నిజాంపేట: నేటి ధాత్రి
గత రెండు సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని నస్కల్ గ్రామస్తులు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఏడవ రోజు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నస్కల్ నుండి నిజాంపేట మండల కేంద్రానికి వెళ్లాలంటే కంకర పోసి వదిలేయడంతో ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ఏడు రోజులు గడుస్తున్నప్పటికీ అధికారుల్లో ప్రజా ప్రతినిధులు ఏలాంటి చలనం లేదన్నారు. రోడ్డు పనులు త్వరలో ప్రారంభించక పోతే దీక్షను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లం యాదవ్, మంగలి నరసింహులు, దొంతరమైనదుర్గయ్య, మెట్టులింగం, దేశెట్టి రాజు, పంగ రాజు తదితరులు పాల్గొన్నారు