస్దితి ఎలా వుందో అర్దం చేసుకోవచ్చు. బైటకు మాత్రం అంతస్దుల మేడలు. మిలమిల మెరుపుతో కూడిన అద్దాల మేడలు. అవి చూడడానికి తప్ప వైద్యం అందించడానికి పనికిరావు. గ్రామీణ ప్రజలకు ఈ విషయాలు ఏమీ తెలియవు. ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైందంటే చాలు ఎలాగైనా మెరుగైన వైద్య చికిత్స చేయించుకోవాలనునే తపనతో నిరక్షరాస్యులైన ప్రజలు ఆ ఆసుపత్రులకు వస్తారు. ఎంత ఖర్చైనా ఫరవాలేదన్న ఆలోచనతో వస్తారు. అలాంటి వాళ్లే ఆ ఆసుప్రతులకు ఆదాయ మార్గాలు. పావలా కోడికి బారాణ మసాల అన్నట్లు వైద్యం సాగిస్తారు. మొదటికే మోసం తెస్తారు. అసలు వైద్యమే సరిగ్గా తెలియని వాళ్లతో ప్రయోగాలు సాగిస్తుంటారు. ఆ వైద్యులకు పట్టాలెవరిచ్చారో..వాళ్లు ఎక్కడ శిక్షణ పొందారో కూడా అర్దం కాదు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్‌ఎంపి వైద్యులకన్నా అద్వాహ్నమైన వైద్యం చేస్తుంటారు. కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో తెల్ల కోటు వేసుకొన్న దెయ్యాలౌతున్నారు. అవును. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారిని ఇంతకన్నా గొప్పగా ఎవరూ కీర్తించరు. నిత్యం ఏదో ఒక ఆసుపత్రి ముందు రోగుల బంధులు ధర్నాలు సాగిస్తూనే వుంటారు. రోధనలు వినిపిస్తూనే వుంటారు. బంధువుల ఆర్తనాదాలలో పూట గడవని ఆసుపత్రి ఒక్కటి కూడా వుండదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత దుర్మార్గంగా వైద్యం అందిస్తున్నారు. ఇంటి దగ్గర వున్నా బతికేవాడేమో? మరో ప్రాంతానికి వెళ్లినా బాగుపడేవారేమో? అనుకుంటూ నిత్యం వరంగల్‌లోని పుట్టగొడుగుల్లా వెలిసిన కార్పోరేట్‌ ఆసుపత్రుల ముందు బంధువుల ఆర్తనాదాలు వింటే తెలుస్తుంది. ఆసుపత్రుల పరిస్టితులు ఎంత దౌర్భాగ్యంగా వున్నాయో అర్ధమౌతుంది. అడిగేవారుండరు. పట్టించుకునేవారుండరు. శవాన్ని ఆసుపత్రి ముందు వేసి కూడా బిల్లు కట్టి శవాన్ని తీసుకెళ్లమంటారు. మానవత్వం మంట గలుపుతుంటారు. వారికి చేతగాని వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వైద్యం కోసం వచ్చిన వారికి ముందు మాయ మాటలు ఎన్నో చెబుతారు. రేపటి కల్లా మార్పు కనిపిస్తుందని చెబుతారు. మరునాడు శవాన్ని చేతుల్లో పెడతాడు. వైద్యం మొదలు పెట్టకముందే ఫీజులు వసూలు చేస్తారు. గంటకోసారి మందుల పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. అయితే ఆ ఆసుపత్రుల్లో సంబంధిత వైద్యానికి వైద్యులు లేకపోయినా అడ్మిట్‌ చేసుకుంటారు. తమకు తెలిసిన చిన్నా చితకా వైద్యం కూడా చేయలేక ప్రాణాలు తీస్తుంటారు. పేరుకు కార్పోరేట్‌ ఆసుపత్రులు…అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ కూడా చేయలేక ఓ వ్యక్తిని ఇటీవలే చంపేశారు. అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ వెనక నుంచి ఆపరేషన్‌ చేసి వరంగల్‌లోని ఓ కార్పోరేట్‌ వైద్యులు వైద్య రంగంలోనే చరిత్ర సృష్టించారు. చిన్న చిన్న క్లినిక్‌లలో కూడా మంచి అనుభవం వున్న వైద్యులు ఎంతో మంది తమ జీవిత కాలంలో కొన్ని వేల అపెండిసైటిస్‌ ఆపరేషన్లు చేసి, ప్రాణాలు కాపాడుతుంటారు. కాని పేరుకు అన్ని రకాల సౌకర్యాలున్నాయని గొప్పలు ప్రచారం చేసుకునే కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో అపెండిసైటిస్‌ ఆపరేషన్లు వికటించి ప్రాణాలు తీస్తున్నారు. ఇక ఫైల్స్‌ లాంటి సమస్యలతో బాదపడేవారిని నాటు వైద్యం చేసేవారు కూడా కాపాడుతుంటారు. ఆ సమస్యలనుంచి గట్టెక్కెస్తుంటారు. అయితే కొంత మంది అలాంటి నాటు వైద్యుల వల్ల ఇతర సమస్యలు ఎదురౌతాయని భయపడి కార్పోరేట్‌ ఆసుపత్రిలో చేరి కూడా ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్దితులు వున్నాయి. ఈ మాత్రం వైద్యం అందించలేని