కార్పోరేట్‌ ఆసుపత్రులలో కాళరాత్రులు! ఎపిసోడ్‌-1

‘‘అర్థరాత్రి’’ దాటితే ‘‘క్యూ కట్టే శవాలు’’!

`ఏ ఆసుపత్రి ముందు చూసినా బంధువుల ఆర్థనాదాలు…

`పట్టించుకునే వారు లేక బాధితుల అరణ్య రోదనలుl

`అవి ఆసుపత్రులు కాదు…ప్రాణాలను తోడేస్తున్న రాబందుల నిలయాలు

 

`బతికుండగానే పీక్కు తిని ప్రాణాలు తీస్తున్న నరరూప రాక్షసులు

`వైద్యులు కాదు తెల్ల కోటు ముసుగులో దెయ్యాలు

`వైద్యం పేరుతో పేదల రక్తం మరిగిన పిశాచులు

`వచ్చీ రాని వైద్యులతో వైద్యం చేయిస్తున్నారు

`శంకర్‌ దాదాలతో వైద్యం కానిచ్చేస్తున్నారు

`ప్రైవేటు ఆసుపత్రులకు పట్టిన కాసుల రోగం

`డబ్బు సంపాదనకు మరిగిన ప్రైవేటు ఆసుపత్రుల పైత్యం

`ప్రాణాలు నిలపాల్సిన చోట మృత్యు ఘోషలు

`దేవాలయంలా కొలవాల్సిన చోట బంధువుల శాపనార్థాలు

`నిత్యం వందల ప్రాణాలు తోడేస్తున్నారు

`వైద్యం కోసం వెళ్తే శవాలై వస్తున్నారు

`చిన్న చిన్న ఆపరేషన్లలో ప్రాణాలు పోతున్నాయి

`ఆసుపత్రుల పేరు చెబితే జంకుతున్నారు

`నూకలు బాకి వుంటే బతికొస్తామనుకుంటున్నారు

`వైద్యం పేరుతో ఆస్థులు కొల్లగొడుతున్నారు

`అర్థరాత్రి సమాచారమిచ్చి చనిపోయాడంటున్నారు

`అనుభవం లేని డాక్టర్లతో వైద్యం చేస్తున్నారు

`అందుబాటులో లేని వైద్యుల పేర్లతో బోర్డులు నింపేస్తున్నారు

`నమ్మి వైద్యం కోసం చేరితే ప్రాణాల మీదకు తెస్తున్నారు

`శాయశక్తులా కృషి చేశామని చేతులు దులుపులుకుంటున్నారు

`వైద్య ప్రమాణాలు గాలికి వదిలేశారు

`అధికారులు లంచాలకు అలవాటు పడ్డారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఆసుపత్రులు కాదు…నరకానికి నకళ్లు…వైద్యాలయాలు కాదు..భూతాలకు నిలయాలు..పిశాచాలకు కేంద్రాలు..అవును కడుపు మండిన వాడు ఇలాగే అంటాడు..కష్టాల బారిన పడ్డవాడు ఇలాగే నిందిస్తాడు..క్షణ క్షణం ఆ ఆసుపత్రులను శపిస్తాడు.. నిర్వాహకులపైన దుమ్మెత్తిపోస్తాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా విరామం లేకుండా తిట్ల దండకం అందుకుంటారు…పాపం పండిన నాడు మీ బతుకులు కూడా విగత జీవులైన రోగుల కుటుంబాల కన్నా అద్వాహ్నమైన పరిస్తితులు ఎదుర్కొంటారని , మట్టి కొట్టుకుపోతారని రోధిస్తూ బాదితులు శపిస్తారు. కొన్ని నిజాలు భయంకరంగా వుంటాయి. వరంగల్‌ జిల్లాలో ఆసుపత్రులు సంగతి తెలిస్తే పై ప్రాణాలు పైకే వెళ్తాయి. ఆసుపత్రిలో అడుగు పెట్టగానే ప్రాణాలు పోతాయి. అంతలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పేరుకు మాత్రమే కార్పోరేట్‌ ఆసుపత్రులు. అక్కడ పని చేసేది పదుల సంఖ్యలో మాత్రమే వైద్యులు. బైట ఏర్పాటు చేసే బోర్డులలో వందల సంఖ్యలో వైద్యుల పేర్లుంటాయి. ఆ పేర్లున్న వైద్యులు ఒక్కరు కూడా ఎప్పుడూ వుండవు. వచ్చి వైద్యం చేయరు. చదివేస్తే వున్న మతి పోయినట్లు