ఎల్తూరి ఆధ్వర్యంలో ఘనంగా మాయవతి జన్మదిన వేడుకలు

పరకాల నేటిధాత్రి
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పరకాల పట్టణంలో సాయి కన్వెన్షన్ లో పరకాల అసెంబ్లీ అధ్యక్షులు ఎల్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జనకళ్యాణ్ దివాస్ బేహన్ జి మాయావతి జన్మదిన వేడుకలు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఎస్పి పరకాల అసెంబ్లీ ఇంచార్జ్ ఆముదాల పెళ్లి మల్లేశం గౌడ్,పరకాల అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఎండి అంజద్ పాషా ల్,పరకాల మండల బీసీ సంఘం నాయకులు విష్ణు,రాజేందర్ ఎస్టి సంఘం నాయకులు పాలకుర్తి విగ్నేశ్వర్ ల్,అధ్యక్షులు పెండేల మహేందర్,ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి సర్వర్,భాష, ఫాతిమా పాల్గొని మహనీయులకు ఘన నివాళులర్పించారు.

మెరుగైన వైద్యం కోసం ఆర్థికసహాయం చేసిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని మాధారం గ్రామానికి చెందిన సుధమల్ల స్వప్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలంటూ స్వప్న తండ్రి రాజయ్య తో పాటు కుటుంబ సబ్యులు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ను ఆశ్రయించగా అనారోగ్యానికి గురైన స్వప్న పరిస్థితిని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి శ్రీనివాస్ తెలుపగా వెంటనే స్పందించి స్వప్న కి వైద్య ఖర్చులకు గాను (250000) రెండు లక్షల యాబది వేల రూపాయల ఎల్ఓసి చెక్కును ప్రభుత్వం నుండి మంజూరు చేయించారు.అట్టి ఎల్ఓసి చెక్కును హనుమకొండ లోని వారి నివాసంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ తో కలిసి బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అందించారు.

కాంగ్రెస్‌ హమీలు..అరుంధతి నక్షత్రమే!

https://epaper.netidhatri.com/

నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై ‘‘మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే..

`పథకాలు మంగళం సమర్పయామి అనుకోవడమే!

`పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే.

`మమ.. అనుకొని చేతులు దులుపుకోవడమే!

`కూర్చునేది లేదు…కుదురుకుంటున్నట్లు లేదు!

`సీటు కాపాడుకోవడం కోసం కూడా సమయం సరిపోయేట్టు లేదు.

`రెండు లక్షలు అప్పు చేసుకోమన్నారు…రాగానే మాఫీ మర్చిపోయారు.

`రైతుభరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు.

`ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు.

`అసెంబ్లీ సాక్షిగా ఇస్తామని ఎక్కడా చెప్పలేదని తేల్చేశారు.

`మహిళలకు అన్ని బస్సు సర్వీసులు ఫ్రీ అన్నారు…పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌కు పరిమితం చేశారు.

`హైదరాబాద్‌, డిల్లీ యాత్రలకే పుణ్య కాలం పోతోంది.

`చీమ చిటుక్కుమన్నా డిల్లీకే వెళ్లాలి.

`అడుగుముందుకేయాలన్నా అధిష్టానాన్ని అడగాలి.

`సంక్షేమం గాలికి…కాంగ్రెస్‌ నేతల పరుగులు డిల్లీకి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