కార్పోరేట్‌ ఆసుపత్రులు వరంగల్‌లో వున్నాయి. అయితే ఇది ఒక్క వరంగల్‌ జిల్లాకే పరిమితం కాదు. తెలంగాణ రాష్ట్రంలో అనేకం వున్నాయి. హైదరాబాద్‌లో కూడా పేరు మోసిన ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి వైద్యమే జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. చల్లదనం కోసం అలవీర జ్యూస్‌ తాగి ఇబ్బంది ఎదురైందని ఆసుపత్రిలో చేరితే వైద్యం అందించక ప్రాణం తీసిన సందర్భాలు కూడా వున్నాయి. ఇలాంటి వాటిని ఆసుపత్రులందామా? మాయదారి వ్యాపారాలందామా? వైద్య విధానంలో ఎన్ని దౌర్భాగ్యాలు అనుసరించాలో అన్ని వరంగల్‌లో అనుసరిస్తుంటారు. నిర్ణీత గడువు ముగిసిన మందులను రోగులకిస్తుంటారు. ఆ హడావుడితో బందువులు కూడా ఆ తేదీలను చూసుకోరు. చదువు రాని వాళ్లు అసలే వాటి గురించి పట్టించుకోరు. ఓ వైపు లక్షలు చెల్లించి ఆసుపత్రిలో చేరిన వారికి కూడా కాలం చెల్లిన మందులతో వైద్యం చేసిన సంఘటలను ఆ మద్య వెలుగులోకి వచ్చాయి. ఇలా ఏదో రకమైన వివాదాలు వరంగల్‌లో వెలుగు చూడడం నిత్య కృత్యమైంది. కానుపు కోసం వచ్చిన వారికి కూడా సరైన చికిత్స అందించే యంత్రాంగం లేక, నిండు గర్భిణీల ప్రాణాలు తీస్తున్న ఆసుపత్రులు కూడ వున్నాయి. నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన వారు ప్రాణాలు పోగొట్టుకొని శవాలుగా ఇండ్లకు చేరుతున్నారు. ఇలాంటి వాటిని ఆసుపత్రుల అనగలమా? ప్రాణాలు తోడేసే రాబంధుల కార్ఖానాలు అనాలి. ఎందుకంటే అక్కడే అలాంటి పిచాశాలు వైద్యం చేస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో వైద్యం కోసం వచ్చిన వారిని బతికుండగానే పీక్కుతినే నరరూప రాక్షసులు అని అనాలి. ఆసుపత్రిలో చేర్చుకునే ముందు రూపాయి తక్కువైనా చేర్చుకోరు. వైద్య అందుతున్న సమయంలో రూపాయి చెల్లించలేమని చెబితే వైద్యం ఆపేసే దుర్మార్గులు. ఎప్పటి బిల్లు అప్పుడు చెల్లిస్తేనే వైద్య పర్యవేక్షణ చేస్తారు. సొమ్ములన్నీ తీసుకున్నా వైద్యం అందించక ప్రాణాలు తీసే రక్త పిశాచులు. అక్కడుండేది తెల్ల కోటు వేసుకున్న కొరివి దెయ్యాలు. వైద్యం పేరుతో రక్తం మరిగిన రక్త పిచాశాలు. శంకర్‌దాదాలను పట్టుకొని వైద్యం సాగిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇది ప్రైవేటు ఆసుపత్రులకు పట్టిన కాసుల రోగం. దానికి ప్రజలు ప్రాణాలు తీయడమే తెలుసు. ప్రాణాలు నిలపడం తెలియని అక్రమ వ్యాపారం. కేవలం డబ్బు సంపాదనకు మరిగిన ప్రైవేటు ఆసుపత్రుల పైత్యానికి వరంగల్‌ ఆసుపత్రులే పరాకాష్ట. ఆసుపత్రిని చూస్తే మొక్కాలనిపించాలి. వైద్యున్ని చూస్తే దండం పెట్టాలనిపించాలి. కాని ఆ ఆసుపత్రులను చూస్తే దుమ్ముత్తిపోయాలని పిస్తుంది. ఆ వైద్యులను చూస్తే కాకిరించి ఉమ్మేయాలని పిస్తుంది. దేవాలయంలా కొలిచే ఆసుపత్రుల ముందు నిత్యం ఎంతో మంది రోగుల బంధువులు రోదిస్తూ, వేధనలతో శాపనార్దాలు పెడుతుంటారు. నిత్యం కార్పోరేట్‌ ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చిన్న చిన్న ఆపరేషన్లకు కూడా ప్రాణాలు తీస్తున్నారు. అందుకే వరంగల్‌ జిల్లా కేంద్రంలో వైద్యమంటేనే జనం జడుసుకుంటున్నారు. ఆసుపత్రుల పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. అర్దరాత్రి సమాచారమిచ్చి శవాన్ని తీసుకుపొమ్మని చావు కబురు చల్లగా చెబుతుంటారు. అయినా అధికారులు కదలరు. అలాంటి ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోరు. లంచాలకు వాళ్లు అలవాట పడపోయారు. ఎంత మంది ప్రజల ప్రాణాలు పోతే అన్ని లంచాలు వస్తాయని వారు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ మరణ మృదంగాలు ఎవరు ఆపాలి. అక్రమ వైద్యాల పని ఎవరు పట్టాలి. వైద్య శాఖ ఎప్పుడు కళ్లు తెరవాలి. ఇంకా ఎంత మంది ప్రాణాల పోవాలి?

