జోరుగా కారు ప్రచారం

14వ వార్డులో ఇ.వి.ఎం లతో ఇంటింటికి ప్రచారం

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లో గురువారం రోజున 14వ వార్డు పరిధిలో బిఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలపు కోసం ఈ వి ఎం లతో ఇంటింటి ప్రచారం నిర్వ హించారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో ముచ్చటగా మూడో సారి చల్లా ధర్మారెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు అన్నారు.అరవై ఏళ్లలో ఇవ్వని హామీలు బిజెపి ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వస్తు న్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్,బిజెపి పార్టీ తెలంగాణలో నాయకులకే భరోసా లేదని ఇక ప్రజల్లోకి ఏ ముఖం పెట్టు కొని వస్తారన్నారు.తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ మూడవసారి కూడా భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రాబో తుందని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన అందు తుందన్నారు.పార్టీలక తీతంగా అన్ని వర్గాల సంక్షేమా నికి కృషి చేస్తున్న ప్రభు త్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు.కేవలం ఓట్ల సమయంలోనే ప్రతిపక్షాల నాయకులు కనిపిస్తారని,ఓట్లు అయి పోయాక ఐదేండ్ల వరకు కనిపించకుండా పోయారన్నారు.ఈ కార్యక్రమం లో వార్డు కౌన్సిలర్ ఉమాదేవి రఘుపతి గౌడ్,వార్డు అధ్యక్షులు బండి వెంకటేష్,మైనారిటీ యువ నాయకులు ఎండి అలీ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్దే లక్ష్మారెడ్డి ప్రచారాస్త్రం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పట్టణానికి తాను చేసిన అభివృద్దే ప్రధాన అస్త్రంగా జడ్చర్ల పట్టణం 21వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి,ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది,వాడ వాడలా గులాబీ జెండా రెపరెపలాడంది.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు,చేపట్టిన అభివృద్ధి గురించి వివరిస్తూ జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల్లో 30 తారీకు రోజు ఈవీయం పై రొండో నెంబర్ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి జడ్చర్ల నుండి భారీ మెజారిటీ ఇచ్చి పట్టణాన్ని మరింత అభివృద్ది చేసుకుందామని తెలిపారు.

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి:
శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ఉమ్మల్ల బాలరాజు మరణించారు మృతుని కుటుంబాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించి నివాళులు అర్పించారని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని మీడియా సెల్ కన్వీనర్ నందిమల అశోక్ తెలిపారు మంత్రి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాగం తిరుపతిరెడ్డి ఉన్నారని ఆయన తెలిపారు

బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

మరిపెడ నేటి దాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల రాంపురం గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి.నవీన్ రావు డోర్నకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డిఎస్ రెడ్యా నాయక్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు బిఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై , రాంపురం గ్రామానికి చెందిన ముదిరాజు నాయకులు బోళ్ల ముత్తయ్య కొండ ఉపేందర్ ఆధ్వర్యంలో పలువురు యువకులు, బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా నవీన్ రావు మాట్లాడుతూ మాట్లాడుతూ నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పక్ష పార్టీలకు ఓటేస్తే మోసపోయి గోసపడతామని తెలిపారు. బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఉందన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద ఐదు లక్షల బీమా, ప్రతి కుటుంబానికి సన్న బియ్యం, పేదింటి మహిళకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని కెసిఆర్ ప్రకటించారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తోమ్మిది ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంతో పాటు డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి పనులు తో మారిందన్నారు. ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే ఉంటున్న నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నానని, గతంలో ఏఎమ్మెల్యే చేయని అభివృద్ధి మన ఎమ్మెల్యే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. మరోక అవకాశం కల్పిస్తే రాష్ట్రంలోనే డోర్నకల్ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచుతానని తెలిపారు. ఈకార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,ఎంపీటీసీ కొమ్ము నరేష్,మండల రైతు సమన్వయ సమితి డైరెక్టర్ కొమ్ము చంద్రశేఖర్,బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బందు పరశురాములు,బిఆర్ఎస్ నాయకులు దోమల సత్తయ్య,రాంపల్లి చిన్న వెంకన్న,అనుమూల నాగిరెడ్డి, ఈరగాని రావన్న, హెల్ది చిన్న మల్లయ్య,డా నాగన్న,కొమ్ము ఐలయ్య,దోమల అశోక్,ఏడ్ల నరసయ్య,గ్రామ సోషల్ మీడియా గోనె మహేష్,రాంపల్లి రంజిత్,దోమల విష్ణు, గంగరబోయిన రమేష్,ఇరగని రమేష్,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో శ్రీ సత్య సాయి బాబా 98వ జన్మదిన వేడుకలు

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో శ్రీ సత్య సాయి బాబా 98 వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామనిశ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు పుల్లయ్య శెట్టి కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా పేదలకు బట్టలు చేశామని అనంతరం అన్నదానం ఏర్పాటు చేశామని సాయి శ్రీ సత్య సాయి బా బ జన్మదినోత్సవ వేడుకలు విజయవంతమైనందుకు వారు వర్షం వ్యక్తం

ఇవిఎం లతో ఇంటింటా ప్రచారం

ధర్మారెడ్డి ని బారిమెజారిటీ తో గెలిపించాలి-కౌన్సిలర్ సంపత్

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లోని ఒకటవ వార్డు లో ఇంటింటా ఈ వి ఎం లతో ప్రచారాన్ని కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ మరింత ముందుకు పోతుందని అమూల్యమైన ఓటును 30వ తారీఖున 3వ నెంబర్ మీద పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాళ్లు,వార్డు నాయకులు,బి ఆర్ ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఉల్లిగడ్డల మణెమ్మ,శ్రీశైలం కూతురు శిరీష వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు,వెంకటయ్య,సత్యం,మహేష్,పెంటయ్య,కృష్ణయ్య,కుమార్,జాఫర్, మన్నాన్, పర్వతాలు,శ్రీను,రాజు,యాదయ్య, సిద్దాపురం మైబు, బొంకూరు శ్రీశైలం, బొంకూరు శేఖర్,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి
చల్లా ధర్మ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని గురువారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణం 47వ బూత్ లో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ ప్రతి ఇంటింటికి తిరుగుతూ చల్లా ధర్మ రెడ్డి గెలిస్తేనే పరకాలకు అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని అన్ని రకాల కులమత అనే భేదాలు లేకుండా అందరికీ సమాన అభివృద్ధి అందిస్తాడని ఈనెల 30వ తారీఖున మూడో నెంబర్ పై ఓటు వేసి ముచ్చటగా హైట్రిక్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచి మంత్రి కూడా అవుతాడని ఇంకా అభివృద్ధి జరుగుతుందని మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు బోట్ల నరేష్ బూత్ అధ్యక్షులు మేకల దేవేందర్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రతి నాయకుడు కార్యకర్త పార్టీకి సైనికుల్లా పనిచేయాలి:మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి
23 నవంబర్

