ఖాలి స్థలం కబ్జాకు యత్నం..?

ప్రహరీ గోడ కూల్చిన వ్యక్తిపై కేసు నమోదు

స్థలం కోర్టు వివాదంలో ఉందంటూ కబ్జా ప్రయత్నం చేసిన ఘనుడు

వరంగల్, నేటిధాత్రి

వరంగల్ నగరం బాలాజీనగర్ దగ్గరలో గల స్థలం వివాదంలో ఉందంటూ, దేశాయిపేట ప్రాంతంలో లక్షల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా బోర్డు పాతాడు కోట సతీష్ అనే వ్యక్తి పేరుతో. ప్రధాన పార్టీలో ఓబీసీ మొర్చా జిల్లా ఉపాధ్యకుడినంటూ ఈ కబ్జా తతంగానికి తెర లేపాడు అని బాధితుడి ఆవేదన. కాశీబుగ్గకు చెందిన వ్యక్తి 20వ డివిజన్లో ప్రధాన జాతీయ పార్టీ నాయకుడుగా ప్రచారమవుతూ కబ్జాలు చేస్తునట్టు తెలిపిన బాధితుడు. దేశాయిపేట నుండి ఏనుమాముల మార్కేట్ కు వెళ్ళే ప్రధాన రహదారిలో దాదాపు లక్షల రూపాయల విలువైన భూమిలో పాగా వేసినట్టు బాధితుడు మీడియాకు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సర్వెనంబర్ 271/ఏ లో 85 గజాల స్థలం ఈ నెల 4న రిజిస్ట్రేషన్ చేసుకున్నానన్న బాధితుడు, అట్టి స్ధలంలో 2022వ సంవత్సరంలో ఆ స్థలం కోర్టు వివాదంలో ఉందంటూ అందరినీ తప్పుతోవ పట్టించి, పోలీసులకు బయనా పత్రాలు చూపెట్టి నమ్మించే ప్రయత్నం చేశాడని, నిర్మించిన ప్రహారి గోడను సైతం కూల్చి, బోర్డు పాతి వెళ్ళాడని, అందుకు లక్ష రూపాయల అస్థి నష్టంతో పాటు, స్థలం వివాదంలో ఉంటే ఎవరూ కోనుగోలు చేయరని, నష్ట పరిహారం చెల్లించే విధంగా పొలీసులు చర్యలు తీసుకుని, అక్రమంగా గోడను కూల్చిన బీజేపీ నాయకుడు ఆయిన కోట సతీష్ పై కేసు నమోదు చేయాలంటూ ఏనుమముల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. పూర్తీ వివరాలు సేకరించిన ఎనుమామూల పోలీసు స్టేషన్ ఎస్సై రాజు కేసు ఎఫ్ఐఆర్ (14/2025) నమోదు చేసినట్టు బాధితుడు తెలిపాడు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ నేత

కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి:

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆద్వర్యంలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన బిసి మేదావుల సదస్సులో తెలంగాణ బీసీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని,స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను బిసిలకు కేటాయించాలని , ఉద్యోగులకు సీ.పి.యస్. విధానాన్ని తొలగించి ఓ.పి.యస్. తీసుకురావాలని ఉద్యోగులకు ఓ.పీ.యస్. పెన్షన్ సౌకర్యం కల్పించాలని, 317 జి.ఓ. భాదిత ఉద్యోగులకు న్యాయం చేయాలని, కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్, మొదలైన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని,
బిసి ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లను కల్పించాలని, అందుకు అవసరం అయితే రాజ్యాంగం మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, తెలంగాణ బీసీ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, కామారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు చింతల శంకర్, అఖిల పక్ష ప్రజా ప్రతినిధులు ఉద్యోగ ఉపాధ్యాయులు, న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ పార్టీల ప్రతినిధుల కుల సంఘాల బాధ్యులు, ప్రజా సంఘాల నేతలు, సమాజ సేవకులు, మీడియా ప్రతినిధులు, మహిళా యువజన విద్యార్థి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి.

టిడిపి 14వ డివిజన్ అధ్యక్షుడు పాశికంటి రమేష్

నేటిధాత్రి, వరంగల్

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ అధ్యక్షుడు పాశికంటి రమేష్ పిలుపునిచ్చారు. శనివారం ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పాషికంటి రమేష్ తోపాటు టిడిపి నాయకులు, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పాశికంటి రమేష్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి రాజకీయ అవకాశాలు లభించాయన్నారు. నేడు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఎంతోమంది నాయకులకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుతం పాలకులు కొనసాగిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. ఎన్టీ రామారావు పేరు మీద 25 సంవత్సరాల క్రితం వెలసిన ఎన్టీఆర్ నగర్ కాలనీకి నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాల సహకరించిన విషయాన్ని గ్రామ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వడ్నాల నరేందర్ బీసీ సెల్ సీనియర్ నాయకుడు ముండ్రాతి శరత్ బాబు, సీనియర్ నాయకుడు లాసాని నరసింగరావు, స్థానిక నాయకులు కొత్తపల్లి యాదగిరి, అడుప మహేష్, బొల్లం నరేష్ కర్రు రాజేందర్, ఎల్లంశెట్టి వీరస్వామి, బొల్లం భాగ్య, తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 3న నర్సాపురం కాంప్లెక్స్ లో పాఠశాల స్థాయి బాలమేళా

భద్రాచలం నేటిదాత్రి

జిల్లా కలెక్టర్ గారి చొరవతో జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు మేరకు ఫిబ్రవరి 3 మూడవ తేదీన నరసాపురం కాంప్లెక్స్ పరిధిలోని 24 పాఠశాలలో ఒకేరోజు పండగ వాతావరణాన్ని మైమరిపించే విధంగా పాఠశాల స్థాయి బాలమేళాను నిర్వహిస్తున్నట్టు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్ బెక్కంటి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

కాంప్లెక్స్ పరిధిలోని 24 పాఠశాలలో ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థుల అభ్యసనా స్థాయి లో FLN అనుగుణంగా జ్ఞానము, నైపుణ్యాలను పెంపొందించే విధంగా సుజనాత్మకతను ప్రోత్సహిస్తూ సాంస్కృతిక, క్రీడల, కళ లలో విభిన్న నేపథ్యాలను పరిగణాలలోనికి తీసుకుంటూ విద్యార్థుల కేంద్రంగా చేసుకుంటూ విద్యార్థుల ఆలోచన చేసే దిశగా శిక్షణ ఇచ్చి బాలమేళాలను నిర్వహించాలని బెక్కంటి సూచించారు.

పాఠశాల స్థాయిలో నిర్వహించే బాలమేళాలో తరగతి వారీగా తెలుగు గణితం ఇంగ్లీష్ అంశాలలో ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేసి బహుమతి ప్రధానోత్సవాలను పాఠశాల స్థాయిలో నిర్వహించాలి.
పాఠశాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా మరియు కాంప్లెక్స్ స్థాయిలో పోటీలకు తీసుకురావాలని కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో శనివారం నాడు నర్సాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలమేల ఈ వర్క్ షాప్ లో రిసోర్స్ పర్సన్స్ గా కారంపూడి దశం బాబు, చిగురుమల శ్రీనివాస్, ఎం కిషన్, ఎన్.అశాలత, బి శ్రీనివాస్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

చిగురుమల్ల శ్రీనివాస్, ఇన్చార్జి పాఠశాలలు, గుర్రాల బైలు, బొజ్జి గొప్ప, కౌలూరు గూడెం, నాగన్న గుంపు, లచ్చి గూడెం,

మాలోతు కిషన్ ఇంచార్జ్ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాల నడికుడి,ప్రాథమిక పాఠశాల ధర్మాపురం,ప్రాథమిక పాఠశాల డి కొత్తగూడం, ప్రాథమిక పాఠశాల నందులచలక

బి శ్రీనివాస్ ఇంచార్జి పాఠశాలలు, సీతారాంపురం, జెడ్ రేగుబల్లి, ఒడ్డు గుంపు , కే దంతనం, నరసాపురం,రామారావుపేట

కే దశంబాబు ఇన్చార్జి పాఠశాలలు అంబేద్కర్ కాలనీ, రామకృష్ణాపురం, వైట్ నగరం, బండారుగూడెం,
వి శ్రీనివాసరావు పరిధిలో పాత మారేడుబాక సింగారం,పెదపాడు, కే మారేడు బాకా, పౌలూరిపేట