…….
కార్పోరేట్‌ ఆసుపత్రులలో కాళరాత్రులు! ఎపిసోడ్‌-2

వరంగల్‌ లో వైద్యమంటే జనం జడుసుకుంటున్నారు.!

`అపెండిసైటిస్‌ ఆపరేషన్లు కూడా చేయలేని దౌర్భాగ్యులు వైద్యం చేస్తున్నారు

`ఫైల్స్‌ ఆపరేషన్లలో కూడా ప్రాణాలు తీస్తున్నారు

`ప్రైవేటు ఆసుపత్రులలో సాగుతున్న మరణ మృదంగాలు

త్వరలో మీ ‘‘నేటిధాత్రి’’లో ఎక్స్‌క్లూజివ్‌గా

నిజాంసాగర్ మండలంలో రేషన్ కార్డుల తనిఖీ: లబ్ధిదారుల వివరాల సేకరణ

కామారెడ్డి జిల్లా/ నిజాం సాగర్ నేటి ధాత్రి:

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామపంచాయతీ , మంగళూరు గ్రామపంచాయతీల పరిధిలో సెక్రటరీలు జ్యోతి, రమ్యశ్రీ, లు శుక్రవారం రేషన్ కార్డుల వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా వారు రేషన్ కార్డులో లబ్ధిదారులు, రేషన్ కార్డులో నమోదు కానీ వారి వివరాలు సేకరించారు. దీంతోపాటు ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా అందించన సంక్షేమఫలాలు తదితర వివరాలను నమోదు చేసుకుని ఉన్నత అధికారులకు వివరాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు పల్లి సెక్రటరీ జ్యోతి, మంగళూరు సెక్రటరీ రమ్యశ్రీ, కారోబార్ నందు, పంచాయతీ వర్కర్స్ సుబ్బురి బాగయ్య, గైని విట్టవ్వ, శ్యామయ్య, తదితరులు ఉన్నారు.

సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మితే కఠిన చర్యలు బైండోవర్ ఎక్సైజ్ సీఐ.