గాలి వానకు గొడుకు పడితే ప్రయోజనం వుంటుందా? ముళ్లకంచెను నీటిలో నాటితే నాటుకుంటుందా? కాంగ్రెస్‌ పరిస్ధితి కూడా అంతే… కాంగ్రెస్‌ను నమ్ముకున్న తెలంగాణ అరవైఏళ్లు గోసపడిపంది. అందుకే తెలంగాణ కోసం కేసిఆర్‌ కొట్లాడిరది. తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తెలంగాణలో వెలుగులు నింపింది. కొన్ని సార్లు ప్రజలు కూడా మాయలో పడిపోయే అవకాశం వుంటుంది. అయితే అది తాత్కాలికమే. ఎల్లకాలం ప్రజలను ఎవరూ మోసం చేయలేదు. కాంగ్రెస్‌ చేసిన మోసం అధికారంలోకి వచ్చిన మరునాడే తేలిపోయింది. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీల మీద సంతకాలన్నారు. తెలంగాణ ప్రజలు కొంత నమ్మారు. దాంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయినా కాంగ్రెస్‌లో మార్పు రాలేదు. మారు కావాలని పదే పదే తెలంగాణ ప్రజలకు చెప్పి,నమ్మించిన కాంగ్రెస్‌ పార్టీ మారిందా? అంటే మారలేదు. గతం తాలూకు బాగోతాలు మర్చిపోలేదు. అందుకే తొలి రోజు నుంచే పాలన గాలికొదిలేశారు. రాజకీయం మాత్రమే చేస్తున్నారు. అసలు అధికారంలోకి వచ్చామన్న నమ్మకం వారికే లేదు. అందుకే సంక్షేమం గాలికి వదిలేశారు. రైతులకు ఇచ్చిన హమీలు మర్చిపోయారు. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతాంగ సంక్షేమం, తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం పనిచేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీ తన ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం అన్నది మర్చిపోయింది. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్న సమయంలో నీటి పారుదల ప్రాజెక్టు గేట్లు ఎత్తితే గంగమ్మ ఉరకలెత్తి, పరుగు పరుగున పొలాలకు చేరినట్లు, రైతు బంధు వేయగానే ట్రింగ్‌, ట్రింగ్‌ మంటూ రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం పడేది. మరి ఇప్పుడు ఎవరు ఏం చెబుతున్నారో అర్ధం కావడం లేదు. ముఖ్యమంత్రి రైతు భరోసా వేశామంటాడు. మరో మంత్రి రైతు భరోసా వస్తుందంటాడు..మరో మంత్రి వేస్తామంటాడు..ఇందులో ఎవరి మాటలు నిజమో వాళ్లుకే తెలియకుండా పోయింది. తెలంగాణ రైతులకు సంకటంగా మారింది. అంటున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై పంచుకున్న ఆసక్తి కరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, మాయ చేసి, పదే పదే అబద్దాలు వల్లెవేసి, చెప్పిందే చెప్పి, అధికారంలోకి వచ్చారు. వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజలను మోసం చేస్తున్నారు.
వారి చేతగాని తనం కప్పిపుచ్చుకోవడానికి బిఆర్‌ఎస్‌మీద లేని పోని అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ నెల రోజులు గడిపేశారు. ఇక ఇంకా ఎలా కాలం గడపాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ పేరు చెప్పి మరింత కాలం పబ్బం గడుపుకోవాలని మాత్రమే చూస్తున్నారు. కాని ప్రజలకు మేలు చేసే అంశం మర్చిపోయారు. ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశమిచ్చారు. ఒక్క ఛాన్స్‌..ఒక్క ఛాన్స్‌ అంటూ గత ఏడాది కాలంగా ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వేడుకుంటూ వచ్చారు. అయినా ప్రజలు కనికరించేట్లు కనిపించలేదు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు లేని పోని, అలవి కాని హామీలను గుప్పించారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలనే కాపీ కొట్టి, కొత్తగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రజలను ఏదో విధంగా నమ్మించారు. అధికారంలోకి వచ్చి పట్టుమని పది రోజులు కాకముందే ప్రజా గ్రహానికి గురయ్యారు. గతంలో ఇలా పది రోజలకే ప్రజల నుంచి ఇంతటి వ్యతిరేక ఎదుర్కొన్న ప్రభుత్వం ఏదీ లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన విధానానికి, అదికారంలోకి వచ్చి అనుసరిస్తున్న ఆచరణకు పొంతన లేదు. అందుకే ప్రజలకు కూడా పది రోజులకే కాంగ్రెస్‌ పాలన ఎలా వుంటుందో అర్ధమైంది. అప్పుడు ప్రజల తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్‌ అంటేనే కరంటు కష్టాలు, ప్రజలకు నష్టాలు..రైతులకు ఆపసోపాలు..అన్ని వర్గాల ప్రజలను అయోమయానికి గురిచేయడమే… గతంలో చూసినవే… యాభై ఏళ్లు ప్రజలు అధికారమిచ్చినా ఎలాంటి సంక్షేమాలు అమలు చేయని, కాంగ్రెస్‌, ఒక్క ఛాన్స్‌ ఒక్క ఛాన్స్‌ అని వేడుకుంటున్నప్పుడే బిఆర్‌ఎస్‌ చెప్పింది. కాంగ్రెస్‌ మాటలు నయవంచనకు రూపాలని పేర్కొనడం జరిగింది. అయినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను కనికరించి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌ హామీలు అరుంధతీ నక్షత్రమే.. పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే అని మరోసారి రుజువైంది. కాంగ్రెస్‌ పథకాలు మంగళం సమర్పయామీ! అన్నదే ఇక వినపడేది.. ముమ్మాటికీ నిజమయ్యేది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైంది.
ఇచ్చిన హామీలలో రెండిరటిని చూపించి మమ అనిపించడం తప్ప చేసేదేమీ లేదు.
సరిగ్గా పాలనపై దృష్టిపెట్టేది లేదు. పెట్టేంత సమయం కాంగ్రెస్‌ నాయకులకు లేదు. ఎంత సేపు కుర్చీ కాపాడుకోవడం కోసం ఆరాటం మాత్రమే వుంటుంది. ప్రజలకు మేలు చేసే ఆలోచనలు కూడా వచ్చేందుకు సమయం వుండదు. కుర్చీలో కూర్చునేందుకు ఎలాంటి రాజకీయాలుచేశారో..ఎలాంటి మభ్యపెట్టే మాటలు చెప్పారో…కుర్చీ కాపాడుకోవడానికి కూడా అవే మాటలు చెబుతారు. కుర్చీలను అంటిపెట్టుకొని వుంటారు. ప్రజలకోసం ఆలోచించే తీరిక చేసుకోరు. పట్టుమని నెల రోజుల కాకముందే లుకలుకలు. కుదురుకోకముందే కుర్చీలాటలు. వాటిని కాపాడుకునేందుకు ఎత్తుగడలు. అనునిత్యం కుర్చీలకు కాపలాలు ..ఇక ప్రజల బాగోగులు ఎలా చూస్తారు.. కుర్చీలాటతో నెంబర్ల లెక్కలు వేసుకుంటున్నారు. పరిపాలన చేస్తామని వేడుకుంటే, అవకాశమిస్తే కుర్చీల కోసం అప్పుడే అంతర్గత కుమ్ములాటలను చూపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజల మేలు ఏనాడు పట్టించుకోరు..గతం చెప్పిన సత్యమే ఇది…గతంలోకి తొంగిచూస్తే కనిపించే నిజాలివే…
అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు ఆశలు కల్పించారు.
ఇప్పుడు మీన మేషాలు లెక్కిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే తాము నిజాయితీగా చెప్పిన మాటలన్నా, కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన అబద్దాలు కొంత మేర నమ్మారు. దాంతో రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రైతులను ఒక రకంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను రెచ్చగొట్టారు. వెళ్లి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొమ్మని చెప్పారు. అయితే రెండులక్షల రుణం ఎలా ఇస్తారన్న సోయి కూడా లేకుండా చెప్పిన కాంగ్రెస్‌ మాటలను రైతులు నమ్మడమే పాపమైంది. నమ్మితేనే కదా! మోసం చేసేది అన్నట్లు కాంగ్రెస్‌ నాయకులు చెప్పిన మాటనే పదే పదే చెప్పి గోబెల్స్‌ ప్రచారం చేశారు. జనాన్ని బురిడీ కొట్టించారు. రెండు లక్షల రుణమాపీ సాధ్యం కాదని కాంగ్రెస్‌ నాయకులకు కూడా తెలుసు. అధికారంలోకి రావాలంటే ఇలాంటి అబద్దాలు చెబితే తప్ప తెలంగాణ ప్రజలు నమ్మేలా లేరని చెప్పారు…అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పినన్నీ అలవి కాని హామీలే… చేతులెత్తేసేవే అని మేం మొదటి నుంచి హెచ్చరించినవే..అయినా జనం కాంగ్రెస్‌ను నమ్మారు. ఎలా చెప్పారంటే డిసెంబర్‌ 9 నాడే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పడంతో ప్రజలు కూడా నమ్మారు. అంతే తప్ప కాంగ్రెస్‌ను పూర్తిగా విశ్వసించలేదు. గత కాంగ్రెస్‌ చరిత్రలు ప్రజలకు బాగాతెలుసు. పల్లె ప్రజానికం కొంత అమయకులు. అందుకే వారిని సులభంగా మోసం చేయగలిగారు. అదే అర్భన్‌ ప్రజలు కాంగ్రెస్‌ను అసలే నమ్మలేదు. బిఆర్‌ఎస్‌ అభివృద్ధి నమూనాను చూశారు. పదేళ్ల క్రితం తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు ఎంత తేడా వుందన్నదానిని గుర్తించారు. ఈ అభివృద్దికి బ్రేక్‌ పడొద్దని విశ్వసించారు. బిఆర్‌ఎస్‌కు అర్భన్‌ ప్రాంతాలు మద్దతుగా నిలిచాయి. కొన్ని విషయాలు తాము కూడా ప్రచారం చేసుకోలేదు. 2019 తర్వాత సుమారు 7లక్షల రేషన్‌ కార్డులు ఇవ్వడం జరిగింది. కాని కాంగ్రెస్‌ పార్టీ రేషన్‌ కార్డులు ఇవ్వలేదని చేసిన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. నెల గడుస్తున్నా రైతు భరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పడం లేదు. ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని తేల్చేశారు. ఎన్నికల ముందు అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. రెండిరటికి పరిమితం చేశారు. తొలి పధకంలోనే కోత కోశారు. హైదరాబాద్‌ నుంచి డిల్లీకి యాత్రలకే పుణ్యకాలం గడిచిపోతుంది. చీమ చిటుక్కుమన్నా డిల్లీకి వెళ్లాలి. అడుగు ముందుకేయాలన్నా అధిష్టానాన్ని అడగాలి. సంక్షేమంగాలికి..కాంగ్రెస్‌ నాయకుల పరుగులు డిల్లీకి..ఇంతే కాంగ్రెస్‌ పాలన..ఇంతకు మించి ఒక్క అడుగు కూడా వేయలేని అబద్దాల లాలన. తెలంగాణ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.

కీళ్ల వ్యాధి బాధితుడికి ఎల్వోసి అందజేసిన ఎంపీ వద్దిరాజు

ఖమ్మం, జనవరి, 13:

కీళ్ల వ్యాధి కారణంగా తొంటి ఎముకల ఆపరేషన్ కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బాధితుడికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం ఖమ్మంలో ఎల్వోసి లేఖను అందజేశారు. నగర శివారు ధంసలాపురం కొత్త కాలనీకి చెందిన రవీంద్ర బాబు ఆర్థరైటిస్ వ్యాధి కారణంగా తొంటి ఎముకలు దెబ్బతిని సక్రమంగా నడవలేని, కూర్చోలేని స్థితికి వచ్చాడు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్యులు బాధితుడికి పరీక్షలు నిర్వహించి.. ఆపరేషన్ అవసరమని సూచించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రవీంద్ర బాబు ఎంపీ రవిచంద్ర ను ఆశ్రయించగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్ ఓసి కొరకు లేఖ రాశారు. ఆయన సిఫారసు మేరకు ప్రభుత్వం రూ. 1 లక్ష మంజూరు చేస్తూ.. ఎల్వోసి జారీ చేసింది. ఈ మేరకు ఆ లేఖను ఎంపీ రవిచంద్ర బాధితుడికి అందజేశారు.

దిల్‌ రాజు మీద సీ(సిని)మాంధ్ర కుట్ర!

https://epaper.netidhatri.com/

`చిరంజీవి అనని దానిని అన్నట్లు ప్రచారం.

` చిరంజీవి మనసులో పెట్టుకొని వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు.

`దిల్‌ రాజుకు దిల్‌ లేదంటూ గతంలోనూ కథనాలు.

`దిల్‌ రాజు మోనోపలి అంటూ ఓ వర్గం ఆరోపణలు.

`బిఆర్‌ఎస్‌ వున్నంత కాలం వాళ్లు సైలెన్స్‌!

`కాంగ్రెస్‌ రాగానే కొత్త పైత్యం షురూ!