మల్కాజగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం నేరెడ్ మేట్ డివిజన్ లోని సరస్వతీ ఫంక్షన్ హాల్ లో బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ఎంబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ నందికంటి శ్రీధర్,ఇంచార్జీ కల్వకుంట్ల వంశీ శ్రీధర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి ఒక ఓటరు ఓటు వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్క ఓటరుని కలసి బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చెయ్యాలని,ప్రతి కార్యకర్త మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో పార్టీలో సముచిత స్థానం గుర్తింపు కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, జీకే. శ్రీదేవి, జీవకన్, కరంచంద్, వీరేశం యాదవ్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

పోడు రైతుల గోడు పట్టని పాయం

 

పోడు పట్టాలపై మాట్లాడడం ఆశాస్పదం

పాయం వెంకటేశ్వర్లు పోడు పట్టాలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పథకాలు మంచివి అన్న నువ్వే నేడు విమర్శించడం సరికాదు

బీఆర్ఎస్ గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోడు రైతుల గోడు చూడలేక పోడు పట్టాలను అందిస్తే మంగళవారం గుండాల మండలానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పోడు పట్టాలు చిత్తు కాయితాలతో సమానం అంటూ తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సరైంది అని బీఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. బుధవారం గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోడుగోడు పట్టని పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సరైందని అన్నారు. గతంలో తాను ఉన్నప్పుడు బీఆర్ఎస్ పథకాలు గొప్పగా చెప్పిన తానే నేడు కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆరోపణలు చేయడం ప్రజలు గమనించాలని అన్నారు. గ్రామంలో 25 కుటుంబాలు ఉంటే వాళ్లని ఏ పార్టీకి సంబంధమో తెలియకుండానే బీఆర్ఎస్ పార్టీ వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కండవల కప్పి షో చేశారే తప్ప తాను కొత్తగా సాధించిందేమీ లేదని అన్నారు. గతంలో ఎన్నికల సమయంలోనే పెద్దతోగు గ్రామానికి వెళ్లి హామీలు కురిపించి మరల ఈ ఎన్నికలకు ఆ ఊరు వెళ్ళాడు తప్ప గతంలో వాళ్లు ఎన్ని బాధలు పడ్డ తన కంటికి కనపడలేవా అని అన్నారు. పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే రేగా కాంతారావు పెద్దతోగు గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఐదున్నర కోట్లతో రహదారిని మంజూరు చేయించి టెండర్ను పూర్తి చేయించారని అన్నారు. పెద్ద తోగు గ్రామ సమీపంలో ఉన్న వాగుపై హై లెవెల్ వంతెన కోసం 8 కోట్ల రూపాయలను మంజూరు చేయించిన ఘనత రేగా కాంతారావు కె దక్కుతుందని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని పనులన్నీటిని ఇప్పుడు గెలిపిస్తే చేస్తానంటే ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు. అభివృద్ధి జరగాలంటే రేగ కాంతారావే మళ్లీ గెలవాలని పాయం వెంకటేశ్వర్లు గెలిస్తే పదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందని అన్నారు. వెన్నెల బైలు గ్రామంలో ఫారెస్ట్ అధికారులు ట్రంచ్ కొడుతున్నారని అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న పాయం వెంకటేశ్వర్లు కు ఫోన్ చేసి ఆపాలని విన్నవించుకున్నప్పటికీ అది మన చేతిలో లేదు ఏమి చేయలేము అక్కడి నుండి తిరిగి రావాలని మమ్ములను పిలిపించిన పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం లోకి తర్వాత వచ్చిన రేగా కాంతారావు హయాంలో వచ్చిన పోడు పట్టాలను చిత్తుకాయితాలతో పోల్చడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న పాయం వెంకటేశ్వర్ల నైజాన్ని ప్రజలు అర్థం చేసుకొని రానున్న ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం చెప్పాలని కోరారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి తోడ్పాటుగా నిలుస్తున్న రేగా కాంతారావు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పార్టీ అధికార ప్రతినిధి తిరుకోల్లూరి రాము, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, దొంగతోగు ఉప సర్పంచ్ పాపారావు, పార్టీ నాయకులు రాంబాబు, జోగ రాంబాబు, గాంధర్ల కిరణ్, గడ్డం వీరన్న, జాటోత్ అమృ, తదితరులు పాల్గొన్నారు.

మీరు మీటర్లు పెట్టలే…మేం నిధులియ్యలే!

https://epaper.netidhatri.com/

`ఇంతకాలం కేసిఆర్‌ చెబుతున్నదే నిజమైంది.

`నిర్మలా సీతారామన్‌ మాటలతో తేటతెల్లమైంది.

` రైతులపై కేంద్రం కపట నాటకం బయటపడిరది.

` కేంద్ర ఆర్థిక మంత్రే స్వయంగా చెప్పేసింది.

`మీటర్లు పెడితేనే రుణాలన్నది నిజమే…అని ఒప్పుకున్నది.

`మీటర్లు పెట్డమని తెగేసి చెప్పిన కేసిఆర్‌.

`అప్పులు ఆపిన నరేంద్ర మోడీ సర్కార్‌.

`దేశమంతా మీటర్లు పెట్టింది కనిపించడం లేదా?

`తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా?

` నిర్మలా సీతారామన్‌ తెలంగాణపై అక్కసు వ్యాఖ్యలు.

`బిజేపి కథ ఇట్లుంటే కాంగ్రెస్‌ కథ మూడు గంటలు.

`కర్ణాటకలో ఐదు గంటలిస్తున్నాం…తెలంగాణ లో మూడు గంటలు చాలంటరు.

`డిల్లీ పార్టీలను నమ్మితే నిండా ముంచుతరు.