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో కిరాణం వ్యాపారులు సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మితే కఠిన చర్యలు తీసుకొని బైండోవర్ చేస్తామని ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి తెలిపారు. ఎవరైనా 10 కిలోలు గాని ఐదు కిలోలు గాని బెల్లం అడుగుతే వారి యొక్క ఆధార్ సెల్ నెంబర్ తీసుకొని బెల్లం అమ్మకాలు జరపాలని సీఐ కిరాణం వారిని కోరారు పటికీ నవ సాగరం సారా తయారు చేసే వస్తువులు ప్రభుత్వం నిషేధించిందని పై అధికారుల అనుమతి తీసుకొని కేసు నమోదు చేసి తహసిల్దార్ ముందు బైండ్ వర్ చేస్తామని సీఐ హెచ్చరించారు తెల్ల బెల్లం అమ్మకాలపై పండుగలకు శుభకార్యాలకు తెల్ల బెల్లం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని సీఐ కోరారు. గుట్టుచప్పుడు కాకుండా కార్లలో ఇతర వాహనాలలో నల్ల బెల్లం పటికి నవ సాగరం అమ్ముతున్నట్లు తన దృష్టికి వచ్చిందని సీఐ పేర్కొన్నారు . అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు.అర్ధరాత్రి డీసీఎంలు ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో ఆన్లైన్లో నల్ల బెల్లం తెప్పించి కిరాణం వ్యాపారులు అమ్ముతున్నారని తమ దగ్గర సమాచారం ఉన్నదని అలాంటి వారిపై ఆకస్మిక తనిఖీలలో సారా నిషేధిత వస్తువులు దొరికితే బైండ్ వర్ చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుతామని సీఐ హెచ్చరించారు. బెల్లం సారా తయారు చేసే వారికి ఇచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని వారు బెల్లం అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు

ఎస్ఐతో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో బహుజన స్టూడెంట్ యూని యన్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరి గింది.అనంతరం ఎస్సై పరమేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్క రించడంలో విద్యార్థి సంఘాలు పాత్ర అవసరమని అన్నారు. విద్యార్థులను చెడు వ్యస నాలకు బానిస కాకుండా మంచి మార్గంలో తీసుకెళ్లేం దుకు విద్యార్థి సంఘాలు కృషి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా అడ్వకేట్ నాగుల పవన్ కళ్యాణ్, బి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద సురేష్, మండల అధ్యక్షులు పెంబర్తి భరత్, పరకాల రాజకుమార్ మండల ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఏడవ రోజు అర్థనగ్న ప్రదర్శన

నిజాంపేట: నేటి ధాత్రి

గత రెండు సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని నస్కల్ గ్రామస్తులు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఏడవ రోజు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నస్కల్ నుండి నిజాంపేట మండల కేంద్రానికి వెళ్లాలంటే కంకర పోసి వదిలేయడంతో ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ఏడు రోజులు గడుస్తున్నప్పటికీ అధికారుల్లో ప్రజా ప్రతినిధులు ఏలాంటి చలనం లేదన్నారు. రోడ్డు పనులు త్వరలో ప్రారంభించక పోతే దీక్షను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లం యాదవ్, మంగలి నరసింహులు, దొంతరమైనదుర్గయ్య, మెట్టులింగం, దేశెట్టి రాజు, పంగ రాజు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వం పథకాలు ఇందిరమ్మ ఇల్లు 500 గ్యాస్ సిలిండర్ లబ్ది దారులకు

అధికారులు ఎమ్మెల్యే న్యాయం చేయాలి

య౦ఏ ఖాదర్ పాష జనసమితి జిల్లా అధ్యక్షులు

వనపర్తి నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరే విదంగా అధికారులు మంత్రి జుపల్లి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి రాష్ట్ర ప్లానిoగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ని తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు య౦ఏ ఖాదర్ పాష.కోరారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని వి వి ద వార్డు లలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల 500 గ్యాస్ 33 వ వార్డు లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఇంటి ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చెసిన గ్యాస్ సిలిండర్ 500 ప్రజల.కు అందడం లేదనిసర్వే లో ప్రజలు తెలంగాణ జనసమితి దృష్టి కి తెచ్చారని ఖాదర్ తెలిపారు ఈ సందర్భంగా ఖాదర్ పాష మాట్లాడుతూ, కులదరణ సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక జరగాలని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు అందేవిధంగా చూడాలని పాత ఇళ్ల నిర్మాణం ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వన్ని కోరారు. వర్షాకాలంలో ఇల్లు కూలిపోయిన బాధితులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం న్ని డిమాండ్ చేశారు. వనపర్తి లో వివిధ వార్డుల్లో అదికారులు చేపట్టిన సర్వే లలో పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా చేపట్టి అర్హులకు అందరికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రజలకు న్యాయం చేయాల.ని అన్నారు తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుని వెంట సర్వే లో వెంకటస్వామి. సాయిబాబా. మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం ఇసుక రవాణా జరగాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల(నేటి ధాత్రి):

జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మాత్రమే ఇసుక రవాణా జరిగే విధంగా అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ ఉంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇసుక రవాణ పై అధికారులతో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు నది పై మొత్తం 6 ఇసుక రీచ్లకు అవకాశం ఉందని అన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ వద్ద 2 రీచ్, ఎల్లారెడ్డిపేట మండలం పదిర వద్ద 1, సిరిసిల్ల మండలం సర్దాపూర్ వద్ద 1, తంగలపల్లి మండలం చింతపల్లి వద్ద 1, మందపల్లి వద్ద 1 ఉన్నాయని అన్నారు.