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. పైసలతో పరాచికం. పెట్టే పెట్టుబడి రాబడి రావొచ్చు. రాకపోవచ్చు. కాని తీసిన సినిమా చూసి మురిసిపోయేవారు వున్నారు. నిండా మునిగిపోయి అడ్రస్‌ లేకుండాపోయిన వారున్నారు. అయినా సినీ తరం ఎప్పుటికీ తరంతరం..నిరంతరమే అన్నట్లు సాగుతోంది. సినిమా ఆడితే ఎంతో వైభోగం..ఆడకపోతే నిర్మాత బతుకు ఆగం.. అలా నిండా మునిగినోళ్లే అనేకం. .అయితే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కొమని పెద్దలు చెప్పినట్లే సినిమా నిర్మాణం ఒక జూదం…సినిమా తీసేవారి దృష్టిలో కళామ తల్లి సేవనం.. ఇతరలు దృష్టిలో వ్యాపారం.. నిజంగా చెప్పాలంటే ఒక వ్యసనం…అయినా దాన్ని ఫ్యాషన్‌ అనే అనుకుంటారు..ఎందుకంటే అక్కడ గెలిస్తే గొప్ప జీవితం మిగులుతుంది. కాకపోతే తమకు తెలిసిందిన సినిమా మాత్రమే చెబుతుంటారు. ఒక్కసారి సినిమాను నమ్ముకుంటే వారికి అదే ప్రపంచం. గెలిచేవారు కొందరే…ఓడిన వారే ఎంతోమంది అయినా అదే కలల ప్రపంచం. కాసుల ప్రపంచం..కళ్ల నిండా కన్నీళ్లు కనిపిస్తున్నా, కంటి ముందు కష్టాలు కనిపిస్తున్నా, దుఖాలు వెంటాడుతున్నా, దురదృష్టం పరుగెత్తిస్తున్నా వాటిని కూడ లేక్క చేయకుండా బతికే ఏకైక ఆశా జీవి.. సీనీ జీవి…నిర్మాత..! నటులౌదామని వచ్చి దర్శకులైనవారున్నారు. నిర్మాతలైనవారు వున్నారు. ఒకప్పుడు సినిమా అంటే కళామ తల్లి. ఇప్పుడు వ్యాపారం కల్పవల్లి. కాలం మారుతోంది. సినిమా రూపం మారుతోంది. పెద్ద తెరమీద నుంచి బుల్లి తెరదాకా నిన్నటిదాకా చూసిన సినిమా నేడు అరచేతిలోకి వచ్చేస్తోంది. అయినా దాని రాజసం దానిదే…సినిమా అంటే సినిమానే…అరచేతిలో పట్టుకొని బొమ్మచూసినా, తాడి చెట్టంత బొమ్మను తెరమీద చూసినా అదో గొప్ప అనుభూతి. అది సినిమాకే చెల్లింది. అలాంటి సినీవైభవ కార్మగారాన్ని నడుపుతున్న, ఒక రకంగా చెప్పాలంటే ఏలుతున్న తెలంగాణ తేజం దిల్‌ రాజు..నిజంగా దిల్‌ వున్న సినీ మొనగాడు. తెలంగాణలోనే సీనీ మకుటం లేని నిర్మాతలకు రారాజు…
నిజం చెప్పాలంటే తెలుగు సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే తెలంగాణ సినిమా! సీమాంధ్ర సినిమా!! అని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే తెలంగాణ సినిమాను ఇప్పటికీ చిన్న చూపు చూస్తున్న సీమాంధ్ర సినీ రంగానికి తెలంగాణలో చోటు లేకుండా పోవడమే మంచిది. ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ సినిమా, సీమాంద్ర సినిమా వేరువేరే. ఈ రెండు కలిపినట్లు కలిపి, నటించి, తెలంగాణ సినిమాను కనుమరుగు చేసి, తెలంగాణ వారిని ఎదగకుండా చేసి, మొత్తం గుండు గుత్తగా గంప గుత్తను చేసుకొని ఇప్పటికీ రాజ్యమేలుతున్న వారంతా సీమాంధ్రకు చెందినవాళ్లే… అందుకే ఎలాగూ ఇంత దూరం వచ్చిన తెలుగుసినిమాను ఒక్క మాటలో చెప్పాలంటే దిల్‌ రాజుకు ముందు..దిల్‌రాజుకు తర్వాత అని తప్పక చెప్పాలి. సీమాంద్రకు చెందిన హీరోల విషయంలో, దర్శకుల విషయంలో, ఆఖరుకు నిర్మాతల విషయంలోనూ ఈ మాట పదే పదే చెప్పుకొని వాళ్లకు వాళ్లే గొప్పలకు పోతుంటారు. ఎందుకంటే తాను పాటలు రాస్తానంటూ తెలంగాణకు చెందిన జాతీయ అవార్డు పొందిన సినీ కవిని నువ్వా..పాటలా? అంటూ హేళన చేశారు. ఎగతాలి చేసిన వారున్నారు. అందుకే తెలుగు సినిమా మీద తెలంగాణ ముద్ర లేకుండా, రాకుండా చూసుకున్నారు. వందేమాతరం శ్రీనివాస్‌ లాంటి గొప్ప సంగీత దర్శకుడు కూడా తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి భయపడిని సందర్భంలో బతికాని, ఇప్పుడు హాయిగా ఊరిపి పీల్చుకుంటూ, నేను తెలంగాణ, నాది తెలంగాణ అని చెప్పుకుంటున్నానని చెప్పాడంటే ఆ సీమాంధ్ర ఆదిపత్యం ఎలా వుండేదో అర్ధంచేసుకోవచ్చు. తెలంగాణకు ఉద్యమానికి ఊపిరిపోసి, తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తించిన మిట్టపల్లి సురేందర్‌ కవి గాయకుడుని కూడా మోసం చేసిన చరిత్ర సీమాంధ్రులది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్తబంధం విలువ నీకు తెలియదురా? అంటూ తెలంగాణ ఉద్యమంలో కన్నీటి వ్యధని, గర్భశోఖాలు మిగులుతుంటే ఆ పాట విని తెలంగాణ అంతా తల్లడిల్లింది. ఆ పాట వింటూ తెలంగాణ అంతా కన్నీటి పర్యంతమైంది. అలాంటి పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్‌ లాంటి కవిని కబ్బోర్డులో దాచిన దుర్మార్గపు చరిత్ర సీమాంధ్రది. అలాంటి సీమాంద్ర పెత్తనం నుంచి తెలంగాణ సినిమాను కాపాడిన ఏకైక నిర్మాత దిల్‌ రాజు..తెలుగు సినిమా పేరు చెప్పి తెలంగాణ సినిమాను ఆగం చేసిన వారికే ఇప్పుడు దిల్‌ రాజు మాతో సినిమా తీస్తే చాలు అనుకుంటున్నారు.
పెద్ద పెద్ద నిర్మాతలుగా పేరున్నవారు. ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసినట్లు చెప్పుకునేవారు, గిన్నిస్‌ రికార్డులు సొంత చేసుకున్నవారు కూడా సినిమా తీయాలంటే గజగజ వనికిపోతున్న సమయంలో తెలుగు సినిమాను నేను ఆదుకుంటాను..నేను నిలబెడతాను అని వచ్చిన ఏకైక సినీ తేజం..తెలుగు సినిమాకు వరం..దిల్‌ రాజు ప్రొడక్షన్‌. ఒక దశలో సినిమా అంటేనే ఆడమ దూరం నిర్మాతలు పరుగెత్తుతున్న తరుణంలో వరుసగా 9 హిట్లు ఇచ్చి, తెలుగు సినిమాకు ఊపిరిపోసి, తెలుగు సినిమా దమ్ము చూపిన ఏకైక నిర్మాత దిల్‌ రాజు. అయితే పైకి సంబురం వ్యక్తం చేస్తూ, ఎప్పుడు దిల్‌ రాజు పడిపోతాడో అప్పుడు నవ్వుకుందామని చూసిన వాళ్లు కూడ చాలా మంది వున్నారు. అయితే పడి లేవడం దిల్‌ రాజుకు కొత్త కాదు. పడి లేవడం తెలిసిన దిల్‌ రాజు ఒక్కసారి పడితే పదిసార్లు లేచేంత బలం కూడదీసుకొని ముందుకు విచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. నవ్విన నాప చేను పండినట్లు, దిల్‌ రాజు ఎక్కడ దొరక్కపోతాడా? అని ఎదురు చూసిన వాళ్లకు కూడా కళ్లు బైర్లు కమ్మేంత వెలుగు చూసిన నిర్మాత దిల్‌ రాజు. దిల్‌ రాజు నిజంగా దిల్‌ వున్న రాజే కాదు..ఎంతో ధైర్యం వున్న రాజు కూడా. అందుకే బలగం తీశాడు.. ఎంతో బలమైన నమ్మకం నింపిన సంకల్పంతో తీశాడు. బలగం అనే సినిమా మొత్తంగా ధియేటర్‌లోనే ఆడితే ఆ రికార్డును ప్రపంచంలో ఎవరూ అందుకోనంత వుండేది. రికార్డులను తిరగరాసేంది. సినీ ప్రభంజనాన్ని సృష్టించేది. కాసుల వర్షం కురిపించేది. అయినా డబ్బుకోసం దిల్‌ రాజు ఆలోచించలేదు. బలగం అందరూ చూడాలనుకున్నాడు. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఉచిత ప్రదర్శన వేయించాడు. కాని సీమాంధ్ర బలగం సినిమాను ఆదరించలేదు. అక్కున చేర్చుకోలేదు. తెలంగాణ సంస్కృతిని కోసమైనా సీమాంధ్ర చూడలేదు. పెద్ద పెద్ద హీరోల సినిమానే మూడు రోజుల్లో చుట్టేస్తున్న సందర్భం. సూపర్‌ హిట్‌ సినిమాలంటే మూడు వారాలు ఆడితే చాలనుకుంటున్న రోజులు. కనీసం ఓటీటిలో పేరొస్తే చాలనకుంటున్న కాలం. అలాంటి దశలో ఏడాది పాటు చర్చించుకునే సినిమా తీశాడు. తెలంగాణ సంస్కృతి వున్నంత కాలం మాట్లాడుకునే సినిమా తీశాడు. పల్లెల్లో పరదాలు కట్టుకొని బలగం సినిమా చూశారు. ధియేటర్లకు బండ్లు కుట్టుకొని వెళ్లి సినిమా చూశారు. తెలంగాణ సంస్కృతే ఈ సినిమా చూసి మురిసేలా చేశాడు. ఈ సినిమాతోనే తెలంగాణ సినిమా, సీమాంధ్ర సినిమా అన్నది స్పష్టంగా రెండుగా విడిపోయినట్లు కనిపించింది. అప్పటి నుంచే సీమాంధ్ర సినీ లోకం దిల్‌ రాజు మీద లేని పోని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల చిరంజీవి దిల్‌ రాజుపై సెటైర్లు వేశారంటూ కొన్ని సీమంధ్రకు చెందిన వాళ్లు విపరీత ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి అయినా ఎంత పెద్ద సినీ జీవికైనా దిల్‌ రాజు లాంటి నిర్మాతలే కావాలి. దిల్‌రాజు లాంటి నిర్మాత లేకుంటే ఏ స్టారు లేడు…ఎవరికీ స్టార్‌ డమ్‌ నిర్మాత లేకుండా రాలేదు. అయినా రెండు రాష్ట్రాల సినిమాకు వారధిగా మిగిలింది ఒకే ఒక్కడు…ఆ ఒక్కడు దిల్‌రాజు మాత్రమే..ఎనీ డౌట్‌?

విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేసిన మహిళా మమత తరంగిణి సంస్థ

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మంచిర్యాల మహిళ మమత తరంగిణి సంస్థ వారు మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు బాగా చదువుకొని స్కూలుకు మంచి పేరు తేవాలని, చదువుతోపాటు ఆటలో కూడా రాణిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలియజేయడం జరిగింది. దూర ప్రాంతం నుంచి స్కూలుకు వచ్చే పేద పిల్లలకి సైకిల్ కూడా ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుగుట జ్యోతి, శ్రీదేవి, భాగ్యలక్ష్మి, జ్యోత్స్న, చంద్ర దత్, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

కోట గుళ్ళ లో పూజ లు నిర్వహించిన ఆలయ ధర్మకర్త ఏవీఎల్ ఎన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో గురువారం ఆలయ ధర్మకర్త అట్లూరు వెంకటలక్ష్మి నరసింహారావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

ప్రతి వార్డును సందర్శిస్తూ రోగులకు అందుతున్న సేవలు గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్

రోగులకు మెరుగైన సేవలు అందించడంలో వైద్యులదే ముఖ్యపాత్ర

వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డును తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలు గురించి స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముఖ్యపాత్ర పోషించాలని ఎప్పటికప్పుడు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు.

ఘనంగా ఆల్ఫాన్సా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు…

విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలి…

విద్యార్థి దశనుండే లోకజ్ఞానం కలిగి ఉండాలి…

బెల్లంపల్లి ఏసిపి సదయ్య …

రామకృష్ణాపూర్,జనవరి 11, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని అల్ఫోన్సా కాన్వెంట్ పాఠశాల లో 35 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా బెల్లంపల్లి ఏసి పి సదయ్య,ఎం ఈ ఓ పోచయ్య లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. విద్యార్థినీ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రానించాలన్నారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని,విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువు పై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,విద్యార్థులు సోషల్ మీడియాల కు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న, ఉన్నత స్థాయిలో ఉండాలన్న సరే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యం అని అన్నారు. వార్షికోత్సవ కార్యక్రమంలో పలు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, నాటికలు చేసి విద్యార్థులు అలరించారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో విద్యార్థులు డ్రగ్స్ , మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండేందుకు నాటికలు చేసి అబ్బురపరిచారు. నాలుగో తరగతి ప్రహర్షితా కళ్లకు గంతలు కట్టుకొని రంగులు, నంబర్స్ , అక్షరాలను చెప్పడం పలువురిని విశేషంగా ఆకర్షించింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ బెస్సి,మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి,రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్,సిస్టర్ అల్ఫోన్సా అబ్రహం రోసిన్,ఫాథర్ బినోయ్, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన.

తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన.

తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా! ప్రతి నెల టంచన్ గా నెల నెలా జీతాలు తీసుకుంటూ ,ప్రైవేట్ ఉద్యోగస్తుల హక్కులు కాపాడాల్సిన భాద్యతా యుతమైన పదవి లో ఉన్న అధికారులు కావాలని అమ్యామ్యా లకు ఆశ పడి నిబంధన లకు తూట్లు పొడుస్తున్నారని బి ఎస్ పి కార్మిక విభాగం రాష్ట్ర ఇంచార్జి చోళ్ళేటి మహేష్ బాబు ఒక ప్రకటన లో విమర్శించారు.

తెలంగాణా లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కు,ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం తో పాటు,అధికారులు కూడా దానికి భాద్యులని,వారిపై వెంటనే న్యాయ పరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అన్ని జిల్లాల్లోని సంపన్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అందులో పని చేసే టీచర్స్, & అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లకు భారత రాజ్యాంగం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన హక్కులు

1. కార్మిక సంఘాల చట్టం 1926 ప్రకారం సంఘాలను ఏర్పాటు చేసుకోకుండా బెదిరిస్తున్నారు.

2. వేతనాల చెల్లింపు చట్టం 1936 మరియు కనీస వేతనాల చట్టం 1948, మరియు సమాన ప్రతిఫల చట్టం ప్రకారం వాళ్లకు సరైన వేతనాలు కూడా ఇవ్వడం లేదు 

3. బోనస్ చెల్లింపు చట్టం 1965 మరియు గ్రాట్యూటి చెల్లింపు చట్టం 1972, & ఉద్యోగ నష్ట పరిహార చట్టం కూడా యాజమాన్యం కావాలని అమలు చేయడం లేదు 

4) . ఈ ఎస్ ఐ కార్మిక భీమా చట్టం 1948 మరియు కార్మిక భవిష్య నిధుల చట్టం 1952 మరియు ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961. & అలాగే జీవో నెంబర్ (1) మరియు జీవో నెంబర్ (95) లను, సంపన్నులైన ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు కావాలని అమలు చేయడం లేదు. ఈ చట్టాలన్నిటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న జిల్లా విద్యాశాఖ మరియు మండల విద్యాశాఖ యంత్రాంగం కావాలని వాంటెడ్ గా అశ్రద్ధ చేస్తూ.సమ్మర్ హాలిడేస్ లో మరియు దసరా సెలవులలో మరియు సంక్రాంతి సెలవులలో అలాగే రెండవ శనివారం మరియు ఆదివారం సెలవులల్లో కూడ సెలవులు ఇవ్వకుండా ఉద్యోగస్తులను స్కూళ్లకు బలవంతం గా రప్పిస్తున్నారు. ఎస్ ఎస్ సి విద్యార్థులకు ప్రైవేట్ క్లాసెస్ పేరు చెప్పి రాత్రి 7 గంటల వరకు టీచర్స్ మరియు స్టాఫ్ లను స్కూల్ లల్లో బలవంతంగా పనిచేయిస్తున్నారు.