ఒకటవ తరగతిలో ఇంగ్లీష్ వర్ణమాల ప్రదర్శన దృష్టి పదాల సరిపోలిక లెటర్ ట్రేసింగ్ స్టేషన్, చిత్ర చిత్రపటనం
నంబర్ లైన్ నడక కౌంటింగ్ పూసలు అదనపు స్టేషన్, నమూనా ప్లే
తెలుగు అక్షర గుర్తింపు వర్డ్ బిల్డింగ్, కథా పఠనం, రైటింగ్ ప్రాక్టీస్

రెండవ తరగతి లో ఇంగ్లీష్
వర్డ్ వాల్ , వాక్య నిర్మాణం, ప్రాస పదాలు,డిక్టేషన్ ఫన్
గణితం : 1. స్థల విలువ చార్ట్, సమయం చెప్పడం, డబ్బు విషయాలు, లెక్కింపును దాటవేయు.
తెలుగు:
సాధారణ పదాలను చదవడం, పిక్చర్ వర్డ్ మ్యాచింగ్, అక్షర రచన, రైమ్స్ రీసైటల్.
3వ తరగతి
ఇంగ్లీష్
పేరాగ్రాఫ్ పఠనం వ్యాకరణ వినోదం స్టోరీ మ్యాప్ స్టోరీ మ్యాపింగ్,పద బింగో లేఖ రాయడం.
గణితం :
గుణకార ఆటలు,భిన్నం వినోదం, కొలత బూత్, డేటా హ్యాండ్లింగ్, సమస్య పరిష్కారం
తెలుగు :
వాక్యాలను చదవడం, పదనిర్మాణం చిక్కు సమస్యలు, వ్యాసరచన. కథ చెప్పడం.
4వ తరగతి
ఇంగ్లీష్:
స్పీచ్ గేమ్ మొక్క భాగాలు, పటనపటిమ,స్టోరీ మ్యాపింగ్, నిఘంటువు వేట.
గణితం :
విభజన వినోదం, జామెట్రి కమర్, డబ్బు సమస్యలు, టైం పజిల్స్, క్షణరూప కళ
తెలుగు :
రీడింగ్ కాంప్రహెన్షన్, సామెత సరిపోలిక వ్యాసరచన, డైలాగ్ ప్రాక్టీస్, స్టోరీ స్క్రిప్టింగ్.
5వ తరగతి
ఇంగ్లీష్ :
పద్య పఠనం, అధునాతన గ్రహణ శక్తి చర్య, చర్య, పుస్తక సమీక్ష, పదాల గేమ్
గణితం :
ప్రాంతం చుట్టుకొలత, గ్రాఫ్ వివరణ, సమస్య పరిష్కారం పజిల్ & నమూనాలు, దశాంశ వినోదం.
తెలుగు :
పఠన పటిమ, సృజనాత్మక రచన, వాడుకలో ఉన్న సామెతలు, డైలాగ్ రైటింగ్, గ్రూప్ స్టోరీ టెల్లింగ్

ఈ పోటీలుకాంప్లెక్స్ స్తాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలలో నిర్వహించబడును..

కేసుల విచారణలో పారదర్శకత, వేగవంతం చేయాలి

జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

కేసుల విచారణలో పారదర్శకత, వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు కోర్టు డ్యూటీ అధికారులు మరియు కోర్టు లైజన్ అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసుల విచారణలో పారదర్శకత, వేగం, మరియు న్యాయ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే, కోర్టు సంబంధిత రికార్డుల నిర్వహణ, సమన్లు, వారంట్లు అమలు చేయడం, మరియు కేసులపై సమయానికి నివేదికలు సమర్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.నేరస్థులకు కచ్చితంగా శిక్ష పడేటట్టు చూడాలని అన్నారు.
జిల్లా పోలీసుల పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన మార్గదర్శకాలు మరియు సలహాలను ఈ సమీక్ష సమావేశంలో వివరించారు.

ఈ కార్యక్రమంలో డీ ఎస్స్పీ వెంకటేశ్వర్లు, డీసీ ఆర్ బీ డీ ఎస్స్పీ రమణా రెడ్డి, వర్టికల్ డీ ఎస్స్పీ సుదర్శన్ మరియు ఇతర సిబ్బంది పి ఆర్ ఓ పాల్గొన్నారు..

నర్సంపేటలో బడా బాబులకే భరోసా..?

పేదోళ్లకు ఒక న్యాయం?… ఉన్నోళ్ళకు ఒక న్యాయం?..!

నిబంధనలకు విరుద్ధంగా భవన అక్రమ కట్టడాలు..

భవన నిర్మాణ హద్దులను తుంగలో తొక్కిన వైనం..

*అక్రమ భవన నిర్మాణ సెట్ బ్యాక్ పట్ల
మున్సిపల్ అధికారుల ఆంతర్యమేమిటి..?*

అక్రమ కట్టడం పట్ల నోటీసులు ఇచ్చిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు..

అధికారుల డిమాండ్ నోటీసులకు విలువ లేదా..?

అక్రమ కట్టడాలపై అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న పట్టణ పేద ప్రజలు.

బిల్డింగ్ నిర్మాణాలు ఆపాలని నోటీసులు ఇచ్చాం..

నోటీసులు ఇచ్చినం త్వరలో తీసుకుంటాం..

నర్సంపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సంధ్యారాణి.

నర్సంపేట నేటిధాత్రి:

*నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ధనికుల రాజ్యమే నడుస్తున్నది. వారు చెప్పిందే అధికారులు వినాలి. వారు చేస్తున్నది అధికారులు వేచి చూడాలి. పేదవాళ్లకు నష్టం జరిగిన మాకు సంబంధం లేదు. భవన నిర్మాణాలు ప్రభుత్వ నిబంధన వేరకు నిర్మించం. మాకు నచ్చిన విధంగానే కట్టడాలు చేపడతాం.మాకు పలుకుబడి,డబ్బు ఉన్నది. నిర్మాణం సమయంలో భవన సెట్ బ్యాక్ పట్ల మున్సిపల్ సిబ్బందికి సంబంధం ఉండదు.ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోరు.పేదోళ్లు ఒక్క ఇటుక పెడ్డ గోడ మొదలుపెట్టిన చాలు ఈగల్లా వాలిపోయి ఎలాంటి వాటినైనా కూల్చేస్తారు. ఇది నర్సంపేటలో జరుగుతున్న మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యపు వ్యవహారమని అందులో ఉన్న ఆంతర్యము ఏమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నర్సంపేటలో బడా బాబులకే భరోసా కల్పిస్తున్నారని..? పేదోళ్లకు ఒక న్యాయం… ఉన్నోళ్ళకు ఒక న్యాయం..! అని అన్నట్లుగా ఉందని పట్టణ ప్రజలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారం మొత్తం నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డుకు గల ఒక కార్పొరేట్ స్థాయి భవనం నిర్మాణం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతూ ఉండడం పట్ల వివిధ రకాల ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు నెక్కొండ రోడ్డు కు గల గ్రీన్ ల్యాండ్ పార్కు వెనుక భాగంలో కార్పొరేట్ స్థాయి భవనాన్ని మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేస్తున్నారని పట్టణ ప్రజలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నారు. ఆ భవనానికి 30 ఫీట్ల రోడ్డు ఉండగా రోడ్డు నుండి సెట్ బ్యాక్ తో మూడు మీటర్ల దూరం ఉండాల్సి ఉంటుంది. అలాగే భవనానికి మూడు వైపుల రెండు మీటర్లు సెట్ బ్యాక్ ఉండాల్సి ఉంది. కానీ వారి యొక్క పలకబడితో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కే సెట్ బ్యాక్ ఉండాల్సిన భూమిని కూడా భవన నిర్మాణంలోని కలిపి సెట్ బ్యాక్ లేకుండా కార్పొరేట్ స్థాయి భవనాన్ని నిర్మాణం చేపడుతున్నారని ఆరోపణలు ఎదురైతున్నాయి. ఇది సంబంధిత మున్సిపల్ అధికారులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మిడిల్ క్లాస్ నుండి పేద ప్రజలు వాళ్లు ఆవాసం పొందేందుకు చిన్న చిన్న ఇండ్లు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే గద్దల్ల వాలిపోయే మున్సిపల్ సిబ్బంది ఇది లేదు అది లేదు. ఇది తక్కువ ఉంది అది తక్కువ ఉంది. ఇది నిబంధనలకు వ్యతిరేకంగా కడుతున్నారు అంటూ కూల్చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బడాబాబులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే మున్సిపల్ అధికారులు వారికే భరోసా ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.పట్టణ ప్రకృతివనం వెనుక నిర్మిస్తున్న కార్పొరేట్ స్థాయి భవనం నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని మున్సిపల్ అధికారులకు తెలిసినప్పటికీ తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని దీనిపట్ల సంబంధిత భవన నిర్మాణ
యాజమాన్యం,అధికారుల మధ్య ఉన్న ఆంతర్యం ఏమిటో అని పట్టణ ప్రజలు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.ఐనప్పటికీ నిర్మాణ పనులు మాత్రం చకచక నడుస్తున్నాయని ఆ అక్రమ నిర్మాణ పనులు మున్సిపాలిటీ అధికారులకు,సిబ్బంది కనబడుట లేదా అని పట్టణ ప్రజలు,ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారుల తీరుపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.ఇప్పటిపైన సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న భవన నిర్మాణానికి చెక్ పెట్టాలని పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ అధికారులు బడా బాబులకే ప్రాధాన్యత ఇస్తున్నారని అనే ఆరోపణలు కొట్టిపడేసేలా చర్యలు చేపట్టినా లేదా అన్ని వేచిచూడాల్సిందే..!

నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ పనులు..

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని నెక్కొండ రోడ్ గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనక భాగంలో భవనం నిర్మాణం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుపుతున్నారు.సమాచారం మేరకు
నిర్మాణ పనులను పరిశీలన చేసినం అని మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిని సంధ్యారాణి తెలిపారు.

షోకాజ్ నోటీసులు ఇచ్చనం..

నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణం పనులను ఆపాలని సంబంధిత యజమానికి షోకాజ్ నోటీసులు ఇచ్చాము.గడువు లోపు వివరణ ఇవ్వాలి లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని
మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిని సంధ్యారాణి వివరణ ఇచ్చారు.

కమిషనర్ ఆదేశాలతో చర్యలు తీసుకుంటాం.

నెక్కొండ రోడ్డుకు గల గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనుక భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు.అది నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని మా దృష్టికి వచ్చింది.మా సిబ్బంది వెళ్లి పరిశీలన చేశారు.వాస్తవమే అని తేలింది.సంబంధిత యజమానికి మున్సిపాలిటీ సిబ్బందితో నోటీసులు అందజేశాం.మున్సిపాలిటీ కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాము అని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారి వీరస్వామి గౌడ్ వివరణ ఇచ్చారు.

సనాతన ధర్మానికి ప్రతీక మహాకుంభమేళా.!

https://epaper.netidhatri.com/view/487/netidhathri-e-paper-19th-jan-2025

-ఐదు రకాల కుంభమేళాలు.

-గురు, సూర్యచంద్రుల సూర్యచంద్రుల స్థానాలను బట్టి.

-మహా కుంభమేళాలో పుణ్య తిధులు.

-40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా.

-అప్రతిష్ట పాలు చేసేందుకు కుయుక్తులు.

-పాకిస్తాన్‌ ఏడుపు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. పురాతన కాలంనుంచి అవిచ్ఛినంగా కొనసాగుతూ వస్తున్న భారతీయ సనాతనధర్మ సం స్కృతికి ప్రతీక. అత్యంత చైతన్యశీలమైన మేళా మనదేశంలో జరిగే ఆధ్యాత్మిక సమ్మేళనాలు లేదా కార్యక్రమాలన్నింటికీ తలమానికం. శ్రీమద్భాగవతం, మహాభారతం, విష్ణుపురాల్లో ఈ కుంభమేళా గురించిన ప్రస్తావన వుంది. కుంభమేళా ఏవిధంగా ప్రారంభమైందనేదానిపై రెండు కథనాలు ప్రచారంలో వున్నాయి. మొదటిది దేవదానవులు అమృతంకోసంసముద్రాన్ని మధించినప్పుడు అమృతం పుట్టింది. దీనికోసం దేవాసురులు పోటీపడితే ఇంద్ర కుమారుడు జయంతుడు అమృతభాండాన్ని తీసుకొని అక్కడినుంచి వెళ్లిపోతాడు. దీన్నిగమనించిన రాక్షసులు అతడి వెంటపడితే పారిపోతూ ప్రయాగ, హరిద్వార్‌, నాసిక్‌, ఉజ్జయినిల్లో అలసట తీర్చుకునేందుకు విశ్రాంతి తీసుకున్నాడు. దేవతల కాలమానం ప్రకా రం ఇది 12రోజుల పాటు జరిగింది. ఇది మానవుల కాలమానం ప్రకారం 12ఏళ్లకు సమానం. ఈ అమృతభాండం ఆయా ప్రాంతాలను స్పృజించడం వల్ల ఈ ప్రాంతాలు పవి త్రతను పొందాయి. ఇక మరో కథనం ప్రకారం సాగర మధనంలో పుట్టిన అమృత భాండాన్ని తీసుకొని దేవతలు వెళుతుండగా అందులోని అమృత బిందువులు ప్రయాగ్‌ రాజ్‌,హరిద్వార్‌, నాసిక్‌, ఉజ్జయినిల్లో పడ్డాయి.ఈ ప్రదేశాల్లోనే కుంభమేళాలు జరుగుతాయి.

ఐదురకాల కుంభమేళాలు

ఇక కుంబమేళా మొత్తం ఐదు రకాలు. మహాకుంభమేళా, పూర్ణకుంభమేళా, అర్థకుంభమేళా, కుంభమేళా, మాఫ్‌ు కుంభమేళా. వీటిల్లో మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌) లో మాత్రమే జరుగుతుంది. ప్రతి 144 సంవత్సరాలకు లేదా 12 కుంభమేళాల త ర్వాత దీన్ని నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరిగేది మహాకుంభమేళా. మళ్లీ మనం ఇటువంటి కుంభమేళాను మన జీవితకాలంలో చూడలేం. పూర్ణకుంభమేళా ప్రతి 12ఏళ్లకు ఒకసారి అలహాబాద్‌, హరిద్వార్‌, నాసిక్‌, ఉజ్జయినిల్లో జరుగుతుంది. అర్థకుంభమేళా ఆరేళ్లకోసారి హరిద్వార్‌, అలహాబాద్‌ల్లో నిర్వహిస్తారు. కుంభమేళా ఉజ్జయిని, అలహాబాద్‌, నాసిక్‌, హరిద్వార్‌లలో జరుగుతుంది. మాఫ్‌ు కుంభమేళా ఏడాదికొకసారి జనవరి`ఫిబ్రవరి మాసాల్లో 45రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)లో మాత్రమే ని ర్వహిస్తారు. దీన్నే మినీ కుంభ్‌ అని కూడా పిలుస్తారు.

గురు, సూర్యచంద్రుల స్థానాలను బట్టి…

విశేషమేంటంటే బృహస్పతి (గురు), సూర్యచంద్రుల స్థానాలను బట్టి కుంభమేళాను నిర్ణ యిస్తారు.ఉదాహరణకు బృహస్పతి కుంభరాశిలోకి, సూర్యుడు మేషరాశి లేదా సూర్యచం ద్రులు కర్కాటకరాశిలోకి ప్రవేశించినప్పుడు మాఫ్‌ుకుంభ్‌మేళాను నిర్వహిస్తారు. అంటే ఈ కుంభమేళా మాఘమాసంలో వస్తుంది. బృహస్పతి వృషభరాశిలో, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు నాసిక్‌లో గోదావరి వద్ద, బృహస్పతి సిం హరాశిలోకి, సూర్యుడు మేషరాశిలోకి లేదా సూర్యచంద్రులు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు ఉజ్జయినిలో క్షిప్రానది వద్ద కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశలో వున్నప్పుడు హరిద్వార్‌లో గంగవద్ద కుంభమేళా జరుగుతుంది.

ఈ మహా కుంభమేళాలో పుణ్యతిథులు

జనవరి 13వ తేదీ పూర్ణిమ నాటినుంచి ఫివ్రబరి 26 మహాశివరాత్రి వరకు ప్రస్తుత పూ ర్ణ కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో కొన్ని పుణ్యతిథులను పెద్దలు నిర్ణయించారు. జనవరి 13 పుష్యపూర్ణిమ, 14న మకరసంక్రాంతి (తొలి పుణ్య స్నానం), జనవరి 29న మౌని అమావాశ్య (రెండో పుణ్యస్నానం), ఫిబ్రవరి 3న వసంత పంచమి (మూడవ పుణ్యస్నానం), ఫిబ్రవరి 4న అచల సప్తమి, 12న మాఘ పౌర్ణమి, 26న మహాశివరాత్రి (చివరి పుణ్యస్నానం)లను స్నానాలకు పవిత్ర తిథులుగా వేదవిదులుపేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 26 అమావాశ్యను మౌని అమవాశ్యగా పిలుస్తున్నారు. ఈరో జు చేసే స్నానం అన్నిస్నానాల్లోకి అతి పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈరోజున పూర్వీకు లను స్మరించుకుంటూ స్నానమాచరించి, దానధర్మాలు చేస్తే ప్రతికూలతలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని విశ్వాసం.