`తెలంగాణ ను గోస పెడతరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

బిజేపి డొల్లతనమంతా తేటతెల్లమైంది. బిజేపి నేతలు మాటల గారడి బైటపడిరది. ఇంత కాలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిందే నిజమైంది. ప్రజలను మభ్యపెట్టాలని చూసిన రాష్ట్ర బిజేపి నేతల బండారం బైటపడిరది. వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెడితేనే రుణాలిస్తామని తెగేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వ మోసం ఎట్టకేలకు బైటపడిరది. ఇక ఇదిలా వుంటే దొంగే దొంగ అన్నట్లు కరీంనగర్‌లో బిజేపి అభ్యర్ధి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. కరీంనగర్‌ ప్రచారంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ మళ్లీ కేసిఆర్‌ వస్తే వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతుడు అన్నాడు. ఇంతకన్నా నీతి మాలిన ప్రచారం ఎక్కడైనా వుంటుందా? ఓ వైపు సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మేం చెప్పినట్లు కేసిఆర్‌ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని చెబుతున్నారు. అందుకే మేం డబ్బులు ఇవ్వలేదని కూడా తేల్చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు రైతులకు ఉచిత కరంటు ఇస్తే ఎలా? సంస్కరణలు ఎలా అమలు జరగాలి? అంటూ నిర్మలా సీతారామన్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ప్రశ్నించింది. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం సాగు మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే రుణాలు ఇవ్వలేదని కూడా తేల్చిచెప్పారు. రైతుల బోర్లుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిన వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా? ఎందుకు మీటర్లు పెట్టలేదని నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. కాని బండి సంజయ్‌ ఎప్పటిలాగే అబద్దాలను నమ్ముకున్నాడు. అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. మళ్లీ బిఆర్‌ఎస్‌ వస్తే రైతులు నష్టపోతారని అనడం అంత దుర్మార్గం ఏమైనా వుంటుందా? కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టమని తేగేసి చెప్పడాన్ని కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే ఏటా ఇవ్వాల్సిన రుణాలు కేంద్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేక సందార్భలలో చెబుతూనే వున్నారు. కేసిఆర్‌ బతికుండగా రైతులకు నష్టం జరగనివ్వని చెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అది కేంద్రానికి నచ్చలేదు. అలాంటి బిజేపి రైతులకు మేలు చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? గతంలో నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఒత్తిడిపై ప్రకటన చేశారు. అది ఎంత మాత్రం నిజం కాదని ఎమ్మెల్యే రఘునందన్‌, ఎంపి. అరవింద్‌ చెప్పారు. ఇప్పుడు వాళ్లు తెలంగాణ రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాల్సిన అవసరం వుంది. ఇంత జరుగుతున్నా బిజేపి నేతలు తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేయాలనే చూస్తున్నారు. తెలంగాణ ప్రజల మీద ఎలాంటి ప్రేమ రాష్ట్ర నేతలకు కూడా లేదని తేలిపోయింది. పొరపాటున బిజేపికి ఓటు పడితే, రైతులు మోటార్లు పెట్టుకోవడానికి సిద్దమని ఒప్పుకున్నట్లే అని కూడా బిజేపి ప్రచారానికి వెనుకాడదు. సరిగ్గా ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టడం లేదని చెప్పినా, బిజేపికీ ఓట్లు వేశారంటే రైతులు మా పక్షానే వున్నారని, మోటార్లు పెట్టాలని కూడ కోరుతారు.
కేవలం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు ఏర్పాటు చేయలేదన్న కోపంతో కేంద్ర ప్రభుత్వం రూ.35వేల కోట్లు ఆపడం జరిగినట్లు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు వెల్లడిరచారు.
అంటే తెలంగాణ మీద బిజేపికి ఎంత కక్ష వుందో అర్దం చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. అరవైఏళ్లు రైతులు గోసపడిన ప్రాంతం. వలసలు పోయి, కుటుంబాలు ఆగమైన ప్రాంతం. చుక్క నీరు లేక ఎండిపోయిన ప్రాంతం ఇప్పుడిప్పుడో కోలుకుంటోంది. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ కృషి చేస్తుంటే, కేంద్రం సహకరించాల్సిందిపోయి, మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు రైతులను బిజేపి గోస పెట్టాలని చూడడం భావ్యమా? కేంద్రం ఇచ్చే రూ.35వేల కోట్లకన్నా, మాకు 68లక్షల తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీటర్లు పెట్టలేదు. అదే పొరుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. తమిళనాడులో, కార్నాకట, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌లలో కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే రైతుల కోసం మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌. కేంద్రం ఒత్తిడిని కూడా లెక్క చేయలేదు. కేంద్రం రుణాలు ఆపేసినా పరవాలేదనుకున్నాడు. తమకు తెలంగాణ రైతులు ప్రయోజనాలే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌.
ఇదిలా వుంటే కాంగ్రెస్‌ కధ మరోలా వుంది.
ఓవైపు తెలంగాణవచ్చిన నాటినుంచి రైతులకు పూర్తి ఉచితంగా నాణ్యమైన 24గంటల కరంటు ఇస్తున్నారు. ఈ సంగతి పొరుగును వున్న కర్నాటక కాంగ్రెస్‌ నాయకులకు తెలియదు. ఎన్నికల ప్రచారం అని ఎగేసుకుంటూ వచ్చి, తెలంగాణలో అధికారంలోకి వస్తే తాము రైతులకు ఐదు గంటల కరంటు ఇస్తామని ప్రకటించగానే రైతాంగం కాంగ్రెస్‌ మీద భగ్గుమన్నది. కర్నాకటలో రైతులకు ఏడు గంటలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాని కరువు మూలంగా ఐదు గంటలే ఇస్తున్నాం. ఇక్కడ కూడా అలాగే ఐదుగంటలు ఇస్తామని చెప్పి,కాంగ్రెస్‌ తన పరువును తాను తీసుకున్నది. మరో వైపు రైతులు 10హెచ్‌పి మోటార్లు ఏర్పాటు చేసుకుంటే మూడు గంటల కరంటు చాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నాడు. రైతులకు 24గంటల కరంటు అవసరం లేదని బాష్యం చెబుతున్నాడు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో , మేమూ 24 గంటలు ఇస్తామంటూ కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్లుగా 24 గంటల కరంటు చూస్తూనే, రైతులకు మూడు గంటలు కరంటు చాలనే కాంగ్రెస్‌ను ప్రజలు నమ్ముతారా? వారిని ఆదరిస్తారా? కాంగ్రెస్‌, బిజేపిలు రైతుల పట్ల ఎంత చిత్తశుద్దితో వున్నారో తేలిపోయింది. ఆ పార్టీల నిజస్వరూపం తెలిసిపోయింది. రైతుల గురించి ఆలోచించేది కేవలం బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అన్నది రుజువైంది. రైతులకు అహర్నిషలు మేలు చేసేది కేవలం కేసిఆర్‌ మాత్రమే అన్నది రైతులకు కూడా పూర్తిగా అవగతమైంది.
దేశమంతా విద్యుత్‌ సంస్కరణలు తెచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో కూడా రైతుల వద్ద విద్యుత్‌ ఫీజులు వసూలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.
అయితే తెలంగాణ ఆ పనికి గండికొట్టింది. దాంతో కేంద్రం అప్పులు ఇవ్వడం లేదు. పైగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని బిజేపి పెద్దలు ఆరోపిస్తున్నారు. దేశంలో వున్న 28 రాష్ట్రాలలో తెలంగాణ అప్పులు కింది నుంచి ఆరో రాష్ట్రంగా మాత్రమే వుంది. కాని బిజేపి మసిబూసి మారేడు కాయ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేసే అప్పులలో సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు ఉచిత విద్యుత్‌, రైతు బంధు వంటి పధకాలు, ఇతర అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తోంది. కాని కేంద్రం పేద ప్రజలకు సేవ చేయాల్సిన అవసరాన్ని వదిలేసి, వ్యాపారులకు పదిలక్షల కోట్ల అప్పులు మాఫీ చేయడం గమనార్హం. ఆ పది లక్షల కోట్లతో దేశంలోని పేదలందరి జీవితాలు మారిపోయేవి. వారికి మౌలిక సదుపాయల కల్పన మరింత జరిగిదే. దేశంలో అందరికీ ఇండ్లు వచ్చేవి. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యులు కూడా లక్షాధికారులయ్యేవారు. రైతులకు మేలు చేస్తే మరింత పంటల దిగుబుడుల పెరిగేవి. మన వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు కూడా చేరేవి. కాని కేంద్రం ఆ పని చేయలేదు. పేరు మోసిన వ్యాపారులకు వారి అప్పులు మాఫీ చేసింది. దేశానికి అన్నం పెట్టే రైతున్నల నుంబి బిల్లులు వసూలు చేయాలనుకుంటోంది. ఇదీ కేంద్ర ప్రభుత్వానికి, బిజేపి పెద్దలకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తేడా…కేసిఆర్‌ పేదల పక్షపాతి. రైతుల సంక్షేమ వాది. రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడు, పాలకుడు. మరి బిజేపి… వాళ్లే సమాదానం చెప్పాలి.