కాళేశ్వరం ప్యాకేజీ 17 కేనాల్ లైనింగ్ పనులను పరిశీలించి సమర్పించిన నివేదిక వివరాలను పరిశీలించి 35 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ను సిరిసిల్ల మండలం పెద్దాపూర్ గ్రామం, తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలోనే చెక్ డాం ముంపు ప్రాంతం నుంచి తరలించేందుకు అనుమతి అందించాలని కలెక్టర్ తెలిపారు.
సిరిసిల్ల జిల్లాలో నూతనంగా నిర్మించే ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్ల, పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఎక్కడ ఇసుక కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం వద్ద ఇసుక రీచ్ ఏర్పాటు పై ఇసుక కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు సంయుక్తంగా పరిశీలించి రెండు మూడు రోజుల్లో నివేదిక అందించాలని, అధికారులు నిబంధనల ప్రకారం నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, మైనింగ్ అధికారి క్రాంతి కుమార్, డీ.ఆర్డీ.ఓ శేషాద్రి, జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి, సర్వే ఏడీ వినయ్ కుమార్, మిషన్ భగీరథ ఈఈ జానకి, సిరిసిల్ల తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

మాతా శిశు ఆస్పత్రిపై మంత్రికి నిర్లక్ష్యం ఎందుకో చెప్పాలే

– ఓట్లు వేసి మంత్రిగా చేసిన మంథని ప్రజల కష్టాలు తీర్చరా
– రెండు నెలలుగా డాక్టర్‌ను నియమించలేని దుస్థితి సర్కారుది
– ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలనే కన్పిస్తాంది
– మెరుగైన వైద్యసేవలందించిన చరిత్ర బీఆర్‌ఎస్‌ సర్కార్‌ది
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