40కోట్లకు పైగా వస్తారని అంచనా

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త జిల్లాగా ప్రకటించింది. ఆవిధంగా ఉత్తరప్రదేశ్‌లో ఇది 76వ జిల్లాగా ఆవిర్భవించింది. ఈసారి కుంభమేళా కు వచ్చే భక్తుల సంఖ్య 40కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తొలి రెండు రోజుల్లోనే మూడున్నర కోట్లమంది త్రివేణీ సంగమంలో సాన్నాలు అచరించారు. గతంలో అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వ హయాంలో 20కోట్లమంది కుంభమేళాకు హాజరైన నేపథ్యంలో ఈ అంచనా వేస్తున్నారు. ఈ మేళా నిర్వహ ణకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూ.7500 కోట్లు ఖర్చుచేస్తుండగా, కేంద్రం రూ.2100 కోట్లు సహాయంగా రెండువిడతలుగా అందజేస్తోంది. మొత్తం కుంభమేళాలో మౌని అమావాశ్యకే అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. 1882లో మనదేశ జనాభా 22.5కోట్లు కాగా, అదే ఏడాది కుంభమేళా సంద ర్భంగా మౌని అమావాశ్యనాడు 8లక్షల మంది పవిత్ర స్నానాలు చేశారు. 1894లో పదిలక్షలు, 1906లో 25లక్షలు, 1918లో 30లక్షలమంది భక్తులు కుంభమేళా స్నానాలు ఆచరించారు. 1942 కుంభమేళాకు అప్పటి గవర్నర్‌ జనరల్‌ లిన్‌లిత్‌గో మదన్‌మోహన్‌ మాలవ్యాతో కలిసి హాజరై ఇంతటి జనసందోహాన్ని చూసి ఆశ్చర్యపోయారట!

అప్రతిష్ట పాలు చేసేందుకు కుయుక్తులు

నిజం చెప్పాలంటే ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరిగే సమయం కూడా. ఒక అంచనా ప్రకారం కుంభమేళాలో రెండున్నర నుంచి మూడున్నర లక్షల కోట్ల మేర వాణిజ్య లావాదేవీలు జరుగుతాయి. మరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది రూ.7500 కోట్లు కాగా ప్రభుత్వ ఖజానాకు చేరేది ఏకంగా రూ. 30వేల కోట్లు! కుంభమేళా లక్షన్నరమందికి ఉపాధి కల్పిస్తోంది. ఉదాహరణకు ఒక చాయ్‌ అమ్ముకునే వ్యక్తిని పరిశీలిస్తే అతని రోజువారీ ఆదాయం రూ.8వేలుగా తేలింది. ఇటువంటి పదివేలమంది చాయ్‌వాలాలు కుంభమేళాలో చాయ్‌ల అమ్మకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. టీ అమ్మకాల ద్వారా కుంభమేళాలో వచ్చే ఆదాయం రూ.360కోట్లు!! అంటే మిగిలిన వ్యాపారాలు ఏవిధంగా వుంటాయో అర్థం చేసుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఏవిధమైన ప్రమేయం లేకుండా నిధుల ప్రవాహం ఇంతపెద్దమొత్తంలో జరగడం చాలా విశేషం! దీన్ని సహించలేని కొందరు దుర్మార్గులు తప్పుడు వార్తలు ప్రసారం చేసి కుంభమేళా ప్రాభవాన్ని దెబ్బతీయాలని చూడటం కూడా సహజమే! ఎందుకంటే కుంభ మేళాలో తొక్కిసలాట జరిగిందని 11మంది మరణించారంటూ యు.పి.కి చెందిన లల్లూ యాదవ్‌ సంజీవ్‌ అనే ఒక యూట్యూబర్‌ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసాడు. దీన్ని మెయిన్‌ స్ట్రీమ్‌ ఛానల్స్‌ ప్రసారం చేయాలని చూసినా విజయవంతం కాలేదు. విచిత్రమేమం టే అన్ని కోట్లమంది స్నానాలు చేసినా ప్రశాంతంగా కుంభమేళా సాగుతోంది తప్ప అక్క డ ఎటువంటి తొక్కిసలాట జరగలేదు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు ఇచ్చే సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. కొన్ని ఛానళ్ల వారు అక్కడ సాధన చేసుకుంటున్న సాధువులను ఇంటర్వ్యూల పేరుతో అనవసర ప్రశ్నలు వే స్తూ విసిగిస్తుంటే భరించలేక వారిని తరిమివేసిన సంఘటనలు కూడా జరిగాయి!! ఈ వీడియోలను ప్రసారం చేసి, సన్యాసులు కోపిష్టులంటూ తప్పుడు ప్రచారం చేయడం కూడా జరిగింది. మరో విచిత్రమేమంటే ఏడాదిన్నరకాలంగా ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించిన, గతంలో టి.వి.లో పనిచేసిన ఒక మహిళ కుంభమేళా స్నానానికి వచ్చినప్పుడు, కొన్ని ఛానళ్లు ఆమె గతంలో టి.వి.లో పనిచేసినప్పుడు ఫ్యాషన్‌ దుస్తులు అర్థననగ్న దుస్తులతో ఉన్న ఆమె ఫోటోలను ప్రసారం చేస్తూ, ఈమె దొంగసన్యాసి అనే ప్రచారం చేయడానికి యత్నించడం మరో విషాదం. ఆమె తాను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని మాత్రమే చె బుతున్నది. కానీ అందుకు చిలవలు పలవలు సృష్టించి తప్పుడు ప్రచారం చేసే ప్రయ త్నం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో హర్యానా, రaార్ఖండ్‌ల్లో వున్న నేరగాళ్లు రంగంలోకి దిగారు. హోటల్‌ రూమ్స్‌ బుక్‌చేస్తామని, దర్శనాలు చేయిస్తామంటూ ఆన్‌లైన్‌ లో ప్రకటనలు జారీచేస్తూ, డబ్బులు వసూలు చేసుకొని మాయమైపోవడం జరుగుతోంది. కుంభమేళాలో సాధువుల రూపంలో ఉగ్రవాదులు ప్రవేశించారని వారని పోలీసులు పట్టుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. యతీంద్రసింహానంద సరస్వతి అనే స్వామీజీ గుడారం వద్దకు ఒక కుర్రవాడు వచ్చి తనను ఆయుష్‌గా పరిచయం చేసుకున్నాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా వుండటంతో తరచి తరచి ప్రశ్నిస్తే అతని పేరు ఆయూబ్‌గా తేలింది. ఇతన్ని ప్రశ్నిస్తున్నారు.

పాకిస్తాన్‌ ఏడుపు

కుంభమేళా అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక లావాదేవీలు జరిగే కేంద్రం కూడా. ఈనేపథ్యంలో కుంభమేళా పట్ల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి కనిపిస్తోంది. అన్ని దేశాల్లో కుంభ మేళాకు సంబంధించిన వివరాలు తెలుసుకునే యత్నం జరుగుతోంది. పెద్దఎత్తున విదేశీ భక్తులు గంగలో స్నానం చేస్తున్నారు. ఇక మన పొరుగుదేశం పాకిస్తాన్‌లో అన్ని వ్యవస్థలు ఈ కుంభమేళాపైనే తమ దృష్టిని పెట్టా యి. యూట్యూబర్లు, ఛానళ్లు, ఇతర మీడియా మరియు ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడ చూసి నా ఈ కుంభమేళా గురించిన చర్చలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. విచిత్రమేమంటే కుంభమేళా గురించి ప్రశంసలు కురిపించి ఇద్దరు యూట్యూబర్లను పాక్‌ ప్రభుత్వం జైల్లో పెట్టింది కూడా!! పాకిస్తాన్‌లో గూగుల్‌ సెర్చ్‌ల్లో మొదటి స్థానంలో వుంది కుంభమేళా! రెండో స్థానంలో ప్రయాగరాజ్‌!! ఇతర ముస్లిం దేశాల్లో కూడా కుంభమేళాపై ఆసక్తి కనబరుస్తున్నారు. టర్కీ వంటి ముస్లిం దేశంనుంచి కూడా ప్రజలు కుంభమేళా స్నానాలు చేసి వెళ్లారు. ఇదిలావుండగా కుంభమేళా సందర్భంగా 2 నుంచి 3లక్షల కోట్ల రూపాయలలావాదేవీలు జరుగుతాయన్న అంశం పాకిస్తాన్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాను బిచ్చమెత్తుకునే స్థితిలో ఉంటే భారత్‌ ఈవిధంగా ఆర్థికంగా సౌభాగ్యపూరితంగా వుండటం దానికి ఎంతమాత్రం నచ్చడంలేదు! అంతకుముందు కుంభమేళాలు జరిగినా ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రచారం జరగలేదు. ఇంటర్నెట్‌ పుణ్యమాని ప్రతి ఒక్క అంశం ఇట్టే తెలిసిపోతుండటంతో పాకిస్తాన్‌కు కునుకుపటడంలేదు. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ వుంటారు. కానీ వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం ఒకటుంది. ఏంటంటే భారత్‌ను, ప్రధాని నరేంద్రమోదీని చూసి అక్కసు వెళ్లగక్కే ఇతర దేశాల నాయకులు, ప్రముఖులు క్రమంగా సోదిలోకి లేకుండా పోవడం! ఇందుకు గొప్ప తాజా ఉదా హరణ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో!