ఈ చట్టాలను భేఖాతరు చేస్తున్న సంపన్న స్కూల్స్ యాజమాన్యాల పై ఎలాంటి చర్యలు కావాలని, వాంటెడ్ గా తీసుకోవడం లేదు. తత్ఫలితంగా అందులో పనిచేసే ప్రైవేట్ స్కూల్ టీచర్ లకి అడ్మిన్ స్టాఫ్ కి చట్టబద్ధంగా న్యాయ బద్ధంగా రావాల్సిన హక్కులు అందడంలేదు.

కాబట్టి వెంటనే ఆయా సంపన్న యాజమాన్యం స్కూల్స్ పై పూర్తి విచారణ చేసి హక్కుల ఉల్లంఘన చేసిన సంపన్న స్కూల్ యాజమాన్యం లపై మరియు కావాలని విధులు సక్రమంగా నిర్వర్తించని విద్యాశాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోగలరని బి ఎస్ పి కార్మిక విభాగం మరియు బహుజన కార్మిక సంఘం తరుపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నాం. …….

లేని యెడల న్యాయ పోరాటం చేయటానికి సిద్ధం గా ఉన్నామని ఆయన తెలిపారు.

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్

బుధవారం నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో కనీసం ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

చెన్నైకి వెళ్లే రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి రాగానే, ఆగినప్పుడు ట్రాక్‌పై నుంచి జారి సైడ్‌వాల్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.
రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం.

ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలను వారు నిర్ధారించారు.

అనేక రైలు సర్వీసులు మళ్లించబడతాయని లేదా రద్దు చేయబడతాయని భావిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లు చెల్లించడానికి చివరి తేదీని పొడిగించింది

జనవరి 10న అధికారిక నివేదికలు వచ్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.113 కోట్ల పెనాల్టీ వసూలు చేశారు 

తెలంగాణ ప్రభుత్వం తగ్గింపులపై ట్రాఫిక్ చలాన్‌లు చెల్లించడానికి చివరి తేదీని జనవరి 31 వరకు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, చలాన్‌లపై వన్-టైమ్ డిస్కౌంట్ డిసెంబర్ 26, 2023 నుండి జనవరి 10, 2024 వరకు వర్తిస్తుంది.

ఈ రోజు, తెలంగాణ పోలీసులు కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న రద్దీ, ప్రోత్సాహకరమైన ప్రతిస్పందన మరియు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చివరి తేదీని పొడిగించినట్లు పేర్కొంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

జనవరి 10న వచ్చిన అధికారిక నివేదికల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 1.29 కోట్ల చలాన్లు క్లియర్ చేయబడ్డాయి మరియు రూ. 113 కోట్ల పెనాల్టీ వసూలు చేశారు. అందులో హైదరాబాద్‌లో 37.5 లక్షల చలాన్లకు రూ.28.7 కోట్లు చెల్లించారు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, వాహనం యొక్క వర్గాన్ని బట్టి తగ్గింపుల శాతం మారుతూ ఉంటుంది.

మల్టీవిటమిన్ మాత్రలతో క్యాన్సర్.. 30 శాతం పెరుగుతున్న రిస్క్..

మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా శరీరానికి అవసరమైన విటమిన్లు అందడంలేదు.. దీంతో విటమిన్ లోపంతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ ఇబ్బందిని తప్పించుకోవడానికి మల్టీవిటమిన్ మాత్రలను వాడడం సాధారణంగా మారింది. అయితే, మల్టీవిటమిన్ల వాడకం శ్రుతిమించితే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం విటమిన్ మాత్రలు వేసుకోవడమంటే క్యాన్సర్ ను ఆహ్వానించినట్లేనని చెబుతున్నారు. సింథటిక్ విటమిన్ వాడకం వల్ల లంగ్, ప్రోస్టేట్, బోవెల్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పరిశోధలో తేలింది.

విటమిన్ లోపంతో బాధపడుతున్న వారికి అవసరమైన మోతాదులో, అవసరమైన మేరకు మాత్రమే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఇవ్వాలని యూకే పరిశోధకులు చెబుతున్నారు. ఈ మాత్రలతో క్యాన్సర్ ముప్పు 30 శాతం పెరుగుతుందని వివరించారు. రోజూ తీసుకునే ఆహారంలోని నేచురల్ విటమిన్లు శరీరంలోకి నెమ్మదిగా చేరతాయి కాబట్టి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. విటమిన్ లోపాలను సాధారణ, సహజ పద్ధతులలో అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఉదయం పూట కాసేపు ఎండలో నిలబడడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు లభిస్తాయని చెప్పారు.

రైతులను మోసం చేస్తున్న దళారులు

నిబంధనలకు విరుద్ధంగా పత్తి వరి కొనుగోలు చేసే దళారులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి

రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాధారం మల్లయ్య డిమాండ్

రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాధారం మల్లయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ పేద రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు పెట్టుబడి సాయం పేరుతో పేద రైతులకు ముందస్తుగానే డబ్బులు ఇచ్చి వారి పంటలు పండగానే సన్నా చిన్నకారు రైతుల దగ్గర పత్తి వరి కొనుగోలు చేసి వడ్డీల రూపంలో వసూలు చేస్తూ పేద రైతుల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణాలు పాటించకుండా పౌరసరఫరాల శాఖ నియమాలను పట్టించుకోకుండా పత్తి వరి కొనుగోలు చేసి అడ్డగోలుగా ధనార్జనయంగా పేద రైతులను మోసం చేస్తున్న నిబంధనలు పాటించని ప్రభుత్వం గుర్తించినటువంటి దళారుల పైన తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పేద రైతులకు న్యాయం జరిగే విధంగా వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ప్రజలకు రైతులకు అవగాహన కల్పించి నమ్మకం కలిగే విధంగా సంబంధిత అధికారులు మార్గదర్శకాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా కట్టుదిట్టంగా రూపోందించాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

నవంబర్ 1,2020 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన పట్టభద్రులు మాత్రమే అర్హులు

ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 (ఆన్లైన్ / ఆఫ్ లైన్) ద్వారా నూతన పట్టభద్ర ఓటర్ల దరఖాస్తు లకు ఆహ్వానo

 

భూపాలపల్లి నేటిధాత్రి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా కట్టుదిట్టంగా రూపోందించాలని, ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 (ఆన్లైన్ / ఆఫ్ లైన్) ద్వారా నూతన పట్టభద్ర ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు పై తహసిల్దార్ లు, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కట్టుదిట్టంగా నమోదు చేయాలని అన్నారు.
ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి ఉమ్మడి వరంగల్ , ఖమ్మం , నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న పట్టభద్రులంతా ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఆన్ లైన్ ద్వారా లేదా మండల తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రతి మండలంలో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక అధికారుల్ని నియమించాలని , పట్టపద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి విద్యార్హత సర్టిఫికెట్ల కాపీలు గెజిటెడ్ అధికారి చే ధ్రువీకరించి సమర్పించాలని అన్నారు.
నవంబర్ 1 2023 ప్రామాణికంగా ఓటరు జాబితా రూపొందిస్తున్నామని, నవంబర్ 1 2020 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన పట్ట భద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అర్హులని కలెక్టర్ అన్నారు.
సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా రూపకల్పన పై జనవరి 15, జనవరి 25 తేదీల్లో రెండుసార్లు వార్తాపత్రికల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు.
ఫిబ్రవరి 6 లోపు ఫారం 18 ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఫిబ్రవరి 24న డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన చేస్తామని, మార్చి 14 లోపు డ్రాఫ్ట్ ఓటరు జాబితా పై అభ్యంతరాల స్వీకరిస్తామని, మార్చి 29 లోపు సదర అభ్యంతరాలను పరిష్కరించే ఏప్రిల్ 4న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అర్.డి. ఓ రమాదేవి, మాస్టర్ ట్రైనర్లు జిల్లా ఫిషరీస్ అధికారి అవినాష్, హార్టికల్చర్ అధికారి సంజీవరావు, ఈ డీ ఎస్సీ కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, 7 మండలాల తాసిల్దార్లు , డీటీలు సంబంధిత అధికారులు తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.

నూతన వస్త్రాలయాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , రాగిడి లక్ష్మారెడ్డి .