సగం సగం చదివిన వైద్యులు మాత్రమే వైద్యం చేస్తుంటారు. వైద్యంలో సరిగ్గా మెలుకువలు తెలియని పట్టుభద్రులు చేత మాత్రమే వైద్యం అందిస్తుంటారు. దాంతో నిత్యం వరంగల్‌లోని పేరు మోసిన ఆసుపత్రుల నుంచి నిత్యం అర్ధ రాత్రి దాటిందంటే ఎన్ని శవాలు బైటకు వస్తాయో తెలియదు. ఆసుపత్రుల్లో చేరిన వారు ఎంత మంది బతికి బట్టకడతారో చెప్పలేం. అంత దారుణంగా వైద్య సేవలు అందుతున్నాయంటే పరిస్దితి ఎలా వుందో అర్దం చేసుకోవచ్చు. బైటకు మాత్రం అంతస్దుల మేడలు. మిలమిల మెరుపుతో కూడిన అద్దాల మేడలు. అవి చూడడానికి తప్ప వైద్యం అందించడానికి పనికిరావు. గ్రామీణ ప్రజలకు ఈ విషయాలు ఏమీ తెలియవు. ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైందంటే చాలు ఎలాగైనా మెరుగైన వైద్య చికిత్స చేయించుకోవాలనునే తపనతో నిరక్షరాస్యులైన ప్రజలు ఆ ఆసుపత్రులకు వస్తారు. ఎంత ఖర్చైనా ఫరవాలేదన్న ఆలోచనతో వస్తారు. అలాంటి వాళ్లే ఆ ఆసుప్రతులకు ఆదాయ మార్గాలు. పావలా కోడికి బారాణ మసాల అన్నట్లు వైద్యం సాగిస్తారు. మొదటికే మోసం తెస్తారు. అసలు వైద్యమే సరిగ్గా తెలియని వాళ్లతో ప్రయోగాలు సాగిస్తుంటారు. ఆ వైద్యులకు పట్టాలెవరిచ్చారో..వాళ్లు ఎక్కడ శిక్షణ పొందారో కూడా అర్దం కాదు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్‌ఎంపి వైద్యులకన్నా అద్వాహ్నమైన వైద్యం చేస్తుంటారు. కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో తెల్ల కోటు వేసుకొన్న దెయ్యాలౌతున్నారు. అవును. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారిని ఇంతకన్నా గొప్పగా ఎవరూ కీర్తించరు. నిత్యం ఏదో ఒక ఆసుపత్రి ముందు రోగుల బంధులు ధర్నాలు సాగిస్తూనే వుంటారు. రోధనలు వినిపిస్తూనే వుంటారు. బంధువుల ఆర్తనాదాలలో పూట గడవని ఆసుపత్రి ఒక్కటి కూడా వుండదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత దుర్మార్గంగా వైద్యం అందిస్తున్నారు. ఇంటి దగ్గర వున్నా బతికేవాడేమో? మరో ప్రాంతానికి వెళ్లినా బాగుపడేవారేమో? అనుకుంటూ నిత్యం వరంగల్‌లోని పుట్టగొడుగుల్లా వెలిసిన కార్పోరేట్‌ ఆసుపత్రుల ముందు బంధువుల ఆర్తనాదాలు వింటే తెలుస్తుంది. ఆసుపత్రుల పరిస్టితులు ఎంత దౌర్భాగ్యంగా వున్నాయో అర్ధమౌతుంది. అడిగేవారుండరు. పట్టించుకునేవారుండరు. శవాన్ని ఆసుపత్రి ముందు వేసి కూడా బిల్లు కట్టి శవాన్ని తీసుకెళ్లమంటారు. మానవత్వం మంట గలుపుతుంటారు. వారికి చేతగాని వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వైద్యం కోసం వచ్చిన వారికి ముందు మాయ మాటలు ఎన్నో చెబుతారు. రేపటి కల్లా మార్పు కనిపిస్తుందని చెబుతారు. మరునాడు శవాన్ని చేతుల్లో పెడతాడు. వైద్యం మొదలు పెట్టకముందే ఫీజులు వసూలు చేస్తారు. గంటకోసారి మందుల పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. అయితే ఆ ఆసుపత్రుల్లో సంబంధిత వైద్యానికి వైద్యులు లేకపోయినా అడ్మిట్‌ చేసుకుంటారు. తమకు తెలిసిన చిన్నా చితకా వైద్యం కూడా చేయలేక ప్రాణాలు తీస్తుంటారు. పేరుకు కార్పోరేట్‌ ఆసుపత్రులు…అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ కూడా చేయలేక ఓ వ్యక్తిని ఇటీవలే చంపేశారు. అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ వెనక నుంచి ఆపరేషన్‌ చేసి వరంగల్‌లోని ఓ కార్పోరేట్‌ వైద్యులు వైద్య రంగంలోనే చరిత్ర సృష్టించారు. చిన్న చిన్న క్లినిక్‌లలో కూడా మంచి అనుభవం వున్న వైద్యులు ఎంతో మంది తమ జీవిత కాలంలో కొన్ని వేల అపెండిసైటిస్‌ ఆపరేషన్లు చేసి, ప్రాణాలు కాపాడుతుంటారు. కాని పేరుకు అన్ని రకాల సౌకర్యాలున్నాయని గొప్పలు ప్రచారం చేసుకునే కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో అపెండిసైటిస్‌ ఆపరేషన్లు వికటించి ప్రాణాలు తీస్తున్నారు. ఇక ఫైల్స్‌ లాంటి సమస్యలతో బాదపడేవారిని నాటు వైద్యం చేసేవారు కూడా కాపాడుతుంటారు. ఆ సమస్యలనుంచి గట్టెక్కెస్తుంటారు. అయితే కొంత మంది అలాంటి నాటు వైద్యుల వల్ల ఇతర సమస్యలు ఎదురౌతాయని భయపడి కార్పోరేట్‌ ఆసుపత్రిలో చేరి కూడా ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్దితులు వున్నాయి. ఈ మాత్రం వైద్యం అందించలేని కార్పోరేట్‌ ఆసుపత్రులు వరంగల్‌లో వున్నాయి. అయితే ఇది ఒక్క వరంగల్‌ జిల్లాకే పరిమితం కాదు. తెలంగాణ రాష్ట్రంలో అనేకం వున్నాయి. హైదరాబాద్‌లో కూడా పేరు మోసిన ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి వైద్యమే జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. చల్లదనం కోసం అలవీర జ్యూస్‌ తాగి ఇబ్బంది ఎదురైందని ఆసుపత్రిలో చేరితే వైద్యం అందించక ప్రాణం తీసిన సందర్భాలు కూడా వున్నాయి. ఇలాంటి వాటిని ఆసుపత్రులందామా? మాయదారి వ్యాపారాలందామా? వైద్య విధానంలో ఎన్ని దౌర్భాగ్యాలు అనుసరించాలో అన్ని వరంగల్‌లో అనుసరిస్తుంటారు. నిర్ణీత గడువు ముగిసిన మందులను రోగులకిస్తుంటారు. ఆ హడావుడితో బందువులు కూడా ఆ తేదీలను చూసుకోరు. చదువు రాని వాళ్లు అసలే వాటి గురించి పట్టించుకోరు. ఓ వైపు లక్షలు చెల్లించి ఆసుపత్రిలో చేరిన వారికి కూడా కాలం చెల్లిన మందులతో వైద్యం చేసిన సంఘటలను ఆ మద్య వెలుగులోకి వచ్చాయి. ఇలా ఏదో రకమైన వివాదాలు వరంగల్‌లో వెలుగు చూడడం నిత్య కృత్యమైంది. కానుపు కోసం వచ్చిన వారికి కూడా సరైన చికిత్స అందించే యంత్రాంగం లేక, నిండు గర్భిణీల ప్రాణాలు తీస్తున్న ఆసుపత్రులు కూడ వున్నాయి. నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన వారు ప్రాణాలు పోగొట్టుకొని శవాలుగా ఇండ్లకు చేరుతున్నారు. ఇలాంటి వాటిని