రైతు బాంధవుడు కేసీఆర్‌

https://epaper.netidhatri.com/

విజయం ఖాయమైంది మెజారిటీ కోసమే ప్రయత్నం
60 ఏళ్ల అంధకారంపై…అభివృద్ధి సూర్యుడై పొడిచిన పాలకుడు కేసీఆర్‌
ఎడారిగా మారిన తెలంగాణను సిరుల తెలంగాణ గా మార్చిన అధిపతి..రైతు సంక్షేమ వారధి.
రైతు రాజ్యాన…కేసిఆర్‌ నజరాన!

`రైతు వరదాత కేసిఆర్‌…

`రుణ విముక్తి జరిగింది.

` రైతు బాంధువుడు…అపర భగీరధుడు.

స్వతంత్ర భారతాన రైతు కన్నీరు తుడిచిన ఏకైక నాయకుడు ‘‘కేసిఆర్‌’’ అని అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ’’నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న అంశాలు…ఆయన మాటల్లోనే.
`తెలంగాణ రైతులందరి పక్షాన కృతజ్ఞతలు.

`కేసిఆర్‌ మాటంటే మాటే…

`ఎంత కష్టమైనా నెరవేర్చుడే!

`రైతంటే ఎనలేని ప్రేమ వుండేది ఒక్క కేసిఆర్‌ కే!

` రైతు దిగులు తీరె…

`రైతు ఇంట ఆనందమే.

` రంది తీరిన రైతుకు సంబరమే.

`సంక్షేమ తెలంగాణ… పురోగతి గ్రామ, గ్రామాన.

` 31 లక్షల మంది రైతులకు లబ్ధి.

` 19 వేల కోట్ల సర్థుబాటు.

`అనూహ్యమైన నిర్ణయం.

` తెలంగాణ రైతుకు వరాల మూటలు.

` గత పదేళ్లలో రైతు కోసం ఊహకందని పథకాలు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