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 10

హబ్సిగూడ డివిజన్ స్ట్రీట్ నెంబర్ 8 లో రైమండ్స్ కే ఎన్ ఫ్యాషన్ నూతన వస్త్రాలయా నిర్వాహకులు అశ్విన్ రెడ్డి, సురేష్ గౌడ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేసి నా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం షోరూంను ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో
హబ్సిగూడ డివిజన్ చెందిన బి ఆర్ఎస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ లో ఫార్మసిస్ట్ ల పాత్ర కీలకం

డియం&హెచ్ఓ లు డా.సాంబ శివ రావు, డా.వెంకట రమణ

హన్మకొండ, నేటిధాత్రి:

తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్( టీ జి. పి ఏ )2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం వరంగల్, హన్మకొండ జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమం నకు హన్మకొండ జిల్లా అధ్యక్షులు కందకట్ల శరత్ బాబు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి హన్మకొండ, వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డా. బి. సాంబ శివ రావు,డాక్టర్. కె. వెంకటరమణ హాజరై మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసిస్టుల పాత్ర చాలా కీలకమైనదని కొనియాడినారు. ఫార్మసిస్టులు పేషెంట్ కి డాక్టర్కు మధ్య వారధి లాంటి వారని, ఫార్మసిస్టులను ప్రభుత్వం వెంటనే ఫార్మసీ ఆఫీసర్లుగా గుర్తించాలని, ఫార్మసిస్టులకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీ జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్, హాజరై మాట్లాడు చూ నూతన ప్రభుత్వం కాంట్రాక్ట్ ఫార్మసిస్టులందరినీ త్వరలోనే రెగ్యులర్ చేస్తుందని, రాబోయే నూతన పిఆర్సి లో ఫార్మసిస్టులకు మంచి వేతనాలు రావడానికి కృషి చేస్తామని, ఫార్మసిస్టులకు సపరేట్ ఫార్మసీ డైరెక్టరేట్ ఏర్పాటుచేయుటకు కృషి చేస్తామని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వివిధ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న ఫార్మసిస్టులు అందరికీ సమాన పనికి సమాన వేతనం రావడానికి కృషి చేస్తానని, ఇటీవల తొలగించబడిన ఫార్మసిస్టులు అందరినీ తిరిగి వేకెన్సీ పోస్ట్లలో భర్తీ చేయాలని,త్వరలోనే ఫార్మసిస్టుల సమస్యలన్నింటినీ గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశం లో హన్మకొండ జిల్లా ఫార్మసీ సూపర్ వైజర్ శ్రీమతి వి. పద్మజా దేవి, ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షులు,సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఫార్మసిస్ట్ ఉప్పు భాస్కర్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు డి. ప్రకాష్ రావు,వర్కింగ్ ప్రెసిడెంట్ టీ. సత్యం, జనరల్ సెక్రటరీ ఎ. వెంకట రమణ, కోశాధికారి అవినాష్,హన్మకొండ జిల్లా జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, కోశాధికారి సతీష్,మరియు హన్మకొండ, వరంగల్ జిల్లాల ఫార్మసిస్ట్స్ నాయకులు శైలజ, గోవర్ధన్, ప్రేమ్ సాగర్,సునీత, విజయ,సతీష్, సూరయ్య, వేణు, శ్రీదేవి, అజిత, సంతోష్,నాగేందర్ రెడ్డి, స్పందన,రమేష్, అనూష, ప్రభావతి,అంజి,అనిల్,వెంకన్న,సుదారాణి, సృజన, సరలా రాణి, శ్వేత,స్వాతి, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని గౌరవ డి.యం. హెచ్. ఓ గారలకు శాలువ, పూల భోకే లతో ఘనంగా సన్మానం చేసి నూతన సంహాత్సర శుభాకాంక్షలు తెలిపి నారు.

రెండు కోట్ల కళాశాల భవనం,మూడు రోజుల ముచ్చటగా మారిన వైనం.

నాసిరకం తో అంతా పగుళ్లు నేటికీ డిగ్రీ కళాశాల పరిస్థితి.

అవినీతితో కూర్కపోయి అసంపూర్తి లో డిగ్రీ కళాశాల భవనం,

పనులు పూర్తికాకముందే ఇంజనీరింగ్ అధికారి సంతకం లేకుండానే హ్యాండ్ ఓవర్ చేసిన కాంట్రాక్టర్.

భవన నిర్మాణానికి విద్యుత్ హైవే లైన్ ఆటంకం ఉందని
హైవే లైన్ పక్కకు అమర్చడంలో ఆరు లక్షల ఖర్చు చూపెట్టి చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్.

పనుల అసంపూర్తి నాసిరకం పై 2019 లొ కలెక్టర్ మరియు కమిషనర్లకు దరఖాస్తు పెట్టిన ఫలితం శూన్యం.

రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మంత్రి తక్షణమే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం.

మహాదేవపూర్ -నేటి ధాత్రి;

మారుమూల ప్రాంతంలో డిగ్రీ కళాశాల అనేక సంవత్సరాలు విద్యార్థుల కలగావుండి ఇంటర్ విద్యాభ్యాసం అనంతరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించిన విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు పరిమితం కావడం ఇలాంటి పరిస్థితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008 నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన విద్యార్థులకు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతులంది అదే సంవత్సరం డిగ్రీ విద్యాభ్యాసం ప్రారంభించడం జరిగింది. ఇలా 2008 నుండి ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కళాశాలలో అనేక సంవత్సరాలు విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ మండలాలకు సంబంధించిన డిగ్రీ విద్యార్థులు ప్రారంభ దశలో 500కు పైగా అడ్మిషన్లు పొంది విద్యాభ్యాసం కొనసాగిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను కొత్త డిగ్రీ కళాశాల భవనాలకు నిర్మాణం చేపట్టుటకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న మహదేపూర్ నువ్వు కూడా డిగ్రీ కళాశాల జి ప్లస్ వన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా రెండు కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన జి ప్లస్ భవనాన్ని డిగ్రీ కళాశాలకు మంజూరు చేసిన విషయాన్ని తెలుసుకున్న ఐదు మండలాలకు సంబంధించిన విద్యార్థినీ విద్యార్థులు తమకు కొత్త కళాశాల భవనము మంజూరై కొద్ది రోజుల్లో తాము నూతన జి ప్లస్ వసతులతో కలిగిన కళాశాలలో విద్యాభ్యాసిస్తామని ఎంతో సంతోష పడడం జరిగింది. కానీ జి ప్లస్ కళాశాల కేవలం పేరుకి పరిమితమై నేటికి అసంపూర్తి నాసిరకంతో 30% కళాశాల గదులను నిర్మాణం చేయకుండానే వదిలివేసిన దుస్థితి నేడు.

రెండు కోట్ల కళాశాల భవనం,మూడు రోజుల ముచ్చటగా మారిన వైనం.

2016లో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా డిగ్రీ కళాశాల భవనాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇదే క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మహాదేవపూర్ మండల కేంద్రంలో గత తొమ్మిది సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల విద్యార్థులు తరగతి గదుల లేక అనేక ఇబ్బందులకు గురవుతూ స్థానికంగా ఉన్న జూనియర్ కళాశాలలో డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల 25 లక్షలు మంజూరు చేస్తూ జి ప్లస్ భవనానికి నిధులు కేటాయించి టి ఎస్ ఈ డబ్ల్యూ డి సి విభాగానికి అందించడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ శాఖ అది సంవత్సరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో జి ప్లస్ వన్ భవనానికి నిర్మాణం కొరకు టెండర్ పిలిచి కాంట్రాక్టర్కు అప్పజెప్పడం జరిగింది. 2016లో ప్రారంభమైన డిగ్రీ జి ప్లస్ వన్ భవనం నేటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అసంపూర్తిగానే మిగిలిపోయి ఉంది. నాలుగు సంవత్సరాలు భవన నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ ఇప్పటికీ ప్రధాన ల్యాబ్ లాంటి భూములను నిర్మించకుండానే కాంట్రాక్టర్ బిల్లులు దండుకోవడం నేటికీ విద్యార్థులకు జి ప్లస్ వన్ కలగానే మిగిలిపోయింది. అసంపూర్తి భవనమే కాకుండా నాలుగు సంవత్సరాల పాటు కాంట్రాక్టర్ చేపట్టిన పనులన్నీ నాసిరకంగా చేయడం వలన ప్రస్తుత మాదాపూర్ డిగ్రీ కళాశాల భవనం గడిని తలపిస్తుంది. కానీ కాంట్రాక్టర్ మాత్రం పనులు పూర్తి చేసినట్లు హ్యాండ్ ఓవర్ ఇచ్చి చేతులు దులుపుకోవడం విశేషం.