ఆసుపత్రుల అనగలమా? ప్రాణాలు తోడేసే రాబంధుల కార్ఖానాలు అనాలి. ఎందుకంటే అక్కడే అలాంటి పిచాశాలు వైద్యం చేస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో వైద్యం కోసం వచ్చిన వారిని బతికుండగానే పీక్కుతినే నరరూప రాక్షసులు అని అనాలి. ఆసుపత్రిలో చేర్చుకునే ముందు రూపాయి తక్కువైనా చేర్చుకోరు. వైద్య అందుతున్న సమయంలో రూపాయి చెల్లించలేమని చెబితే వైద్యం ఆపేసే దుర్మార్గులు. ఎప్పటి బిల్లు అప్పుడు చెల్లిస్తేనే వైద్య పర్యవేక్షణ చేస్తారు. సొమ్ములన్నీ తీసుకున్నా వైద్యం అందించక ప్రాణాలు తీసే రక్త పిశాచులు. అక్కడుండేది తెల్ల కోటు వేసుకున్న కొరివి దెయ్యాలు. వైద్యం పేరుతో రక్తం మరిగిన రక్త పిచాశాలు. శంకర్‌దాదాలను పట్టుకొని వైద్యం సాగిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇది ప్రైవేటు ఆసుపత్రులకు పట్టిన కాసుల రోగం. దానికి ప్రజలు ప్రాణాలు తీయడమే తెలుసు. ప్రాణాలు నిలపడం తెలియని అక్రమ వ్యాపారం. కేవలం డబ్బు సంపాదనకు మరిగిన ప్రైవేటు ఆసుపత్రుల పైత్యానికి వరంగల్‌ ఆసుపత్రులే పరాకాష్ట. ఆసుపత్రిని చూస్తే మొక్కాలనిపించాలి. వైద్యున్ని చూస్తే దండం పెట్టాలనిపించాలి. కాని ఆ ఆసుపత్రులను చూస్తే దుమ్ముత్తిపోయాలని పిస్తుంది. ఆ వైద్యులను చూస్తే కాకిరించి ఉమ్మేయాలని పిస్తుంది. దేవాలయంలా కొలిచే ఆసుపత్రుల ముందు నిత్యం ఎంతో మంది రోగుల బంధువులు రోదిస్తూ, వేధనలతో శాపనార్దాలు పెడుతుంటారు. నిత్యం కార్పోరేట్‌ ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చిన్న చిన్న ఆపరేషన్లకు కూడా ప్రాణాలు తీస్తున్నారు. అందుకే వరంగల్‌ జిల్లా కేంద్రంలో వైద్యమంటేనే జనం జడుసుకుంటున్నారు. ఆసుపత్రుల పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. అర్దరాత్రి సమాచారమిచ్చి శవాన్ని తీసుకుపొమ్మని చావు కబురు చల్లగా చెబుతుంటారు. అయినా అధికారులు కదలరు. అలాంటి ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోరు. లంచాలకు వాళ్లు అలవాట పడపోయారు. ఎంత మంది ప్రజల ప్రాణాలు పోతే అన్ని లంచాలు వస్తాయని వారు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ మరణ మృదంగాలు ఎవరు ఆపాలి. అక్రమ వైద్యాల పని ఎవరు పట్టాలి. వైద్య శాఖ ఎప్పుడు కళ్లు తెరవాలి. ఇంకా ఎంత మంది ప్రాణాల పోవాలి?

…….
కార్పోరేట్‌ ఆసుపత్రులలో కాళరాత్రులు! ఎపిసోడ్‌-2

వరంగల్‌ లో వైద్యమంటే జనం జడుసుకుంటున్నారు.!

`అపెండిసైటిస్‌ ఆపరేషన్లు కూడా చేయలేని దౌర్భాగ్యులు వైద్యం చేస్తున్నారు

`ఫైల్స్‌ ఆపరేషన్లలో కూడా ప్రాణాలు తీస్తున్నారు

`ప్రైవేటు ఆసుపత్రులలో సాగుతున్న మరణ మృదంగాలు

త్వరలో మీ ‘‘నేటిధాత్రి’’లో ఎక్స్‌క్లూజివ్‌గా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!