రైతు మనసు తెలిసిన నాయకుడు పాలకుడౌతే ఆ రాష్ట్రం ఎంత సుభిక్షంగా, ఎంత సుసంపన్నంగా వుంటుందో తెలంగాణను చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది. ఎందుకంటే కేసిఆర్‌ స్వతహాగా రైతు. ఆయనకు రైతు కష్టాలు తెలుసు. రైతు కన్నీళ్లు తెలుసు. సాగు కోసం ఎంత రైతు కష్టడతాడో తెలుసు. ఆరు గాలం శ్రమించినా, ఫలితం దక్కని నాడు రైతు వేదన ఏమిటో తెలుసు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కన్నీళ్లు కార్చే రోజులు ఎలా వుంటాయో తెలుసు. బంగారు పంటలు పండిద్దామనుకుంటే నీళ్లు లేకపోతే ఎంత కన్నీటి పర్యంతమౌతాడో తెలుసు. సాగు చేసేందుకు రొక్కం లేక ఎన్ని అవస్ధలు పడతాడో తెలుసు. అందుకే తెలంగాణ వస్తే గాని రైతు దుఖం తీరదని నిర్ణయం తీసుకున్న గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. పట్టుదలకు మారు పేరుగా ఆయన పట్టిన పట్టు విడవలేవు. తెలంగాణ సాధించేదాకా విశ్రమించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి. ఆయనకు రైతులంటే వల్లమాలిన ప్రేమ. గౌరవం. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని జలయజ్ఞం చేసిన గొప్ప మహర్షి కేసిఆర్‌. ఆయనను వేనోళ్ల పొగిడినా సరిపోదు. దేశమంతా ఆయన పేరు నినాదమైనా సరిపోదు. అంత గొప్ప గుణం వున్న నాయకుడు దేశంలోనే మరొకరు లేదు. కేవలం రైతు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్‌. పరిస్ధితులు అనుకూలించినప్పుడు ఎవరైనా పనులు చేస్తారు. కాని ప్రజల కోసం ఎంతటి ఇబ్బందులైనా ఎదుర్కొని పనులు పూర్తి చేయడం అన్నది ఎంతో గొప్పది. అందుకోసం కొన్ని దశాబ్ధాలుగా శ్రమ పడడడం అన్నది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం ఒక్క కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. నీటికెడ్చిన తెలంగాణ గోసను చూసి దుఖం తన్నుకొచ్చిన రోజులు చూసిన నాడు నా తెలంగాణ అంటూ కంటి తడిపెట్టుకున్నది కేసిఆర్‌. అసలే అరకొర వ్యవసాయం అనుకుంటే విద్యుత్‌ చార్జీల మోతతో తెలంగాణను ఎడారిగా మార్చే ఉమ్మడి పాలకుల కుట్రను ఎదుర్కొన్నది కేసిఆర్‌. అందుకే తెగించి 2001లో తెలంగాణ కోసం బయలు దేరి తెలంగాణ సాధించేవరకు అలుపెరగని పోరాటంచేశాడు. మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. ఎత్తిన పడికిలి దించలేదు. ఇప్పుడు పాలకుడిగాకూడా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలోనే తీసుకున్న నిర్ణయాలను వరసగా అమలు చేస్తున్నాడు. రైతు లోకం తెలంగాణలో సృష్టిస్తున్నాడు. ఒకనాడు ఎక్కడ చూసినా నెర్రెలు పారి, పడావు పడ్డ భూములు. మరి నేడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు. పండుతున్న బంగారు పంటలు. పదేళ్లలో ఎంత అధ్భుతం. ఎంత ఆశ్చర్యం. ఇలాంటి తెలంగాణ ఆవిష్కణ ఇంత తక్కువ సమయంలో జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రగతి పరుగులు ఎవరూ కలగనలేదు. కాని కేసిఆర్‌ మాత్రమే కలగన్నాడు. ఆ కలను నిజం చేసి చూపిస్తున్నాడు. అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , నేటిదాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వెలుబుచ్చిన విషయాలు. ఆయన మాటల్లోనే…
ఎన్నికల సమయంలో రైతు రుణ మాఫీ గురించి ప్రజలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిలబెట్టుకున్నారు.
తెలంగాణలో రైతు, సాగు గురించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారని మరోసారి నిరూపించారు. రైతు రుణమాఫీ మూలంగా తెలంగాణలోని సుమారు 31లక్షల మంది రైతులకు ఊరట కల్గుతుంది. అందుకోసం అవసరమైన రూ.19వేల కోట్ల రూపాయాలు సర్ధుబాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజునుంచే రుణమాఫీ అమలు చేస్తున్నారు. రైతు రుణ మాఫీ ఎప్పుడో జరిగిపోయేది. కాని మధ్యలో కరోనా కాలంలో రెండేళ్లపాటు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రైతు బంధు ఆగలేదు. ప్రాజెక్టుల పనులు నిలిచిపోలేదు. అందుకే కొంత కాలయాపన జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా, ఎవరూ ఊహించని అనేక పనులు, పధకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ తలరాతనే మర్చేశాడు. తెలంగాణను బంగారు నేలగా తీర్చిదిద్దారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వస్తుందని ఎవరూ ఊహించలేదు. దానితో ముడిపడినటువంటి అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందని అనుకోలేదు. తెలంగాణ నిండు కుండలా కరువులొచ్చినా సాగుకు కష్టం రాకుండా నీటి నిల్వలతో కళకళలాడుతుందని కలగనలేదు. చెరువు బాగు గురించి ఎవరికీ అవగాహన కూడా లేదు. కాని అవన్నీ నెరవేరాయి. తెలంగాణలోని సుమారు 46వేల చెరువులు పూర్వకళను సంతరించుకున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఎండిపోయిన చెరువులు మళ్లీ పురుడు పోసుకున్నాయి. నేనున్నానని గుర్తు చేస్తున్నాయి. చెరువే ఊరికి ఆదరువు అని పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. తెలంగాణ పల్లెలో పొలాలకు నీళ్లందిస్తున్నాయి. కుల వృత్తులకు ఆధారంగా నిలుస్తున్నాయి. చెరువులే మత్య్స సంపదకు ఆలవాలంగా మారిపోయాయి. తెలంగాణలో నీలి విప్లవానికి కూడా శ్రీకారం జరిగింది. రైతు బంధుతో రైతుకు భరోసా కలుగుతోంది. పండిన పంటలు పొలం గట్టునే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణ రైతు కాలు మీద కాలేసుకొని పాగు చేసుకునే పరిస్ధితి వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు ఎకరం భూమి వున్న రైతు జీవితానికి ఢోకా లేదు. ఐదెకరాల రైతు నేడు కోటిశ్వరుడౌతానని కలలో కూడా కలగనలేదు. అలా తెలంగాణ తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు రైతుల పక్షాన వేల వేల ధన్యవాదాలు.
నిన్నటి నా తెలంగాణ గుర్తుచేసుకుంటే కలలో గగుర్భాటు పడుతుంది.
దేశమంతా పచ్చగా తెలంగాణ మాత్రం ఎందుకు ఇలా ఎండిపోతోందని అనుకునేవాళ్లం. మధన పడేవాళ్లం. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరుకు అనంతపురం లాంటి జిల్లాలో పంటలు పండుతున్న తరుణంలో తెలంగాణలో ఎందుకు పంటలెందుకు లేదు? కనీసం తాగడానికి మంచినీళ్లు ఎందుకు లేవు? అరవై తెలంగాణ గోస పడిరది. నీటి చుక్కకు తండ్లాడిరది. గొంత తడవక తల్లడిల్లింది. సాగు లేక భూమి తల్లి విలవిలలాడిరది. రైతు బతుకు చిద్రమైంది. వానలు పడితే సాగు. అది కూడా ఆకాశం వైపు నిత్యం చూసుకుంటూ కన్నీళ్లతో సాలు తడిపిన కాలం. తొలకరిని చూసి మురిసిపోయి చేసుకునేసాగు. ఆ తర్వాత చినుకు జాడ లేకపోతే ఎండిపోతున్న సాలును కన్నీరొలికే సాగు. నీరు లేక వేసిన విత్తనం పురుగు తింటుంటే మోడు వారిని బతుకు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు కష్టం పగవాడికి కూడా రాకూడదనంత దుర్భరంగా వుండేది. ప్రజలకు తినడానికి తిండి లేక, చేయడానికి పనులు లేక, దేశాలు పట్టిపోయిన కాలం గుర్తు చేసుకుంటే తెలంగాణను సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ యుగపురుషుడుగానే చూడాలి. తెలంగాణ సాగును చూసి ఆయన పాలన స్వర్ణయుగంగా చెప్పుకోవాలి. గతంలో రాజుల కాలంలో గుప్తు కాలం స్వర్ణయుగమని చదువున్నాం. అదెలా వుంటుందో ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో చూస్తున్నాం. బంగారు తెలంగాణలో చూసి తరిస్తున్నాం. మురుస్తున్నాం. రైతు రాజుగా చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తుంటే ఇది నా తెలంగాణ అని సంబరపడుతున్నాం. నా తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను రైతులోకం కొలుస్తోంది. కేసిఆర్‌ నామస్మరణ చేస్తోంది.