రో హస్‌లా…ఓయో రూములా?

https://epaper.netidhatri.com/view/487/netidhathri-e-paper-19th-jan-2025/2

`చిత్రపురిలో వెలుగులోకి వస్తున్న భయంకర నిజాలు.

`రో హౌస్‌ లలో నివాసముండేది కేవలం పదుల కుటుంబాలు.

`వాటిని గెస్ట్‌ హౌస్‌ లుగా మార్చుకున్న వారే అందరూ.

`అక్రమ కార్యకలాపాలకు రో హౌస్‌లు అడ్డాలు.

`గుట్టు చప్పుడు కాకుండా నీతి మాలిన పనులు.

`సాయంత్రం వేళల్లో అనైతిక కార్యకలాపాలు.

`ఎవరికీ అనుమానం రాకుండా రో హౌస్‌ లు ఎంచుకున్నారు.

`రో హౌస్‌లు విలాసాలకు అడ్డాలుగా మార్చుకున్నారు.

`పైకి మాత్రం అందరూ పెద్ద మనుషులు.

`సినిమా వాళ్లంటే ఎవరికీ అనుమానాలు రావు.

`సినిమా వ్యవహారాలని ఎవరూ పట్టించుకోరు.

`పైకి కనిపించేదంతా సినీ గద్దల సమావేశాలు.

`లోపల జరిగేదంతా గుడిసేటి వేషాలు.

`అన్ని తెలిసినా కార్మికులు ప్రశ్నించలేదు.

`సినిమా వాళ్ల వ్యవహారమని ఎవరూ కలుగజేసుకోరు.

`సినిమా వాళ్లకు అదంతా కామన్‌ అనుకుంటారు.

`అందుకే సినీ గద్దలు నీచాలకు దిగజారుతున్నారు.

`నివాసాల కోసమని చెప్పి విలాసాలు సాగిస్తున్నారు.

`అనైతిక కార్యకలాపాలకు అడ్డాలు చేసుకోవడం దుర్మార్గం.

`సినీ గద్దలు ఎంచుకున్న సురక్షిత ప్రాంతం.

`విందులు, వినోదాలకు అనువైన స్థలం.

`తమ సరదాల కోట్ల రూపాయల విలువైన భూమిని కొట్టేశారు.

`విలాసవంతమైన భవనాలు కట్టేశారు.

`కార్మికులకు నిలువ నీడ లేకుండా చేశారు.

`తాము మాత్రం తందనాలడడానికి స్థలాలు కొట్టేశారు.

`ఆడిషన్ల ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు.

`సొంత ఇండ్లను సరదా సోకుల కోసం వినియోగించుకుంటున్నారు.

`ఎక్కడ కనిపించినా మీడియాలో వార్తలకెక్కుతారు.

`రో హౌస్‌ లలో రంకులెన్ని చేసినా ఎవరూ పట్టించుకోరు.

`నిత్యం రో హౌస్‌ లలో జరిగే తంతు మొత్తం ఇదే…

`నిజంగా అక్కడ జరిగేది సినీ హడావుడి నిజమైతే ఏడాదికి వెయ్యి సినిమాలు రావాలి.

`రో హౌస్‌లున్న పెద్దలవి ఏళ్లు గడిచినా ఒక్క సినిమా రావడం లేదు.

`మతలబ్‌ క్యాహై…కుచ్‌ కుచ్‌ హోతా హై!!