ఆడబిడ్డల కాన్పు తల్లిదండ్రులకు భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో ఆనాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మాతా శిశు ఆస్పత్రి నిర్మాణం చేసి మెరుగైన సేవలు అందిస్తే ఈనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆ ఆస్పత్రిపై మంత్రి నిర్లక్ష్యం చేస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. శుక్రవారం మంథని పట్టణంలోని మాతా శిశు ఆస్పత్రిని ఆయన సందర్శించి ఆయా వార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఎంత మంది డాక్టర్లు ఉన్నారని, సిబ్బంది ఎంతమంది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రెండు మాసాలుగా గైనకాలిజిస్ట్‌ వైద్యుల నియామకం జరుగలేదని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం ముఖ్యమంత్రితో కలిసి తిరుగుతున్న మంథని ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలోని మాతా శిశు ఆస్పత్రిలో ఒక వైద్యుడిని నియమించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడికి ఒక పెద్ద పదవి వస్తే ప్రజలు ఎంతో ఆనందిస్తారని, తమకు ఎంతోమేలు జరుగుతుందని ఆశిస్తారని, కానీ ఇక్కడ మాత్రం అందుకు బిన్నంగా జరుగుతోందన్నారు. మంథని ప్రజల ఓట్లతో గెలిచి మంత్రిగా అయిన మంథని ఎమ్మెల్యే మంథని ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని, రెండు నెలలుగా మాతా శిశు ఆస్పత్రిలో ఒక గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ను నియమించడంలో విఫలం అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి హోదాలో ఉండి ఈ ప్రాంత ప్రజలను పురోగతిలోకి తీసుకెళ్లాల్సి ఉండగా అందుకు బిన్నంగా తిరోగమనంలోకి తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు. మంథని ఎమ్మెల్యేను ఐదు సార్లు, ఆయన తండ్రిని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంథని ప్రజలను ఓట్ల యంత్రాలుగానే చూస్తున్నారే తప్ప వారి గురించి ఏనాడు ఆలోచన చేయలేదని అన్నారు. రెండు నెలలుగా వైద్యుడిని నియమించకపోవడం ఎవరి తప్పో ఆలోచన చేయాలన్నారు. తాము ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వాటికి సరైన సమాధానం చెప్పకుండా కింది స్థాయి నాయకులతో తనను దూషించిపిస్తున్నారని, మాతా శిశు ఆస్పత్రి విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆనాడు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంథనిలో మాతా శిశు ఆస్పత్రిని మంజూరీ చేయించి నిర్మించామని, అటుతర్వాత వైద్యులను నియమించి ఈ ప్రాంత ఆడబిడ్డలకు కాన్పులు చేయించామని అన్నారు. సామాజిక వైద్యశాలలో ఆడబిడ్డలు కాన్పులై వేసవికాలంలో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతుంటూ తన ఆడబిడ్డల్లా బావించి ఏసీలు పెట్టించామని, అలాగే మాతా శిశు ఆస్పత్రిలో కూలర్లు అందించామని ఆయన గుర్తు చేశారు. ఈనాడు మంథని ఎమ్మెల్యే మంత్రిఅయ్యారని ఆస్పత్రికి మంచి రోజులు వచ్చాయని, మరిన్నిసౌకర్యాలు మెరుగుపడుతాయని భావిస్తే అందుకు బిన్నంగా ఆస్పత్రిని నిర్లక్ష్యంగా వదిలేశారని ఆయనవాపోయారు. ఒక వైద్యురాలు లేకపోవడంతో ఆస్పత్రిలో సుమారు 20మంది సిబ్బంది ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఎంతో మంది ఆస్పత్రికి వైద్యంకోసం వచ్చి డాక్టర్‌ లేక గోదావరిఖరి, కరీంనగర్‌ లాంటి పట్టణాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంథనికి 30కిలో మీటర్ల దూరంలోనే కలెక్టర్‌ కార్యాలయం ఉందని, అయినా కలెక్టర్‌ ఈ విషయంపై దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. తరచూ ఈ ప్రాంతంలో పర్యటించే కలెక్టర్‌ మాతాశిశు ఆస్పత్రిలో వైద్యుల నియామకం ఎందుకు చేయడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా మంథని ఎమ్మెల్యే స్పందించి మాతా శిశు ఆస్పత్రిలో వెంటనే వైద్యురాలును నియమించి మెరుగైన సేవలుఅందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కామారెడ్డి జిల్లాలో మహిళ హత్య: బంగారు ఆభరణాలు అపహరణ

కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటి ధాత్రి:

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఒంటరిగా నివసిస్తున్న మహిళ హత్యకు గురైంది. మృతురాలి ఒంటిపైన ఉన్న నగలను హంతకులు అపహరించారు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్ గల్ గ్రామానికి చెందిన గొరిగే సత్యవ్వ (55) తన ఇంటిలోనే హత్యకు గురైంది. గురువారం సాయంత్రం సత్యవ్వ అన్న పాపుగొండ సత్యవ పొద్దున్నుంచి కనిపించడం లేదని ఆమె ఇంటికి వెళ్లి చూడగా సత్యవ్వ ఇంట్లో చనిపోయి ఉంది. ఆమె ముక్కునుండి నోటి నుండి రక్తం కారి దుర్వాసన వస్తున్నట్టు గుర్తించారు. అని ఆమె ఒంటిపై ఉన్న నగలు కనిపించలేదు దానితో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సత్యవ్వ ఒంటరిగా ఉన్నది చూసి ఆమెను చంపి అట్టి బంగారాభరణాలు ఎత్తుకుపోయి ఉంటారు అని మృతురాలి అన్న గొరిగే పాపు గొండ ఫిర్యాదు ఇవ్వగ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పిట్లం పోలీసులు తెలిపారు.

ఒకేఒక్కడు’లో అర్జున్లా నల్లగొండ జిల్లా కలెక్టర్‌

నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం.

హైదరాబాద్,నేటిటిధాత్రి:

ఒకేఒక్కడు’ సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్జున్ కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటాడు.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అధికారులను, ఉద్యోగులను ఏమాత్రం ఉపేక్షించకుండా ఊస్టింగ్ ఆర్డర్ ఇస్తుంటాడు.అదే తరహాలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా ఇంచుమించు ఇలాంటి నిర్ణయమే తీసుకుని వార్తల్లో నిలిచారు.విధుల్లో అలసత్వం వహించిన పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 100 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 100 మంది పంచాయతీ కార్యదర్శులు ఆరు నెలల పాటు చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరు అవడంపై వివరణ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. కొంతమంది పంచాయతీ కార్యదర్శులు అనారోగ్యం పేరుతో విధులకు గైర్హాజరు అయి కూడా జీతాలు తీసుకున్నట్లు కలెక్టర్ విచారణలో బట్టబయలైంది.ఈ పంచాయతీ కార్యదర్శుల్లో కొందరు వాళ్ల పోస్టింగ్ కోసం జిల్లా పాలనాధికారి మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది. టీఎన్జీవో సంఘం డీపీఓ ఆఫీస్ను గుప్పిట్లో పెట్టుకుని పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం చేయడం మానేసి.. రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారని కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటి పన్నులు వసూలు చేసి చలాన్ కట్టకుండా కార్యదర్శులు సొంతానికి వాడుకున్నారని జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు అందాయి. డబుల్ రసీదు పుస్తకాలు మెయింటెనెన్స్ గురించి అడిగే వారు ఎవరూ లేకపోవడంతో ఆన్లైన్లో తక్కువ చూపించి ఆఫ్లైన్లో ఎక్కువ వసూలు చేసి అధికారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.కలెక్టర్ అనుమతి లేకుండా పంచాయతీ కార్యదర్శులు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఎంబీ (మెజర్మెంట్ బుక్) రికార్డ్ చేశారని ఆరోపణలున్నాయని, ఇలా చేయడం చట్ట విరుద్ధమని కలెక్టర్ మండిపడ్డారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న నల్గొండ జిల్లాలోని కొందరు అధికారుల భరతం పట్టి, అధికార యంత్రాంగాన్ని గాడిన పెట్టేందుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేస్తున్న ప్రయత్నంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరిని గ్రామ సభ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

మరిపెడ నేటిధాత్రి.

కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రవేశపెట్టబోయే రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డులు భూమిలేని రైతు కూలీలకు కూలి భరోసా మొదలగు సంక్షేమ పథకాలు జనవరి 26వ తారీఖున ప్రారంభమయ్య పథకాలన్నిటికీ గ్రామ సభలో అధికారులు పారదర్శకత పాటించి అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని అధికారులకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సహకరించాలని పార్టీలకు అతీతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారుల జాబితాలను గ్రామసభలో పారదర్శకత పాటించి అర్హులైన ప్రతివారికి ఎంపిక చేయాలని అదేవిధంగా వాన కాలంలో రైతు భరోసా ఆగి నందుకు దానిని కూడా కలిపి ఏకకాలంలో రెండు పంటల రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయాలి ఇందిరమ్మ ఇండ్లను గ్రామ సభ ద్వారా అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలి భూమిలేని కూలీలకు ఇచ్చే భరోసా పథకాన్ని ఉపాధి హామీ పనిని 20 రోజులు కనీసం చేయని వారిని కూడా ఈ పథకంలో లబ్ధి దారులుగా చేకూర్చి వారికి ఈ పథకాన్ని కూడా వర్తింప చేయాలి,నూతన రేషన్ కార్డులను ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న కొంతమందికి పేర్లు నూతన రేషన్ కార్డులలో జాబితాలో రాలేదు వాటిని కూడా అధికారులు పున పరిశీలించి అందరి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు మంజూరు అయ్యే విధంగా చూడాలని కోరడం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న ఏఐటీయూసీ నాయకులు నారాయణ అంజి తదితరులు పాల్గొన్నారు.

ఐ ఎన్ టి యు సి (ఎఫ్) లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ గా నరసింహరములు నియామకం

హనుమకొండ, నేటిధాత్రి(లీగల్):-

ఐ ఎన్ టి య సి (ఎఫ్) తెలంగాణ 11 జిల్లాల లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ గా పోరెండ్ల నరసింహ రాములును నియమిస్తూ ఐ ఎన్ టి యు సి (ఎఫ్) జాతీయ అద్యక్షులు స్వామినాథ్ జైస్వాల్ జి 01-01-2025 నాడు ఉత్తర్వులు జారీచేశారు. హసన్ పర్తి కి చెందిన పోరెండ్ల నరసింహా రాములు గారు గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి వరంగల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు, తన మీద నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు స్వామీనాథ్ జస్వాల్ జి గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వీరి నియకం పై పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్ త్రిబుల్ ఆర్ వస్తువుల సేకరణ

కాప్రా నేటిధాత్రి 17;

కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ ఆదేశాల మేరకు స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్ 2024 ,కాప్రా డివిజన్ ,సి.ఎస్. నగర్, మల్లికార్జున్ నగర్ ,శివ సాయి నగర్ కాలనీలో, శానిటేషన్ విభాగము సిబ్బంది, ప్రత్యేక వాహనంతో త్రిబుల్ ఆర్ వస్తువుల సేకరణ చేశారు .ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ,పాత పుస్తకాలు ,బట్టలు, పాత సైకిళ్ళు ,ప్లాస్టిక్ బాటిల్స్, సేకరించడం జరిగింది .కాప్రా డివిజన్ సి ఎస్ ఆర్ నగర్ మరియు శివ సాయి నగర్ కాలనీలలో కాలనీ అసోసియేషన్ వారు పాల్గొని వీధి వీధి తిరిగి అవగాహన కల్పిస్తూ వస్తువులను సేకరించారు.


ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన మెటీరియల్ అనగా పాత పుస్తకాలు, ప్లాస్టిక్ బాటిల్స్, పాత సైకిళ్లు, కూలర్, స్వెటర్స్, మరియు రకరకాల వస్తువులను సేకరించి కాప్రా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ సాకేత్ యందు ఏర్పాటుచేసిన త్రిబుల్ ఆర్ సెంటర్ కు చేరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి ఎస్ నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూజ, మరియు అసోసియేషన్ సభ్యులు శివ సాయి నగర్కు జగదీష్, మల్లికార్జున్ నగర్ కు సంబంధించిన అసోసియేషన్ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ సానిటరీ జవాన్ కృష్ణ, అశోక్ ఇంచార్జ్ ఎస్ ఎఫ్ ఏ అంజలి ఎస్ ఎఫ్ ఏ అరవింద్, సునీల్ మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఏఐకేఎంఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలి

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచర్ల బాలరాజు.

న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రెండు సంస్థల విలీనం సందర్భంగా ఈనెల 19 న రాష్ట్ర జనరల్ కౌన్సిల్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగనున్నదని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచర్ల బాలరాజు తెలిపారు.నర్సంపేట పట్టణంలోని న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఏఐకేఎంఎస్ నాయకులు కార్యకర్తలు కరపత్రం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాచర్ల బాలరాజు మాట్లాడుతూ వ్యవసాయక విప్లవం ఇరుసుగా కలిగిన నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం పోరాడుతూ భావ సారూప్యం కలిగినటువంటి వివిధ విప్లవ రైతాంగ సంఘాల విలీనం కోసం గత కొన్ని సంవత్సరాలుగా కృషి జరుగుతుందని ఈ క్రమంలోనే రెండు,వేర్వేరు నిర్మాణాలు కలిగిన ఏఐకేఎంఎస్ సంస్థలు విలీనం కావడానికి ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు.ఈ సభ ప్రారంభంకు ముందు ఉదయం 10 గం. ఓసి క్లబ్ నుండి గంగపుత్ర సంఘం భవనం వరకు ర్యాలీ ఉంటుందని , గంగపుత్ర భవనంలో కౌన్సిల్ ప్రారంభమవుతుందని సభకు అధ్యక్ష వర్గంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు వి.కోటేశ్వరరావు ,మామిడాల బిక్షపతి వ్యవహరిస్తారని ప్రధాన వర్తగా ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య హాజరై ప్రసంగిస్తారని ఇంకా ఈ సభలో ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు చిట్టి పార్టీ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, గౌని ఐలయ్య ప్రసంగిస్తారని తెలుపుతూ
ఈ సభను జయప్రదం చేయాలని నాయకులు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాడ అశోక్, గుగులోతు భద్రాజి, రమేష్, భీమగాని మల్లయ్య, ఎన్ సూరయ్య, ఆకుతోట రాజు, చిరంజీవి, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క, పివైఎల్ జిల్లా నాయకులు రంజిత్, పిడిఎస్యు నాయకులు అజయ్, ఐఎఫ్టియు నాయకులు అశోక్, వేముల వెంకన్న, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

నూతన ఎస్సై సాంబమూర్తి ని కలిసిన సిపిఐ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలో నూతన ఎస్సైగా విధుల్లోకి చేరిన మచ్చ సాంబమూర్తి ని మర్యాద పూర్వకంగా సిపిఐ పట్టణ నాయకులు కలిశారు. ఈ సందర్బంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ శాలువా కప్పి పులా బొకే ను అందజేశారు. అనంతరం ట్రాఫిక్, ఫ్లెక్సీ ల సమస్యలను ఎస్సై సాంబమూర్తి దృష్టికి తీసుకుపోయారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజు సతీష్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, గడ్డం సింహాద్రి, గోనేల తిరుపతి, కునూరి భగత్, ఐలి శరత్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version