అభివృద్ధి అంటే హైదరాబద్‌

https://epaper.netidhatri.com/

ప్రజలు మెచ్చిన పాలన ప్రగతి పథంలో ముందున్న పాలన కెసిఆర్‌ సుపరిపాలన

పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ!
పదేళ్ల లో తెలంగాణ అభివృద్ధి పై పారిశ్రామిక ప్రగతి గురించిఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే…

` హైదరాబాద్‌ చుట్టూ అద్భుతమైన ప్రగతి.

`తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ.

`ఐటిలో మేటి తెలంగాణ.

`తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు.

`ఫార్మాహబ్‌ గా తెలంగాణ.

`హైదరాబాద్‌ లో మరిన్ని సొగసులు.

`కొత్త కట్టడాలు.

`మహానగరంగా…విశ్వ నగరంగా

`పేరుమోసిన వ్యాపార సముదాలన్నీ హైదరాబాద్‌ లోనే.

`బిజినెస్‌ సమ్మిట్ల వేధిక.

`ప్రపంచ స్థాయి కంపెనీల మూల సంస్థలు హైదరాబాద్‌ లో..

`రజనీకాంత్‌ లాంటి వారు ఆశ్చర్యపోయామన్నారు.

`లండన్‌ లో వున్నానా అని చెప్పిన సినీ నటి లయ. Continue reading అభివృద్ధి అంటే హైదరాబద్‌

ఇంటింటా ప్రచారం నిర్వహించిన చల్లా జ్యోతి

పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సతీమణి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అధిక మెజారిటీ తో చల్లా ధర్మారెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ అభివృద్ధిపథకాలు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని వికలాంగుల పెన్షన్ గాని వింతౌత్ పెన్షన్ గాని ఆసరా పెన్షన్ గాని కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ రైతుబంధు రైతు బీమా బీసీ బందు మైనార్టీ బందు దళిత బంధు కుల సంఘాలకు కుల వృత్తులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాంటి మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ నెల 30న జరిగే ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటు చేయాలనీ పరకాల ను అభివృద్ధి చేయాలంటే ధర్మన్న నే సరైన నాయకుడని అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షులు సనత్ పటేల్, పరకాల పట్టణ మాజీ మహిళ అధ్యక్షురాలు గంట కళావతి, మహిళ నాయకురాళ్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల వేళ రైతుకన్నుల్లో ఆనందం

పొలాలల్లో వడ్ల కుప్పలు
. *ఐకెపి సెంటర్లు ప్రారంభం, మిగతావి కూడా ప్రారంభించాలి శాయంపేట నేటిధాత్రి

శాయంపేట మండలం మైలారం గ్రామంలో రైతుల ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేపడుతుంది. అదేవిధంగా వానకాలం సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంట కోతలు జరుగుతున్న ప్రాంతంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు చేయాలి.రైతులకు న్యాయం జరిగేటట్టు చూసుకోవాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో చివరి వరకు రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామంలోని రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు.

గులాబీ గూటికి చేరినకాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపెళ్లి జిల్లా చిట్యాలమండలం లోని నైన్ పాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడు రామగిరి రాజు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు యధండ్ల గణేష్ యాదవ్ లను ఆహ్వానించి సోమవారం రోజున బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్,ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొడుగు విజేందర్ యూత్ అధ్యక్షులు గుండు నగేష్ గొర్రె అనిల్ యాదవ్ ఉన్నారు.

అంతర్జాతీయ బాలల దినోత్సవం

నడికూడ,నేటి ధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజున అంతర్జాతీయ బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ నవంబర్ 20 1989న బాలల హక్కులపై కన్వెన్షన్ ను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిందని ఇట్టి ప్రత్యేక రోజును అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం గా జరుపుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికను భారతదేశం డిసెంబర్ 11, 1992 నాడు అంగీకరించిందని అన్నారు.తదనుగుణంగా పిల్లల హక్కుల రక్షణకై భారతదేశం బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చట్టం(సిపిసిర్) జనవరి 20,2006 నాడు అమల్లోకి తెచ్చిందని, బాలలందరూ వారి యొక్క హక్కులు సంపూర్ణంగా పొందేలా కృషి చేస్తామని, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ చేయాలని, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచన చేసిందని అన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు, బాలల హక్కుల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్యా, విద్యా వాలంటీర్లు బాబురావు పర్శవేని జ్యోతి, ఐఆర్పి రమేష్ ఆయాలు అరుణ,సుశీల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులే ఎమ్మెల్యే చల్లా

న డి కూడ, నేటి ధాత్రి:
కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.నడికూడ మండలంలోని కంటాత్మకూరు, రామకృష్ణాపురం గ్రామంలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు.అనంతరం
ఎమ్మెల్యే మాట్లాడుతూ అరవై ఎండ్లు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే పేదల బాధలను, పేదల కడుపును నింపాలని, రైతులకు పొలాలకు నీరివ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ రాలేదన్నారు,తెలంగాణను నాశనం చేశారన్నారు,మళ్లీ ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ అధికారం కోసం మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు.ఈ ఎన్నికల తర్వాత
కాంగ్రెస్,బిజెపి పార్టీలు తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతాయన్నారు.
నేడు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తేనే సాధ్యమవుతుందన్నారు.ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచన చేయాలి గత పది ఎండ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గమనించాలి.పనిచేసే వారికి పట్టం కట్టాలని కోరారు.పరకాల నియోజకవర్గంలో సిఎం కేసీఆర్ సహకారంతో కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటుచేసుకున్నాం అందులో నిర్మానవుతున్న కంపెనీలలో నియోజకవర్గంలోని యువతకు,మహిళలకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మొదటి బాలెట్ లో మూడో నంబర్ పైన ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్థులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

చీకట్లో ఓట్ల కొరకు కాంగ్రెస్ ప్రమాణం.