నిజాలు నిష్టూరంగానే వుంటాయి. కాని నిజాలే వ్యక్తిని, వ్యవస్దను, సమాజాన్ని నిలబెడతాయి. నడిపిస్తాయి. నిజమే అన్నింటినీ శాసిస్తుంది. నిజాన్ని వినేందుకు, జీర్ణించుకునేందుకు చాల మంది ఇష్టపడరు. అబద్దాలతో, అన్యాయాలతో బతికేవాళ్లకు నిజం గిట్టదు. అలాంటిదే చిత్రపురిలోని రోహౌస్‌పై వెలుగులు చూస్తున్న నిజాలు. చిత్రపురిలో సినీ గద్దలు రోహజ్‌లు ఎందుకు నిర్మాణం చేసుకున్నారు? ఇది మొదటి ప్రశ్న. రోహౌజ్‌లు తీసుకున్న ప్రతి సినీ పెద్దకు అక్కడే కాకుండా అనేక ఇండ్లున్నాయి. నివాసం వుండేందుకు ప్రత్యేకంగా భవంతులున్నాయి. నగరశివారుల్లో ఫామ్‌ హౌజ్‌లు కూడా వున్నాయి. అయినా చిత్రపురిలో కూడా పెద్దలందరికీ రోహౌజ్‌లు చాలా మందికి వున్నాయి. రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్న వాళ్లలో అతి కొద్ది మాత్రమే అక్కడ నివాసాలుంటున్నారు. అంటే వాళ్లకు ఇతర ప్రాంతాల్లో ఇల్లు లేకపోవడంతో మాత్రమే వుంటున్నారు. కాని మిగతా పెద్దలెవరు? అక్కడ వుండడం లేదు. వుండరు కూడా? కాని వారికి రో హౌజ్‌లు ఎందుకు? కాని రో హౌజ్‌లు ఉదయం వేళ్లలో తాళాలుంటాయి. సాయంత్రం వేళల్లో బల్బులు వెలుగుతుంటాయి ఎందుకు? పొద్దంతా సినిమా షూటింగులు జరిపి సాయంత్రం వచ్చి నిత్యం అర్ధరాత్రుల దాకా దర్శకులు, నిర్మాతలు చేసేదేమీ వుండదు. పొద్దంతా అలసిపోయిన వాళ్లు సాయంత్రాలు ఇళ్లకు చేరుకుంటారే తప్ప రోహౌజ్‌లకు రారు. అసలు రోహౌజ్‌లకు నిర్మాణం చేసుకున్న సినీ పెద్దల కుటుంబాలు అక్కడకు రావు. వచ్చినట్లు కూడా దాఖలాలు లేవు. కాని రోహౌజ్‌లు నిర్మానం చేసుకున్నారు. కార్మికుల పొట్ట కొట్టారు. రోహౌజ్‌లున్న వాళ్లు ఎవరికైనా అద్దెలకు ఇచ్చారా? అంటే అదీ లేదు. మరి ఆ రోహౌజ్‌లను ఎందుకు వాడుకుంటున్నారు? అక్కడ సినిమా కార్యాలయాల బోర్డులు లేవు. ఎందుకంటే అవి ఆవాసాల కోసం నిర్మాణం చేసుకున్న ఇండ్లు. మరి రో హౌజ్‌లు ఇంకెందుకు ఉపయోగపడుతున్నాయన్న ప్రశ్న అందరికీవుంది. కాని ఎవరూ బైట పడరు. కాని అందరికీ తెలుసు. రోహౌజ్‌లలో ఏఏ బాగోతాలు జరుగుతున్నాయో? జరుగుతాయో? తెలియిన వాళ్లు ఎవరూ లేరు. కాని అందరూ సినిమాలో నటించినట్లే నటిస్తున్నారు. ఏమీ తెలియని అమాయకులుగా కనిపిస్తున్నారు. కళ నుంచి కామ కళకు సినిమా ఎప్పుడో మారిపోయింది. అప్పటి నుంచే ఈ దరిద్రమంతా వచ్చి చేరింది. సినిమా పెద్దలుగా చెలమాణి అయిన వారు కొంత మంది బలవంతులు రో హౌజ్‌లు తీసుకున్నారు. అక్కడ సినిమాలకు సంబంధించిన ఎలాంటి సమావేశాలు వుండవు. కనీసం దర్శకులకు చెందిన అసిస్టెంట్లు వుండరు. రచయితలకు చెందిన అసిస్టెంట్లు వుండరు. మరి వాటిని ఏం చేస్తున్నట్లు ? ఎందుకు వినియోగిస్తున్నట్లు? అక్కడ సాగుతున్న అనైతిక కార్యకలాపాలపై అందరికీ తెలుసు. కాని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే అవి వాళ్ల సొంత ఇండ్లు. అక్కడ ఏం జరిగినా ఎవరూ పట్టించుకోరు. ఆ ధైర్యంతోనే సినీ పెద్దలు విలాసాలకు ఆ రోహౌజ్‌లను వినియోగించుకుంటున్నారు. సినిమా వాళ్లు బైటకు వెళ్తే ఏదో రకంగా మీడియాకు ఎక్కుతారు. సినిమా కోసం వచ్చే అమ్మాయిలు వాటిని ఆసరగా తీసుకొని నిర్మాతలను, దర్శకులపై ఆరోపణలు చేస్తున్నారు. తమను అటూ, ఇటు తిప్పుకున్నారని చెప్పడానికి అవకాశాలుగా మల్చుకుంటున్నారు. అందుకే చాల తెలివిగా సినీ పెద్దలు రోహౌజ్‌లను ఓయో రూములుగా మల్చుకున్నారు. విలాసాలకు కేంద్రాలు చేసుకున్నారు. ఇక్కడ విషయమేమిటంటే ఆ రోహౌజ్‌లున్న దర్శకులుగాని,నిర్మాతలు గాని ఇప్పుడు ఎవరూ సినిమాలు తీయడం లేదు. సినిమాలు కొనడం లేదు. కాని వాళ్లంతా సినిమా పెద్దలు. ఏటా ఓ వంద సినిమాలు నిర్మాణం జరిగితే అందులో ఓ పది సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు విడుదలౌతున్నాయి. ఆ పది సినిమాలలో కూడా ఈ సినీ పెద్దల సినిమా ఒక్కటి వుండదు. ఆ సినిమాలకు దర్శకత్వం వహించేవారు ఎవరూ వుండరు. కాని నిత్యం రోహౌజ్‌లకు ఎవరో వస్తుంటారు. వేళా పాళా లేకుండా వస్తుంటారు పోతుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఆ రోహౌజ్‌లకు వచ్చేవారు ఆ నిర్మాతలు కాదు. ఆ దర్శకులు కాదు. ఇతర సాంకేతిక నిపుణులెవరూ కాదు. సంగీత దర్శకులు కాదు. పాటల రచయితలు కాదు. గాయకులు కూడా కాదు. మరి ఎవరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? అన్నది కూడా ఎవరికీ తెలియదు. సహజంగా గేటెడ్‌ కమ్యూనిటీలలోకి ఎవరు పడితే వారు రారు. రాలేదు. కాని ఎవరెవరో వస్తున్నారు. అంటే ఆ సినీ పెద్దలకు సంబంధించిన వారు మాత్రమే రాగలరు. అక్కడ ఏమైనా సినిమా సిట్టింగులు జరుగుతున్నాయా? అంటే అదీ లేదు. అక్కడ సినిమాలకు సంబంధించిన కథా చర్చలు జరిగినట్లుగాని, జరుగుతున్నట్లు గాని కనిపించదు. ఇక అక్కడ ఏమైనా ఆడిషన్లు జరిగే అవకాశం వుందా? అందుకు సరిపోయే వసతులు అక్కడ వుండే అవకాశం లేదు. సహజంగా సినిమాలకు సంబందించి ఆడిషన్లన్నీ స్టూడియోలలోనే జరుగుతుంటాయి. దాంతో రోహౌజ్‌లను సినిమా అవసరాలకు కూడ వినియోగిస్తున్నట్లు ఎక్కడా సమాచారం లేదు. మొత్తంగా చిత్రపురిలో వున్న రోహౌజ్‌లలో అసాంఫీుక కార్యకలాపాలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయన్నది వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓ ఆరు రోహౌజ్‌లను కూల్చేయాలని అధికారులు నోటీసులు జారీ చేసి, నాలుగు కూల్చేశారు. ఆ రోహౌజ్‌లు కూల్చేస్తున్న సమయంలో అక్కడ డ్రగ్స్‌కు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు దొరికినట్లు, వాటిని గుట్టు చప్పుడు కాకుండా కాల్చేసినట్లు కూడా తెలుస్తోంది. అంటే రోహౌజ్‌లలో జరగకూడని దరిద్రాలన్నీ జరుగుతున్నట్లు ఈ సంఘటన ద్వారా అర్దమౌతోంది. సినిమా నిర్మాణానికి చెందిన వాళ్లు పెద్దగా వుండకపోవడం, కొన్ని రోహౌజ్‌లు కిరాయిలకు ఇవ్వడం కూడా జరిగింది. వాటిలో ఎవరు వుంటున్నారన్నది కూడా ఎవరికీ తెలియదు. ఈ విషయాలు కార్మికులందిరికీ తెలుసు. కాని ఏమీ చేయలేని పరిస్తితి. ఎవరికీ చెప్పుకోలేని నిస్సహాయ స్ధితి. కార్మికులకు సంబందించిన భూములను ఆక్రమించి పెద్దలుగా చేలామణి అవుతున్న వారు గద్దలై వాలి, రోహౌజ్‌లు నిర్మాణాలు చేసుకున్నారు. వారి సరసల్లాప కార్యకలాపాలకు వేధికలు చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఎవరికీ అనుమానం రాదు. ఎవరు అనుమానించే పరిస్దితి అసలేవుండదు. ఎవరొస్తున్నారు..ఎవరు వెళ్తున్నారని ఎవరూ ఆరా తీయరు. ఒక వేళ ఎవరైనా అడిగితే సినిమాకు సంబంధించిన విషయాలని అంటారు. కామసూత్ర సినిమా తీసేవారు కళాత్మకంగా తీస్తే ఎవరు చూస్తారు? అన్నట్లు సినిమాలలో నీతులు చెప్పేవారంతా ఇలా నీతి మాలిన పనులే చేస్తారని చెప్పడానికి రోహౌజ్‌లలో జరుగుతున్న బాగోతాలే నిదర్శనమని అంటున్నారు. ఇప్పుడు సినిమాలు తీసేవారులేరు. సినిమాలలో ఇతరులకు అవకాశాలిచ్చే పరిస్దితుల్లో లేరు. కొత్త వాళ్లు ఔత్సాహికులు సినిమా తీస్తే ధియేటర్లు గుప్పిట్లో పెట్టుకొని ఆ సినిమాలను తమ సినిమాలగా చెప్పుకొని పెద్దలుగా చెలామణి అవుతున్న వారే చిత్రపురిలో పాతుకుపోయారు. సినిమాలలో సంపాదించాల్సినంత సంపాదించారు. కార్మికుల భూములను కొల్లగొట్టారు. విలాసాల కోసం రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు. అక్కడ వేయాల్సిన అడ్డమైన వేషాలు వేస్తున్నారని సమాచారం. చిత్రపురి అనేది ఒక పవిత్రమైన స్దలంగా చూసుకోవాలి. ఎందుకంటే నివాసాలు ఎప్పుడూ అనైతిక కార్యకలాపాలకే అడ్డాలు కాకూడదు. సినిమా పరంగా అక్కడ ఏవైనా గొప్ప కార్యాకలాపాలు జరిగినట్లు, జరుగుతున్నట్లు గాని ఇప్పటి వరకు లేదు. అయినా నివాసాల సముదాయాలలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటే గుట్టు చప్పుడు కాకుండా, ఇతరలకు ఇబ్బందులు కాకుండా మసలు కుంటారు. కాని చిత్రపురిలో ఏం జరిగినా ఎవరూ అడిగేవారు వుండదు. అటు వైపు తొంగి చూసే వారు కూడా వుండరు. రోహౌజ్‌లలో వినోదాలు జరుగుతున్నా సినిమా వాళ్లంటేనే వినోదం…వారు చేసేదే సల్లాపం అనుకుంటారు. అందుకే చిత్రపురిలో సినీ గద్దలు ఆడిరది ఆట…పాడిరది పాట అవుతుందంటున్నారు. అదికారులు దృష్టిపెడితే అందరి ముసుగులు తొలగిపోతాయంటున్నారు.

మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మహిళలను అన్ని రంగా లల్లో అభివృద్ధికై ప్రభుత్వం కృషి

సర్వే జరుగుతున్న తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వారి ప్రజ్వల్ సంఘం ఆధ్వర్యంలో మహిళ లకు కుట్టు మిషన్ శిక్షణ పూర్తయిన వారికి ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ జరిగింది. మహిళలను అన్ని రంగాలల్లో అభివృద్ది చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు తెలిపారు.వారి నిర్వహణలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్న ట్లు తెలిపారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేసి వారితో గ్రూపు ఫొటో దిగారు.

లబ్ధిదారుల జాబితాను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయాలి

ప్రభుత్వం ఈ నెల 26 నుంచి నాలుగు కొత్త పథకాలు అమలు చేయనున్న నేపథ్యంలో అర్హుల జాబితాను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. పెద్దకోడెపాక గ్రామంలో నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక కు సంబందించి ఫీల్డ్ వెరిఫికేషన్ ను స్వయంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 26న రిపబ్లిక్ డే పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి, గ్రామసభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఫీల్డ్ విజిట్ ను పరిశీలించి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా, లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అంతకుముందు గ్రామంలో నాలుగు పథకాలకు సంబంధించి సర్వే జరుగుతున్న విషయం ముందస్తు సమాచారం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అక్కడున్న ఎంపీడీవో ఇతర అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఎందుకు ఇవ్వలేదని అడగ్గా, పొంతన లేని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. వెంటనే హన్మకొండ జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎంపీడీవో పని తీరు సరిగా లేదని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న నాలుగు పథకాలల్లో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, క్షేత్రస్థాయిలో గ్రామాలల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులను సమన్వయం చేసుకొని వివరాలను సేకరించాలని అక్కడున్న అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్ర మంలో మండలంలోని కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ అభిమానులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.

మెట్పల్లి ఇబ్రహీంపట్నం మండలాల్లోని ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

మెట్ పల్లి జనవరి 18 నేటి ధాత్రి
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండలంలో గోధూర్ గ్రామం తిమ్మాపురం గ్రామం వేములకుర్తి గ్రామం మరియు మెట్పల్లి మండలం వెంకట్రావుపేట లో నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ అడా కమిటీ మెంబర్ తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు కోరుట్ల నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు పోతాని సత్యం ఇబ్రహీంపట్నం మండల మాజీ అధ్యక్షులు శ్రీ గుజ్జుల రమేష్ మెట్పల్లి పట్టణ మాజీ అధ్యక్షులు జర్రిపోతుల చందు మరియు కోవూరి వెంకట్రావు కర్ణవర్తుల ప్రభాకర్ ధర్మపురి బోయగోని గంగాధర్ ఎన్టీఆర్ భూమన్న తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి లో తెలుగుదేశం పార్టీ నేతలు

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి తెలుగుదేశం నేతలు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య యాదవ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బి రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారని చేశారు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200 సీట్లు ఎమ్మెల్యే స్థానాలు ఎన్టీ రామారావు గెలిపించి రికార్డు స్థాయిలో దేశంలోనే పేరు గాంచిన వ్యక్తి అని కొనియాడారు రాష్ట్రంలో మహిళలకు విశ్వవిద్యాలయాలు రైతులకు సబ్సిడీ రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఎన్టీ రామారావు అనేక సంక్షేమ అభివృద్ధి పనులు పేద ప్రజలకు చేశారని గుర్తు చేశారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి గ్రామం సందర్శించి అక్కడున్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని ఎన్టీ రామారావు నిబంధనలు పెట్టారని ఆయన పేర్కొన్నారు గ్రామస్థాయిలో కూడా ప్రజలు చైతన్యవంతులయ్యారని ఎన్టీ రామారావు తెచ్చిన పథకాల వల్లనే కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఏంటి రామారావు కీలక పాత్ర పోషించారని బి రాములు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు హోటల్ బలరాం బాలరాజ్ న్యాయవాది శాకీర్ హుస్సేన్ బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమాని దస్తగిరి ఎండి గౌస్ కొత్త గొల్ల శంకర్ గంధం కృష్ణయ్య ఫారూఖ్ మేదరి బాలయ్య గంధం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం పండ్లు పంచిపెట్టారు

జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో అంకుసాపూర్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగంప్రవీణ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం అంక్సాపూర్ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగిందని ఇందులో జిల్లా స్థాయిలోని పలు గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుందని అలాగే క్రీడలతో ఆరోగ్యంగాను ఉత్సాహంగాను ఉండటం ఆరోగ్యంలో ఒక భాగం అని యువత ముందుకు వచ్చి క్రీడా రంగంలో జిల్లా స్థాయిలో పాల్గొంటూ ఇంకా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి టోర్నమెంట్ కార్యక్రమంలో ఏఎంసిడైరెక్టర్ ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగల రాజు మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్ ఆత్మకూరి తిరుపతి పొన్నాల లక్ష్మణ్ గౌడ్, మీరాల శ్రీనివాస్ శ్రీకాంత్ పవన్ శ్రీనివాస్ కంకణాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

పరకాలలో ఘనంగా సీనియర్ ఎన్టిఆర్ 29 వర్ధంతి

పరకాల నేటిధాత్రి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిసందర్బంగా నియోజకవర్గం నాయకులు కందుకూరి నరేష్,టౌన్ అధ్యక్షులు చీదురాల రామన్న, ప్రధాన కార్యదర్శి శంకర్ ల ఆధ్వర్యంలో స్థానిక వెలమవాడలోని టీడీపీ గద్దె వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం నిరుపేదలకు పండ్లు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి నల్ల రవి,ముక్కిరాల జనార్దన్ రావు,వల్లల హరీష్,దండుగుల అశోక్,ఎన్టీఆర్ అభిమాన సంఘం,తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భగవంతుని సేవలో తరించాలి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

పూర్ణకుంభముతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

భగవంతుని సేవలో తరించాలి అని నూతనంగా ఎంపికైన మన్యం కొండ దేవస్థానం పాలకమండలి సభ్యులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం లోని మన్యం కొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి పాలకమండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవ లభించడం ఇది పూర్వ జన్మ సుకృతం అని, భగవంతునికి చేరువగా చేరి సేవ చేసుకొనే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందన్నారు. మన్యం కొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ దేవాలయ విశిష్టత తెలుసునని, అందుకే దేవాలయ అభివృద్ధికై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. భక్తులకు అధునాతన సౌకర్యాలు ఏమి కావాలో వాటిని గుర్తించి అందించే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. మన్యం కొండ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మన్యం కొండ దేవస్థానం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అంతకుముందు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక నిర్వహించారు, వేదపండితులు ఎమ్మెల్యే కు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అలహరి మధుసూదన్ చారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి , వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు అనిల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, మరియు మన్యం కొండ దేవస్థానం పాలకమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

ఎమ్మెల్యే ఆదేశాలతో ట్రాన్స్ఫార్మర్ మంజూరు

గంగాధర నేటిధాత్రి :

మండల కేంద్రంలోని 9వ వార్డ్ లో ట్రాన్స్ఫార్మర్ లోడ్ సరిపోక కరెంట్ సమస్య ఉందని అక్కడి ప్రజలు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వినతిపత్రం ఇవ్వగా, ఎమ్మెల్యే ఆదేశాలమేరకు విద్యుత్ అధికారులు పరిశీలించి 25kv ఉన్న ట్రాన్స్ఫార్మర్ బదులు 63 kv ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసి శనివారం విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ ను బిగించారు. విద్యుత్ సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే కు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంత్రి లత, కాలనీ వాసులు పాల్గొన్నారు.

కోతుల బీభత్సవo… వెంటపడి కరుస్తున్న వైనం

కోతుల బెడద తప్పించరూ మహా ప్రబో!