నాసిరకం తో అంతా పగుళ్లు నేటికీ డిగ్రీ కళాశాల పరిస్థితి.

2.25 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల జి ప్లస్ భవనం బలవంతంగా నిర్మాణంలో సంవత్సరాలుగా జాప్యం మరోవైపు విద్యార్థులకు తరగతి గదులు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు మంచినీరు మలవిసర్జన లాంటి సమస్యలు తలెత్తుతున్న క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ 2019 జూన్ 26వ తేదీన కళాశాల నూతన భవనంలో ప్రముఖులు చేయకుండానే గత్యంతరం లేక సాదాసీదాగా అప్పటినుంచి పాల్ విద్యార్థులచే నూతన భవనంలో ప్రవేశించి తరగతులను ప్రారంభించడం జరిగింది. ఇక గత ఐదు సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాల జి ప్లస్ వన్ నూతన భవనంలో కొనసాగుతున్నప్పటికీ నేటికీ సంపూర్ణ తరగతి గదులు లేకపోవడం ఇప్పటికీ విద్యార్థులకు పరిశోధన కంప్యూటర్ లాంటి ల్యాబ్ లకు ఇబ్బంది పడక తప్పడం లేదు. మరో ప్రధాన విషయం ఏమిటంటే నిర్మించిన కళాశాల పూర్తిస్థాయి నాసిరకం పనులు చేపట్టడానికి ప్రస్తుత కళాశాలలో అనేక సాక్షాలు దర్శనమిచ్చే పరిస్థితి ఒకవైపు అసంపూర్తిగా ఉన్న తరగతి గదులతో పాటు కళాశాల లోని తరగతి గదులు గోడలు వరండాలు పరిచిన శభాష్ బండ పగుళ్ళతో బయటికి రావడం కళాశాల తరగతి గదుల ముందు కార్పెట్ లేదా శభాష్ బండకు బదులు సిమెంట్ తో ఫినిషింగ్ చేయడం వలన పూర్తిగా సిమెంట్ ఫినిషింగ్ చెడిపోయి బయటికి వచ్చి నడిచే పరిస్థితి లేకుండా ఉంది. వర్షాకాలంలో పై కప్పు కూడా పదులు వచ్చి గోడల వరకు నీళ్లు రావడం తో విద్యార్థులు కాస్త గందరగోళ పరిస్థితి కూడా ఎదురుకోవడం జరుగుతుంది. మారుమూల ప్రాంతంలో పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో రెండు కోట్ల 25 లక్షల రూపాయల నిధులను కేటాయించి అన్ని వసతులతో విద్యార్థులకు కళాశాల అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా నిధులు మంజూరు చేస్తే తూతూ మంత్రంగా నిర్మాణం చేపట్టి నాసిరకం పనులు నిర్వహించి నిధులు సరిపోలేదని అర్ధాంతరంగా నిర్మాణం పూర్తి చేయకుండానే వదిలివేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకోవడం జరిగింది.

అవినీతితో కూర్కపోయి అసంపూర్తి లో డిగ్రీ కళాశాల భవనం,

2016 17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మహదేవ్పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రెండు కోట్ల 25 లక్షల రూపాయల నిధులను జి ప్లస్ వన్ భవనా నిర్మాణానికి మంజూరు చేసి జిల్లా కలెక్టర్ సత్వర పనులకు పూర్తి చేసి విద్యార్థుల కు తక్షణ మే విద్యాభ్యాసం కొరకు అలవాటులోకి తీసుకురావాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. వండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 2016 17 ఆర్థిక సంవత్సరంలో పనులను ప్రారంభించిన సదురు కాంట్రాక్టర్ 9 సంవత్సరాల కాలం పూర్తి అయినప్పటికీ కూడా డిగ్రీ కళాశాల నేటికీ అసంపూర్తిగానే వదిలేయడం జరిగింది. నేడు సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న క్రమంలో జి ప్లస్ వన్ డిగ్రీ కళాశాల భవనంలో కంప్యూటర్ ల్యాబ్ ఎన్సిసి తోపాటు స్పోర్ట్స్ తరగతి గదులను ఇప్పటికీ పూర్తి చేయలేదు. సంవత్సరాల కాలం గడుపుతూ పెద్ద మొత్తంలో ఉన్న నిధులను నాసిరకం పనులతో చేపట్టి ప్రశ్నించేవారు ఎవరు లేకుండా నేడు జి ప్లస్ వన్ కళాశాల వేల సంవత్సరాల గడిని తలపిస్తుంది. ఇక నాసిరకం పనుల విషయానికొస్తే జి ప్లస్ వన్ నిర్మాణం ప్రత్యక్షంగా కళాశాలను సందర్శించిన వారందరికీ కార్ ఫీట్ కి బదులు శాబాష్ బండ అది కూడా పైకి రావడం అన్ని తరగతి గదుల్లో పెద్ద మొత్తంలో పగుళ్లు ఇక్కడ కూడా మార్బల్ లాంటి బండను ఉపయోగించకుండా గ్రౌండ్ లెవెల్ అంత సిమెంట్ రుద్ది నిధులు దండుకోవడం జరిగింది.

పనులు పూర్తికాకముందే ఇంజనీరింగ్ అధికారి సంతకం లేకుండానే హ్యాండ్ ఓవర్ చేసిన కాంట్రాక్టర్.

రెండు కోట్ల 25 లక్షల జి ప్లస్ వన్ భవనము 2016లో ప్రారంభమైతే 2019 వరకు పనులు అసంపూర్తి కావడం ఇక పనులు ముందుకు సాగకపోవడంతో మరోవైపు విద్యార్థులకు తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో 2019 జూన్ లో నూతన భవనంలో ప్రవేశం చేయడం జరిగింది. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అదునుగా భావించిన కాంట్రాక్టర్ పెద్ద మొత్తంలో పలును ఉన్నప్పటికీ కళాశాలలో క్లాసులు ప్రారంభించడం కాంట్రాక్టర్కు కలిసి వచ్చింది. ఇదే సందని భావించిన కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ విభాగం సంతకం లేకుండానే ప్రిన్సిపాల్ కు బిల్డింగ్ పూర్తయిందని హైండవర్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ ప్రిన్సిపల్ కు హైందవర్ చేసిన కాగితంలో మాత్రం ఫ్రంట్ వింగ్, రైట్ విన్, రేర్ వింగ్, కారీ డోర్, తోపాటు ఇతర పనులకు సంబంధించి పూర్తి చేయడం జరిగిందని నాణ్యత పరిమాణాలతో ప్రతి పనికి సంబంధించిన మెటీరియల్ వివరాలు అందించడం జరిగింది. హ్యాండ్ ఓవర్ కాగితాన్ని చూస్తే మాత్రం జి ప్లస్ వన్ భవనానికి అన్ని అంగుళాలతో సంపూర్ణంగా ఏలాంటి నాణ్యత లోపాలు లేకుండా నిర్మించి అందజేస్తున్నట్లు కాగితంలో అందించడం జరిగింది. కానీ నిర్మాణంలో మాత్రం హ్యాండ్ ఓవర్ రిపోర్టుకు భిన్నంగా సంపూర్తిగా ఉన్న వివరాలు కాలేజ్ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా నాణ్యతలేని పనులు చేపట్టి కాంట్రాక్టర్ నిధులు దోచుకోవడం జరిగిందని కండ్లకు కట్టినట్టుగా కనబడుతుంది. మరో వింత విషయం ఏమిటంటే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారులు ఎవరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసే రిపోర్టులో క్వాలిటీ కంట్రోల్ భవనానికి పర్యవేక్షించిన ఇంజనీరింగ్ అధికారి ఆమోదం లేకుండానే హ్యాండ్ ఓవర్ లెటర్ ను అందించడం జరిగింది.

భవన నిర్మాణానికి విద్యుత్ హైవే లైన్ ఆటంకం ఉందని
హైవే లైన్ పక్కకు అమర్చడంలో ఆరు లక్షల ఖర్చు చూపెట్టి చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్.