పనిచేస్తే ఓటు వేస్తారు,ఓట్ల ప్రమాణం చేపించుకోవడం ఏమిటి

ప్రచారాల పేరుతో ప్రమాణాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా.!?

అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, నేటి ధాత్రి గత నెల నుండి ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంది.

ప్రధాన పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ లపై ఓటర్లకు నమ్మకం లేదు అనడానికి ప్రమాణాలు సాక్ష్యం.!?

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

మంథని నియోజకవర్గ ప్రజలకు మరియు ఓటర్లకు నేటి ధాత్రి గత 20 రోజుల నుండి ఎన్నికల నగర మోగిన అనంతరం ఓటర్లలో చైతన్యం కొరకు నిష్పక్షంగా ఓటును వినియోగించుకోవాలని గారడీలకు ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని నేటి ధాత్రి వరుస ప్రజల్లో చైతన్యం కొరకు కథనాలను అందిస్తూ ఓటర్లకు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల వ్యవహారాలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. చివరికి నేటి ధాత్రి అక్షరాలు వాస్తవాలుగా తిరపతి కి రావడం జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి మంథని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పక్షాన ఓట్లు వేయాలని ప్రమాణాలు చేపిస్తున్న వీడియో తెరపైకి రావడం జరిగింది. నియోజకవర్గ ఓటర్లు మరియు ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనించాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీ అభ్యర్థులు పార్టీకు సంబంధించిన వ్యక్తులు ప్రజల వద్దకు వెళ్లి తమ పక్షాన ఓట్లు వేయాలని ఊరుకోవడమే తప్ప ప్రమాణాలు ప్రతిజ్ఞలు చేయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కానీ ప్రజలపై ఆ పార్టీకి నమ్మకం లేకపోవడంతో దేవుళ్ళ పేరు మీద ప్రమాణం చేయించి అభ్యర్థి జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి ఎన్నికల కమిషనర్ కు సవాల్ విసిరేటట్టుగా కనబడుతుంది.

చీకట్లో ఓట్ల కొరకు కాంగ్రెస్ ప్రమాణం.

నేటి ధాత్రి చెప్పినట్లే ఒక్కొక్కటి సాక్షాలుగా తెరపైకి రావడం అర్ధరాత్రి పెద్ద మొత్తంలో మహిళను గుమ్మి గూడించుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎం ఎల్ ఏ అభ్యర్థి గెలుపు కొరకు మీరు ఓట్లు వేయాలని మహిళలతో వారి ఆధ్యాత్మిక దేవుళ్ల పై ప్రమాణం చేయించి జై కాంగ్రెస్ అన్న నినాదాల వీడియో ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. మంథని నియోజకవర్గం అసెంబ్లీ పరిధిలోని మహదేపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో శనివారం అర్ధరాత్రి మహదేవ్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు సుమారు వందకు పైబడి మహిళలను ఒక్కచోటకు చేర్చి ఎంపీపీ మహదేవ్పూర్ మేము పెద్దంపేట గ్రామ మహిళలము మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఎంఎల్ఏ అభ్యర్థి శ్రీధర్ బాబుకు కు తమ ఓటు వేస్తామని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము అని ప్రమాణం మరియు ప్రతిజ్ఞ మహిళలతో చెప్పించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాణం చేసిన వీడియో నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఒక మండల పరిషత్ అధ్యక్షురాలు మండలంలో ప్రజలకు తమ పార్టీకి మీ ఓట్లు అందించి సహకరించండి అని ప్రచారం చేయాల్సిన ఎంపీపీ దేవుని పేరుతో తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని మహిళలతో ప్రమాణాలు చేయించిన వ్యవహారాన్ని నియోజకవర్గ ఓటర్లు ప్రజలు తప్పుబడుతున్నారు.

పనిచేస్తే ఓటు వేస్తారు,ఓట్ల ప్రమాణం చేపించుకోవడం ఏమిటి.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంథని నియోజక వర్గం ఎన్నికలవేళ ప్రమాణాలతో ఓట్లు అడగడం అనే ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకువచ్చిందేమో ఇది ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం కాదా అని చర్చించుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని ప్రజల్లో తీసుకువెళ్లి నిర్భయంగా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్దంపేట గ్రామంలో చేసిన పనిని చూపించి తమకు ఓట్లు వేసి విజయాన్ని అందించాలని చెప్పవలసిన ఎంపీపీ దేవునిపై ప్రమాణం చేయించి మనస్ఫూర్తి ఆత్మసాక్షిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రమాణం చేయించడం ఏమిటి, ఈ వ్యవహారాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గంలో ప్రజలకు గ్రామాలకు ఏమైనా పనులు చేసిందా లేక ప్రమాణాలకు పరిమితమై ఓట్లు వేయించుకునే క్రమంలో ఉందా అన్నట్లుగా ఉంది ఈ ప్రమాణాల వ్యవహారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని చూసి నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేస్తారు, కానీ ప్రజా ప్రతినిధులు వెళ్లి అమాయక మహిళలను పెద్ద మొత్తంలో ఒకచోటు చేర్చి కాంగ్రెస్ పార్టీకి మీ దేవుని పేరు మీద ఒట్టేసి ఓటు వేస్తామని ప్రమాణం చేయించుకుంటే అమాయక మహిళలు దేవుడు మీద ప్రమాణం చేసి ఉన్నాము కదా లేకుంటే తమకు భవిష్యత్తులో ఏమవుతుందో నని భయభ్రాంతులకు గురై కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓట్లు వస్తాయని ఆలోచనతోనే ప్రమాణాలు చేయించు కుంటున్నారేమో అని చెప్పడంలో సందేహం కాదు సాక్ష్యమే నియోజకవర్గ ప్రజల ముందు ఉంది.

ప్రచారాల పేరుతో ప్రమాణాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా.!?

ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు సుమారు 28 రోజులు అభ్యర్థులకు నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి వారు గతంలో నియోజకవర్గంలో ఎంఎల్ఏ లుగా కొనసాగితే మీరు ప్రజలకు చేసిన సేవలను వారి దృష్టిలో పెట్టి తిరిగి గతం కంటే రాబోయే రోజుల్లో మంచి పని చేస్తామని, అలాగే ఇతర పార్టీ మరియు స్వతంత్ర అభ్యర్థులు భవిష్యత్తులో ప్రజలకు ఒక సిపాయిలాగా బడుగు బలహీన కుల మత భేదం లేకుండా పట్టణాలు గ్రామాల్లో అభివృద్ధి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల వద్దకు అందేలా ప్రజల్లో ఒక వ్యక్తిగా ప్రజలకు సహాయ సౌకర్యాలు అందించేలా చేస్తాము తమకు మీ ఓటుతో ఆశీర్వదించండి అని ప్రజల్లో అభ్యర్థులు భవిష్యత్తు తో పాటు గతంలో చేసిన పనులను వివరిస్తూ తమకు ఓటు వేయాలని కోరడం కొరకు ఎన్నికల సంఘం ప్రచారాల కొరకు సమయాన్ని ఇచ్చింది. కానీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మాత్రం ప్రచారాల సమయంలో ప్రమాణాలు చేయిస్తూ అమాయక మహిళలను ఆధ్యాత్మిక దేవుళ్ల పై ప్రమాణం చేపించి గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభాలకు గురి చేస్తూ ప్రచారం పేరుతో ప్రమాణాలు కొనసాగించడం కచ్చితంగా తమకే ఓట్లు వేయడానికి దేవుళ్లపై ప్రమాణాలు చేయించుకోవడం ఒకవైపు ఆశ్చర్యానికి గురి చేస్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎప్పుడు వచ్చి తమతో ప్రమాణం చేపించుకుంటారేమో నియోజకవర్గ ఓటర్లు కాస్త భయందోళన కు గురయ్యే పరిస్థితి ఈ దారితీస్తుంది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల వ్యవహారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల నిబంధనలను ప్రచారంలో ప్రమాణాలు చేయించుకోవడం నిబంధనలో వస్తుందా లేక నిబంధనలకు విరుద్ధఎం అనేది ఎన్నికల అధికారులే నిర్ణయించాలి.

అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, నేటి ధాత్రి గత నెల నుండి ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంది.

నియోజకవర్గ ప్రజలకు నేటి ధాత్రి గత 25 రోజుల నుండి రాజ్యాంగం అందించిన అమూల్యమైన ఓటును ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నిర్భయంగా నియోజకవర్గ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు చైతన్యవంతం చేస్తూ రాజకీయ పార్టీల వ్యవహారాలను నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతూ ప్రజలకు మరియు ఓటర్లకు వాస్తవాలతో చైతన్యం తీసుకువచ్చే విధంగా కథనాలు అందిస్తున్న నేటి ధాత్రి నేడు ప్రధాన పార్టీల వ్యవహారం కూడా ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుంది. చివరికి నీటి ధాత్రి చెప్పిందే వాస్తవాలు తెర పైకి రావడం జరుగుతుంది. ప్రధాన పార్టీల మాయలో పడద్దని అమాయక ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తుందని గత 20 రోజుల నుండి నేటి ధాత్రి, చెప్పుకుంటూనే వస్తుంది, చివరికి అదే సాక్ష్యంగా అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి చీకట్లో మహిళలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని దేవుడు మీద ప్రమాణం చేయించిన వ్యవహారం నియోజకవర్గ ఓటర్ల ముందు ఉంది. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలు ఓటర్లు తమ ఓటు వినియోగించుకునే విషయంలో ఒక నిష్పక్షంగా మీ సమస్యలను పరిష్కరించే వ్యక్తిని మీ ఓటు హక్కుతో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రమాణాలు చేయించుకునేవారు రేపు భవిష్యత్తులో మీకు ఆధ్యాత్మికంగా మీ దేవుళ్లను సాక్షిగా పెట్టి పని అడుగుతే ఒట్టు వేసుకునే పరిస్థితి వరకు దారితీస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీ ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రధాన పార్టీ కాంగ్రెస్,టిఆర్ఎస్ లపై ఓటర్లకు నమ్మకం లేదు అనడానికి ప్రమాణాలు సాక్ష్యం.

ప్రస్తుతం మంథని నియోజకవర్గం లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి లపై ప్రజలకు నమ్మకం లేదు అనడానికి పెద్దంపేట గ్రామంలో ప్రమాణం చేయించడమే సాక్ష్యం. నియోజకవర్గాన్ని కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీలు పరిపాలించినప్పటికీ నేడు ప్రజల్లో ఏ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు అనేది కేవలం ఎన్నికలు తొమ్మిది రోజులు ఉన్నప్పటికీ స్పష్టత లేకపోవడం తో పాటు పార్టీలో ప్రజా ప్రతినిధులుగా కొనసాగే వ్యక్తులు గ్రామాల్లో వెళ్లి అర్ధరాత్రి వేళ దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ఆత్మ సాక్షిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రమాణాలు చేసుకునే పరిస్థితికి రావడం జరిగిందంటే ప్రధాన పార్టీల వ్యవహారం అభ్యర్థులపై నియోజకవర్గ ఓటర్లలో నమ్మకం లేదన్నడానికి దీనికంటే బలమైన సాక్ష్యం అవసరం లేదు. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు పాలించినప్పటికీ కూడా గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గంలోని ప్రజలకు సేవలు అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్న పార్టీ అభ్యర్థులు మరి వారు చేసిన పనికి నియోజకవర్గ ప్రజలు ఓటు వేయక తప్పదు కానీ దేవునిపై ఒట్టేసి తమ పార్టీకి ఓటు వేయాలని ప్రమాణం ఎందుకు చేయించు కుంటున్నారు. ప్రజలకు పార్టీలపై నమ్మకం లేదా లేక పార్టీలకు ప్రజలపై నమ్మకం లేదా అనేది ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్న వ్యవహారం కానీ వాస్తవం ఏమిటంటే ప్రధాన పార్టీకు నియోజకవర్గ ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి తమ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కొరకు మహిళలతో దేవుని పేరుపై ప్రమాణం చేసుకొని ఓటు వేయించుకునే ప్రయత్నం అన్నది వాస్తవం.

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి.ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండల కేంద్రానికి పల్లె మల్లేష్(40) అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, సర్పంచ్ బచ్చిరెడ్డి, ఎక్స్ ఎంపీపీ నర్సింలు, కో ఆప్షన్ ఆల్తాఫ్ బేగ్, బిఆర్ఎస్ పార్టీ ఉపద్యక్షులు రాచమల్ల యాదగిరి, మాజీ ఏఎంసి డైరెక్టర్ దేవేందర్, భీమగండ్ల నర్సింలు, అల్లే శ్రీనివాస్, పాల్కొండ నవీన్, అంజనేయులు బిఆర్ఎస్ నాయకులు, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version