కోతుల బెడదతో వణికిపోతున్న జనం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో కోతులు హడలెత్తిస్తున్నాయి. కుక్కలను మించి కోతుల భయమే మండలంలోని ప్రజలను వెంటాడుతుంది మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో ఇదే తంతు జరుగు తుంది.చిన్నపిల్లలను కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరి చాయి.కోతుల బెడద తీవ్రంగా ఉందని మహిళలు ప్రజలు చిన్నపిల్లలు భయపడుతు న్నారు. వనం వీడింది జనంలోకి వచ్చింది మీ ఊరొచ్చా మీ ఇంటికి వచ్చా అంటూ ఇప్పటికే ఊర్లో సెటిల్ అయింది. కాయలు పండే కాదు మనుషులని జంక్ ఫుడ్ గడిచిన శతాబ్దం నుంచి కోతుల జనాభా అంతకంతా పెరుగుతున్నది ఇప్పుడు మండల కేంద్రంలో తక్కువలో తక్కువగా 500 నుండి750 వరకు కోతులు ఉన్నాయి. ఇంటి తలుపులు వేయడం మరిచారో ఇక అంతే సంగతులు కోతులు ఇండ్లలోకి చేరి వంట సామానులు దుస్తులు ఆహార పదార్థాలు చిందర వందర చేస్తూ భయ భ్రాంతులను సృష్టిస్తున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొనాల్సి వస్తుంది రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల వద్ద,హాస్టల్ వద్ద విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తు న్నాయి ఇప్పటికైనా సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు మండల అధికారులు ప్రభుత్వం స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఎంఎఫ్ఎఫ్ మండల అధ్యక్షులుగా కోగిల అరవింద్

ప్రధాన కార్యదర్శిగా బొచ్చు నవదీప్

పరకాల నేటిధాత్రి
మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు పట్టణ కేంద్రంలోని అమరధామంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మండల అధ్యక్ష కార్యదర్శులను ఏకు శంకర్ మాదిగ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ పిబ్రవరి 7న జరుగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతుల ప్రదర్శన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంఎఫ్ఎఫ్ మండల అధ్యక్షునిగా కోగిల అరవింద్ మాదిగ,ప్రధాన కార్యదర్శిగా బొచ్చు నవదీప్ మాదిగలను ఏకగ్రీవంగా ఎనుకున్నట్టు తెలిపారు.రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చిన విద్యార్థులను అధిక సంఖ్యలో భాగస్వాములను చేసి సభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజశేఖర్,రాకేష్,నవనీత్ మాదిగలు,ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి,డప్పు కళాకారుల సంఘం నాయకులు కోగిల రవి డబ్బాల్,మడికొండ ప్రమోద్ కుమార్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఆఖరి మజిలికి ముక్తిఆశ్రమ్

పేదోడికి అండగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శ

మంథని :- నేటి ధాత్రి

అద్దె ఇంట్లో ఉంటూ ఆఖరి మజిలీకి అష్టకష్టాలు పడే పేదోడికి ముక్తి ఆశ్రమం భరోసా ఇస్తోంది. అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంతిమ కార్యక్రమం ఆ అద్దె ఇంట్లో నిర్వహించేందుకు ఇంటి యజమానులు అడ్డుకుంటుంన్న ఈ సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఒకరు చనిపోతే గౌరవించాల్సిన పరిస్థితులు ఉన్నా కట్టుబాట్లు, ఆచారాల పేరుతో పేదోడిని ఇబ్బందులకు గురి చేసిన సందర్బాలుఉన్నాయి. నియోజకవర్గంలో ఎంతో మంది పేదలు తమ కుటుంబసబ్యుడు చనిపోతే అద్దె ఇంట్లో ఉంటలేక చివరకు పార్థివ దేహాన్ని రోడ్డుపైనే ఉంచిన సందర్బాలు అనేక ఉన్నాయి. పేదోడి ఆఖరి మజిలీకి కుటుంబసభ్యులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని బస్‌ డిపో సమీపంలో ముక్తి ఆశ్రమం నిర్మించారు. అద్దె ఇంట్లో ఉంటూ ఎవరైన చనిపోతే వారి అంతిమ సంస్కారాలతో పాటు కర్మకాండ పూర్తి చేసుకునే వరకు ఈ ముక్తి ఆశ్రమంలో ఉండి చేసుకునే విధంగా సదుపాయాలు కల్పించారు. ఈ మేరకు మంథని పట్టణానికి చెందిన ఉడుత శివ మంథని పట్టణంలోని 13 వ వార్డు లో ఓ ఇంట్లో కిరాయి ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఉడుత శివ మరణించగా అద్దె ఇంట్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంటి యజమాని అంగీకరించలేదు. దీంతో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముక్తి ఆశ్రమంలో వారి అంతిమ కార్యక్రమం చేసుకుంటున్నారు. శనివారం ఆ కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. ముక్తి ఆశ్రమం మీలాంటి పేదోళ్ల కోసమే ఏర్పాటు చేశామని, పేదోడి ఆఖరి మజిలీలో ఎలాంటి ఇబ్బందులు రాకూడనే ఆలోచనతో ముక్తీ ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు

బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్‌టీఆర్‌దే

అణగారిన వర్గాలు కళ్లు తెరిచి మహనీయుల గురించి చర్చించాలే

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

ఆనాడు పటేల్‌ పట్వారీ దొర బాంచెన్‌ అనే పరిస్థితుల నుంచి బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టీ రామారావు వర్ధంతి సందర్బంగా మంథని పట్టణంలోని ఎన్‌టీఆర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేశారని, అలాంటి మహనీయుల విగ్రహాల వెనుక దాగి ఉన్న చరిత్రను తెలియజేయాలనే ఆలోచనతో మంథనిలో విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. అయితే ఆనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు నేలవంక కింద చూసి నడిచే వారని కనీసం పెద్దవాళ్లను తల ఎత్తి చూసేవారు కాదన్నారు. అలాంటి పరిస్థితులను మార్చిన చరిత్ర ఎన్‌టీఆర్‌దేనని అన్నారు. ఈనాడు బీసీలు రాజకీయంగా ఇంత ఎత్తు ఎదిగారంటే అందుకు ఎన్‌టీ రామారావు కారణమన్నారు. ఎన్‌టీఆర్‌ రాకముందు కాంగ్రెస పార్టీ తమ చెక్కు చేతల్లో ఉండే వాళ్లను మాత్రమే రాజకీయంగా వాడుకునే వారని, ఎస్సీల్లో రిజర్వేషన్‌లు ఉన్నా స్వతంత్ర ఆలోచన శక్తి ఉండేది కాదన్నారు. ఈ క్రమంలో ఎన్‌టీఆర్‌ ఎస్సీలను ముందుకు తీసుకువచ్చి రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే మనం ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు. బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు ఇప్పటికైనా కళ్లు తెరిచి మహనీయుల గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు కూనవరం రోడ్డు లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భద్రాచలం శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ తెల్లo వెంకటరావు భద్రాచలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి శ్రీనివాస్, షేక్ అజీమ్, కంభంపాటి సురేష్ కుమార్, కుంచాల రాజారాం , కోనేరు రాము , అడుసుమల్లి జగదీష్ రావు, చల్లగుళ్ళ నాగేశ్వరరావు, కొర్లపాటి రాము, దేసప్పా, భద్రాచలం సొసైటీ అధ్యక్షులు అబ్బినేని శ్రీనివాసరావు, తాళ్లూరు చిట్టిబాబు, దాసయ్య, టి శ్రీనివాసరావు, రేపాక రాంబాబు, తాత సీత, గౌతమి అచ్యుతరావు, పోటు వెంకటేశ్వర్లు, కొడాలి వెంకటేశ్వర్లు, రాంబాబు, కొడాలి చంటి, కొండవీటి అశోక్ కుమార్, తుము శ్రీను, టిఆర్ఎస్ నాయకులు ఆకోజు సునీల్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పరిమి శ్రీనివాసరావు ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం
వెంకట్రావు మాట్లాడుతూ నందమూరి తారకరామారావు గారు చేసిన అనేక సంక్షేమ పథకాలు గిరిజన దళిత బిసి వర్గాలు మహిళలకు చేరువయ్యాయని అయినా ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని మండల వ్యవస్థ తీసుకొచ్చి సుధీర్ ప్రాంతాలు ప్రయాణించాల్సిన ప్రజల యొక్క కష్టాలు పోగొట్టి మండల వ్యవస్థ తీసుకొచ్చి వారికి అన్ని శాఖలు ఒక దగ్గరగా తీసుకొచ్చి ప్రజలకు సమస్య పరిష్కారానికి కృషి చేశారని వారు వారు ఆయన యొక్క సేవలను గుర్తు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ సభ్యుడు కూడా శ్రీనివాసన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏ ఆశయంతో అయితే పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు ప్రజలకు కూడు గూడు గుడ్డ నినాదం తోటి సమీక్ష పథకాలను పేద ప్రజలందరికీ తీసుకొచ్చి మహిళలకు ఆస్తిలో సమాన కు హక్కు భద్రాచల ని అభివృద్ధి చేసిన కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి తెలియజేశారు జరిగిందని

error: Content is protected !!
Exit mobile version