మహాదేవపూర్ డిగ్రీ కళాశాల ప్రాంగణము సుమారు 5 ఎకరాలకు మించి ఒక విశాలమైన అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా భూమి కలిగి ఉంది. కానీ కాంట్రాక్టర్ మాత్రం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ప్రదేశంలో ప్లే గ్రౌండ్ తో పాటు ఒకవైపు కళాశాల సంపూర్ణ భవనాన్ని నిర్మించుటకు ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ కాలేజ్ ప్రాంతంలో ఉన్న 33 కెవి తోపాటు 11 కెవి 63 కెవి డీటీఆర్ ఎల్ టి లైన్లను తొలగించి నిర్మాణ పనులు చేపట్టుటకు ఇంజనీరింగ్ మ్యాపులో భవన నిర్మాణానికి విద్యుత్ తీగల అంతరాయం అని దానికి తొలగించిన అనంతరం నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని కాలేజ్ భవన నిర్మాణానికి కేటాయించిన రెండు పాయింట్ 25 కోట్ల రూపాయల గూగుల్ లో నుండి ఆరు లక్షల 85 వేల రూపాయలను వెచ్చించి విద్యుత్ తీగలను తొలగించడం జరిగిందని చెప్పుకు రావడం జరిగింది. విద్యుత్ తీగలు భవన నిర్మాణానికి ఆటంకం కలుగుతే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటిని వేరే చోటు నుండి లైను తీసేలా లేదా నిర్మాణానికి విద్యుత్ తీగల దూరంగా ఇంజనీరింగ్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ ఇలాంటి పనులు ఏమీ చేయకుండా సుమారు ప్రస్తుతం నాలుగు ఎకరాల భూమి విశాలవంతమైన మరో రెండు నుండి మూడు జి ప్లస్ భవనాలు ఇలాంటి ఆటంకాలు లేకుండా కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ విద్యుత్ లైన్ పై దృష్టి ఎందుకు వెళ్లిందో అర్థం కావడం లేదు. భవన నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత నైనా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువస్తే విద్యుత్ శాఖ 33 కెవి లైవ్ ఇతర ప్రాంతానికి మార్చేది, కానీ భవన నిర్మాణానికి కేటాయించిన నిధులను విద్యుత్ లైన్ మార్చడానికి ఉపయోగించడం కొరకు నిధులు వాడుకోవచ్చా కాంట్రాక్టర్ కావాలని విద్యుత్ లైన్ పేరుతో నిధులను పక్కదారి పట్టించడానికి కొరకే ఈ ప్రయత్నం చేయడం జరిగిందని ప్రస్తుత కాలేజీ పరిస్థితి చూస్తే వాస్తవమే కాంట్రాక్టర్ విద్యుత్ పేరుతో నిధులను పక్కదారి పట్టించడం జరిగిందని స్పష్టమవుతుంది.

పనుల అసంపూర్తి నాసిరకం పై 2019 లొ కలెక్టర్ మరియు కమిషనర్లకు దరఖాస్తు పెట్టిన ఫలితం శూన్యం.

ఒకవైపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం జి ప్లస్ వన్ కోట్ల రూపాయలతో విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వసతులు లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో జి ప్లస్ వన్ భావన నిర్మాణానికి నిధులు అందించి భావన నిర్మాణం చేసినప్పటికీ నేటికీ భవనం అసంపూర్తిగా విద్యార్థులకు అనేక ఇబ్బందులు కలుగుతున్న దృశ్య 2019లో కమిషనర్ ఆఫ్ కాలేజ్ అయ్యర్ ఎడ్యుకేషన్ తోపాటు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కు డిగ్రీ కళాశాల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయిందని మరో నలభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేస్తే జి ప్లస్ భవన పనులు పూర్తి అవుతాయని కమిషనర్ ఆఫ్ ఇయర్ ఎడ్యుకేషన్ మరియు జిల్లా కలెక్టర్లకు విన్నపం కూడా చేయడం జరిగింది. కానీ నాటి నుండి నేటి వరకు కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుండి అసంపూర్తిగా ఉన్న డిగ్రీ కళాశాల భవనానికి నిధులు మంజూరు కాకపోవడం, మరోవైపు కాంట్రాక్టర్ చేసిన నిర్లక్ష్యానికి పేరుకే ఉన్న జి ప్లస్ భవనంలో కళాశాల కొనసాగడం జరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మంత్రి తక్షణమే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం.

మహదేవ్పూర్ డిగ్రీ కళాశాల 2008లో ప్రస్తుతం రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కళాశాల మంజూరు చేయడం జరిగింది. కొన్ని రోజులు జూనియర్ కళాశాలలో కొనసాగిన డిగ్రీ కళాశాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మూడు రూములు కేటాయిస్తూ ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల్లో 33 డిగ్రీ కళాశాలలకు జి ప్లస్ వన్ భవనాల ఏర్పాటుకు రెండు కోట్ల 25 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఐటి మంత్రి శ్రీధర్ బాబు నాలుగు మండలాల విద్యార్థులకు డిగ్రీ కళాశాల సదుపాయం కలిగించినప్పటికీ పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు కేటాయించి అన్ని వసతులతో కూడిన భవనాన్ని ఏర్పాటు చేయాల్సిన కాంట్రాక్టర్ నిధులను దుర్వినియోగం చేస్తూ భవనాన్ని అసంపూర్తిగా వదిలేసి కట్టిన భవనాన్ని కూడా నాసిరకం పనులతో చేపట్టి నేడు వందల సంవత్సరాల భవనానికి కల్పించేలా చేసిన కాంట్రాక్టర్ అలాగే టి ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులపై తక్షణమే రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి చర్యలకు ఆదేశించి పూర్తిస్థాయి జి ప్లస్ వన్ డిగ్రీ కళాశాల భవనానికి అవసరమయ్యే 46 లక్షల నిధులను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి-దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి
పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పరకాల నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న మరియు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ దొమ్మటి సాంబయ్య పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇటీవలే ఓటరు జాబితా షెడ్యూల్ ను విడుదల చేసిన ఈసి ఫిబ్రవరి 06 లొపు ఖమ్మం,నల్గొండ,వరంగల్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను పట్టుబద్రులందరూ 2020 నవంబర్ లొపు ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఫామ్ 18నింపి ఏంఆర్వో కి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారూ,ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పరకాల నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు అందరూ పట్టుభద్రుల ఓటర్ మహాశయులను కలిసి దగ్గరుండి వారిని నమోదు చేపించి త్వరలో వెల్లడించే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పక్షాన భారీ మెజారిటీతో గెలిపించాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎంపిపి తక్కళ్లపెల్లి స్వర్ణలత,నియోజకవర్గం లోని ప్రజా ప్రతినిధులు,వివిధ మండలాల కమిటీ అధ్యక్ష కార్యవర్గం,జిల్లా ముఖ్య నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బాలల రక్షణకు భరోసా ” స్నేహిత “

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

పాఠశాల, కళాశాలల్లో చదివే పిల్లలకు ” స్నేహిత ” చక్కటి రక్షణ కవచమని జమ్మికుంట మండల విద్యాధికారి వి.శ్రీనివాస్ అన్నారు. ఈనాడు సమాజములో అఘాయిత్యాలు పెచ్చుమీరి పోతున్నాయని. వాటిని అరికట్టడం అందరి బాధ్యత అని. తొమ్మిది నెలల పిల్లల నుండి తొంభై యేండ్ల వయస్సు ఆడవారికి కూడా రక్షణ లేకుండా పోతుందని. అందుకు స్నేహిత అండగా ఉంట్టుందని ఈ కార్యక్రమ అధ్యక్షులు జిల్లా పరిషత్ బాలికల ప్రధానోపాధ్యాయులు డి. సుధాకర్ అన్నారు. సెప్టిటచ్చు, అన్సెప్టి టచ్చు విషయాల గురించి చైల్డ్ వెల్ఫేర్ అధికారిని రోహిణి విద్యార్థులకు వివరించారు. సమాజములో అనేక దురాఘాతాలు జరుగుతున్నాయని మీ ఉపాధ్యాయుల ద్వారా వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకొనీ వాటిని పాటించాలని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సదానందం తెలిపారు. ఏఈఓ లక్ష్మణ్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు విలువలు నేర్చుకొని చక్కగా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడాలన్నారు. జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని రూపొందించి పాఠశాలల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉంటుందని. విద్యార్థుల్లో పోషకహర లోపం చాలా ఉంటుందని చక్కని పోషక ఆహారాన్ని తీసుకోవాలని వైద్యాధికారి తెలిపారు. మీకు ఏలాంటి ఇబ్బంది కలిగిన మాకు తెలియజేస్తే వాటిని గొప్యంగా ఉంచి పరిష్కరిస్తామని పోలీస్ అధికారి వివరించారు. ఈ కార్యక్రమములో వైద్యాధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పలు శాఖల అధికారులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version